ocean
-
ఆఫ్రికాను చీలుస్తూ... ఆరో మహాసముద్రం
మహాసముద్రాలు ఐదు అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆరు అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీలుస్తూ శరవేగంగా ఆరో మహాసముద్రం పుట్టుకొస్తోంది. ఆ క్రమంలో అక్కడి పలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నింటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది. ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇది తప్పదన్నది తెలిసిన విషయమే అయినా, అందుకు కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆరో మహాసముద్రం ఆవిర్భావానికి మహా అయితే కొన్ని వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు!టెక్టానిక్ ఫలకాల కదలికల కారణంగా ఆఫ్రికా ఖండం నిలువునా చీలిపోతోంది. వేలాది ఏళ్లుగా స్థిరంగా జరుగుతూ వస్తున్న ఈ పరిణామం కొంతకాలంగా అనూహ్య రీతిలో వేగం పుంజుకుంది. ఆఫ్రికా ఖండం దిగువన నుబియన్, సోమాలీ, ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లలో జరుగుతున్న కదలికలే దీనికి ప్రధాన కారణం. అవి ఏటా ఏకంగా దాదాపు ఒక సెంటీమీటర్ మేరకు దూరం జరుగుతున్నాయి! ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టం (ఈఏఆర్ఎస్)గా పిలిచే ఈ ప్రాంతం ఇది మొజాంబిక్ నుంచి ఇథియోపియా, కెన్యా, టాంజానియా మీదుగా ఎర్రసముద్రం దాకా వేలాది కిలోమీటర్ల మేర విస్తరించింది. దాని పొడవునా భూగర్భంలో వేలాది ఏళ్లుగా అతి నెమ్మదిగా సాగుతూ వస్తున్న నిరంతర టెక్టానిక్ కదలికల పరిణామం కొన్నాళ్లుగా స్పీడందుకుంది. తూర్పు ఆఫ్రికాను నిలువునా చీలుస్తోంది. ఫలితంగా చివరికి తూర్పు ఆఫ్రికా క్రమంగా మిగతా ఖండం నుంచి పూర్తిగా విడిపోనుంది. వాటి మధ్య ఏర్పడే ఖాళీలో ఏకంగా 10 వేల బిలియన్ గ్యాలన్ల పై చిలుకు అపార జలరాశి నిండిపోయి సరికొత్త మహాసముద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నిదర్శనాలు ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇథియోపియాలో 2005 నాటికే ఏకంగా 60 మైళ్ల పొడవున లోతైన గుంత ఏర్పడింది. ఇది పలుచోట్ల ఏకంగా 20 మీటర్ల పై చిలుకు లోతుంది! 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగుళ్లు పుట్టుకొచ్చాయి. కారణాలెన్నో... టెక్టానిక్ కదలికలతో పాటు భూమి లోపలి పొరల్లోని శిలాజ ద్రవం తూర్పు ఆఫ్రికా చీలికను మరింత వేగవంతం చేస్తోంది. క్రమంగా లోపలి పొర పూర్తిగా పగుళ్లిచ్చి భారీ లోయల పుట్టుకకు దారితీస్తుంది. అగి్నప్రమాద కార్యకలాపాలను పెంచుతుంది. 2005లో ఇథియోపియాలో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఏకంగా 420కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఈ పరిణామం సైంటిస్టులతో పాటు పరిశోధకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆఫ్రికా ఖండం దిగువ భూ ఫలకాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని వారంటున్నారు. ఇకపై ఆఫ్రికాలో మరిన్ని భూకంపాలు, అగి్నపర్వతాల పేలుళ్ల వంటి పరిణామాలను చూడనున్నామని తులానే వర్సిటీ జియో సైంటిస్టు సింథియా ఎబింగర్ చెప్పుకొచ్చారు. అట్లాంటిక్ ఇలాగే పుట్టింది... మహాసముద్రాల్లో వయసురీత్యా అట్లాంటిక్ అన్నింటికంటే చిన్నది. ప్రస్తుత ఆఫ్రికా ఖండం తరహా పగుళ్లే లక్షలాది ఏళ్ల క్రితం దాని పుట్టుకకు దారితీసినట్టు సైంటిస్టులు చెబుతారు. తర్వాత మళ్లీ ఇంతకాలానికి మరో మహాసముద్రం పుట్టుకకు దారి తీయగల స్థాయిలో ఓ ఖండం నిలువునా చీలుతోంది. మహాసముద్రాల ఆవిర్భావ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది చాలా అరుదైన అవకాశమని సైంటిస్టులు అంటున్నారు.కొత్త ఖండం కూడా... ఆఫ్రికా చీలిక ఆరో మహాసముద్రంతో పాటు కొత్త ఖండం పుట్టుకకు కూడా దారితీయనుంది. ఎందుకంటే సోమాలియా, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా నుంచి పూర్తిగా విడిపోతాయి. ఆరో సముద్రం ఆ మధ్యలో విస్తరిస్తుంది.లక్షల్లో నిర్వాసితులు... వాతావరణ మార్పుల దెబ్బకు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఆ ఖండంలో ఏర్పడుతున్న చీలిక వల్ల పలు దేశాల్లో జీవజాలం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో మొత్తంగా వాటి ఆర్థిక పరిస్థితులే తారుమారు కానున్నాయి. దాంతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే వారి సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోనుంది. కొత్త మహాసముద్రం ఆఫ్రికా భౌగోళిక స్వరూపాన్నే సమూలంగా మార్చనుంది. పలు దేశాల ఆర్థిక, పర్యావరణ, మౌలిక వ్యవస్థలనే తలకిందులు చేయనుంది. చుట్టూ భూభాగాలతో కూడిన జాంబియా, ఉగాండా వంటి దేశాలు కొత్త సముద్ర తీర ప్రాంతాలు మారిపోతాయి. దాంతో కొత్త వర్తక మార్గాలు, ఆ దేశాల్లో నౌకాశ్రయాల వంటివి పుట్టుకొస్తాయి. అలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలే సమూలంగా మారిపోతాయి. సరికొత్త సముద్ర వాతావరణ పరిస్థితులు కొత్త ఆవాస ప్రాంతాలుగా మారతాయి. ఈ పరిణామం జీవవైవిధ్యంలో చెప్పుకోదగ్గ మార్పులకు దారి తీస్తుంది. అదే సమయంలో సముద్రమట్టంలో పెరుగుదల మరింత వేగంపుంజుకుంటుంది. భూభాగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. అంతేగాక పలుచోట్ల తరచుగా తీవ్ర భూకంపాలు సంభవించవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల వచ్చిపడే తీవ్రమైన రిసు్కలను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇప్పటినుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. కొత్త మహాసముద్రం ఆవిర్భావం వేలాది ఏళ్ల తర్వాత జరిగినా ఆ క్రమంలో తలెత్తే పరిణామాలు ఆఫ్రికా ఖండంపై సమీప భవిష్యత్తు నుంచే కొట్టొచ్చినట్టుగా కన్పించడం మొదలవుతుంది. భూగోళం నిరంతరం పరిణామం చెందుతున్న తీరుకు ఈ పరిణామం మరో తాజా ఉదాహరణ. దీని ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలయ్యారు. ఎందుకంటే తూర్పు ఆఫ్రికాలో జరుగుతున్నది కేవలం భౌగోళికపరమైన మార్పు మాత్రమే కాదు. సుదూర భవిష్యత్తులో మరిన్ని ఖండాలు విడిపోయి కొత్త మహాసముద్రాల పుట్టుక వంటివి జరిగి చివరికి మనకిప్పుడు తెలిసిన ప్రపంచమే సమూలంగా, శాశ్వతంగా మారిపోతుందనడానికి తిరుగులేని నిదర్శనం. ఆరో మహాసముద్రం ఆవిర్భావంతో ప్రపంచ భౌగోళిక స్వరూపంతో పాటు పర్యావరణ వ్యవస్థలు కూడా సమూల మార్పులకు లోనవడం ఖాయమని భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాబేళ్ల మృత్యుఘోష!
సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రిస్తూ జీవజాలం మనుగడకు దోహదపడుతున్న సముద్రపు తాబేళ్లు(ఆలీవ్ రెడ్లీ) మృత్యువాత పడుతున్నాయి. సముద్రతీరంలో తాబేళ్ల మరణాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇదే కొనసాగితే తాబేళ్ల జాతి క్రమేపీ అంతరించి పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం శ్రద్ధపెట్టి తాబేలు జాతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. బాపట్ల, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం తదితర జిల్లాల పరిధిలోని తీర ప్రాంతంలో ఒక్క జనవరి నెలలోనే 3,085 తాబేళ్లు మరణించినట్టు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇవన్నీ తీరానికి కొట్టుకొచ్చినవే. మృతి చెంది సముద్రంలో కలిసి పోయిన తాబేళ్ల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. – సాక్షి ప్రతినిధి, బాపట్లసముద్ర జీవుల్ని రక్షిస్తూ.. సముద్రంలో విపరీతంగా ఉత్పత్తి అయ్యే నాచు.. సూర్యకిరణాలను సముద్రపు లోతుల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల సముద్రంలో పెరిగే జంతు జాలానికి ఆక్సిజన్ సక్రమంగా అందే అవకాశముండదు. అదే జరిగితే జంతుజాలం చాలా వరకు చనిపోవడంతో పాటు మిగిలిన జంతు జాలానికి ఎదుగుదల ఉండదు. తాబేళ్లు ఈ నాచును ఆహారంగా తీసుకుని దాని ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. సముద్రంలో కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే జల్లి ఫిష్‌లను సైతం తాబేళ్లు ఆహారంగా తీసుకుంటాయి. సముద్ర గర్భంలో ఉన్న కొండలు, గుట్టల్లో చేపలు గుడ్లుపెట్టే కేంద్రాలను తాబేళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. దీనివల్ల మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారులకు మేలు జరుగుతుంది.ఆ విధంగా అంతరిస్తున్నాయ్..సముద్ర తాబేళ్లు జలాల అడుగున ఉంటున్నప్పటికి ప్రతి 40 నిమిషాలకోసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలానికి రావాల్సిందే. ఇలావచ్చి తిరిగి వెళ్లే క్రమంలో మోటారు బోట్లు, మత్స్యకారుల టేకు, నానాజాతి వలల వల్ల కొన్ని, కాలుష్యానికి గురై మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ తరహా వలలు అధికంగా వాడుతుండడంతో తాబేళ్ల మరణాలు అధికంగా ఉన్నాయని టీ ఫౌండేషన్ వెల్లడించింది. ఏటా జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు తీరప్రాంతానికి వచ్చి ఇసుకలో గుంతలు తీసి గుడ్లు పెట్టి వెళతాయి. 48 నుంచి 50 రోజుల మధ్యకాలంలో ఆ గుడ్లు పిల్లలుగా మారతాయి. ఈ క్రమంలోనే తాబేలు జాతి అధికంగా అంతరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాబేలు గుడ్లు, పిల్లల సమయంలో నక్కలు, కుక్కలు, ఇతర జంతువులు కొన్ని గుడ్లు, పిల్లల్ని తినేస్తున్నాయి. పిల్లలుగా మారిన తాబేళ్లు 3 గంటల్లోపు నీటిలోకి చేరకుంటే చనిపోతాయి. కొన్ని నీటిలోకి చేరినా శ్వాస కోసం నీటిపైన తేలియాడేటప్పుడు పెద్ద పెద్ద పక్షులు వాటిని పొడిచి చంపుతున్నాయి. ఉత్పత్తి అవుతున్న తాబేలు పిల్లల్లో 10 శాతం కూడా బతకడం లేదని అంచనా. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడితే ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు.ప్రభుత్వ చర్యలు శూన్యం తాబేళ్ల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల్లో తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ ఐదు నెలల పాటు ప్రత్యేకంగా అవగాహన కలిగిన సిబ్బందిని నియమించి తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రాల్లో పొదిగించాలి. పిల్లలు ఉత్పత్తి అయ్యాక వాటిని సురక్షితంగా నీటిలో వదలాలి. ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయించి సంరక్షణ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలి. మరోవైపు సముద్రంలో తాబేళ్లు చిక్కుకోని వలలనే వాడేలా మత్స్యకారులకు ఆదేశాలివ్వాలి. తాబేళ్ల ప్రాధాన్యంపై ఎప్పటికప్పుడు మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖలు సమన్వయం చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.తాబేళ్ల రక్షణకు ట్రీ ‘ఫౌండేషన్’! తాబేళ్ల రక్షణకు చెన్నై కేంద్రంగా ఉన్న ట్రీ ఫౌండేషన్ కొంత మేర కృషి చేస్తోంది. 2017 నుంచి ఇక్కడ తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తీరంలోని చినగంజాం మండలం ఏటిమొగ్గ, కుంకుడుచెట్లపాలెం, వేటపాలెం మండలం రామచంద్రాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండలం సూర్యలంక తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 మంది సిబ్బందితో తాబేలు గుడ్లు సేకరించి వాటిని పొదిగించి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదులుతోంది. 2023లో 7,102, 2024లో 9,694 చొప్పున తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలామని, ఈ ఏడాది ఇప్పటివరకు 14 తాబేళ్లు వచ్చి 1,541 గుడ్లు పెట్టినట్టు ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లా అటవీశాఖ దీనిని పర్యవేక్షిస్తోంది. గత ప్రభుత్వంలో ఫౌండేషన్ సభ్యులకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవవేతనం ఇవ్వగా.. ఈ ప్రభుత్వం వచ్చాక అదీ ఇవ్వకపోవడంతో సభ్యులకు ఐటీసీ సంస్థ గౌరవ వేతనాలు చెల్లిస్తోంది.ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం.. సముద్ర తాబేళ్ల రక్షణకు ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని తీరప్రాంతంలో 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 12 మంది సిబ్బంది ద్వారా తాబేళ్లు పెట్టిన గుడ్లు ఎప్పటికప్పుడు సేకరించి, సంరక్షణ కేంద్రాల్లో పొదిగించి పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదులుతున్నాం. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం. – చంద్రారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ట్రీ ఫౌండేషన్ -
ఆ చల్లని సముద్రగర్భంలో... ఆక్సిజన్ పుడుతోంది!!
భూమిపై జీవజాలం,(Biome)మనుగడకు (oxygen)ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది! అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండటం శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఇదెలా సాధ్యమవుతోందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్లు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటిమయమైన డార్క్మ్యాటరే ఎక్కువన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్క్మ్యాటర్లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతోకాలంగా సాగుతున్న వాదనలకు కొత్త బలం చేకూరింది. ఎక్కడ కనిపెట్టారు? బంగాళాదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్–క్లిప్పర్టన్ జోన్ (సీసీజెడ్)లో 13,100 అడుగుల లోతులో సముద్రగర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొడుతున్నాయి. కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మ్యాన్ చెప్పారు. ఇదెలా సాధ్యమవుతోందన్నది తేల్చేందుకు మూడేళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెర తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు! ‘‘ఈ ‘చీకటి ఆక్సిజన్’ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీజెడ్ మాదిరే సముద్రగర్భంలో ఇతర చోట్లా ఇలా ఆక్సిజన్ తయారవుతోందేమో కనిపెడతాం’’ అని స్వీట్మ్యాన్ చెప్పారు. భూగర్భంలోనూ ఆక్సిజన్...? సముద్ర గర్భంలోని శిలల్లోనే గాక భూమి లోలోపలి పొరల్లోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలో మసాచుసెట్స్‌లోని వుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ లేబోరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమీల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రియరీ భూముల్లోని అత్యంత లోతుల్లోనూ ఆక్సిజన్ ఉందని చెప్పారాయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ఆక్సిజన్ 40 వేల ఏళ్ల క్రితమే భూమి పొరల్లోకి చేరి ఉండాలని ఒక నివేదికలో పేర్కొన్నారు. సూక్షజీవులు కూడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ‘‘కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్‌లోని ఆక్సిజన్ పాడుచేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచి్చంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించాం. అవి తన మనుగడ కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, రెండు ఆక్సిజన్ అణువులను రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్‌గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకు అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోంది’’ అని రఫ్ అన్నారు.మూడు కి.మీ. లోతులో ‘చీకటి ఆక్సిజన్’ జాడ కనిపెట్టేందుకు రఫ్ బృందం దక్షిణాఫ్రికాలో బంగారం, యురేనియం గనుల్లోకి వెళ్లింది. ఏకంగా 3 కి.మీ. లోతులో 120 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో ఆక్సిజన్‌ను కనుగొన్నారు. రేడియోధారి్మక గుణమున్న యురేనియం అక్కడి నీటితో చర్య జరపడం వల్ల ఆక్సిజన్ తయారై ఉంటుందన్న అంచనాకొచ్చారు. నాసా ఆసక్తి కాంతితో నిమిత్తం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమంటున్న తాజా పరిశోధనపై నాసా ఆసక్తి చూపుతోంది. చంద్రుని ఆవలివైపు కాంతి ప్రసారమే ఉండదు. అలాంటి చోట్ల ఈ ‘శిలాజ ఆక్సిజన్’ ద్వారా వ్యోమగాముల అవసరాలు తీర్చవచ్చని నాసా ఆశ పడుతోంది. మంచుతో కూడుకున్న శని, బృహస్పతి ఉపగ్రహాలు ఎన్సిలాడస్, యూరోపాలపై ఏ మేరకు పీడనం పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చా అని ఇప్పటినుంచే లెక్కలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
20 కిలోల బరువు: దీని దుంపతెగ! మూములు పీత కాదిది, రాకాసి పీత!
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది. ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు. ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగుఅరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా? -
NAVIKA SAGAR PARIKRAMA II: కడలి అలలిక వాళ్ల కాళ్ల కింద...
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి. ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.→ ఆటల నుంచి సాగరంలోకి...‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.→ నన్ను నేను తెలుసుకోవడమే‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.→ కఠిన శిక్షణ‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. 56 అడుగుల సెయిల్ బోట్. 40000 కిలోమీటర్ల దూరం250 రోజుల ప్రయాణంరాకాసి అలలు... భీకరగాలులువీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్కు చెందిన డెల్నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి... -
1989 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, హైదరాబాద్: గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ కడలి వైపు కదిలిపోతున్నాయి. ఇప్పటికే 1,903 టీఎంసీల గోదావరి, 86 టీఎంసీల కృష్ణా జలాలు కలిపి మొత్తం 1989 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరి, కృష్ణాలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఎగువ గోదావరి పరీవాహకంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వరద రాకపోవడంతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు సగం కూడా నిండలేదు. కృష్ణాలో ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో 10 రోజులుగా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం(తెలంగాణ) నుంచి అంతర్వేది(ఏపీ) వరకూ పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో వస్తున్న వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల్లేక వరద తగ్గుముఖం..గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు, వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.25 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 3,583 క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టు కాల్వలకు విడుదల చేస్తున్నారు. గోదావరికి ప్రాణహిత వరద తోడుకావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 2,89,710 క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్ నుంచి 4,48,810 క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్ నుంచి 4,61,484 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచ్చినట్టు దిగువన వదులుతున్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కాళేశ్వరం లింక్–2లో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.82 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,676 క్యూసె క్కులు ఉండగా, 3,602 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. ఎగువ కృష్ణాలో తగ్గిన వరదకృష్ణా పరీవాహకంలో ఎగువన వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 15,000, నారాయణపూర్ నుంచి 6,000, జూరాల ప్రాజెక్టు నుంచి 82,339 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,84,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు 1,04,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్ ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదలనాగార్జునసాగర్/దోమలపెంట : శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జునసాగర్ వద్ద కొన్ని గేట్లు మూసివేశారు. శనివారం సాయంత్రం 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఆదివారం ఉదయానికి 16 గేట్లకు తగ్గించారు. మధ్యాహ్నానికి 14, 10 గేట్లకు తగ్గిస్తూ సాయంత్రానికి ఎనిమిది గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. పర్యాటకులతో ఆదివారం నాగార్జునసాగర్ జనసంద్రంగా మారింది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.సొంతవాహనాల్లో తరలిరావడంతో డ్యాం దిగువన కృష్ణాతీరం వెంట గల రోడ్లన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుందనే సాకుతో ఆదివారం కూడా తెలంగాణ వైపు లాంచీలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు చాలామంది నిరాశతో వెళ్లారు. కొంతమంది మాత్రం రైట్ బ్యాంకు వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట వద్ద ఆరు గేట్లు పైకెత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
అల.. హడలెత్తిస్తోంది
అల్లవరం: సహజ వనరుల నిక్షేపాల కేంద్రాన్ని సముద్రం చుట్టేస్తోంది. కోనసీమలో ఓఎన్జీసీ టెర్మినల్‌కు భారీ ముప్పు పొంచి ఉంది. కృష్ణా – గోదావరి బేసిన్‌లోని సముద్ర జలాల అడుగు భాగంలోని గ్యాస్, చమురు నిక్షేపాలను నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ వెలికితీస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంపై ఉన్న ఆఫ్‌షోర్ టెర్మినల్ నుంచి రిగ్గుల ద్వారా సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల చమురు నిక్షేపాలను రోజూ వెలికి తీస్తోంది. ఇలా తీసిన నిక్షేపాలను పైపుల ద్వారా ఓడలరేవులోని ఆన్‌షోర్ టెర్మినల్‌కు తరలిస్తుంది. పొంచి ఉన్న ప్రమాదం సముద్ర అలల కారణంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. ఓడలరేవు గ్రామంలో 370 ఎకరాల్లో ఓఎన్జీసీ ఆన్‌షోర్ టెర్మినల్ విస్తరించి ఉంది. గ్యాస్, చమురు నిక్షేపాలను ఈ ఆన్‌షోర్ టెర్మినల్‌లో శుద్ధి చేసి గ్యాస్‌ను, చమురును ఆ కలెక్షన్ సెంటర్లకు మళ్లిస్తారు. ఈ టెర్మినల్‌కు రక్షణగా 2017లో చుట్టూ ప్రహరీ నిర్మించారు. టెర్మినల్‌కు దక్షిణంగా సముద్రం ఉంది. అప్పట్లో ప్రహరీకి సముద్రం కనీసం వంద మీటర్ల దూరం ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, తుపానులు, అల్పపీడనాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలకు తీరం కోతకు గురవుతోంది. ఏడేళ్లలో సముద్రం వంద మీటర్ల ముందుకు వచ్చి0ది. ప్రస్తుతం టెర్మినల్ ప్రహరీని సముద్రం తాకుతోంది. దక్షిణ, పశి్చమం రెండు వైపులా ప్రహరీని భారీ అలలు చుట్టేస్తున్నాయి. ప్రహరీ చుట్టూ నిర్మించిన బీటీ (తారు) రోడ్డు, డ్రైనేజీని సముద్రం తనలో కలిపేసుకుంది. కెరటాల ఉధృతికి ప్రహరీ కూలితే టెర్మినల్‌కు పెనుముప్పు సంభవించే అవకాశం ఉంది. అదే జరిగితే రూ.కోట్ల విలువ చేసే టెర్మినల్‌కు భారీ నష్టం తప్పదు. సరుగుడు తోటలు నరికేసి.. ఓడలరేవులో వైనతేయ నది సముద్రంలో కలిసే సంగమం నుంచి కిలోమీటరు పొడవునా సరుగుడు తోటలు విస్తరించి ఉండేవి. కాలక్రమేణా ఈ తోటలను నరికేశారు. వేరు వ్యవస్థ కనుమరుగు కావడంతో భారీ అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఆన్షోర్పై టెర్మినల్ నిర్మాణానికి ముందు సముద్రం ఒక కిలోమీటర్ దూరంలో ఉండేదని, ప్రస్తుతం ప్రహరీని తాకుతోందని స్థానికులు చెబుతున్నారు. అంటే నాలుగు దశాబ్దాల కాలంలో సముద్ర తీరం ఏ స్థాయిలో కోతకు గురైందో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. స్పందించకుంటే ప్రమాదమే.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ తీరం పొడవునా నాలుగు కిలోమీటర్ల వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీనికి ఓఎన్జీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ఓఎన్జీసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రక్షణ గోడ నిర్మాణం అటకెక్కింది. ఇటీవల కాలంలో కోతకు గురైన ప్రాంతంలో స్క్వేర్ ట్యూబ్‌ను ఏర్పాటు చేశారు. భారీ తుపాన్ల సమయాల్లో అలలకు స్క్వేర్ ట్యూబులను సైతం సముద్రం తనలో కలిపేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ, ప్రజాప్రతినిధులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టెర్మినల్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం గ్లోబర్ వార్మింగ్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీనివల్ల ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్ ప్రహరీని అలలు తాకుతున్నాయి. అయినా ఓఎన్జీసీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావడం లేదు. 2004లో సునామీ తర్వాత ఇక్కడి సముద్ర తీరం భారీ కోతకు గురైంది. వందలాది ఎకరాలు సముద్రంలో కలిసిపోయాయి. శాస్త్రవేత్తల బృందం ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జియో ట్యూబ్, గ్రోయిన్లు, లేదా రక్షణ గోడ నిర్మించాలని సూచించింది. ఓఎన్జీసీ ఈడీగా మార్బుల్ ఉన్న సమయంలో తీరం పొడవునా రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. – పాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, ఓడలరేవు, అల్లవరం మండలం -
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ప్రపంచంలో ప్రత్యేకంగా ‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అన్నారు. సముద్ర ఉత్పత్తులపై ఆధారపడిన ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా భారత్ స్థిరమైన బ్లూఎకానమీపై దృష్టి సారిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘కొత్త ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా డీప్ సీ మిషన్‌ను విస్తరించాలని భావిస్తోంది. భారత్‌కు సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. జీవనోపాధి కోసం సముద్ర ఉత్పత్తులపై ఆధారపడేవారి ఆర్థికస్థితిగతులను మరింత మెరుగుపరచాలి. స్థిరమైన బ్లూఎనానమీని సాధించేలా కృషి చేయాలి. అందుకోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు సహకారం అందించాలి. డీప్ సీ మిషన్ కేవలం సముద్రంలోని ఖనిజాలు అన్వేషించడానికి మాత్రమే పరిమితం కాదు. సముద్రంలోని వైవిధ్యమైన వృక్ష, జంతుజాలాన్ని కనుగొనడానికి ఉపయోగపడాలి. సముద్రంలో 6,000 మీటర్ల లోతున డైవ్ చేయగల ‘మత్స్యయాన్ 6000’ అభివృద్ధి కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేసిన కృషి అభినందనీయం. సముద్రం లోతుకువెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా, ఒత్తిడిని తట్టుకునేలా ఇస్రో సహకారంతో ‘టైటానియం హల్’ను అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, 72 గంటల పాటు నీటిలో మునిగిఉండేలా అభివృద్ధి చేస్తున్న సెల్ఫ్-ఫ్లోటేషన్ టెక్నాలజీ పురోగతిని ఆయన సమీక్షించారు. డీప్ సీ మిషన్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందండీప్ సీ మిషన్భారతదేశ సముద్రజలాల్లోని ఖనిజాలను కనుగొనేందుకు డీప్ సీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిబ్బంది సహాయం లేకుండా సముద్రగర్భంలోకి వెళ్లి మాంగనీస్ , నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ హైడ్రాక్సైడ్ వంటి ఖనిజాలతో కూడిన పాలీమెటాలిక్ పార్టికల్స్‌ను అన్వేషించి వాటిని వెలికితీసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఖనిజాలను ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఖనిజాల పరిశోధనతోపాటు వైవిధ్యమైన సముద్ర వృక్ష, జీవజాతులపై పరిశోధనలు జరిగేలా ఈ డీప్ సీ మిషన్‌ను వినియోగించుకోవాలని తాజాగా మంత్రి సూచిస్తున్నారు. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
వచ్చే ఏడాదే ‘సముద్రయాన్’: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతమని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్‌కు సముద్రయాన్ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఈ ఏడాది ఆఖరుకల్లా పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని వెల్లడించారు. సముద్రయాన్‌కు 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మత్స్య6000’ జలాంతర్గామిలో ముగ్గురు పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖర్లో హిందూ మహాసముద్రంలో వారు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి. -
మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువవుతోంది. దాదాపు అన్నింట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని చోటుకు, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు. సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్ ఉపయోగాలివే.. మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమైనట్లు తెలిసింది. -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..
భూమిగా ఏర్పడటానికి ముందు అగ్ని గోళంలో ఉండేదని క్రమేణ ఘనీభవించిన మంచులా ఉందని ఆ తర్వాత విస్పోటనం చెంది భూమిగా ఏర్పడిందని తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న సముద్రాల ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), జపాన్‌లోని నీగాట యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అందుకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్ ఏర్పడుటకు దారితీసిన సంఘటనలను గురించి తమ అధ్యయనంలో వెల్లడించారు. శాస్త్రవేత్తలు సుమారు 700 నుంచి 500 మిలియన్ల సంవత్సరాల క్రితం స్నోబాల్ ఎర్త్ గ్లేసియోషన్ అని పిలిచే మందపాటి మంచు పలకలు భూమిని కంపి ఉంచినట్లు విశ్వసిస్తారు. భూమిపై ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదలను రెండొవ ఆక్సిజనేషన్ ఈవెంట్‌గా పిలుస్తారు. భూమి ప్రారంభక్రమంలో ఈ ఆక్సిజన్ రకరకాలుగా మార్పు చెంది చివరికి జీవనానికి ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందింది. భూమి పుట్టుకకు ముందు ఉన్న ఉనికి కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన శిలాజాలు, సముద్రాలు మాయమవ్వడంతో అదోక అంతుపట్టిని మిస్టరిలా ఉండిపోయింది. ప్రస్తుతం హిమలయాల్లో అటువంటి సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో ఆ విషయాలను కనుగొనవచ్చు అనే కొత్త ఆశ పరిశోధకుల్లో చిగురించడం ప్రారంభమైంది. శాస్త్రవేత్తల బృందం కనుగొన్న నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని, కాల్షియంను కోల్పోయినట్లు గుర్తించారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుతుందని అన్నారు. అందువల్లే ఈ మహాసముద్రం ఘనీభవించినప్పుడూ ఏర్పడిన మెగ్నిషియంను వాటి రంధ్రాల్లో బంధించిందని పరిశోధకులు చెబుతున్నారు. కాల్షియం లేమి పోషకాహర లోపానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే సైనో బాక్టీరియాకు అనుకూలంగా మారింది. దీంతో వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ బయటకు పంపడం జరిగిందని తెలిపారు. వాతావరణంలో ఆక్సిజన్ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్ ఉంటుంది అని శాస్త్రవేత్త ఆర్య చెప్పారు. దీనికోసం శాస్త్రవేత్లల బృందం పశ్చిమ కుమావోన్ హిమాలయాలలో అమృత్పుర్ నుంచి మిలామ్ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపునీటి ఉనికిని వెల్లడించాయి. ఇది భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం
సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్‌కు చెందిన ఎన్–ఆర్క్ సంస్థ నిర్మిస్తోంది. మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్–ఆర్క్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. బయటివైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. రెండో వర్తుల భాగంలో తేలియాడే భవంతులు, నగరంలో జనాల రాకపోకలకు వీలుగా పడవ మార్గాలు ఉంటాయి. లోపలి వైపు నడిమధ్యన ఉండే వర్తుల భాగంలో ఉపరితలంపై ఎలాంటి నిర్మాణం ఉండదుగాని, నీటి అడుగున డేటా సెంటర్, వైద్య పరిశోధన కేంద్రం ఉంటాయి. ‘డోజెన్ సిటీ’గా పేర్కొంటున్న ఈ నగరం సముద్రంలో వైద్య పర్యాటక కేంద్రంగా జనాలను ఆకట్టుకోగలదని దీని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో తేలియాడే భవంతులు ఉన్న భాగంలో నివాస భవనాలతో పాటు తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి. అలాగే నగర ప్రజల అవసరాల కోసం పంటలు పండించుకునే చిన్న చిన్న పొలాలు, తోటలు కూడా ఉంటాయి. నాలుగు కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్న ఈ నగర నిర్మాణం 2030 నాటికి పూర్తి కాగలదని చెబుతున్నారు. (చదవండి: 600 ఏళ్లనాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే) -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
సముద్ర జలాల్లో ‘జీన్స్’ కాలుష్యం.. కేవలం ఏడుసార్లు వాడి పడేస్తున్నారు
ఫ్యాషన్ ప్రపంచంలో ‘జీన్స్’కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. అబ్బాయిలు, అమ్మాయిలు అయితే సరేసరి. పాశ్చాత్య దేశాల్లో వీటి హవా అంతాఇంతా కాదు. ఈ కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల కంటే ఎక్కువ జతల జీన్స్ అమ్ముడవుతున్నాయి. ప్రతి సెకనుకు 73 యూనిట్ల విక్రయాలు జరుగుతున్నాయంటే మాటలు కాదు. మార్కెట్లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్ పరిశ్రమ తీసిపోవడంలేదు. సాక్షి, అమరావతి: జీన్స్ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్ టన్నుల మైక్రోఫైబర్లు (మూడు మిలియన్ బ్యారెళ్ల చమురుకు సమానం) ఏటా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా సాగర జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న సింథటిక్ పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్ (పాలిమర్ రంగులు)లను నీటిలో కడగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. దీనివల్ల జీన్స్‌లోని ప్లాస్టిక్ మైక్రోఫైబర్లు సముద్ర జలాలను కప్పేసినట్లు గుర్తించారు. యూఎన్ నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ 20 శాతం కలుషిత నీరు, 10 శాతం కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది విమానాలు, సముద్ర రవాణా ద్వారా వెలువడే ఉద్గారాల (గ్రీన్హౌస్ వాయువులు) కంటే ఎక్కువగా ఉంటోంది. దేశంలోని భారతియార్ విశ్వవిద్యాలయంలో టెక్స్టైల్స్, దుస్తుల డిజైన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అముత కరుప్పచామి విశ్లేషణ ప్రకారం.. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే చైనా, భారత్‌తో పాటు, అమెరికాలో కూడా రసాయనాలను విరివిగా వినియోగించడం కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతోందని చెబుతున్నారు. ఒక జత జీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీరు సాధారణంగా.. దుస్తులన్నింటికీ అద్దకం, ఇతర ప్రక్రియల కోసం భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు. ప్రతి టన్ను వ్రస్తానికి రంగు వేయడానికి దాదాపు 200 టన్నుల మంచినీరు అవసరం. ఇందులో ఒక జత బ్లూజీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇది సగటు వ్యక్తికి ఏడేళ్లపాటు అవసరమయ్యే తాగునీటితో సమానం. అలాగే, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ ఏటా 93 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. ఈ నీటితో ఐదు లక్షల మంది జీవితకాల దాహార్తిని తీర్చవచ్చు. మరోవైపు.. దుస్తుల వినియోగంలోనూ మానవుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొద్దికాలానికే వాడిపడేస్తూ..: ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో 5,300 మిలియన్ టన్నుల నూలు తయారవుతోంది. దీంతో ఏటా 80 బిలియన్ల కొత్త దుస్తులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యూఎన్ ఎని్వరాన్‌మెంట్ ప్రోగ్రామ్ భాగస్వామి అయిన ఎల్లెన్ మకార్తుర్ ఫౌండేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక ట్రక్కులోడు వ్రస్తాలను చెత్తలో పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం గడిచిన దశాబ్దంలో దుస్తుల ఉత్పత్తి రెట్టింపు అయింది. కానీ, వీటిలో 70 శాతం దుస్తులను ప్రజలు కొద్దిరోజులకే వాడిపడేస్తున్నారు. సగటున పాశ్చాత్య దేశాల్లో ఏడుసార్లు మాత్రమే ధరించి పడేస్తున్నారు. అదే ఇక్కడ ఒక కుటుంబం ఏటా 30 కిలోల దుస్తులను పడేస్తోంది. కొలరాడో పరిశోధన విశ్వవిద్యాలయం ప్రకారం.. కేవలం 15 శాతం దుస్తులను మాత్రమే రీసైకిల్ లేదా విరాళంగా అందిస్తున్నారు. ఇది మరింతగా పెరిగితే ఫ్యాషన్ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్.. కోవిడ్–19 తర్వాత ప్రజల దృక్పథంలో మార్పువస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్ ట్రెండ్ వైపు మళ్లుతోంది. ఇటువంటి సస్టైనబుల్ బ్రాండ్లు డజన్ల కొద్దీ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి బట్టల తయారీకి ఆర్గానిక్ మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇవి ఖరీదైనవిగా ఉన్నాయి. ఇందులో దుస్తులకు ఆర్గానిక్ రంగులనే వాడుతున్నారు. ప్రజల్లోనూ రీసైక్లింగ్ క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. దుస్తుల్ని వివిధ దశల్లో చాలాసార్లు ఉపయోగించేలా అవగాహన వస్తోంది. మన దేశంలో ఇలా.. ఇక వివిధ మార్కెట్ అధ్యయనాల ప్రకారం భారతీయ డెనిమ్ (జీన్స్) మార్కెట్ కొన్నేళ్లుగా వార్షిక వృద్ధి రేటు సగటున 8–9 శాతం వరకు కొనసాగిస్తోంది. ఇది 2028 నాటికి రూ.91,894 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు.. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటు జీన్స్ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం సగటున ఒక వ్యక్తికి 0.5 జీన్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి వ్యక్తికి ఒక జత జీన్స్ ఉండాలంటే సంవత్సరానికి మరో 700 మిలియన్ జతల జీన్స్ అవసరమని అంచనా. అలాగే, ఓ సర్వే ప్రకారం 2023లో 59 శాతం మంది భారతీయులు గత సంవత్సరం కంటే ఎక్కువ జీన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
సముద్రాల గుట్టు ఛేదించే ‘మత్స్య యంత్రం’
మన దేశానికి 7,500 కిలోమీటర్లకుపైగా సముద్ర తీరం ఉంది. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం.. మూడూ మూడు దిక్కుల్లో ఆవరించి ఉన్నాయి. ఎంతో మత్స్య సంపదకు, మరెన్నో వనరులకు, చిత్రవిచిత్రాలకు సముద్రాలు పుట్టినిల్లు. వాటి అడుగున ఉండే చిత్రవిచిత్రాలూ ఎన్నో. ఈ క్రమంలోనే సముద్ర అడుగున పరిశోధనలు, వనరుల వెలికితీత కోసం భారత్ ‘సముద్రయాన్’ప్రాజెక్టును చేపట్టింది. ఆ వివరాలేమిటో చూద్దామా.. సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్ ‘డీప్ ఓసియన్ మిషన్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్‌ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది. ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్ వాటర్ సబ్ మెర్సిబుల్ వెహికల్)ను భారత్ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. మత్స్య 6000 పేరుతో.. ► ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్ వాటర్ వెహికల్ ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్ వాటర్ వెహికల్‌ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ► సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్‌వాటర్ వెహికల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. ► మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్ వాటర్ వెహికల్‌ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ► ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు. ఇదీ చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సాగరతీరాల్లో ఉన్న నగరాలు తక్కువేమీ కాదు గాని, సాగరంలోని అలలపై తేలియాడే నగరం ఎక్కడైనా ఉందంటే అది వింతే! అలాంటి వింతనే దక్షిణ కొరియా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి తేలియాడే నగరాన్ని బ్యూసన్ సాగరతీరానికి ఆవల సముద్రం అలలపై నిర్మించింది. ‘ఓషియానిక్స్’ పేరిట పూర్తి జనావాసానికి అనుకూలమైన నగరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహకారంతో నిర్మించింది. త్వరలోనే ఇది పర్యాటకుల రాకపోకలకు, నౌకల రవాణాలకు అనువుగా సిద్ధం కానుంది. సముద్రంలో తేలియాడే ఈ నగరంలో రకరకాల ఆహార పంటలను పండిస్తుండటం, పండ్ల తోటలను పెంచుతుండటం కూడా విశేషం. -
నడి సంద్రం.. నౌకలో మంటలు.. వేలాది కార్లు బూడిద
Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!) -
మృత్యుసాగరం?
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండే విశాఖ సముద్ర తీరం మృత్యు కుహరంగా మారిపోతోంది. నిత్యం కడలి కెరటాల ఘోష వినిపించే ప్రాంతం.. సముద్ర జీవరాశుల మృత కబేళాలతో నిండిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగర గర్భంలో ఉండే జీవరాశులు సైతం ఒడ్డుకు కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొంత కాలంగా విభిన్న జీవరాశులు విశాల విశాఖ తీరంలో ఎక్కడో ఒక చోట నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్‌లతోపాటు విశాఖ తీరంలో అరుదైన డాల్ఫిన్లు ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్రే(టేకు చేప), ముళ్లచేప మొదలైన జీవరాశులు మరణిస్తున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవుతున్న కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యమే ప్రధాన శత్రువు వాతావరణంలో మార్పులను మానవ నివాసానికి అనుకూలంగా మార్చేవి సముద్రాలే. ఇందులోని జలాలు ఆవిరై వర్షాలుగా కురిసి నీటివనరులు అందేందుకు దోహదపడుతున్నాయి. మనిషి తీసుకునే ప్రోటీన్లలో సింహభాగం సముద్రం ఇస్తున్నదే. ఇన్ని ఇస్తున్న సాగరానికి.. తిరిగి మనమేం ఇస్తున్నామంటే కాలుష్య రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలే. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా సముద్ర గర్భంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ సీగా మార్చేస్తున్నారు.. అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులే ప్రధాన సమస్యగా మారుతున్నారు. బీచ్ ఒడ్డున కూర్చొని.. తినుబండారాల్ని తినేసి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు సముద్రంలో పారేస్తున్నారు. ఇలా వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకి మించి సముద్రాల్లో చేరుతుండటంతో ఆమ్లగాఢత పెరుగుతోంది. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విడుదలవుతున్న హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేపలకు హాని చేస్తోంది. అడుగున ఉన్న ఆకర్షణీయమైన ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా భావిస్తున్న జలచరాలు.. వాటిని తిని మృత్యువాతపడుతూ ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్ర జీవులు మనుగడ సాధించేందుకు జలాల్లో ఆక్సిజన్, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకూ ఆక్సిజన్ అవసరంకాగా.. 30 నుంచి 33 శాతం వరకూ లవణీయత ఉండాలి. కానీ విషపూరిత రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తుండటంతో అసమతుల్యత ఏర్పడి.. సరైన స్థాయిలో ఆక్సిజన్ అందక ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వెలికితీస్తున్న స్వచ్ఛంద సంస్థలు సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలకు ఎలాంటి హాని తలపెడుతున్నాయనే విషయంపై ప్రజల్లో అవగాహన శూన్యమనే చెప్పుకోవాలి. అందుకే.. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాసిక్ వ్యర్థాల్ని తొలగించేందుకు లివిన్ అడ్వెంచర్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ప్రతి రోజూ 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. మరోవైపు సాగర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విడిచిపెట్టకుండా తీరానికి వస్తున్న సందర్శకులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినా.. పర్యాటకుల నుంచి స్పందన కరువవడంతో జలచరాల ఉనికికి ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యాన్ని కాపాడటం అందరి బాధ్యత ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని సముద్రంలో విసిరేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సముద్రంలో ఉన్న ప్రాణులు చనిపోతూ కనిపిస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే వెలికితీస్తున్నాం. మన సముద్రాన్ని మనం పరిరక్షించుకుందాం. ప్రజలు, సందర్శకులు కూడా దీనికి సహకరించాలి. ప్లాస్టిక్ సముద్ర ప్రాణుల్ని అంతరించిపోయేలా చేస్తోంది. ఇది జాతి మనుగడకే చాలా ముప్పు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. – బలరాంనాయుడు, లివింగ్ అడ్వెంచర్స్ సంస్థ ప్రతినిధి చేపల శరీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ సంస్థతో కలిసి ఎన్ఐవో చేసిన ఓ పరిశోధనలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరాల్లోకి వెళ్తున్నట్లు తెలిసింది. ఇది ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మెరైన్ పొల్యూషన్ అనేది కేవలం జలచరాలకే కాదు.. మానవాళి ఉనికికే పెను ముప్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తోంది. పరిశ్రమల వ్యర్థాలపై కాలుష్య నియంత్రణ మండలితో పాటు జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ఐఓ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తీరాన్ని కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. – డా. కె.ఎస్.ఆర్.మూర్తి, ఎన్ఐవో విశ్రాంత శాస్త్రవేత్త -
అడ్వెంచర్: సాగర గర్భాన వందేళ్ల నాటి నౌకల అన్వేషణ
సాక్షి, విశాఖపట్నం: వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్ ఇండియా నావిగేషన్ కంపెనీకి చెందిన చిలకా షిప్ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్ అడ్వెంచర్స్ సంస్థను సంప్రదించాయి. జోగంపేట, భావనపాడు బీచ్‌లలో.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌కు కొంత దూరంలో విదేశీ నౌక వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు చరిత్రలో ఉంది. ఈ షిప్ ఎంత దూరంలో మునిగిపోయింది, ఆ షిప్ ఏ దేశానికి చెందినది, అది కార్గోనా లేక ప్రయాణికులతో వెళ్లే నౌకా అనే వివరాలు మాత్రం ఎక్కడా లేవు. అదేవిధంగా పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్ షిప్ అని తెలిసింది. అయితే.. ఈ షిప్ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్ అడ్వెంచర్స్ సంస్థ సమాయత్తమవుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ బృందం భావనపాడు తీరంలో అన్వేషణ సాగించాల్సి ఉండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ.. అన్వేషణ మొదలు పెట్టనున్నారు. -
సాగర ప్రపంచం అద్దాల మేడల్లో..
సాక్షి, విశాఖపట్నం: తీరంలో నిలబడితే.. అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా పలకరించి వెళ్లిపోయే కెరటాలతోనే మనం సంబరపడిపోతాం. మరి సాగర గర్భంలో దాగి ఉన్న ఎన్నో వింతల్ని చూస్తేనో.. ప్రతి జీవికి దగ్గరగా వెళ్లి పలకరిస్తేనో.. డాల్ఫిన్ నుంచి ఆక్టోపస్ వరకూ.. షార్క్ నుంచి సీహార్స్ వరకూ.. జెల్లీ ఫిష్ నుంచి కాక్టస్ వరకూ స్టార్ ఫిష్ వరకూ.. ఈ అన్నింటినీ చేతితో తాకితేనే అ అనుభూతే వేరు. దేశంలోనే తొలి ఓషినేరియం ఏర్పాటుకు విశాఖ వేదిక కానుంది. పర్యాటక రంగానికి మణిహారంగా మారనుంది. ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై ఇటీవలే చర్చించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలోను విశాఖలోని పర్యాటక ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఈ ఓషినేరియం ప్రధాన అంశంగా నిలిచింది. టన్నెల్ ఆకారంలో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఇళ్లల్లో చిన్న చిన్న నీటి తొట్టెలో చేపలను, మొక్కల్ని పెంచుతూ.. అందులో ఆకర్షణ కోసం రంగు రంగు రాళ్లను వేస్తుంటాం. దీన్ని అక్వే రియం అని పిలుస్తారు. ఇలాంటి అక్వేరియం ఓ భారీ టన్నెల్ ఆకారంలో ఉంటే.. అందులో దాదాపు సముద్రంలో పెరిగే అన్ని జీవుల్నీ పెంచితే దాన్ని ఓషి నేరియం అంటారు. మన దేశంలో ఇలాంటి ఓషినేరియంలు ఇంతవరకూ లేవు. విశాఖలో ఏర్పాటు చేస్తే దేశంలో తొలి ఓíషినేరియంగా గుర్తింపు పొందుతుంది. అదో అద్భుత ప్రపంచం ఓషినేరియం ఓ అద్భుత సాగర ప్రపంచంలా ఉంటుంది. సముద్రలోతుల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. టన్నెల్లా ఉండే ఈ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే డాల్ఫిన్ మన మీదకు వచ్చేసినట్లుంటుంది.. షార్క్ నోరు తెరుచుకొని కరిచేందుకు వెంటబడుతుంది. ఆక్టోపస్‌లు మన చుట్టూ తిరుగుతుంటాయి. సముద్రపు రొయ్యలు మీసాలు మెలేస్తుంటాయి. సముద్రపు తాబేళ్లు.. ప్రమాదకర జెల్లీ ఫిష్‌లు, విష సర్పాలు.. ఇలా ప్రతి ఒక్క సముద్ర జీవరాశీ మన పక్కనే ఉంటూ మనమే సాగరగర్భంలోకి వెళ్లినట్లుగా కనిపిస్తుంటుంది. అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో నీలి నీలి అందాలు చూపు తిప్పనీకుండా చేస్తాయి. 1938లో యూఎస్‌లోని ఫ్లోరిడాలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఓషినేరియం ఏర్పాటు చేశారు. పోర్చుగల్‌లోని లిస్బన్ ఓసినేరియం, ప్రపంచంలో అతి పెద్ద ఓషినేరియంగా సింగపూర్‌లోని మెరైన్ లైఫ్ పార్క్, ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్ ఓషినేరియం, లాస్ ఏంజిల్స్‌లో ఉన్న సీ వరల్డ్ ఇలా మొదలైన ఓషినేరియంలు ప్రపంచంలో అతి అరుదైన జీవరాశుల సముదాయంతో నిర్మించారు. వీటి ప్రత్యేకతలు పరిశీలించి అత్యుత్తమ టన్నెల్ ఓషినేరియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో స్థల పరిశీలన ఓషినేరియం ఏర్పాటు చేసేందుకు కొద్ది నెలల క్రితం రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. టన్నెల్ ఓషినోరియం నిర్మాణానికి ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో రుషికొండ ప్రాంతం దీన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత డీపీఆర్ సిద్ధం చేశాక.. ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభు త్వం దీనిపై సుముఖత వ్యక్తం చేస్తే.. రెండేళ్లలో విశాఖ వాసులకు టన్నెల్ ఓషినోరియం అందుబాటులోకి రానుంది. పీపీపీ విధానంలో దీన్ని నిర్మించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. రూ.300–400 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఆనందా గ్రూప్స్ సంస్థ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పర్యావరణ, వాతావరణ పరంగా రుషికొండ ఆమోదయోగ్యమైన స్థలమని అధికారులు గుర్తించగా.. సదరు సంస్థ మాత్రం నగరం నడిరోడ్డున కానీ.. ఆర్కే బీచ్ సమీపంలో కానీ.. 10 ఎకరాల స్థలం ఇవ్వాలనీ.. దీనికి ప్రత్యేక రాయితీలు కేటాయించాలనీ.. చాలా అంశాలతో కూడిన విషయాల్ని పర్యాటక శాఖ ముందుంచారు. సంస్థ ప్రతినిధుల గొంతెమ్మ కోరికలు విన్న శాఖాధికారులు.. అవన్నీ సమకూర్చలేమని చెప్పడంతో ఆనంద గ్రూప్ సంస్థ.. ఓషినేరియం ఏర్పాటు నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 20 వేలకుపైగా జలచరాలు పర్యాటక కేంద్రంగానే కాకుండా వైజ్ఞానిక, పరిశోధన క్షేత్రంగానూ ఉపయోగపడేలా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. టన్నెల్ ఆకారంలో నిర్మించనున్న ఈ ఓషినేరియంలో ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో కనిపించే 20 వేల సముద్ర జలచరాలు ఉండనున్నాయి. వీటిని 360 డిగ్రీల కోణంలోనూ చూడవచ్చు. చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్ దేశాలకు చెందిన నిపుణులతో ఈ ఓసినేరియంను డిజైన్ చెయ్యనున్నారు. సుమారు 3 వేల మంది ప్రజలు ఒకేసారి అద్దాల్లో ఉన్న అందాల సాగర ప్రపంచాన్ని తిలకించేలా ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరగనుంది. ఒకేసారి 2 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా డిజైన్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స Poduru: ఇక్కడి మండువా లోగిళ్లలోనే ఆ సినిమా షూటింగులు! -
తూర్పు గోదావరిలో అద్భుతం ఆవిష్కృతం
సాక్షి, తూర్పు గోదావరి: ఐ పోలవరం మండలం భైరవపాలెం వద్ద సముద్రంలో రిలయన్స్ రింగుకు సమీపంలో విచిత్రం చోటు చేసుకుంది. సముద్రంలో టోర్నడో ఏర్పడి నీరు సముద్రం నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్టు దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిని స్థానిక మత్స్యకారులు తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో ఏర్పడే టోర్నడోలను ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని భైరవపాలెం మత్యకారులు అంటున్నారు. (అనుబంధాలకు ‘కఠిన కారాగార’ శిక్ష) -
తూర్పు గోదావరిలో అద్భుతం ఆవిష్కృతం
-
యువకుడిని ముంచెత్తిన అలలు...
