
బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్ శాంటా క్రజ్ ఫేస్‌బుక్’ పేజీ నిర్వాహకులు షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.
ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment