Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి.
మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్‌లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
(చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!)
Comments
Please login to add a commentAdd a comment