-
భయానకం: అలలు అతడిని లాక్కెళ్లాయి!
బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్ శాంటా క్రజ్ ఫేస్బుక్’ పేజీ నిర్వాహకులు షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు
-
వైరల్ : అంటార్కిటికాలో అరుదైన జీవి
కాన్బెర్రా : దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా సముద్రపు అరుదైన జీవి ఎనీప్నియాస్టీస్ ఎగ్జీమియాను కనుగొన్నామని ఆస్ట్రేలియా అంటార్కిటిక్ డివిజన్ తెలిపింది. అండర్‌వాటర్ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్కిటికాలో ఈ అరుదైన జీవి ఉనికిని కనుగొన్నామని పేర్కొంది. హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్, స్పానిష్ డాన్సర్, హెడ్‌లెస్ చికెన్ ఫిష్‌గా పిలుచుకునే ఈ జీవిని మొదట మెక్సికో సింధుశాఖలో కనుగొన్నారు. కాగా హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. సముద్రపు అంతరాల్లో నిక్షిప్తమైన ఇటువంటి అరుదైన సంపదను చూసే వీలు కల్పించినందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు నెటిజన్లు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ‘మనకు తెలియని విషయమేదీ లేదంటూ మనలో కొంతమంది అనుకుంటారు. కానీ ప్రకృతి చాలా విచిత్రమైందని ఇటువంటి సంఘటనల ద్వారా నిరూపితమవుతుంది కదా’ అంటూ ప్రకృతి ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. -
సముద్రంలో ఒంటరిగా 76 రోజులు!
అమెరికాకు చెందిన స్టీవెన్ కల్హాన్ రచయిత, ఫిలాసఫర్, జర్నలిస్ట్, పరిశోధకుడు. నేవల్ ఆర్కిటెక్చర్ చదివిన కల్హాన్ పడవల తయారీలో నిపుణుడు. 1986లో స్పెయిన్‌లో తీరంలో జరిగిన పడవల పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరాడు. అక్కడ పోటీలు జరుగుతుండగా తుపానులో చిక్కుకొని బోటు దెబ్బతిని ఆఫ్రికాలోని మొరాకోకు దగ్గరలో ఉన్న ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ బోటును రిపేరు చేసుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు. అప్పటికే బోటులో ఆహారం అయిపోవడంతో చేపలు, పక్షుల్ని పట్టుకొని తింటూ, వర్షాలు పడినపుడు బోటులోని ఓ డబ్బాలో నీళ్లు నిల్వచేసుకుని తాగుతూ 76 రోజుల ఒంటరి ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వెస్టిండీస్‌లోని ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ కొందరు స్థానిక జాలర్లు ఈయన్ని రక్షించడంతో తిరిగి అమెరికా చేరుకున్నాడు. సముద్రంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆ తర్వాత ఆయన రాసిన అడ్రిఫ్ట్ నవలకు ఎంతో పేరొచ్చింది. అలాగే 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో కొన్ని సంఘటనలకూ స్టీవెన్ అనుభవమే ప్రేరణ. ఆ సినిమాకు ఆయన సహాయకుడిగానూ వ్యవహరించాడు. -
సముద్రపు ఉప్పులో కూడా ప్లాస్టిక్
న్యూయార్క్: సముద్రపు నీరు కలుషితం అవుతున్న విషయం మనకు ఇప్పటికే తెలుసు. సముద్రం నీటి నుంచి తయారవుతున్న ఉప్పు కూడా కలుషితం అవుతున్న కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లండన్, యూరప్, అమెరికా, చైనా దేశాల్లో విక్రయిస్తున్న సముద్రపు ఉప్పులో చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. విక్రయ కేంద్రాల్లో కలుస్తున్నది కాదని, సముద్రంలోనే కలుస్తుందన్న విషయం సముద్ర ఉప్పు క్షేత్రాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల చేపల్లో కూడా చిన్న చిన్న ప్లాస్లిక్ ముక్కలు ఉంటున్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు ఇటీవలనే కనుగొన్నారు. మైక్రోవైబర్స్, ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ బాటిల్ లాంటి వాటివల్ల ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లాస్టిక్ ఒక్క వాతావరణాన్నే కాకుండా గాలిని, నీరును, మనం తినే ఉప్పు, ఆహారాన్ని ఎక్కువగా కలుషితం చేస్తోందని న్యూయార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ షెర్రీ మాషన్ తెలిపారు. ఒకసారి ప్లాస్టిక్ సముద్రపు నీటిలో కలిస్తే అది విషవాయువులకు, విష పదార్థాలకు అయస్కాంతంలా మారుతోందని ఆమె తెలిపారు. ఫలితంగా మంచినీళ్లలో, బీరుల్లో ప్లాస్టిక్ ముక్కలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. ఓ మనిషి శరీరంలోకి సరాసరిన సంవత్సరానికి 660 ప్లాస్టిక్ ముక్కలు పోతున్నాయని అన్నారు. అయితే వాటివల్ల మానవ ఆరోగ్యానికి కలుగుతున్న నష్టమేమిటో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. -
సముద్రంపై భూమి.. ఆ భూమిపై అడవి!
ఒకప్పుడు భూమి మొత్తం పచ్చగా ఉండేదట. మనిషిలో స్వార్థం పెరుగుతున్న కొద్దీ చెట్టూ చేమ కొట్టుకుపోయి.. కాంక్రీట్ జనారణ్యాలు వచ్చేశాయన్నమాట. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమయ్యేదో ఊహించుకోలేంగానీ... తాజా ట్రెండ్ ఏమింటే.. ఎక్కడ వీలైతే అక్కడ ఎన్ని వీలైతే అన్ని చెట్లు నాటేయడం. ఫొటోలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకీ పచ్చగా ధగధగలాడిపోతున్న ఈ భవనాల కథేమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. మలేషియా, సింగపూర్ సరిహద్దుల్లో కట్టబోతున్నారీ భారీ నగరాన్ని. విశేషాలేమిటో తెలుసా? పచ్చదనం గురించి తరువాత మాట్లాడుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది దాదాపు 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ నగరం మొత్తం సముద్రాన్ని పూడ్చడం ద్వారా అభివృద్ధి చేసిన భూమిపై నిర్మాణమవుతుంది. నివాస గృహాలతోపాటు కార్యాలయ సముదాయాలు, పార్కులు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్, అంతర్జాతీయ పాఠశాల వంటి హంగులన్నీ ఇక్కడే ఏర్పాటవుతాయి. మొత్తం ఏడు లక్షల మందికి నివాసం కల్పించేలా ఈ ఫారెస్ట్ సిటీ నిర్మాణం జరుగుతోంది. నగరం నడిబొడ్డున రెయిన్ ఫారెస్ట్ వ్యాలీ పేరుతో ఓ భారీసైజు పార్కు ఏర్పాటవుతుంది. చుట్టూ జలపాతంతో కూడిన ఈ పార్కులో పంచభూతాలను తలపిస్తూ ఐదు దిక్కులకు రహదారులుంటాయి. ల్యాబొరేటరీ ఫర్ విజనరీ ఆర్కిటెక్చర్ (లావా) సంస్థ సిద్ధం చేసిన ఈ డిజైన్ ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్ పోటీల్లో విజయం సాధించింది కూడా. సాధారణ నగరాలతో పోలిస్తే దీంట్లో పచ్చదనం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందన్నది ఫొటోలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే... ఈ నగరంలో వీలైనంత వరకూ వాహన సంచారం మొత్తం భూగర్భంలోనే సాగిపోతుంది. రహదారుల్లో ఎక్కువ భాగం పాదచారులకు అనుకూలంగా సిద్ధం చేస్తారు. పక్కనే కొంచెం ఎత్తైన మార్గంలో రైల్వేలైన్ ఉంటుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రుచుల ఓషన్...
-
హవాయ్లో అరుదైన దృశ్యాలు
-
ఆ విషయంలో భారత్ కు 11వ స్థానం!
పూనెః సముద్ర జలాలను శుభ్రపరిచే విషయంలో భారత్ 11వ స్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్ర జలాలనుంచి వెలికి తీసి, తీరాలను శుభ్రపరిచే ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో ఇండియా పదకొండవ స్థానానికి పరిమితమైంది. ఓషన్ కన్జర్వెన్సీ దినోత్సవం సందర్భంగా 2015 సెప్టెంబర్ 26న చేపట్టిన ఓషన్ క్లీన్ ఆప్ కార్యక్రమంలో సముద్ర జలాలనుంచి తొలగించిన చెత్త బరువు ఆధారంగా ఇటీవల నైరోబి ర్యాంకులను వెల్లడించింది. ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో భారత దేశం 11వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ తీర శుభ్రత కార్యక్రమంలో భాగంగా మొత్తం 8 లక్షల మంది వాలంటీర్లు కలసి సుమారు 80 లక్షల కేజీల వ్యర్థాలను సముద్రం నుంచి వెలికి తీసినట్లు నైరోబి తెలిపింది. ఆయా నగరాల్లోని ఇండియన్ మారిటైం ఫౌండేషన్ సమన్వయంతో భారత దేశంలోని ముంబై, పూనే, గోవా, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్, కోటా, సహా పశ్చిమ మరియు ఉత్తర భారత దేశంలోని సమారు 250 మైళ్ళ తీరాన్ని10,800 వాలంటీర్లు శుభ్రం చేసినట్లు తెలిపింది. ఒక్క తీరాలను శుభ్రం చేయడమే కాక, నదులనుంచి సముద్రాల్లోకి వచ్చే అనేక వ్యర్థాలను క్లీన్ అప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేపట్టామని, అందుకు విద్యార్థులు, కార్పొరేటర్లు, ప్రధాన బ్యాంకులు మద్దతునిచ్చాయని ఇండియా క్లీన్ అప్ కార్యక్రమానికి కో ఆర్డినేట్ గా వ్యవహరించిన కమోడోర్ పవన్ మల్హోత్రా తెలిపారు. -
బోటెక్కిన డాల్ఫిన్!
డాల్ఫిన్.. సముద్రంలో కనిపించే అందమైన జలచరం. ఎప్పుడూ సముద్రం మధ్యలో పడవలు, ఓడల వెంబడి కనిపించే తెల్లని నీళ్లలో మునిగి తేలడానికి ఇవి బాగా ఇష్టపడతాయని మనకు తెలిసిందే. వాటికున్న ఆ ఇష్టమే ఓ పడవలో ప్రయాణిస్తున్న వారికి షాక్ ఇచ్చింది. మెక్సికోలో డాల్ఫిన్లను చూడటం కోసం పడవలో సముద్రంలోకి వెళ్లిన వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పడవ వెంబడి వస్తూ గాల్లో పల్టీలు కొడుతున్న ఓ డాల్ఫిన్ హఠాత్తుగా బోటు లోపలికి దూకేసింది. అంతే, పడవలోని వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో మొదట కాస్త కంగారు పడ్డ సిబ్బంది పరుగులు పెట్టారు. కాస్త తేరుకున్నాక వారిలో ఇద్దరు బోటులో పడిన డాల్ఫిన్ మీద గుడ్డను కప్పి తిరిగి సముద్రంలో పడేశారు. బోటులో ప్రయాణిస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. -
పొంచివున్న ప్రళయం....!
లండన్: భూతాపోన్నతి పెరగడం వల్ల కలిగే వాతావరణ మార్పుల కారణంగా సముద్రాలు ఉప్పొంగి సమీప నగరాలను ముంచేయడం, అకాల తుపానులు విరుచుకు పడడం, జనావాసాలను ధ్వంసంచేసే భూకంపాలు రావడం, మానవులను మృత్యు కళేబరాలుగా మార్చే కరవుకాటకాలు దాపురించడం లాంటి దారుణ పరిస్థితులు సంభవిస్తాయని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు చూద్దాంలే! అనే తాత్సార ధోరణిని ఇంతకాలం దేశాధినేతలు అనుసరిస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వేసిన అంచనాలకన్నా తీవ్రమైన పరిస్థితులే దాపురిస్తాయని వాతావరణ మార్పులపై తాజాగా జరిపిన అతి పెద్ద అధ్యయనం వెల్లడిస్తోంది. దాదాపు 20వేల క్రితం నాటి వాతావరణ పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకొని రానున్న పదివేల సంవత్సరాల్లో వాతావరణంలో కలిగే మార్పులను దాదాపు పాతిక మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. యూనివర్శిటీ ఆఫ్ విక్టోరియాకు చెందిన మైఖేల్ ఎబీ నాయకత్వాన జరిగిన ఈ అతి పెద్ద అధ్యయనాన్ని ‘నేచర్ క్లైమేట్ చేంజ్’లో ప్రచురించారు. కార్బన్ ఉద్గారాలను అరికట్టడం ద్వారా భూతాపోన్నతి రెండు డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలనే ప్రపంచ దేశాల లక్ష్యాన్ని నిజంగా సాధించినప్పటికీ ప్రపంచంలో 20 శాతం జనాభా తీర ప్రాంతాలను ఖాళీచేసి వలసపోవాల్సిందేనని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పోయిన వాటి సానుకూల ప్రభావం కనిపించాలంటే కూడా పదివేల సంవత్సరాలు నిరీక్షించాలని తాజా అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టవ్‌పై నీటిని వేడిచేసి, ఆ తర్వాత స్టవ్‌ను కట్టేసిన చాలా సేపటి వరకు కూడా నీళ్లు వేడిగా ఉన్నట్లుగానే కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన భూతాపోన్నతి అంత త్వరగా తగ్గదని వారు భావిస్తున్నారు. భూతాపోన్నతి పరిస్థితులు ఇప్పుడున్నట్లుగానే కొనసాగినట్లయితే పశ్చిమ అంటార్కటికాలో మంచు పలకలు వేగంగా కరగి సముద్ర నీటి మట్టాలు దాదాపు పది అడుగులు అంటే మూడు మీటర్లు పెరుగుతాయని, పర్యవసానంగా న్యూయార్క్, లండన్, షాంఘై నగరాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ లక్ష్యం ప్రకారం భూతాపోన్నతిని రెండు డిగ్రీలు తగ్గించినట్లయితే ప్రపంచంలో 20 శాతం తీరప్రాంత ప్రజలు ఖాళీచేయాల్సిందేనని వారు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వెయ్యికోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు వెలువడుతున్నాయని, 1990 దశకంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు ఉద్గారాలు వెలువడుతున్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో 58 వేల కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు ఉన్నాయని, మరో రెండు వేల నుంచి 2,300 సంవత్సరాల నాటికి ఈ ఉద్గారాలు 1,28,000 కోట్ల టన్నుల నుంచి 5,12,000 కోట్ల టన్నుల వరకు పెరగవచ్చని శాస్త్రవేత్తల అంచనాలు తెలియజేస్తున్నాయి. లక్ష్య సాధన దిశగా ప్రపంచం కదిలినట్లయితే మరో 300 సంవత్సరాలకు కార్బన్ ఉద్గారాలను అరికట్టగలమని, అయితే వాటి సానుకూల ఫలితాలు రావాలంటే మాత్రం పదివేల సంవత్సరాలు నిరీక్షించాల్సిందేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిస్థితుల్లో మార్పు తీసుకరానట్లయితే మరో రెండువేల సంవత్సరాల నాటికి సముద్ర మట్టాలు 80 అడుగుల నుంచి 170 అడుగుల వరకు పెరుగుతాయని వారి అంచనా. సముద్రాలు ఉప్పొంగడం వల్ల భారత్‌తోపాటు సెంట్రల్ అమెరికా, ఆఫ్రీకా, బురుండి, చాడ్, సూడాన్, కాంగో లాంటి దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని మరో అధ్యయనం తెలియజేస్తోంది. -
మునిగిపోవడం కల్ల!
ఈ కుర్రాడు వేసుకున్న టీషర్ట్‌ను జాగ్రత్తగా గమనించండి. ఏదైనా తేడా కనిపిస్తోందా? లేదుకదూ... కానీ ఛాతీకి ఇరువైపులా భుజాలకు దగ్గరగా రెండు ఆకారాలున్నాయి చూశారా? అవే ఈ టీషర్ట్ స్పెషాలిటీ. ఎడమవైపున లంగరు ఆకారంలో ఉన్న దాన్ని గట్టిగా కిందకు లాగారనుకోండి. మహాసముద్రం లోనూ మీరు కించిత్ కూడా మునగకుండా తేలియాడుతారు. టీషర్ట్ వెనుకభాగంలో ఉండే ప్రత్యేకమైన ట్యూబ్‌లోకి గాలి ప్రవేశించి మిమ్మల్ని నీటిపైనే ఉంచుతుంది. ఈత నేర్చుకునే వారికి, వాటర్‌స్పోర్ట్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏజీస్ లైఫ్షర్ట్ పేరుతో దీన్ని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. -
ముగ్గురి ప్రాణాలు కాపాడిన సెల్ఫీ స్టిక్
న్యూయార్క్: సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు ఉపయోగించే సెల్ఫీ స్టిక్ ఓ కుటుంబాన్ని కాపాడింది. సముద్రంలో ఈత కొడుతున్న వారిని ఓ రాకాసి అల మింగబోతుండగా దాని సాయంతో బయటపడ్డారు. మస్సాచుస్సెట్స్లోని సముద్రతీరం వెంబడి టెక్సాస్‌కు చెందిన డెర్రిక్ జాన్, ఆయన భార్య, కూతురు ఎరిన్(16) కాలక్షేపానికి వెళ్లిన వారు తీరపుఒడ్డున స్నానం చేసేందుకు దిగారు. వారిలో కూతురు హెరిన్ చేతిలో కెమెరాను సెల్ఫీ స్టిక్కు అమర్చి వీడియో తీస్తుండగా వారి వెనుక నుంచి ఒక్కసారిగా భారీ అల వచ్చి ముంచేసింది. దీంతో హెరిన్ తన చేతిలోని సెల్ఫీ స్టిక్‌ను సముద్రంలోకి జారిపోతున్న తల్లిదండ్రులకు అందించి కాపాడింది. దీంతో హమయ్య అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సముద్రంలో బాలుడు గల్లంతు
తూర్పుగోదావరి: కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన పిక్కి రాము(8) అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. -
కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై మహా సముద్రం
వాషింగ్టన్: అరుణగ్రహంపై నీటి జాడల కోసం అన్వేషిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ ఆసక్తికర విషయాన్ని కనుగొంది. సుమారు 430 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై మహా సముద్రం ఉండేదని...అరుణగ్రహం ఉపరితలాన్ని సుమారు 450 అడుగుల మేర ముంచేంత స్థాయిలో అందులో నీరు ఉండేదని గుర్తించింది. అందులోని నీటి పరిమాణం భూమిపై ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రంకన్నా చాలా ఎక్కువగా ఉండేదని...మొత్తంగా మార్స్ మహాసముద్రంపై 2 కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉండేదని లెక్కగట్టింది. ఇది మార్స్ ఉత్తర ధ్రువాన్ని దాదాపు ఆక్రమించేంత స్థాయిలో ఉండేదని అధ్యయనంలో అంచనా వేసింది. కాలక్రమేణా 87 శాతం నీరు అంతరిక్షంలో కలిసిపోయిందని పేర్కొంది. మార్స్‌పై నీరు ఉండేదని తేలడంతో అక్కడ జీవం కూడా సుదీర్ఘకాలంపాటు కొనసాగి ఉండేదని అభిప్రాయపడింది. -
హే.. కృష్ణా!
వాడుకున్న నీటి కంటే వృధా అయిన నీరే ఎక్కువ గత 52 ఏళ్లలో 42 వేల టీఎంసీలు సముద్రం పాలు గడచిన పదేళ్ల కాలంలోనే 5,077 టీఎంసీలు వృథా సగటున ఏడాదికి 800 టీఎంసీలపైనే సాగరంలోకి... బ్యారేజీ దిగువన నీటి నిల్వలకు ప్రతిపాదనలు కరువు మిగులు జలాలకోసం నాడు పులిచింతల మొదలుపెట్టిన వైఎస్ సాక్షి, విజయవాడ బ్యూరో: సాగునీటి వాడకంపై సమర్థవంతమైన ప్రణాళికలు లేకపోవడంతోపాటు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోన్న నిధుల కొరత రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. భారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి భారీస్థాయిలో వస్తోన్న వరద నీటిని ఎక్కడికక్కడ రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడం, అవసరాన్ని బట్టి వాడుకోవడంలో ఏటా అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. గడచిన 52 ఏళ్ల కాలంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 42,087 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేయడం ఇందుకు నిదర్శనం. గడచిన పదేళ్ల సాగునీటి వాడకపు గణాంకాలను పరిశీలించినా ఇదే నిజమని స్పష్టమవుతోంది. 2004-05 నుంచి ఇప్పటివరకూ 1,933 టీఎంసీల నీటిని వాడుకోగా, సముద్రంలోకి వదిలింది మాత్రం 5,077 టీఎంసీలు. ఈ గణాంకాలను చూసి కృష్ణా రివర్‌బోర్డు అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తప్ప మిగతా నాయకులెవ్వరూ సర్ప్లస్ వాటర్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి కేటాయింపు 811 టీఎంసీలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నపుడు కృష్ణా జలాల కేటాయింపులు 811 టీఎంసీలు. తుంగభద్ర, రాజోలిబండ డైవర్షన్ స్కీం, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆయకట్టు భూములతో తాగునీటి అవసరాలకూ ఈ నీటినే వాడాలి. రాష్ట్ర విభజన జరిగాక ప్రాజెక్టుల్లోని నీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాగునీటి కోసం అవసరమని ఆంధ్రప్రదేశ్, విద్యుదుత్పత్తికి కావాలంటూ తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగంపై వాదులాడుకుంటున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్ని చూసి మళ్లీ కరువు తప్పదంటూ ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు అందివచ్చిన వరద నీటిని సమర్థంగా వినియోగించుకోవడంలో వెనుకబడ్డాయి. ఫలితంగా అన్నదాతలకు ఏటా సాగునీటి తిప్పలు తప్పడం లేదు. వాడుకున్న నీటి కంటే వృధానే ఎక్కువ... కృష్ణాబేసిన్‌కు చివరనున్న కృష్ణా డెల్టా ప్రాంతంలో నదీజలాల వాడకపు గణాంకాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. 2004-05 నుంచి 2014-15 ఖరీఫ్ సీజను వరకూ 7,010 టీఎంసీల నీరు బ్యారేజీకి చేరగా అందులో 1,933 టీఎంసీలనే తాగు, సాగు అవసరాలకు వినియోగించారు. మిగతా 5,077 టీఎంసీల నీరూ సముద్రంలో కలిసింది. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం ఒక టీఎంసీ (థౌజెండ్ మిలియన్ క్యూసెక్స్) నీటితో ఆరున్నర నుంచి ఏడు వేల ఎకరాల మాగాణి, 14 వేల మెట్ట భూములను సాగులోకి తీసుకురావచ్చు. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల మధ్య నీటి నిల్వలకు ఏడాది కిందట వరకూ ఎటువంటి ప్రాజెక్టులు, రిజర్వార్లు లేనందున వరదనీటిని పెద్ద మొత్తంలో సముద్రంలోకి వదిలారు. దీన్ని గుర్తించిన వైఎస్ పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏడాది కిందట దీన్ని ప్రారంభించినా పూర్తి సామర్థ్యంలో (45 టీఎంసీలు) నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ 54 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా రివర్‌బోర్డు అధికారులు బేసిన్ పరిధిలో నీటి వాడకం, సర్ప్లస్ వాటర్ వివరాలను పరిశీలిస్తున్నారు. బ్యారేజీ దిగువన నీటి నిల్వకు చెరువులు... వృధాగా సముంద్రంలోకి వెళ్లే జలాలను నిల్వ చేసుకుని అటు తాగు, ఇటు సాగునీటిగా వాడుకునేందుకు వైఎస్ కాలంలోనే ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టారు. అయితే 2009లో వచ్చిన భారీ వరదల తరువాత ప్రభుత్వం వీటి సంగతినే మర్చిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి హంసలదీవి వరకూ సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బ్యారేజీ నుంచి దిగువకు విడుదలయ్యే నీటిని అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లో 20 టీఎంసీల వరకూ నిల్వ చేయాలన్న ఆలోచన అటకెక్కింది. ఇక్కడి ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు బాగా పెరిగే వీలుంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో మూడు టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయడం సాధ్యం కాదు. ప్రకాశం బ్యారేజీ 10 కిలోమీటర్ల ఎగువన మరో బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మిస్తేగానీ కొంత మేర సమస్య పరిష్కారం కాదు. -
సముద్ర తీర ప్రాంతాల సందర్శన
పాఠక పర్యటన మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు... ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల. మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్రోడ్లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్లో మా ప్రయాణం సాగింది. పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది. అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం. ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం. పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం. పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం. పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం. మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. -
కోటి ఆశలతో...
చీరాల టౌన్, న్యూస్‌లైన్: సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి చెందే సమయంలో 45 రోజుల పాటు ప్రభుత్వం విధించిన వేట నిషేధం పూర్తయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మత్స్యకారులు కోటి ఆశలతో సముద్రంలో వేటకు పయనమయ్యారు. గంగమ్మను నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారులు గతేడాది సంభవించిన విపత్తులు మళ్లీ రాకూడదంటూ పూజలు చేసి వేటకు శ్రీకారం చుట్టారు. వేట నిషేధ సమయంలో ఎటువంటి ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం మత్స్యకారులు తంటాలు పడ్డారు. నిషేధం పూర్తికావడంతో ఒక్కో బోటుకు నలుగురు చొప్పున ఆనందోత్సాహాలతో సముద్రంలోకి వేటకు వెళ్లారు. వేటకు కావాల్సిన వలలు, ఆహారం, ఇంజిన్, చేపలు నిల్వ చేసుకునేందుకు ఐస్‌బాక్సులను పడవల్లో పెట్టుకుని బయలుదేరారు. కొందరు మత్స్యకారులు శనివారం రాత్రే గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల వేటకు వెళ్లి ఆదివారం ఉదయానికి తీరానికి చేరుకున్నారు. వలలకు చిక్కిన కూన, రొయ్యలు, పారలను వేలంలో విక్రయించారు. తొలిరోజు వేట ఆశాజనకంగానే ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే బియ్యాన్ని ఈ ఏడాదికి ఇస్తారో లేదోనని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ ఓ మహాసముద్రం
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్:కాంగ్రెస్ మహాసముద్రం లాంటిదని కేంద్ర మంత్రి చిరంజీవి అభివర్ణించారు. కుళ్లూ, చెత్తా ఒడ్డుకు చేరుకుంటాయని, సముద్రం మాత్రం పవిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేశాయనీ, నిజాలు అందరికీ తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. బస్సుయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు గుంటూరు జీటీ రోడ్డులోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువతరానికి అవకాశం ఇస్తుందనీ, యువత వినియోగించుకోవాలని సూచించారు. నిఖార్సయిన వాడ్ని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. తాను నికార్సయిన వ్యక్తిని కాబట్టే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని చిరంజీవి చెప్పారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ బీసీలు, దళితులను ముఖ్యమంత్రులనుచేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే అందరికీ సమానావకాశాలుంటాయని, సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే విభజన సాకుతో పార్టీని ఎక్కువగా బలహీన పరచారని, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్టాలిన్ సినిమాలోని డైలాగులు చెప్పి కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తప్పులేదని చెప్పండి.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన పనులను ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజనపై టీడీపీ, వైఎస్సార్ సీపీలు ఇచ్చిన లేఖల ప్రతులను చూపించారు. వాటిని ఇంటింటికీ చూపించి విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులేదనే విషయాన్ని వివరించాలని కార్యకర్తలను కోరారు. గుంటూరు మిర్చి ఘాటు, పల్నాటి పౌరుషాన్ని చూపించి ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపడితే రాష్ట్రం బలహీనపడినట్లేనన్నారు. బడా వ్యాపారవేత్తలు పార్టీ ముసుగులు ధరించి వస్తున్నారని, వారి ఉచ్చులో ఇరుక్కోవద్దని కోరారు. కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీతో చంద్రబాబు జతకట్టారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.వ్యాపారులను టీడీపీలోకి చేర్చుకోవడంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ నడుతున్నారా వ్యాపార సంస్థ నడుపుతున్నారా అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా సందిగ్ధంలో ఉన్న తాను తన కుమార్తె ఇచ్చిన నైతిక స్థైర్యంతో స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.సమావేశంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, కొండ్రు ముర ళి, ఎమ్మెల్సీలు సింగం బసవపున్నయ్య, మహమ్మద్ జానీ, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సముద్రంలో మరో శకలం
మలేసియా విమానానిదని అనుమానం.. రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్370 ఆచూకీ కోసం ఆరు విమానాలు, ఆరు నౌకలతో 36 వేల చ .కి.మీ. విస్తీర్ణంలో విస్తృత గాలింపులు జరిపినా శనివారం దాకా ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా 26 దేశాల బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా రెండు శకలాలను గుర్తించడంతో వాటికోసం శుక్రవారం అన్వేషించినా.. జాడ దొరకలేదు. దీంతో అవి సముద్రంలో మునిగిపోయి ఉంటాయని భావించారు. అయితే హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా శకలాలను గుర్తించిన ప్రాంతానికి నైరుతి దిశగా 120 కి.మీ. దూరంలో మరో వస్తువును మంగళవారం చైనా ఉపగ్రహం గుర్తించినట్లు శనివారం మలేసియా రక్షణ, రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ప్రకటించారు. 22.5 మీ. పొడవు, 13 మీ. వెడల్పు ఉన్న ఆ వస్తువు అన్వేషణ కోసం చైనా రెండు నౌకలను పంపుతున్నట్లు తెలిపారు. అయితే విమానం బ్లాక్‌బాక్స్‌లో బ్యాటరీ 30 రోజులే పనిచేస్తుందని, మరో 15 రోజులు దాటితే బ్లాక్‌బాక్స్ నుంచి సంకేతాలు ఆగిపోతాయని హిషాముద్దీన్ తెలిపారు. ఏమాత్రం ప్రయోజనం లేదని భావించేదాకా అన్వేషణ కొనసాగుతుందన్నారు. విమానం ఆచూకీ కోసం సముద్ర గర్భంలో అన్వేషించేందుకు నిఘా పరికరాలను ఇవ్వాలంటూ అమెరికాను మలేసియా కోరింది. అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్కు మలేసియా రక్షణ మంత్రి ఫోన్లో విజ్ఞప్తి చేయగా.. తమ టెక్నాలజీని, పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు.