Burning
-
ఒక్కరోజులో భారీగా పంట వ్యర్థాల కాల్చివేత.. మరింతగా పెరిగిన కాలుష్యం
చండీగఢ్: పంజాబ్‌లో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో తరహా కేసుల సంఖ్య 8,404కి చేరుకుంది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 404 వరకూ పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో ఫిరోజ్పూర్లో 74, భటిండాలో 70, ముక్త్సర్లో 56, మోగాలో 45, ఫరీద్‌కోట్‌లో 30 ఘటనలు ఉన్నాయన్నారు. ఫిరోజ్‌లో అత్యధికంగా పంటవ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా పంజాబ్‌లో 2022లో ఒకేరోజులో 966, 2023లో 1155 పంట వ్యర్థాలు తగులబెట్టిన కేసులు నమోదయ్యాయి.కాగా గత సెప్టెంబరు 15 నుండి నవంబర్ 17 వరకు పంజాబ్‌లో 8,404 పంటవ్యర్థాలు తగులబెట్టారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇటువంటి సంఘటనలలో 75 శాతం తగ్గుదల కనిపించింది. పంజాబ్, హర్యానాలలో అక్టోబర్, నవంబర్లలో వరి పంట కోసిన తర్వాత భారీ ఎత్తున పంట వ్యర్థాలు తగులబెడుతుంటారు. ఇదిలో ఢిల్లీలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
పంట వ్యర్థాలు దహనం చేస్తే భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే గాలి కాలుష్యం ఎక్కువైందన్న ఆరోపణలొస్తుండటం తెలిసిందే. దీనిని కట్టడి చేసేందుకు రైతులపై జరిమానాలను భారీగా విధించాలని గురువారం కేంద్రం నిర్ణయించింది. పంట వ్యర్థాలకు నిప్పుపెట్టే రైతులకు జరిమానాలను భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు విధించనున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలు తెలిపాయి. తాజా నిబంధనల ప్రకారం.. రెండెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు తన పొలంలోని వ్యర్థాల్ని కాలిస్తే రూ.5వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇది రూ.2,500 మాత్రమే ఉంది. అదేవిధంగా, 2 నుంచి 5 ఎకరాల భూమి గల రైతు ఇదే పనిచేస్తే రూ.5 వేలు బదులు ఇకపై రూ.10వేలు కట్టాల్సిందే. అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలకు నిప్పుపెడితే రూ.30వేల వరకు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్రం ప్రకటించింది. ఇవి ‘కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చట్టం–2021’లో భాగమని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్క్‌ను దాటడంతో జనం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఏమిటంటూ గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం సరైన చట్టాలను రూపొందించలేకపోతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జరిమానాలను విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్రం ప్రకటించింది. పంజాబ్ రైతు సంఘాల నిరసన పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన యంత్రాలను అందించడానికి బదులుగా కేంద్రం జరిమానాలను భారీగా పెంచడంపై పంజాబ్‌లోని రైతు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. వ్యర్థాల నిర్వహణకు యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో మరోమార్గం లేక దహనం చేస్తున్నామే తప్ప, ఉద్దేశపూర్వకంగా కాదని వారంటున్నారు. కాలుష్యానికి కారణమంటూ రైతుల వైపు వేలెత్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 30 శాతం మంది రైతులకు మాత్రమే పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను అందజేసిందని వివరించారు. పంట వ్యర్థాల వల్ల జరిగే కాలుష్యం కంటే పరిశ్రమలు, రవాణా రంగం వల్లే గాలి కాలుష్యం ఎక్కువని పర్యావరణ నిపుణురాలు సునీతా నారాయణ్ తెలిపారు. -
దహనానికి ముందే కుప్పకూలిన రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కోటా నగరంలోని దసరా మైదానం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 65 అడుగుల ఎత్తయిన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. రావణాసురిని దిష్టిబొమ్మను నిలబెట్టేందుకు ఉపయోగించిన బెల్టు తెగిపోవడంతో ఒక్కసారిగా రావణాసురుని బొమ్మ కూలిపోయింది. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రావణుని దిష్టిబొమ్మను దహనం కోసం సిద్ధం చేశారు.క్రేన్ సాయంతో ఆ రావణాసురుని బొమ్మను నిలబెడుతుండగా ఒక్కసారిగా శబ్ధం చేసుకుంటూ అది కిందపడిపోయింది. రావణాసురుని దిష్టిబొమ్మ పడిపోయిన నేపధ్యంలో దాని వెనుక భాగం దెబ్బతింది. దీంతో దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం ఖురేషి మాట్లాడుతూ రావణుని దిష్టిబొమ్మను ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు రూపొందించారని తెలిపారు. కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను ఇప్పటికే మైదానంలో నిలబెట్టారు. రావణుని దిష్టిబొమ్మను నిలబెట్టే సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఖురేషి తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
అది అగ్గే..కాదు పిడుగే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది. రూ.108 కోట్ల విద్యుత్ నష్టం! ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్కోకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్డ్ చార్జీల నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుంది. భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరమ్మతులకు బీహెచ్ఈఎల్ ససేమిరా.. కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు బీహెచ్ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది. -
‘ఇది అధికార పార్టీ పనే’.. రాజమండ్రిలో అలజడిపై భరత్‌రామ్
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ నేత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి దహనం చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుం డగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మాజీ ఎంపీ భరత్ రామ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయనతో పాటు ప్రకాశం నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఇటు వంటి విషసంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని చెప్పారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం,ఇళ్ల పైకి దాడులు చేయడం, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం వంటి దారుణాలకు ఒడిగట్టారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు దర్యాప్తు చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. -
3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు
సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు. అక్కడ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు పంపిణీ చేస్తే కోడ్ ఉల్లంఘనే నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు. -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
మంటల్లో శునకం.. ప్రాణాలకు తెగించిన యువకుడు!
ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాటిని ఇంటిలోని మనుషుల్లానే భావిస్తూ, వాటిపై ప్రేమ కురిపిస్తుంటారు. వాటి రక్షణ కోసం ఏమి చేసేందుకైనా సిద్ధపడుతుంటారు. తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియో జంతు ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడాన్ని గమనించవచ్చు. ఈ నేపధ్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో ఒక వ్యక్తి పరుగున వచ్చి , మంటలు వ్యాపించిన ఆ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అతనిని అగ్నిమాపక సిబ్బంది వారించినా, అతను వారి మాటను పట్టించుకోడు. మంటలు చుట్టుముట్టిన ఇంటిలోకి దూరిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తరువాత ఒక శునకాన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఆ శునకాన్ని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతికి స్వల్పంగా కాలిన గాయం అవుతుంది. ఈ కుర్రాడి జంతు ప్రేమను చూసిన వారంతా అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @HumansNoContext అనే ఖాతాలో షేర్ చేశారు. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్‌లో ‘తన పెంపుడు శునకాన్ని రక్షించడానికి ఒక వ్యక్తి తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు’ అని రాశారు. ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోను చూసిన యూజర్స్ ఆ యువకుడని నిజమైన హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. Man runs into burning home to save his dog pic.twitter.com/BOMk1nBDiU — NO CONTEXT HUMANS (@HumansNoContext) January 25, 2024 -
ఆమె వ్యాధి 'మెడికల్ మిస్టరీ'! ఏ భావోద్వేగాన్ని వ్యక్తం చేసినా ఇక అంతే..!
కొన్ని రకాల వ్యాధులు వైద్యానికి అంతు చిక్కని మిస్టీరియస్ వ్యాధుల్లా ఉంటాయి. బాబోయ్ ఇదేం వ్యాధి! అనేలా జుగుప్సకరంగా ఉంటాయి. ఆ వ్యాధిని ఫేస్ చేస్తున్న బాధితులకే కాదు చూస్తున్న వాళ్లను కూడా హడలెత్తిస్తాయి. అలాంటి అంతు చిక్కని విచిత్రమైన వ్యాధిని ఎందుర్కొంటోంది 20 ఏళ్ల బెత్ త్సంగరైడ్స్. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన బెత్ త్సంగరైడ్స్ అనే 20 ఏళ్ల అమ్మాయి వైద్య విధానానికి అందని ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎలాంటి భావోద్వేగాలకు స్పందించిందా ఇక అంతే!.. ఆమె శరీరీం యాసిడ్ పోసినట్లు భగభగమని మండిపోతుంటుంది. వెంటనే చర్మంపై దద్దుర్లతో కూడిన ర్యాషస్ వచ్చేస్తాయి. అవి అచ్చం కాలిన గాయాల మాదిరిగా దారుణంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఆమెకు సరిగ్గా 15 ఏళ్ల ప్రాయం నుంచి ఫేస్ చేస్తోంది. వైద్యులు సైతం ఆమె వ్యాధిని 'మెడికల్ మిస్టరీ'గా వ్యవహరించారంటే.. అది ఎంత విచిత్రమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని వైద్య భాషలో 'చలనశీత సమస్యలని' అంటారు. నవ్వడం దగ్గర నుంచి ఏడుపు వరకు ప్రతిదానికి ఆమె ముఖంపైన చర్మం రియాక్షన్ ఇచ్చేస్తుంది. దీంతో ఆమె ఆ బాధను భరించలేక బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయింది. అదీ కూడా ఓ గదిలో ఒంటిరిగా ఉండటమే. కనీసం బయటకు వెళ్లి గడిపే అవకాశం కూడా లేదు. వీచే గాలులకు, మంచి సుగంధభరితమైన వాసనలకు ఆమె చర్మం వెంటనే రియాక్షన్ చెంది ర్యాషస్ వచ్చేయడం మొదలైపోతుంది. ఈ అసాధారణ దీర్ఘకాలిక వ్యాధి కారణంగా సరిగా స్కూల్ ఎడ్యుకేషన్ సాగలేదు, స్నేహితులు కూడా లేకుండా పోయారని ఆవేదనగా చెబుతోంది. ఈ వింత వ్యాధిని టాచీకార్డియో సిండ్రోమ్(పీవోటీఎస్)గా నిర్థారించారు వైద్యులు. అమెరికా నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం..ఈ పీవోటీఎస్ వ్యాధికి సాధారణంగా మైకము, మూర్ఛ, దడ, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి కానీ ఆమెకు మాత్రం అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా అరుదుగా కొద్దిమందిలోనే కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి కారణంగా ఆమె ప్రేగులు, మూత్రపిండాలు సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధి కారణంగా ఆమె మొత్తం ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆమె ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదీపడితే అది తినేందుకు కూడా వీలులేదు. కనీసం బయట ఫుడ్‌ని కూడా ఆస్వాదించలేదు. ఒకవేళ తినాలనుకున్నా చాలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ చెఫ్‌లకు తనకు ఇచ్చే ఆహారం ప్రిపరేషన్‌కి సంబంధించిన జాగ్రత్తలు వివరించాలి. ఇంత తతంగం ఉంటేనేగానీ బయటకీ రాలేని స్థితి ఆ అమ్మాయి పరిస్థితి. ఈ రియాక్షన్లతో ఆమె ముఖం మచ్చలు మచ్చలుగా అసహ్యంగా తయారయ్యింది. కనీసం అద్దంలో చూసుకుంటేనే ఒక విధమైన ఇబ్బందికి అనిపిస్తుంది ఆమెకు. అయినప్పటికీ ఆ ఇబ్బందులన్నింటిని తట్టుకుని నూతన ఉత్సహాంతో గడిపేయత్నం చేస్తోంది. తన పరిస్థితి ఇంతే..! తానే బాగుండటానికి ప్రయత్నించాలని సమస్యతో పోరాడేలా తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే యత్నం చేస్తోంది. పైగా ముఖానికి మేకప్ వేసుకుని ఆకర్షణీయంగా కనిపించే యత్నం కూడా చేస్తోంది. . అయితే వైద్యులు ఈ మేకప్‌ని కూడా అస్సలు వినియోగించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే 'ఆమెకు ఆమె ఎలర్జీ' కదా!. ఐతే బెత్ త్సంగరైడ్స్కి మేకప్ వేసుకోవడమంటే చాలా ఇష్టమంటా..!. అలా మేకప్ వేసుకుని తనను తాను చూసుకోవడం ఇష్టం అని చెబుతుంది బెత్ త్సంగరైడ్స్. నిజానికి ఇలాంటి వ్యాధి పగవాడికి రాకూడదనిపిస్తోంది. అసలు ఎలాంటి భావోద్వేగం చెందించలేని స్థితి అంటే.. ఎంతటి దారుణమైన స్థితి. ఒకరకంగా చెప్పాలంటే జీవనమే స్థంబించనట్లు ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి తనలో ఆత్మవిశ్వాసాన్ని కూడగొట్టుకుని బతికే యత్నం చేస్తున్నందుకు హ్యాట్సాప్ అని చెప్పాలి కదూ..!. View this post on Instagram A post shared by Beth Tsangarides (@bethtsangarides) (చదవండి: జస్ట్ హెయిర్ డ్రైయర్ వాడినందుకు.. ఏకంగా రూ. 78 వేలు వసూలు చేసిన హోటల్ యాజమాన్యం!) -
గడియారాలను తగలేస్తారు!
ఉత్తరార్ధగోళంలో శీతకాలపు అత్యంత సుదీర్ఘరాత్రి డిసెంబర్ 21. చాలా పాశ్చాత్య దేశాల్లో ‘విటర్ సోల్స్టైస్’ వేడుకలు జరుపుకొంటారు. క్రిస్మస్కు నాలుగు రోజుల ముందు వచ్చే ఈ సుదీర్ఘరాత్రి సందర్భంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు చేసుకుంటారు. ఇంగ్లండ్‌లోని బ్రైటన్ రేవు పట్టణంలో మాత్రం ‘వింటర్ సోల్స్టైస్’ సందర్భంగా జనాలంతా సందడి సందడిగా బయలుదేరి వీథుల్లోకి వచ్చి మూకుమ్మడిగా గడియారాలను తగలేస్తారు. వాళ్లు తగలేసేవి నిజం గడియారాలు కాదు లెండి. కాగితాలు, అట్టలతో చేసిన బొమ్మలాంతరు గడియారాలను కూడళ్లలో పోగుబెట్టి తగలేస్తారు. వీథుల్లో నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపు పొడవునా బాణసంచా కాల్పులు జరుపుతారు. ‘బర్నింగ్ ది క్లాక్స్’ పేరుతో జరిపే ఈ వేడుక వెనుక పురాతన సంప్రదాయమేదీ లేదు. ముప్పయ్యేళ్లుగా మాత్రమే ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. తొలిసారిగా 1993లో ఈ వేడుకలు జరిగాయి. అప్పటి నుంచి బ్రైటన్ ప్రజలకు ఇదొక ఆనవాయితీగా మారింది. సహకార ఉద్యమానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సేమ్ స్కై’ అనే కళాకారుల బృందం ఈ ‘బర్నింగ్ ది క్లాక్స్’ వేడుకలను ప్రారంభించింది. ఈ వేడుకలను తిలకించడానికి ఇంగ్లండ్ నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో జనాలు బ్రైటన్‌కు చేరుకుంటారు. గడచిన ముప్పయ్యేళ్లలో ఈ వేడుకలు మూడుసార్లు మాత్రమే రద్దయ్యాయి. తొలిసారి 2009లో హిమపాతం కారణంగా రద్దయితే, తర్వాత 2020, 2021లో ‘కోవిడ్’ కారణంగా ఈ వేడుకలు జరగలేదు. -
రైతులను విలన్లుగా చూపొద్దు.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి రైతులను విలన్లుగా చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను వారు కాల్చడానికి చాలా కారణాలు ఉండొచ్చు.. కానీ దానిని అరికట్టడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. ప్రతియేటా శీతాకాలం ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పంట వ్యర్థాలపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఇలా స్పందించింది. 'రైతులను విలన్లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం వంటి అనేక కారణాలు వారికి ఉండొచ్చు. పంటవ్యర్థాలు కాల్చడాన్ని అరికట్టాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వమే ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా..? పంజాబ్‌లో మొత్తంలో కేవలం 20 శాతం కేసుల్లో మాత్రమే జరిమానా విధించారు. జరిమానాతో పాటు ఎఫ్ఐఆర్ వంటి చర్యలను తీసుకోవచ్చు. వరి పెంపకం వల్ల పంజాబ్ నేలల్లో తేమశాతం తగ్గిపోతుంది.' అని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. గతంతో పోలిస్తే ఈ నవంబరులో దిల్లీ మరింత కాలుష్య నగరంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల కాల్చివేతల ఘటనలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ, యూపీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం -
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం
ఢిల్లీ: దేశ రాజధానిలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు. " ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ — anand mahindra (@anandmahindra) November 7, 2023 ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో దేశ రాజధానిలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-భేసి విధానాన్ని కూడా అమలుపరచనుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పంట కోతలు అయిపోయి.. ఆ వ్యర్ధాలను దహనం చేసే సమయం కావడం వల్ల ఢిల్లీలో పరిస్థితి తీవ్రతరమౌతోంది. పునరుత్పత్తి వ్యవసాయం(Regenerative Agriculture) : పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా సాగు చేస్తారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పద్ధతినే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇదీ చదవండి: కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..? -
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది?
అమెరికాలోని నెవాడా స్టేట్‌లో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ సాంస్కృతిక సంబరాన్ని తిలకించేందుకు 70 వేల మంది హాజరయ్యారు. అయితే వారంతా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉత్సవం దక్షిణ నెవాడాలోని ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఉత్సవ సమయంలో ఇలాంటి విపరత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఎవరూ ఊహించలేదు. రెండు మూడు రోజులుగా ఇక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఉత్సవం జరుగుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. నడిచేందుకు కూడా వీలు లేనివిధంగా రోడ్లు తయారయ్యాయి. చివరికి టాయిలెట్లు కూడా ఉపయోగించలేని విధంగా మారిపోయాయి. ఈ ఫెస్టివల్‌కు ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, బిలియనీర్లు హాజరయ్యారు. ప్రకృతి వైపరీత్య వాతావరణం కారణంగా ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. నిర్వాహకులు ఇప్పటికే ఉత్సవాన్ని నిలిపివేశారు. అలాగే ఇక్కడికి కొత్తగా వాహనాల రాకను నియంత్రించారు. కాగా 2018లోనూ ఈ ఉత్సవంలో ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆ తరువాత రెండేళ్లపాటు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదు. ప్రస్తుతం ఉత్సవం జరుగుతున్న ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. అమెరికా ల్యాండ్ మేనేజిమెంట్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అత్యధికంగా బురద పేరుకుపోయిన కారణంగా వాహనాలు రాకపోకలకు సురక్షితం కాదు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయనే సూచనలు ఉన్నందున ఇక్కడ ఉన్నవారంతా ఆహారాన్ని, తాగునీటిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. Looks like God is not down with all the hedonism at Burning Man...#WeWantAnswers #BurningMan #BurningMan2023 #Satanic #SatanicAgenda pic.twitter.com/0knj4thwMW — Isaac’s Army (@ReturnOfKappy) September 4, 2023 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు సంబంధించిన సమాచారం తమకు అందిందని, వైట్‌హౌస్ అధికారులు అప్రమత్తమై, సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు తుపాను కారణంగా ఫెస్టివల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెవాడాలోని బ్లాక్ రాక్ సిటీలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా బర్నింగ్ మ్యాన్ పండుగ 1990లలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇక్కడికి 80 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 1993 సంవత్సరంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య 1000కి పైగా పెరిగింది.ఈ సంఖ్య ప్రస్తుతం 70 వేలకు చేరుకుంది. అమెరికాలో అత్యధిక సెలవులు వచ్చే రోజుల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్కు దూరంగా ఉంటూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినవారు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తారు. అలాగే వారు రూపొందించిన వస్తువులను వారే తగులబెడతారు. తద్వారా వ్యక్తిలోని అహం అంతమవుతుందని నమ్ముతారు. అందుకే ఈ ఉత్సవానికి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది. ఇది కూడా చదవండి: బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? Burning Man is a mess. Upward of 60,000 people are literally stuck in mud and have been ordered to stay put. Food and water running low. pic.twitter.com/HKRZSwkTCY — Citizen Free Press (@CitizenFreePres) September 2, 2023 -
ముచ్చటపడి కొనుక్కున్న బైక్.. మొదటి నుంచీ సమస్యలే.. చిర్రెత్తుకొచ్చి
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
ఇలా చేస్తే శరీరంలో ఉన్న కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు!
ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు. కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి.. సెనగలు ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది. క్వినోవా డైట్ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. టోఫు: ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ: దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి. మొలకలు వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..
ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్‌లోని సిమ్ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి. ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్ గవర్నర్ డేవిడ్ ట్రెంచ్ చేత ప్రారంభించబడిన మెరైనర్స్ అనే ఓ క్లబ్ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్ హోటల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా. Huge fire tears through #HongKong #skyscraper: Fire hits skyscraper being built on site of old Mariner's Club in Hong Kong's #TsimShaTsui https://t.co/zmG6QrCLhQ pic.twitter.com/3DcPsuIykq — 🛰️ War in Ukraine 🍉 (@EUFreeCitizen) March 2, 2023 (చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..) -
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్‌లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
భగ భగ మండే నిప్పుల కొలిమిలో వేసినా తగలబడదు
చరిత్రలో కనుమరుగు అయిన పుస్తకాలు ఎన్నో. చెదలు పట్టడమో, ప్రమాదాల్లో నాశనం అయిపోవడమో జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. ఇక్కడో పుస్తకం ఎంతో ప్రత్యేకం. మంటల్లో వేసిన కూడా తగలబడదు ఈ పుస్తకం. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?.. వెయ్యికిపైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా నాశనం కాదట!. మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్‌ని ఉపయోగించి ఈ బుక్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ అన్‌బర్నబుల్ బుక్ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో రూపొందించారు. ఈ పుస్తకం వేలంలో కోటి రూపాయలకు పైనే పలకింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును.. స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే 'పెన్ అమెరికా' సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట. ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదే . ఆ పుస్తక రచయిత అట్వుడ్ ఈ అన్‌బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్‌మెయిడ్స్ 'పెన్ అమెరికా' కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పుస్తకం చాలాసార్లు నిషేధించబడింది. అంతేకాదు బుక్ పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే పబ్లిషింగ్ సంస్థ, టోరంటోలోని రీథింక్ క్రియేటివ్ ఏజెన్సీ, ది గ్యాస్ కంపెనీ ఇంక్ అనే రెండు కంపెనీలు ఉమ్మడిగా ఈ అన్‌బర్నబుల్ బుక్ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. దాదాపు 2200 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతకు గురైనప్పటికీ నాశనం కాదని, పైగా ప్రత్యేకమైన ఇంక్‌తో ముద్రించబడిందని బుక్ డిజైనర్లు వెల్లడించారు. అంతేకాదు ఒక కెనడా రచయిత ఫ్లేమ్ త్రోవర్‌తో పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: 14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు ప్రవేశం లేదు) -
నడి సంద్రం.. నౌకలో మంటలు.. వేలాది కార్లు బూడిద
Ship Carrying Thousands of vehicles: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని పోర్చుగీస్ ద్వీపం తీరంలో వాహనాలతో కూడిన ఓడ బుధవారం నుంచి మంటల్లో దగ్ధమవుతోంది. నౌకలోని 22 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇది ఇప్పుడు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగల్‌లోని అజోర్స్ తీరం వెంబడి కొట్టుకుపోతోంది. ‘ఫెలిసిటీ ఏస్’ అనే ఓడ ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎమ్డెన్ నుంచి బయలుదేరి బుధవారం అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని డేవిస్‌విల్లేకు చేరుకోవాల్సి ఉంది. పోర్చుగీస్ ద్వీప ప్రాంతమైన అజోర్స్‌లోని టెర్సీరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఓడ కార్గో హోల్డ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పోర్చుగీస్ బలగాలు సిబ్బందిని ఖాళీ చేయించారు. హెలికాప్టర్‌తో కూడిన రెస్క్యూ ఆపరేషన్ సాయంతో సిబ్బందిని రక్షించారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టం కాలేదు. ఆ ఓడలో 189 బెంట్లీ కార్లతో సహా వోక్స్వ్యాగన్ గ్రూప్‌కి చెందిన 4 వేల కార్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు ఆ ఓడలో పోర్ష్ కంపెనీకి సంబంధించిన కార్లు సుమారు వెయ్యి కార్లు ఉన్నట్లు ఆ కంపెనీ ధృవీకరించింది. తమ కార్ల గురించి ఆందోళన చెందుతున్న కస్టమర్లను సంబంధిత డీలర్లను సంప్రదించమని సంబంధిత కంపెనీల ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!) -
మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు
తిరువనంతపురం: ఇంట్లో కానీ ప్రయాణిస్తున్న వాహనంలో అనూహ్యంగా మంటలు చెలరేగడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.. ఆ సమయంలో ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతుంటారు. అయితే లారీలో మంటలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ప్రమాదాన్ని ఆపడంతో రియల్‌లో హీరో అనిపించుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం రోజు పశుగ్రాసం(గడ్డి)లోడ్‌తో వెళుతున్న లారీ రోడ్డుపైన ఉన్న విద్యుత్ తీగలకు తాడకంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వయనాడ్ నుంచి కొడంచేరికి చేరుకునే సమయంలో మంటలు లారీలోని గడ్డి మొత్తానికి చుట్టుముట్టాయి. దీన్ని గమనించిన డ్రైవర్ మధ్యలోనే లారీని నుంచి దిగి పారిపోయాడు. అయితే ప్రమాదాన్ని గమనించిన షాజీ వర్గీస్‌గా పేర్కొనే ఓ వ్యక్తి హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే లారీ ఎక్కి దానిని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అంతేగాక మంటల్లో కాలిపోతున్న లారీని కూడా రక్షించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాలో బంధించగా.. దీనిని ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రాణాలకు తెగించి వర్గీస్ చేసిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. చదవండి: గల్లీలో పల్లీలు అమ్ముకుంటూనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు ఈ ఘటనపై వర్గీస్ మాట్లాడుతూ.. మండుతున్న లోడ్‌ను కింద పడేయాడానికి జిగ్‌జాగ్ పద్ధతిలో లారీని నడిపినట్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా తాను హెవీ డ్యూటీ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో దేశవిదేశాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించడంలో అనుభవం ఉందని, అదే ఇప్పుడు ఈ సవాలును ఎదుర్కోవడంలో సహయపడిందని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్నేహితులు, తెలిసిన వారి నుంచి ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాపక అధికారులు కూడా వర్గీస్ సాహసాన్ని కొనియాడారు. చదవండి: గాల్లో పక్షిలా చక్కర్లు కొడుతున్న కోడి.. వైరల్ వీడియో View this post on Instagram A post shared by നമ്മൾ കോഴിക്കോട്ടുകാർ (@kozhikottukaarofficial) -
వారం రోజులు వర్క్ ఫ్రం హోం ఇవ్వండి: సుప్రీంకోర్టు
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా.. పంట వ్యర్థాలను కాల్చడాన్ని వారంపాటు ఆపేయాలని రైతులను కోరింది. అలానే ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే మరోసారి లాక్డౌన్ విధింపునకు తాము సిద్ధమే అని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంలో ప్రత్యేక అఫిడవిట్లను దాఖలు చేశాయి. కాగా, ఢిల్లీలో ప్రజలు జీవించడానికి భయపడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, గతం వారం నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు) -
సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): సినిమాలో సీన్ చూస్తాడు.. నేర కథనాలను చూస్తాడు.. ఆ తర్వాత బయటకు వచ్చి అదే తరహాలో ఘటనలకు పాల్పడతాడు. సినిమాలో చూచిన విధంగానే చేస్తాడు. అంతే కాదు మద్యం సేవిస్తే మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో పోరంకి గ్రామం ప్రభునగర్‌కు చెందిన మొక్కపాటి ఫణిదుర్గాప్రసాద్ తెలియదు. వాహనాల దగ్ధం కేసులో నిందితుడు ఫణిదుర్గాప్రసాద్‌ను పెనమలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను తెలిపారు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ప్రభునగర్‌లో తన ఇంటికి వెళ్లేందుకు గాను మార్గమధ్యంలో పోరంకి గ్రామంలోని కరణం గారి బజారు వద్ద నిలబడ్డాడు. ఇక్కడే ఇళ్లముందు పార్కింగ్ చేసిన మూడు మోటార్ సైకిళ్లకు ఉన్న పెట్రోల్ ట్యాంకు పైపులను ఊడదీసి తన దగ్గర జేబులో ఉన్న లైటర్ తో వాటిని తగులపెట్టినట్టు ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు మంటలు అధికంగా వ్యాపించడంతో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఇన్నోవా కారు కూడా కాలిపోయిందన్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడు గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా ఫణిదుర్గాప్రసాద్ విజయవాడలోని పోరంకి గ్రామం ప్రభునగర్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’) కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య -
ఈ సీజన్లో ఇవి తినండి.. బరువు తగ్గండి
ఖర్జూరాలు పోషకాలన్నిటినీ కలిపి ఒక క్యాప్సూల్ లో వేస్తే వచ్చే ఫలితాన్నిస్తాయి ఖర్జూరాలు. ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ మితంగా తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆకుకూరలు (ముదురు ఆకుపచ్చవి) పుదీనా, ఆవ ఆకు, పాలకూర, చుక్కకూర వంటి వాటిలో విటమిన్ ఏ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా, శీతాకాలంలో ఎదురయ్యే... శరీరం పొడిబారి పోవటం, జుట్టు రాలిపోవటం వంటి సమస్యల నుండి కూడా కాపాడతాయి. బాదం పప్పులు, వాల్నట్స్ వీటిని తీసుకోవటం వల్ల, శరీర ఉష్టోగ్రత సమతుల్యంగా ఉండటమే కాకుండా, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. గుండె సక్రమంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఇవి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సిట్రస్ జాతి పండ్లు సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, కమలా, బత్తాయి, నారింజ వంటి వాటిలో రసం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన సి విటమిన్ అధికంగా లభ్యమవుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అటుకులు శీతాకాలంలో అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వలన ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇందులో నుంచి శక్తి నెమ్మదినెమ్మదిగా విడుదల అవుతుండటం వల్ల మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఆకలి వేయదు. వీటికి డ్రైఫ్రూట్స్, నట్స్ జత చేసి తీసుకుంటే మరింత రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంటారు. చిలగడ దుంప చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చిలగడ దుంప తినటం వల్ల జీర్ణశక్తి బలపడి, మలబద్దక సమస్య దూరమవుతుంది. -
ఆ కాలుష్యానికి ఆనంద్ మహీంద్ర పరిష్కారం
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. వేసవి పంటల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను పారవేసే చౌకైన ,పర్యావరణ అనుకూలమైన మార్గాన్ని ట్వీట్ చేశారు. మహీంద్రా అనుబంధ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ రూపొందించిన ట్రాక్టర్ గురించి తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. కాలుష్య స్థాయిలను తగ్గించడానికి సూపర్ ప్లాంటర్ వాడాలన్నారు. ఇలాంటి యంత్రం రూపకల్పనకు నిజమైన ప్రాధాన్యత ఇస్తూ.. చురుకుగా ఉండాలంటూ వ్యవసాయరంగ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కాకు ట్యాగ్ చేశారు. దీనికి సిక్కా సానుకూలంగా స్పందించారు. స్వరాజ్ షేర్ చేసిన ట్వీట్ ప్రకారం, గడ్డి కాల్చివేతతో వస్తున్న పొగ లాంటి సమస్యలకు ఈ ట్రాక్టర్ మంచి పరిష్కారం. ఇది పొలంలో మిగిలిని మొండి వ్యర్థాలను తిరిగి మట్టిలో కలపడానికి సహాయపడుతుందని స్వరాజ్ తెలిపింది. "సూపర్ సీడర్ విత్ స్వరాజ్ 963 ఎఫ్ఈ ట్రాక్టర్'' పర్యావరణహితమైందంటూ ఒక వీడిమోను ట్వీట్ చేసింది. తమ ట్రాక్టర్లను వాడాలని కంపెనీ సూచించింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రను ఆకర్షించింది. కాగా పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా ప రిణమిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వీటిని కాల్చడం మూలగా వస్తున్న పొగ భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు తమ పొలాల్లో పంట తరువాత గడ్డిని తగులబెట్టడం దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా పలు చోట్లు అనుసరిస్తున్న ఈ పద్థతి పర్యావరణాన్ని హానికరంగా పరిణమిస్తున్న సంగతి తెలిసిందే. We should be more active in facilitating the adoption of such implements @hsikka1 This is a real priority. https://t.co/6D22OPHCGv — anand mahindra (@anandmahindra) October 14, 2020 -
భర్త అంత్యక్రియలు.. ఇద్దరు భార్యల మొండిపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు భార్యలున్న భర్త బాధలు ఇన్నిన్ని కాదయా అంటారు.. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఏమోగానీ మరణించాక మాత్రం ఆ భర్తకు తిప్పలు తప్పలేదు. ఓ భార్య దహనం అంటే.. మరొకరు ఖననం అని మొండికేయడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన దక్షిణామూర్తి భార్య తంగమ్మాళ్. భార్య జీవించి ఉండగానే గౌరీ అలియాస్ ఏసుమేరీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కంటే రెండో భార్య ఇంట్లోనే ఎక్కువకాలం గడిపే దక్షిణామూర్తి ఈ నెల 16న మృతి చెందాడు. అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయడమా.. లేక క్రైస్తవ సంప్రదాయం పద్ధతిలో ఖననం చేయడమా అనే ప్రశ్న తలెత్తింది. ‘చివరి దశలో ఆయన నా వద్దనే ఉన్నారు కాబట్టి ఖననం చేయాలి.. అంతేకాదు తన భర్త కూడా అదే ఆదేశించారు’ అని పేర్కొంటూ దక్షిణామూర్తి రాసినట్లుగా ఒక ఉత్తరాన్ని రెండో భార్య వెలుగులోకి తెచ్చింది. అయితే అందులో సంతకానికి బదులు వేలిముద్ర ఉంది. ‘ఆయనకు నేను మొదటి భార్యను.. మా సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరగాలి. సంతకం చేయడం తెలిసిన ఆయన వేలిముద్ర ఎందుకు వేస్తారు? రెండో భార్య చూపుతున్నది నకిలీ ఉత్తరం’ అంటూ పెద్ద భార్య వాదించింది. ఇద్దరు భార్యల మధ్య సామరస్యం కోసం పోలీసుల ప్రయత్నం కూడా విఫలమైంది. భార్యల కుమ్ములాట కొలిక్కిరాకపోగా దక్షిణామూర్తి శవం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లడంతో పోలీసులు చెంగల్పట్టు మార్చురీకి తరలించారు. భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యలూ కోర్టుకెక్కారు. ఇరుపక్షాల వాదనలు ముగిశాక న్యాయమూర్తి ప్రకాశ్ శుక్రవారం ఇరుపక్షాలనుద్దేశించి.. ‘దక్షిణామూర్తి అంత్యక్రియలపై ఇద్దరు భార్యలు ఏకాభిప్రాయానికి వస్తారని ఎంతో ఎదురుచూశాం.. అయితే ఇద్దరూ మొదటి నుంచి అదే పట్టులో ఉన్నారు.. రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రాకుంటే.. అనాథ శవంగా పరిగణించి ప్రభుత్వమే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది’ అంటూ తీర్పును వెలువరించారు. -
మోడీకు హఠావో.. దేశ్‌కు బచావో..
పెద్దపల్లిటౌన్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రచార ఆర్భాటాలలో మునిగి తేలుతున్న నరేంద్రమోడీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ సభ్యులు ఈర్ల కొమురయ్య హెచ్చరించారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌రహదారి కమాన్‌చౌరస్తా వద్ద శనివారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కుట్రపూరితంగా వ్యవహరించడం బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక, మహిళా, యువత, విద్యార్థి సంక్షేమాన్ని విస్మరించిన మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోడీకి హఠావో.. దేశ్‌కి బచావో.. అంటూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. నిరసనలో నాయకులు బుషనవేని సురేశ్‌గౌడ్, మంథని నర్సింగ్, అక్బర్అలీ, సర్వర్‌పాషా, సునిల్గౌడ్, కడార్ల శ్రీనివాస్, నల్లగొండ కుమార్, టాంక్ జైదేవ్, పరమేశ్వర్, దొడ్డుపల్లి జగదీశ్, బండి అనిల్, భాషా తదితరులు పాల్గొన్నారు. -
కొవ్వు కరిగించే హార్మోన్లు గుర్తించారు
ఊబకాయం పాటు మధుమేహ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలకు సరికొత్త ఆయుధం లభించింది. కొవ్వును వేగంగా కరిగించగల, మధుమేహాన్ని తగ్గించగల రెండు హార్మోన్లను కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటమ్, లిపోకాలిన్–5 అనే పేరున్న ఈ రెండు హార్మోన్లతో ఇతర ఉపయోగాలు ఉన్నట్లు వీరు అంటున్నారు. అవయవాలు, కండరాల మధ్య సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా తాము ఈ హార్మోన్లను గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ముందుగా తాము హార్మోన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తోందో గుర్తించామని, ఆ తరువాత మనుషుల్లో, ఎలుకల్లోని హార్మోన్ల మధ్య సారూప్యతను తెలుసుకున్నామని చెబుతున్నారు. చాలా హార్మోన్లు మనుషుల్లో, ఎలుకల్లో ఒకే తీరున పని చేస్తున్నట్లు తెలిసిందని, దీనిని బట్టి ఎలుకలలో నోటమ్, లిపోకాలిన్–5లు చేస్తున్న పని మానవులలోనూ సాధ్యమన్నది స్పష్టమైనట్లు వివరించారు. శరీరానికి పోషకాలు ఒంటబట్టేందుకు కూడా ఈ రెండు హార్మోన్లు ఉపయోగపడుతున్నట్లు తమకు తెలిసిందని, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపారు. -
మండుతున్న సూరీడు
వెంకటగిరి: జిల్లాలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అప్పుడే తడాఖా చూపుతున్నాయి. మార్చి మొదటివారంలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఈ నెలాఖరుకు ఎండలు మరింత తీవ్రం కావడంతోపాటు వడగాల్పులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలియజేసింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఈ వేసవిని తట్టుకోవడం ఓ పరీక్షగా మారనుంది. రెండు రోజులుగా మండు వేసవిని తలపించేలా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విచ్చలవిడిగా బోరుబావుల ద్వారా భూగర్భజలాలను తోడేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణం అవుతుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లోకి చేరిన అరకొర నీరు ఇప్పటికే అడుగంటింది. దీంతో మూగజీవాలకు గుక్కెడు నీరు కరువయ్యే పరిస్థితి నెలకొంది. కాగా రాత్రిళ్లు మంచు తీవ్రత ఎక్కువగా ఉండటం విశేషం. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీలు ) అత్యల్పం అత్యధికం ఫిబ్రవరి 25 21 33 ఫిబ్రవరి 26 21 34 ఫిబ్రవరి 27 21 34 ఫిబ్రవరి 28 21 33 మార్చి 1 22 34 మార్చి 2 20 35 మార్చి 3 20 36 మార్చి 4 19 34 మార్చి 5 25 34 -
మంట లేకుండానే వేడి చేస్తుంది...
ఆఫీసుకు క్యారియర్ పట్టుకొచ్చారా? భోజనం వేళకు.. అయ్యో ఆహారం చల్లగా ఉందని బాధపడుతున్నారా? ఇంకొన్ని నెలలు ఆగితే ఈ ఇబ్బందికి సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, స్టవ్ వంటివి అవసరం లేకుండానే ఆహారాన్ని వెచ్చబెట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేసింది యాబూల్. ఫొటోలో కనిపిస్తోందే.. అదే యాబూల్ కుక్కర్. సిలికాన్ రబ్బరుతో తయారు చేసిన ఓ బాక్స్.. మూతపై చిన్న వాల్వ్ లాంటివి ఉంటాయి దీంట్లో. వంటెలా వండాలి? అంటున్నారా? చాలా సింపుల్. ఈ కుక్కర్‌తోపాటు మీకు కొన్ని హీటింగ్ ప్యాడ్స్ అవసరమవుతాయి. కవర్లోంచి వాటిని తీసి కుక్కర్ అడుగున పెట్టాలి. పైన జిప్ బ్యాగ్‌లో వండాల్సిన ఆహారం ఉంచి.. మూత వేసేయాలి. ఒకవైపు నుంచి మూత కొంచెం మాత్రం తీసి నీళ్లుపోసి.. మళ్లీ మూత పెట్టేయాలి. అంతే. పది నిమిషాల్లో కుక్కర్ నుంచి ఆవిరి రావడాన్ని మీరు గమనించవచ్చు. కొంచెం ఆగి జిప్బ్యాగ్లో ఉన్న ఆహారాన్ని లాగించేయడమే. హీటింగ్ బ్యాగ్‌లో ఉండే రసాయనాల కారణంగా చుట్టూ ఉన్న నీరు వేడెక్కి కుత కుత ఉడికే స్థాయికి చేరుతుంది. ఈ క్రమంలోనే బ్యాగ్‌లలో ఉంచిన ఆహారం కూడా సిద్ధమవుతుందన్నమాట. ఒక్కో హీటింగ్ ప్యాడ్‌ను ఒక్కసారి మాత్రమే వాడుకోవచ్చు. కొరియాకు చెందిన యాబూల్ ఈ వినూత్నమైన ఐడియాను మార్కెట్లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరిస్తోంది. దాదాపు పదివేల డాలర్లు సేకరించాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే 23 వేల డాలర్లకుపైగా వచ్చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో నెల రోజుల్లో ఈ వినూత్నమైన కుక్కర్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. -
వృద్ధుడి సజీవ దహనం
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలంలో చెత్తను కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని ఓ వృద్ధుడు సజీ దహనమయ్యాడు. ఈ ఘటన మాల్యాల్ మండలం ముత్యంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన సంత ఆదిరెడ్డి(70) అనే వృద్ధుడు రోజువారి పనిలోభాగంగానే పోలానికి వెళ్లాడు. తన పొలంలో చెత్త కాల్చుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రితో చిన్నారి చివరి మాటలు..
► నాన్నా.. లేస్ ప్యాకెట్ తీసుకురా.. ► చిన్నారుల సజీవ దహనం ఘటన పటమట(విజయవాడ ఈస్ట్): ‘మేం పడుకుంటాంలే నాన్న.. అమ్మను తీసుకురా.. వచ్చేటప్పుడు లేస్ ప్యాకెట్ తీసుకురా.. మర్చి పోవద్దు.. అమ్మకు కూడా చెప్పా.. తమ్ముడిని నువ్వు వచ్చే వరకు నేను చూసుకుంటాలే.. త్వరగా వెళ్లి అమ్మను తీసుకుని రా.. ఎండగా ఉంది. నాకోటి.. తమ్ముడి కోటి లేస్ ప్యాకెట్లు తీసుకురండి.. అని తండ్రికి చెప్పిన ఆ చిన్నారి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వచ్చీరాని మాటలతో.. చేతి సైగలతో అందరినీ ముచ్చట చేస్తూ తిరిగిన ఆ చిన్నారి అన్నతో పాటు సజీవ దహనమవ్వటం స్థానికంగా కలచివేసింది. వివరాలు.. పటమటలోని అయ్యప్పనగర్ ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో బుధవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో ఓ కుటుంబంతో విధి ఆటలాడుకుంది. ఒడిశా రాష్ట్రంలోని కటక్‌కు చెందిన కల్లిపల్లి భోగేష్ , పద్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో రెండో కొడుకు లోకేష్(6), రాజేష్(3)లను తీసుకుని ఆరు నెలల క్రితమే జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. కాలనీలో ఓ బిల్డర్ భవనం స్థలం ముందు పూరిపాక వేసుకుని జీవనం సాగిస్తున్నారు. భోగేష్ భవన నిర్మాణ పనులు వెళ్తుండగా, పద్మ ఇళ్లలో పనిచేయటానికి వెళ్తోంది. రోజూ మాదిరే పద్మ పనికి వెళ్లగా బుధవారం భోగేష్కు పనిలేకపోవటంతో చిన్నారులకు భోజనం తినిపించి వారిని నిద్రబుచ్చి భార్యను తీసుకురావటానికి వెళ్లాడు. వెళ్లిప పది నిముషాల్లో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారులు లోకేష్, రాజేష్ సజీవ దహనం అయ్యారు. అంతా నిమిషాల్లోనే.. భోగేష్ భార్యను తీసుకురావటానికి వెళ్లిన పది నిమిషాల్లో ఇంటికి మంటలు అంటుకోవటంతో కేకలు పెట్టా. పక్కనే ఉండే యువకులు వచ్చే సరికి మంటలు బాగా వ్యాపించాయి. అప్పటికే భోగేష్ పిల్లలు లోపల మంటల్లో చిక్కుకున్నారని తెలిసింది. పక్కనే ఉన్న పండు అనే యువకుడు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషాదం జరిగిపోయింది. – కె. దేవి. ప్రత్యక్ష సాక్షి రక్షించేందుకు ప్రయత్నించినా.. చిన్నారుల ఆర్త నాదాలు వినిపించి వారిని రక్షించేందుకు ప్రయత్నించా.. లోపలి వరకు వెళ్లా.. విద్యుత్ బోర్డు వద్ద మంటలు దట్టంగా రావటంతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మంచంపై పడుకున్న చిన్నారుల ఆర్తనాదాలు చేస్తూనే సజీవ దహనమయ్యారు. లోనికి వెళ్లే క్రమంలో నా జుట్టు కూడా కాలింది. చేతికి గాయమయ్యింది. మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసి పడటంతో వెనక్కి వచ్చా. – పండు, స్థానిక యువకుడు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి పటమట : పటమట ట్రెజరీ కాలనీలో చోటుచేసుకున్న ప్రమాద బాధిత భోగేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన భోగేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.5 వేలు అందించారు. ఆయన వెంట గాదిరెడ్డి అమ్ములు, ధనేకుల కాళీ, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.8 వేలు విడుదల చేసినట్లు కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం బుధవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. బాధితులను ఆదుకుంటాం.. సంఘటన వెంటనే అక్కడికి చేరుకున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
అగ్నికి ఆహుతి
జమ్మలమడుగు రూరల్: రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని కాల్చేందుకు ఎవరో నిప్పు పెట్టారు. అది సమీపంలోని అరటి తోటను కాల్చేసింది. ఈ సంఘటన జమ్మలమడుగు మండలం పి.బొమ్మెపల్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు ముర్రా మధుసూధనరెడ్డి రెండున్నర ఎకరాల్లో అరటి సాగు చేశాడు. పంట కోత దశకు చేరుకుంది. దీనిని చూసిన వ్యాపారులు కొనుగోలు చేసి వెళ్లారు. మరో వారం, పది రోజుల్లో కోత కోసి ఇతర ప్రాంతాలకు తరలించే వారు. అయితే కొందరు రైతులు పసుపు పంట ఆకులు కోసి గ్రామ పొలిమేరలోని రోడ్డుపై వేశారు. వీటికి ఆదివారం రాత్రి ఎవరో నిప్పుపెట్టి వెళ్లారు. మంటలు వ్యాప్తి చెందడంతో ముర్రా మధుసూధన్‌రెడ్డికి చెందిన తోట దగ్ధమైంది. అందులోని 3500 చెట్లు కాలిపోయాయి. గెలలు మాడిపోయాయి. డ్రిప్పు పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనను సోమవారం తెల్లవారుజామున బాధిత రైతు గుర్తించారు. రూ. 10 లక్షలకు పైగా నష్టం వచ్చిందని ఆయన వాపోయారు. రెండేళ్లుగా నష్టం: గతేడాది ప్రకృతి వైపరీత్యం వల్ల అరటి పంట నాశనమైపోయింది. ఈ ఏడాది ఎవరో పెట్టిన మంటలకు తోట పూర్తిగా దగ్ధమైంది. డ్రిప్పు పరికరాలన్నీ కాలిపోయాయి. గతేడాది నష్టం వచ్చింది. ఈ ఏడాది పది లక్షల వరకు నష్టపోయాను. - ముర్రా మధుసూధన్‌రెడ్డి, రైతు, పి.బొమ్మెపల్లి. -
అగ్నికి ఆహుతి
జమ్మలమడుగు రూరల్: రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని కాల్చేందుకు ఎవరో నిప్పు పెట్టారు. అది సమీపంలోని అరటి తోటను కాల్చేసింది. ఈ సంఘటన జమ్మలమడుగు మండలం పి.బొమ్మెపల్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు ముర్రా మధుసూధనరెడ్డి రెండున్నర ఎకరాల్లో అరటి సాగు చేశాడు. పంట కోత దశకు చేరుకుంది. దీనిని చూసిన వ్యాపారులు కొనుగోలు చేసి వెళ్లారు. మరో వారం, పది రోజుల్లో కోత కోసి ఇతర ప్రాంతాలకు తరలించే వారు. అయితే కొందరు రైతులు పసుపు పంట ఆకులు కోసి గ్రామ పొలిమేరలోని రోడ్డుపై వేశారు. వీటికి ఆదివారం రాత్రి ఎవరో నిప్పుపెట్టి వెళ్లారు. మంటలు వ్యాప్తి చెందడంతో ముర్రా మధుసూధన్‌రెడ్డికి చెందిన తోట దగ్ధమైంది. అందులోని 3500 చెట్లు కాలిపోయాయి. గెలలు మాడిపోయాయి. డ్రిప్పు పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనను సోమవారం తెల్లవారుజామున బాధిత రైతు గుర్తించారు. రూ. 10 లక్షలకు పైగా నష్టం వచ్చిందని ఆయన వాపోయారు. రెండేళ్లుగా నష్టం: గతేడాది ప్రకృతి వైపరీత్యం వల్ల అరటి పంట నాశనమైపోయింది. ఈ ఏడాది ఎవరో పెట్టిన మంటలకు తోట పూర్తిగా దగ్ధమైంది. డ్రిప్పు పరికరాలన్నీ కాలిపోయాయి. గతేడాది నష్టం వచ్చింది. ఈ ఏడాది పది లక్షల వరకు నష్టపోయాను. - ముర్రా మధుసూధన్‌రెడ్డి, రైతు, పి.బొమ్మెపల్లి. -
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
చింతలపూడి : కార్పొరేట్ శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జన ఆవేదన సదస్సులో భాగంగా పీసీసీ కార్యదర్శి ఎం.ధామస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తాపత్రయం అంతా తన పుత్రరత్నం లోకేష్ గురించేనన్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మోడీ మెప్పు కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తుందుర్రు ఘటనలో మహిళలను తీవ్రంగా కొట్టి పోలీసులతో ఈడ్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా మంత్రి పీతల సుజాత కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో లాభపడింది విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు పంచి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20లోగా ప్రజా బ్యాలెట్‌ను పూర్తిచేసి పంపించాలని కోరారు. అనంతరం ఏలూరుచింతలపూడి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. -
బర్నింగ్ ప్రాబ్లమ్!
ఒకప్పుడు ట్రైన్ ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. బొగ్గును తీసుకొని ఇంజన్ కడుపులో వేస్తే భగభగమని మండి ఛుక్ ఛుక్మని పరుగెడుతుండేవి. మన కడుపూ అంతే. కడుపులో అన్నం పడితే... ఆ అన్నం భగభగా మండి మనల్ని పరుగులు తీసేలా చేస్తుంది. కానీ... వేళకు అన్నం పడకపోతే కడుపే మండిపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కడుపులో యాసిడ్ తిప్పేస్తుంది. ఈరోజుల్లో వేళకు భోజనం, నిద్ర ఎలాగూ కరువయ్యాయి. దీనికి తోడు పాడు స్ట్రెస్ యాసిడ్‌ను చిమ్మిస్తూనే ఉంటుంది. కడుపు రగిలిపోతూనే ఉంటుంది... అమ్మో!! ఎసిడిటీ... బర్నింగ్ ప్రాబ్లమ్! మనం తిన్న అన్నం అరగాలంటే యాసిడ్ కావాలి. అందుకే కడుపులోకి ఆహారం చేరగానే దాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే జీర్ణాశయంలో తాను పనిచేయడానికి తగినంత ఆహారం లేకపోయినా... లేదా ఏదైనా ఒత్తిడి కలిగినా కడుపులో మరింత యాసిడ్ ఉత్పన్నం అవుతుంది. అది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంది. దాంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ఆ యాసిడ్ పైకి తంతూ ఉంటే నోట్లోకి చేదుగా వస్తుంది. ఒకవేళ లోపలే ఉండిపోతే... కడుపు కండరాలపై పనిచేస్తూ, వాటిని మండిస్తూ ఉంటుంది. ఈ మంట చాలామందికి అనుభవమే. ఆ యాసిడ్ కారణంగా అన్నం సరిగా అరగనప్పుడు అక్కడ గ్యాస్ కూడా ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరమూ కలిగిస్తుంది. ఆ యాసిడ్ మంటలూ, కడుపు ఉబ్బరాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపు నిర్మాణం అర్థం చేసుకోడానికి ఒక చిన్న పోలికను చూద్దాం. అచ్చం కింద ఖాళీ స్థలం ఎక్కువ ఉండే ఒక సన్న మూతి ఉన్న సీసాలా ఉంటుంది మన కడుపు నిర్మాణం. అలాంటి సీసాలో నీళ్లు పోస్తున్నామనుకోండి. ఏమవుతుందో ఊహించండి. కింది నుంచి గాలి బుడగలు బుసబుసమంటూ పైకి వస్తాయి కదా. కడుపులోని అన్నంపై యాసిడ్ పనిచేస్తున్నప్పుడు, అవసరమైన దాని కంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు అది పైకి తంతుంది. అలాగే గ్యాస్ కూడా. ఆ గ్యాస్ పైకి వస్తూ ఉన్నప్పుడు దాంతో పాటు యాసిడ్ పైకి రావడాన్ని వెట్బర్ప్ అంటారు. ప్రతివారూ జీవితంలో ఒకసారైనా ఇలాంటి అనుభవాన్ని చవిచూసే ఉంటారు. అయితే కొందరికి అది నిత్యకృత్యం. యాసిడ్, గ్యాస్ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఈ సమస్యకు పేర్లు ఎన్నో... యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, గ్యాస్ కడుపులోనే చిక్కుకుపోయి కడుపు ఉబ్బరంగా ఉండే ఈ సమస్యను సాధారణంగా ఎసిడిటీగా పేర్కొంటాం. అయితే దీనికి వైద్యపరంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. అవి... నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్ఈఆర్డీ), ఎరోసివ్ ఈసోఫేజియల్ డిసీజ్ (ఈఈజీ), గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ). కొందరిలో ఎసిడిటీ వల్ల కడుపు మంట, గ్యాస్ పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం రాత్రివేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా రాత్రివేళల్లో కనిపించే ఆ సమస్యను నాక్చర్నల్ జీఈఆర్డీ అంటారు. కారణాలు గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్ లైఫ్‌స్టైల్), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్న వెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ∙ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం ∙పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడంతో యాసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ∙జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అదేపనిగా వేపుడు పదార్థాలు తీసుకుంటూ ఉండటం, కొన్నిసార్లు భోజనం తినకపోవడం (మీల్ స్కిప్ చేయడం), తీవ్రమైన పని ఒత్తిడి ∙రాత్రిషిఫ్ట్‌లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం ∙అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటం ∙నిద్రలేమి. మరికొన్ని అంశాలు పైన పేర్కొన్న కారణాలతో పాటు మరికొన్ని అంశాలు సైతం ఎసిడిటీకి దోహదం చేస్తుంటాయి. అవి... ∙స్థూలకాయం ∙ఒళ్లు కదలకుండా ఒకే చోట కుదురుగా కూర్చొని పనిచేసే వృత్తులలో ఉండటం వ్యాయామం చేయకపోవడం ∙తరచూ కాఫీ తాగడం లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం ∙చాక్లెట్లు తినడం రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వంటి అంశాలు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి ∙ఇక మద్యం (ఆల్కహాల్), పొగతాగే అలవాటు, మింట్ (పుదీనా బిళ్లలు) చప్పరిస్తూ ఉండటం కూడా ఎసిడిటీకి దోహదం చేస్తుంది. అనర్థాలు ►దీర్ఘకాలికంగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుండేవారిలో చాలా ఆరోగ్యపరమైన అనర్థాలు సంభవిస్తుంటాయి. ►జీర్ణాశయం కింది భాగం (లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్) సన్నబడిపోతుంది. ►చాలా కొద్ది మందిలో మాత్రం యాసిడ్ పైకి ఎగజిమ్ముతూ ఉండే జీఈఆర్డీ సమస్య చాలాకాలం పాటు కొనసాగేవారిలో నోటి నుంచి జీర్ణాశయం (పొట్ట) వరకు ఉండే నాళం క్రమంగా పేగు వంటి కణజాలాన్ని పెంపొందించుకుంటుంది. దీన్నే బారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అయితే దీనిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అది క్రమంగా ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. నివారణ ►చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ►స్థూలకాయం ఉన్నవారు తప్పక బరువు తగ్గించుకోవాలి ►బరువు పెరుగుతున్న వారు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి ► పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయాలి ►రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు ►రాత్రి ఆహారం తీసుకోగానే నిద్రకు ఉపక్రమించకూడదు ►రాత్రి భోజనం తర్వాత వీలైతే కాసేపు నడవాలి ► రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి ►రాత్రి పడుకోవడానికి ముందర రెండు గంటల పాటు ఏమీ తినకూడదు ► కంటినిండా నిద్రపోవాలి ►డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తే తప్ప నొప్పి నివారణ మందులు, స్టెరాయిడ్స్‌ను తీసుకోకూడదు. ►పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ ► మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను తలకింద పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు. ఎసిడిటీ నిర్ధారణ పరీక్షలు యూజీఐ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డీసీజ్ను నిర్ధారణ చేయవచ్చు. ఇక దీన్ని నిర్ధారణ చేయడానికి 24 గంటల పీహెచ్ మానిటరింగ్ పరీక్షను గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు. చికిత్స దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం. వీటితో తగినంత ఉపశమనం కనిపిస్తుంది. డయాఫ్రమ్ బలహీనంగా ఉండటంతో కడుపు ఛాతీలోకి పొడుచుకువచ్చిన (హయటస్ హెర్నియా) కండిషన్లో ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గృహ వైద్యం అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఎసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ ఉండి ఈ కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి ఎసిడిటీ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గుతుండటం, మింగడం చాలా కష్టంగా అనిపించడం, ఎసిడిటీ మందులు తీసుకుంటున్నా ఉపశమనం కనిపించకపోవడం, చికిత్సకు స్పందించక.. లక్షణాలు పెరుగుతూ పోతూ ఉంటే పరిస్థితిని తీవ్రంగా పరిగణించి తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఎసిడిటీ వల్ల కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు ఎప్పుడూ దగ్గు వస్తుండటం గొంతు బొంగురుగా అనిపిస్తుండటం ఆస్తమా – పిల్లికూతలు మింగుతున్నప్పుడు గొంతునొప్పి (అయితే దీన్ని గ్యాస్ కారణంగా అని గుర్తుపట్టలేకపోవడంతో.. దగ్గు, గొంతు బొంగురుపోవడం, ఆయాసపడటం, మింగుతునప్పుడు వచ్చే నొప్పికి మామూలుగా తీసుకునే మందులు వాడుతుంటారు. అవి సమస్యను పరిష్కరించకపోగా పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి). కొందరిలో ఉదరంలోని భాగాలను కప్పి ఉంచే డయాఫ్రమ్ అనే పొర బలహీనంగా ఉండటంతో కడుపు భాగం ఛాతీలోకి పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. దాంతో ఛాతీలో నొప్పితో ఎసిడిటీ, గ్యాస్ సమస్య బయటపడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్ట్రబుల్కు దోహదపడుతుంటాయి. మలం నల్లరంగులో వస్తుంటే అది కడుపు లేదా పేగుల్లో రక్తస్రావం అవుతుందన్న దానికి సూచనగా భావించి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. గుండెపోటో, గ్యాస్ ట్రబులో తెలియక తికమక ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని గుండెపోటులా పొరబడే అవకాశం ఉంటుంది. అది ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పే అయినా డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింత వహించాలి. అంతేగానీ... కేవలం ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పే అయినా నిర్లక్ష్యం చేయకూడదు. తీసుకోకూడనివి ⇒ స్ట్రాంగ్ కాఫీలు n చాక్లెట్లు ⇒ కూల్ డ్రింక్‌లు ⇒ ఆల్కహాల్ ⇒ మసాలాలతో కూడిన ఆహారం ⇒పుల్లటి సిట్రస్ పండ్లు ⇒ టొమాటో ⇒ కొవ్వుతో ఉండే ఆహారాలు ⇒ వేటమాంసం (రెడ్‌మీట్) చేయకూడనివి... ⇒ ఒకేసారి ఎక్కువగా తినేయడం ⇒ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం. ఎసిడిటీని నివారించే ఆహారాలు... ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ’ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది. తీసుకోవాల్సినవి ⇒కాస్త వీక్‌గా ఉండే హెర్బల్ టీ (అవి కడుపులో యాసిడ్ పాళ్లను పెంచకూడదు) ⇒ తాజా పండ్లు ⇒ పరిశుభ్రమైన మంచినీళ్లు ⇒ నాన్ ఆల్కహాలిక్ తాజా పండ్ల రసాలు ⇒ ఉడికించిన అన్నం, తాజా బ్రెడ్, ఉడికించినమొక్కజొన్న గింజలు ⇒ పియర్పండ్లు, అరటిపండ్లు, ఆపిల్స్, పుచ్చపండు ⇒ ఉడికించిన ఆలూ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారట్, గ్రీన్ పీస్ ⇒ కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు ⇒ కొవ్వు తక్కువగా ఉండే చేపలు, కోడి మాంసం చేయాల్సినవి ⇒ కొద్దికొద్దిమోతాదుల్లో ఎక్కువసార్లు తినడం ⇒ నిద్రకు ఉపక్రమించడానికి 2–3 గంటల ముందే తినడం. డాక్టర్ శివరాజు సీనియర్ జనరల్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చెన్నైలో సంచలనం రేపుతున్న వీడియో క్లిప్‌లు
-
మద్యంమత్తులో ఒళ్ళు కాల్చుకొని వ్యక్తి మృతి
నరసరావుపేటరూరల్ççç: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని కాల్చుకొని దుర్మరణానికి గురైన సంఘటన మండలంలోని జొన్నలగడ్డలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన గారపాటి లోకరాజు (27) గత ఆరు నెలలుగా జొన్నలగడ్డ రోడ్డులోని బ్రిక్స్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి మైకంలో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన లోకరాజును గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్టు, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. -
బిస్కెట్ల లారీ దగ్ధం
గుత్తి రూరల్: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లారీ నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బిస్కెట్ల లోడుతో వెళుతోంది. గుత్తి శివారుకు రాగానే బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. పది కిలోమీటర్ల వరకూ అలాగే వెళ్లడంతో మంటలు వ్యాపించి.. బిస్కెట్ డబ్బాలు కాలిపోయాయి. మంటలు లారీ టైర్లకు కూడా పాకాయి. వెనుక వచ్చిన లారీ డ్రైవర్లు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని అపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగాయి. బిసెట్లన్నీ బూడిదయ్యాయి. -
చెన్నైలో బాబు దిష్టిబొమ్మ దహనం
మీడియాకు ముఖం చాటేసిన ఏపీ మంత్రి గంటా సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎర్ర చందనం కూలీల పేరుతో ఏపీ పోలీసులు 32 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేయడం, పాలారు జలాశయంలో చెక్‌డ్యాంల ఎత్తు పెంపునకు నిరసనగా తమిళర్ మున్నేట్రపడై నేతలు సోమవారం చెన్నైలో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరు కోయంబేడులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో బస్‌స్టేషన్ చుట్టూ పోలీసులు మోహరించారు. కృష్ణ పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం తరఫున డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఆహ్వానించేందుకు సోమవారం చెన్నైకి వచ్చిన ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. చెన్నై విమానాశ్రయంలో మంత్రిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. -
భూవివాదమే ప్రాణం తీసింది
♦ వీడిన న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్య మిస్టరీ ♦ కత్తితో మెడపై పొడిచి చంపిన వైనం ♦ అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి దహనం ♦ నిప్పంటించేక్రమంలో గాయపడిన నిందితుడు ♦ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్ ♦ అతడికి సాయం చేసిన ఒకరి అరెస్టు ♦ వివరాలు వెల్లడించిన డీసీపీ రాంచంద్రారెడ్డి కలకలం రేపిన న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య కేసు మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్టు గానే భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని నిర్ధారించారు. కత్తితో పొడిచి చంపిన నిందితుడు మృతదేహానికి నిప్పంటించే క్రమంలో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడికి సాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కీసర: కలకలం రేపిన న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఊహించినట్లుగానే భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని నిర్ధారించారు. కత్తితో పొడిచి చంపిన నిందితుడు మృతదేహానికి నిప్పంటించే క్రమంలో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి సాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు రిమాండుకు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం కీసర ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రఫీక్, కీసర సీఐ గురువారెడ్డితో కలిసి వెల్లడించారు. కాప్రా సర్కిల్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులు. ఉదయ్‌కుమార్ ఓ సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తూ మల్కాజిగిరి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు సర్కార్ జవహర్‌నగర్ పరిధిలోని చెన్నాపురంలో ఐదెకరాల పొలం కేటాయించింది. మాజీ సైనికుల భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. జవహర్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు న కులుడి భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ భూమిపై అతడి మేనల్లుడు గుంటూరుకు చెందిన లోకేష్(23) కన్నేశాడు. ఎలాగైనా సదరు భూమిని సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. ఈక్రమంలో నకులుడికి రూ. 25 లక్షలు ఇచ్చి పొలాన్ని నోటరీ చేయించుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న ఉదయ్‌కుమార్ దానికి అంగీకరించలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. మా భూమి ఇవ్వాలని అతడు పట్టుబట్టాడు. ఈవిషయమై ఇరువర్గాలకు గొడవలు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం తన మారుతీ కారులో వెళ్లిన ఉదయ్‌కుమార్ తిరిగి రాలేదు. ఆయనకు భార్య, తండ్రి తదితరులు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం కీసరదాయర గ్రామశివారులో కారులో కాలిపోయిన ఉదయ్‌కుమార్ మాంసపుముద్దగా కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భూవివాదాల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈమేరకు సుమన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా వివరాలు వెలుగుచూశాయి. ఇలా చంపేశాడు.. ఉదయ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం తన పొలం వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న లోకేష్ ఎందుకొచ్చావని అతడిని ప్రశ్నించాడు. ఈక్రమంలో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన లోకేష్ తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో మెడపై పొడిచాడు. కిందపడిన ఉదయ్‌కుమార్‌పై రెండుమూడు కత్తిపోట్లు పొడవడంతో చనిపోయాడు. అనంతరం సుమన్రెడ్డిసాయంతో మృతదేహాన్ని కారులో వేశాడు. పెట్రోల్ కొనుగోలు చేసిన లోకేష్ కారును కీసర దాయర శివారుకు తీసుకెళ్లాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈక్రమంలో అతడు కూడా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నిందితుడి బైకును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. లోకేష్ కోలుకున్నాక అరెస్టు చేసి హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. భూమాఫియా హస్తం..? న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్యలో ల్యాండ్ మాఫియా హస్తం ఉందని మల్కాజ్గిరి బార్ అసోషియేషన్ సభ్యులు ఆరోపించారు. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వారు ఈమేరకు డీసీపీ రాంచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉదయ్‌కుమార్ హత్య కేసులో భూమాఫియా ఉన్నదని, కొందరు పెద్దలు హస్తం ఉందని, వారు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థులు సరిగా చదవడం లేదని...
చెన్నై: విద్యార్థులు సరిగా చదవడంలేదని ఉపాధ్యాయురాలు కిరాతకంగా వ్యవహరించింది. వారి కాళ్లపై కర్పూరం వెలిగించి కాల్చిన ఘటన తమిళనాడులోని విల్లాపురం లో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న వైజయంతి మాల 15 మంది విద్యార్థులున్న తరగతిలో నలుగురు విద్యార్థులు సరిగా చదవడం లేదని వారిపై ఈ దురాగతానికి ఒడిగట్టింది. ఈమేరకు ఆమెపై జువైనిల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఈనెల 24 వరకు ఆమెను కస్టడీలో ఉంచాల్సిందిగా కోర్టు ఆదేశించిందని జిల్లా ఎస్ పీ నరేంద్రకుమార్ తెలిపారు. మహిళా టీచరను, ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
‘బర్నింగ్’ ప్రాబ్లమ్!
♦ విద్యుత్ శాఖకు ఎండల గండం ♦ అధిక ఉష్ణోగ్రతలతో కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు ♦ సబ్స్టేషన్లపైనా తీవ్ర ప్రభావం ♦ డీటీఆర్లు, ఫీడర్లను చల్లార్చేందుకు ఫ్యాన్లు, కూలర్ల వినియోగం సిటీలో ఇప్పుడు మండుతున్న ఎండలే ‘బర్నింగ్’ టాపిక్. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. ఎండలు మనుషులు, జంతువులు, పక్షులపైనే కాదు సబ్స్టేషన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓవర్‌లోడ్‌తోపాటు పగటి ఉష్ణోగ్రతలకు వేడెక్కుతున్న డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు)లను చల్లార్చేందుకు అధికారులు చివరికి కూలర్లు, ఫ్యాన్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయిల్ లీకేజీలు, ప్రాపర్ ఎర్తింగ్ లేక, డీటీఆర్‌ల చుట్టూ పేరుకపోయిన చెత్త, ఏపుగా పెరిగిన చెట్ల వల్ల అవి కాలిపోతున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికులను భయపెడుతున్నాయి. కోఠి, దిల్సుఖ్నగర్ పరిధిలో శనివారం రెండు ట్రాన్స్ఫార్మర్లు ఎండవేడిమికి మంటలు చెలరేగి కాలిపోయాయి. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భానుడు భగ్గున మండుతున్నాడు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ అనుహ్యంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం పది మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది. దీంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్) తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. సబ్స్టేషన్ల వద్ద ప్రాపర్ ఎర్తింగ్ లేక పోవడం, నేరుగా కనెక్షన్లు ఇవ్వడం, ఆయిల్ లీకేజీలకు తోడు బస్తీల్లో ఏర్పాటు చేసిన డీటీఆర్‌ల చుట్టూ పేరుక పోయిన చెత్తను రోజుల తరబడి తొలగించక పోవడంతో ఎండలకు మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫలితంగా న గరంలో రోజుకు సగటున ఐదు నుంచి పది డీటీఆర్లు కాలిపోతున్నట్లు తెలిసింది. ఇటీవ ల అడ్డగుట్ట సమీపంలోని శ్రీనివాసనగర్, కోఠి ఉమెన్స్ కాలేజీ సమీపంలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, తాజాగా శనివారం కోఠి, ఐఎస్‌సదన్‌లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మంటలు అంటుకుని కాలిపోవడానికి ఇదే కారణం. ఇదిలా ఉంటే ఒత్తిడి నుంచి ఫీడర్లను కాపాడుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం వాటికి తాత్కాలికంగా ఫ్యాన్లు, కూలర్లు అమర్చుతున్నారు. నాసిరకం వైండింగ్..ఆయిల్ లీకేజీలతో నష్టాలు రిపేరుకు వచ్చిన వాటిలో చాలా వాటికి కనీసం ఆయిల్ కూడా మార్చడం లేదు. లోపలి వైండింగ్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. దీంతో ఆయిల్ లీక్ అవుతోంది. నాసిరకం వైండింగ్ వల్ల ఆరుమాసాల వ్యవధిలో ఒకే ట్రాన్స్ఫార్మర్ రెండుసార్లు కాలి పోతోంది. వేసవిలో సహజంగానే విద్యుత్ వినియోగం ఎఉ్కవ. డీటీఆర్లపై అదనపు భారం తప్పదు. టెంపరేచర్ పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్లోని సెల్ఫ్ ప్రొటెక్షన్(సీఎస్పీ) పరికరం ఫీడర్‌ను ట్రిప్ చేస్తుంది. కానీ నగరంలో ఏ ఒక్క చోట కూడా ప్రాపర్ ఎర్తింగ్ లేకపోవడం, నేరుగా కనెక్షన్లు ఇస్తుండటం వల్ల డీటీఆర్లు కాలిపోతున్నట్లు స్వయంగా అధికారులే స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ లో ఐదేళ్లలో కేవలం నాలుగు డివిజన్ల పరిధిలో 22,720 డీటీఆర్లు కాలిపోగా, 2015-16లో ఒక్క రంగారెడ్డి సౌత్ సర్కిల్ల ో్లనే 2112 డీటీఆర్లు షెడ్డుకు చేరుకోవడం విశేషం. వీటి రిపేర్ల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.8 కోట్లకు పైగా ఖర్చు చేయడం గమనార్హం. కేటాయింపులోనూ అవినీతి విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు ఏటా కొత్తగా వేలాది ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తారు.వీటి కేటాయింపులో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు స్వయంగా డిస్కం పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కేటాయిం చిన వాటి పని తీరు, కంపెనీ ఇచ్చిన గ్యారంటీ గడువు వంటి అంశాలు పరిశీలించకుండానే కొత్తవి కేటాయిస్తున్నారు. ప్రజావసరాల కోసం ఉపయోగించాల్సిన ఈ ట్రాన్స్ఫార్మర్లను స్థానిక అధికారులు ప్రైవేటు వాణిజ్య సముదాయాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తవాటి కేటాయింపులోనే కాదు కాలిపోయినవి రిపేర్లకు కేటాయించడంలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఐదు రిపేరింగ్ షెడ్డులు ఉన్నా.. వీటిని కాదని మహేశ్వరం సమీపంలో ఉన్నషెడ్డుకే ఎక్కువగా కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం జిల్లా: కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆరోపించింది. టేకులపల్లి మండలకేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పదెకరాల వేరుశెనగ పంట దహనం
మద్దికెర: కర్నూలు జిల్లాలో పదెకరాల వేరుశెనగ పంటను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. జిల్లాలోని మద్దికెర మండలం హంప గ్రామంలో సోమవారం వేకువజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో తలారిగా పనిచేసే రాముడు తన పదెకరాల్లో వేసిన వేరుశెనగ పంటను వాముగా వేశాడు. ఆ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పంట పూర్తిగా కాలి బూడిదయింది. దీంతో సుమారు రూ.1.50 లక్షల మేర రైతుకు నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. -
భార్యను చంపి.. బ్యాగులో కుక్కి!
-
భార్యను చంపి.. బ్యాగులో కుక్కి!
* వికారాబాద్ అడవుల్లో దహనం.. పూడ్చివేత * కానిస్టేబుల్ రామకృష్ణ ఘాతుకం హైదరాబాద్/వికారాబాద్ రూరల్/జక్రాన్‌పల్లి: పెళ్లై ఏడాది తిరగక ముందే ఓ కానిస్టేబుల్.. భార్యను కిరాతకంగా హత్య చేశాడు! ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి దహనం చేశాడు. ఆనవాళ్లను పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చావు తెలివిని ప్రదర్శించాడు. అయితే పోలీసుల విచారణలో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. వేరొకరితో వెళ్లిపోయిందంటూ అత్తారింటికి.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కడియాల రామకృష్ణ కిందటేడాది ఆగస్టు 20న దూరపు బంధువైన సుప్రియ (19)ను వివాహం చేసుకున్నాడు. వరకట్నంగా రూ.10 లక్షల నగదు, పది తులాల బంగారం, రూ.1.20 లక్షల విలువైన బైక్ ఇచ్చారు. రామకృష్ణ హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంకులో ఎస్పీఎఫ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గతనెల 6న టవల్‌తో సుప్రియ మెడకు ఉరేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వగ్రామానికి చెందిన తన స్నేహితుడు ప్రదీప్ సాయంతో స్కూటర్‌పై స్పోర్ట్స్ బ్యాగ్‌లో వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లారు. మొదట పెట్రోల్ పోసి దహనం చేసి, ఆ తర్వాత ఆనవాళ్లు కూడా కనబడకుండా పూడ్చిపెట్టి, ఇంటికి తిరిగి వచ్చారు. అదే రోజు రాత్రి తన అత్తగారింటికి(నిజామాబాద్ జిల్లా మునిపల్లి) వెళ్లాడు. సుప్రియ తనకు మెసేజ్ పెట్టి వెళ్లిపోయిందని, సుప్రియ కనిపించడం లేదని, వేరొకరితో వెళ్లిపోయిందని నమ్మబలికాడు. ఆగస్టు 14న తన భార్య కనిపించడం లేదంటూ అత్తామామలతో కలిసి నారాయణగూడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి మునిపల్లిలోనే ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికాడు. సుప్రియను వెతకడానికి అత్తామామల నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. అరుుతే సుప్రియను వెతక్కుండా తన స్నేహితులతో కలిసి తిరుగుతున్నట్లు గమనించిన సుప్రియ తల్లిదండ్రులు.. రామకృష్ణపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని రామకృష్ణను తమదైన శైలిలో విచారణ జరిపారు. సుప్రియను తానే హత్య చేసి వికారాబాద్ అడవుల్లో దహనం చేసి పూడ్చి పెట్టినట్లు అతడు అంగీకరించాడు. దీంతో రామకృష్ణను గురువారం అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ సీఐ భీంరెడ్డి సిబ్బందితో కలిసి నిందితుడిని తీసుకొని వికారాబాద్ వద్ద అనంతగిరి అడవికి చేరుకున్నారు. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని మునిపల్లికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. రామకృష్ణ గత మార్చి 24 నుంచి విధులు నిర్వహించడం లేదని పోలీసులు తెలిపారు. అందుకే చంపేశాడు సుప్రియ తండ్రి రామకృష్ణ నపుంసకుడని సుప్రియ తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ఈ విషయం ఎక్కడ బయటపడి పరువు పోతుందోనని తన కూతురిని చంపేశాడని చెప్పారు. -
'పాక్‌లో నా ఫొటోలు తగలబెడుతున్నారు'
సంతోషం వెంటే విషాదాన్నీ చవిచూస్తున్నాడు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ! భారత్‌లో ఎంతకాలమైనా నివసించవచ్చనే అనుమతి దొరకడం ఓవైపు.. స్వదేశం పాకిస్థాన్‌లో తనపై పెల్లుబిగుతోన్న ప్రజాగ్రహం మరో వైపు. రెండింటి నడుమ నలిగిపోతూ తన బాధను మీడియాతో పంచుకుని కాస్త ఉపశమనం పొందే ప్రయత్నం చేశాడు సమీ.. పాకిస్థాన్ ప్రభుత్వం తన వీసాను పునరుద్ధరించకపోవడంతో చిక్కుల్లో పడ్డ ఆయన.. 'నన్ను మీ గడ్డ మీదే నివసించే అవకాశమివ్వండి' అని భారత ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు. అందుకు ప్రభుత్వం అంగీకరించడం ఆ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ పౌరసత్వాన్ని త్యజిస్తు న్నట్టు అద్నాన్ సమీ పేర్కొ న్నాడు. ఇకపై తన పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదిలేస్తున్నానని, 14 ఏళ్లుగా తనకు ఆశ్ర యమిచ్చిన భారత్ నే ఇకపై తన సొంతగడ్డ అని అతడు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లోనే ఉండాలనుకుంటున్న సమీ నిర్ణయంపై పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. 'నా స్వదేశస్తులకు నా మీద కోపం పెరిగిపోయింది. అక్కడ నా ఫోటోలను తగలబెడుతున్నారు. ఇది నన్నెంతగానో బాధపెడుతోంది. కానీ ఏం చేస్తాం! ఇండియా అన్నా.. ఇక్కడ నివసించడమన్నా నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తా' అని కళ్లు చెమర్చాడు అద్నాన్ సమీ. -
70 ఎకరాల మొక్కజొన్న దగ్ధం
ఒంగోలు : ప్రకాశం జిల్లా గవిలవారిపాళెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 70 ఎకరాల్లో మొక్కజొన్నపంట దగ్ధమైంది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్థినష్టం ఉంటుందని భావిస్తున్నారు. పరిసర పొలాల్లో క్రిమికీటకాల నివారణకు వేసిన మంటల వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటనస్థలానికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించారు. -
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
తెర్యాణి (ఆదిలాబాద్): ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారజామున 4 గంటలకు ఆదిలాబాద్ జిల్లా తెర్యాణి మండలం మొదలవాడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిత్రం దుర్గ ఇల్లు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా బెల్లంకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది (పైరింజన్) వచ్చే సరికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంతో సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. కాగా, దుర్గకు చుట్ట తాగే అలవాటు ఉందని స్థానికులు చెప్పారు. దీంతో ఆ ఇల్లు ప్రమాదవశాత్తూ నిప్పంటుకుందా ? లేక నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధం
వరంగల్(కరీమాబాద్): వరంగల్ జిల్లా కరీమాబాద్ మండల కేంద్రంలోని ఉరుసు ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న సిరిమల్ల విద్యాసాగర్ ఇంట్లో విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. మట్టెవాడు నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. -
చంపి ఉరేశారా..?
* తుజాల్పూర్లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి * మృతుని ట్రాక్టర్ ఇంజన్ సైతం దహనం * చంపి ఉరివేశారని కుటుంబసభ్యుల ఆరోపణ * డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు * తుజాల్పూర్లో కలకలం దోమకొండ : మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరి వెంకట్‌గౌడ్(35)అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే మృతదేహం ఉన్న తీరును బట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉరేసి ఉంటారని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతునికి చెందిన ట్రాక్టర్ ఇంజన్ సైతం ఇదే రోజు దహనం కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వివరాల్లోకి వెళితే వెంకట్‌గౌడ్ తన భార్య లావణ్యతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి వరకు తాగునీటి మోశాడు. అయితే తెల్లవారుజామున నిద్ర లేచిన భార్యకు భర్త కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు గ్రామంలో వెతికగా గ్రామ శివారులో ఎల్లమ్మగుడికి వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకున్నట్లు వెంకట్‌గౌడ్ మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న భిక్కనూర్ సీఐ శ్రీధర్‌కుమార్, దోమకొండ ఎస్సై శోభన్‌బాబు, బీబీపేట ఏస్సైలు నరేందర్, రాంప్రసాద్‌లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నుంచి డాగ్‌స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. కాగా వెంకట్‌గౌడ్‌ను కావాలనే ఎవరో చంపి ఉరివేశారని మృతుని భార్య లావణ్య, తండ్రి బాల్‌రాజ్, తల్లి పోశవ్వలు ఆరోపించారు. మృతదేహం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఇది హత్యా..? లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గ్రామంలో గీత కార్మికునిగా పనిచేస్తున్నారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డిలో పోస్టుమార్టం వద్ద డీఎస్పీ భాస్కర్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. -
కొలిక్కిరాని కేసు
సాక్షి, గుంటూరు : రాజధాని ప్రాంతంలోని పంట పొలాల్లో దుండగులు కార్చిచ్చు పెట్టిన ఘటనపై విచారణ ఓ కొలిక్కి రాకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లోని ఆరు గ్రామాల్లో పంటపొలాల్లో వెదురు బొంగులు, పాకలు, డ్రిప్ పైపులు, నెట్లు వంటి సామగ్రిని దుండగులు దహనం చేసిన విషయం విధితమే. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీనజరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామకృష్ణలు హుటాహుటిన సంఘటనా స్థలాలను పరిశీలించి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసినా ఉపయోగం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని సెల్ టవర్ల వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో వెళ్లిన కాల్‌లిస్ట్‌లను పరిశీలించారు. వీటి ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో పెనుమాక వాసులు.. నిందితుల సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షలు రివార్డు ఇస్తామని ఐజీ సునీల్‌కుమార్ ప్రకటించినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఓవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో బందోబస్తు ఏర్పాట్లు తలనొప్పిగా మారాయి. ఇది రాజకీయ కోణంలో ఏమైనా జరిగిందా అనే అనుమానంతో రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఫోన్లను సైతం టాప్ చేస్తున్నట్లు తెలిసింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన ఐజీ.. నిందితులెవరో తేలకపోవడంతో గుంటూరు రేంజి ఐజీ పి.వి.సునీల్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం తన కార్యాలయంలో ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతో కేసు విషయమై సమావేశమయ్యారు. అనంతరం తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లి దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ముందుగానే పరిస్థితిని గమనించి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఎస్పీలతో కలసి త్వరలో ఆయన గ్రామాలను సందర్శించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఐజీ మాట్లాడుతూ పంటల దహనం కేసుకు సంబంధించి తమ వద్ద కొంత సమాచారం ఉందని, దర్యాప్తు దశలో ఏమీ చెప్పలేమని అన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ దిష్టిబొమ్మ దహనం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం విద్యార్థి నిరుద్యో గ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నిరుద్యోగ జే ఏసీ చైర్మన్ సంతోశ్‌గౌడ్ మా ట్లాడుతూ.. విద్యార్థి నిరుద్యోగులు పోరాటంతో సాధించుకున్న టీఎస్పీఎస్సీకి చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి నిరుద్యోగుల పట్ల ని ర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యాలయాని కి వెళ్లిన విద్యార్థి నిరుద్యోగ నాయకులతో దు రుసుగా ప్రవర్తించడమే కాకుండా పోలీసుల చేత వారిని గెంటేయించడం శోచనీయమన్నారు.పది రోజుల్లో ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేయాలని లేదంటే తెలంగాణలోని పది జిల్లాల నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన లో తెయూ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అ ధ్యక్షుడు రాజ్‌కుమార్, రాము, మనోజ్, బా బు, సృజన్, హరి, అనుదీప్, నాయక్, సుం దర్ తదితరులు పాల్గొన్నారు. -
బూడిదే మిగిలింది
చొర్లంగిలో 25 ఎకరాల వరికుప్పలు దగ్ధం రూ.7.5 లక్షల ఆస్తి నష్టం చొర్లంగి(ఎల్.ఎన్.పేట): మండలంలోని చొర్లంగి గ్రామంలో వరిచేను కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి తరువాత జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 25 ఎకరాలకు చెందిన వరిచేను కుప్ప లు కాలిపోయాయి. ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడం.. ఎవరూ గుర్తించకపోవడంతో తెల్లవారే సరికి బూడిదే మిగిలింది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 9 మంది రైతు లు వరి పంటను కళ్లాల్లో కుప్పలుగా ఉంచారు. ఈ రైతు ల్లో ఒకరైన కరగాన సూరప్పడు తన కళ్లంలో విత్తనాలకు సంబంధించిన చేను మంగళవారమే నూర్చాడు. అదే రోజు రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో తాము సాగు చేస్తున్న భూమిపై వివాదం చేస్తున్న గిరిజనులే కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో రైతులు లండ పాపినాయుడువి 6 ఎకరాలు, కరగాన సూరప్పడుకు చెందిన 4 ఎకరాలు, కరగాన సింహాద్రినాయుడువి 3 ఎకరాలు, కరగాన రామస్వామివి 2 ఎకరాలు, కరగాన వరహాలునాయుడువి 3 ఎకరాలు, లండ మొఖలింగంవి 3 ఎకరాలు, లండ రామారావుది ఎకరా, మహాంతి అర్జునది ఎకరా, బుడ్డపు రామారావుకు చెందిన 1.5 ఎకరాల్లోని పంట అగ్నికి ఆహుతైంది. పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు బోరుమన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7.5 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. భూమి వివాదాలే కారణమా? 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ విధిస్తూ చొర్లంగికి సమీపంలో ఉన్న బిడ్డికిపేట గ్రామం జాతాపు తెగకు చెందిన కొంతమందికి సుమారు 6 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆయా లబ్ధిదారులు భూములను పక్క గ్రామాలకు చెందిన రైతులకు అమ్ముకున్నారు. కొన్నాళ్లుగా జాతాపు తెగవారు తమ భూములను తమకు అప్పగించాలని కొనుగోలు చేసిన రైతులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్, జూలైల్లో మండల పెద్దల సమక్షంలో తగాదా కూడా జరిగింది. అప్పటికే పంటలు వేశారని, కోతలు పూర్తయిన తరువాత రైతుల వద్ద తీసుకున్న నగదు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని పెద్దలు సూచించారు. అయితే భూములు అప్పగించలేదన్న ఉద్దేశంతో గిరిజనులు పంటలకు నిప్పు అంటించి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. బిడ్డికిపేటకు చెందిన నిమ్మక ఎర్రయ్య, కుండంగి భుజంగరావు, నిమ్మక బారికి, నిమ్మక అప్పారావు, నిమ్మక రవి, కుండంగి మజ్జిబాబు, నిమ్మక ప్రశాంత్‌లతో పాటు గార్లపాడుకు చెందిన కడ్రక సింహాచలం అగ్ని ప్రమాదానికి కారణమై ఉంటారని బాధిత రైతులు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.శ్రీనివాస్ చెప్పారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ఖానాపూర్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బాధ్యుడిని చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆదివారం స్థానిక జగన్నాథ్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కరెంటు సంక్షోభానికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, ఉపసర్పంచ్ కారింగుల సుమన్, నాయకులు కరిపె శ్రీనివాస్, నయీం, కమ్మరి బీమన్న, రాచకొండ గోపి గోడాపురం సందీప్, సల్ల చంద్రహస్, గాడ్పు చందు, నిట్ట రవి, రాజేశ్వర్, గంగన్న, ముత్యం పాల్గొన్నారు. -
కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం
- కారు, బైకులకు నిప్పుపెట్టిన అగంతకులు - మరో బైకును రైలు పట్టాలపై పడేశారు - ప్రైవేటు బస్సుల్లో నుంచి వస్తువుల చోరీ కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వాసవీస్కూల్కు సమీపంలోని ఓ వీధిలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు వాహనాలను పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ కారు, బైకు దహనం కాగా, మరో బైకును రైలు పట్టాలపై పడేయడంతో రైలు ఢీకొని తుక్కుతుక్కయ్యింది. ఇంకో బైకును దహనం చేయడానికి ప్రయత్నించారు. అదే వీధిలో రెండు ప్రైవేటు బస్సుల్లో నుంచి డీవీడీ ప్లేయర్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... 5-8-407/బీ నంబరు గల ఇంటిలో నెల క్రితమే అద్దెకు చేరిన కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పు రాజగోపాల్ అనే కాంట్రాక్టర్ రోజులాగే రాత్రి ఇంటి ముందర తన నిస్సాన్ మిక్రా కారు (ఏపీ 16జీ 14 నంబరు)ను నిలిపి ఉంచారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు నిప్పంటుకుంది. వీధిలోని వారందరూ లేచి చూసేసరికి కారు కాలుతూ ఉంది. పక్కనే ఉన్న 5-8-407 నంబరు గల ఇంటి గేటుకు తాళం లేకపోవడంతో దుండగులు అందులోకి ప్రవేశించి ఇంట్లో అద్దెకు ఉంటున్న సూరేటి రాజిరెడ్డికి చెందిన (ఏపీ 25ఏపీ 4380) నంబరు గల ప్యాషన్ ప్రో బైకును దహనం చేశారు. రాజిరెడ్డి వారం క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న బి.జగన్ అనే వ్యక్తికి చెందిన (ఏపీ 25 సీ 9147)నంబరు గల స్ల్పెండర్ బైకును సమీపంలోని రైలు పట్టాలపైకి తీసుకెళ్లి పడేశారు. రాత్రిపూట వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో బైకు తుక్కుతుక్కయ్యింది. జగన్ 20 రోజుల క్రితం ఇంట్లో అద్దెకు దిగాడు. సమీపంలోని ప్రధాన రోడ్డుపై నిలిపి ఉంచిన ప్రైవేటు బస్సుల్లో నుంచి డెక్కులు, ఇతర సామగ్రిని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఎవరూ దొరకలేదు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, పట్టణ సీఐ కృష్ణ, ఎస్సై మధు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన వాహనాల దహనం... దొంగలైతే వాహనాలను ఎత్తుకెళతారు. ఇక్కడ కారు, బైకును దహనం చేయడం, మరో బైకును పట్టాలపై వదలడం, ఇంకో వాహనాన్ని దహనం చేయడానికి ప్రయత్నించడం వంటి సంఘటనలు మిస్టరీగా మారాయి. వాహనాల యజమానులకు ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలతో జరిగాయా అంటే, ఆ ముగ్గురూ ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం, వారు ఈ మధ్యనే ఆ ఇళ్లలో అద్దెకు దిగడం వల్ల వ్యక్తిగత కక్షలతో జరిగి ఉండకపోవచ ్చంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని డీఎస్పీ సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రాణాలు ఇస్తారు, తీస్తారు..!
ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్‌బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా... ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఫుట్‌బాల్‌పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం. ఎస్కోడార్ కాల్చివేత... ఫిఫా 2014 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో చేసిన సెల్ఫ్ గోల్ గుర్తుందా.. సరిగ్గా 20 ఏళ్ల కిందట 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో కొలంబియా ప్రముఖ ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్ అచ్చం ఇలాగే సెల్ఫ్ గోల్ చేశాడు. పొరపాటున చేసిన ఈ గోల్ చివరికి అతని ప్రాణాలనే బలిగొంది. ఆ గోల్ వల్లే తమ జట్టు ప్రపంచకప్ నుంచి ఇంటిదారి పట్టినందుకు కొలంబియా అభిమా నులు కొందరు తీవ్ర ఆ వేదనకు లోనయ్యారు. అంతే ఎస్కో బార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమ ర్శలు చేశారు. అయితే అమెరికా నుంచి తిరి గొచ్చిన రెండు రోజులకే ఎస్కోబార్‌ను మెడెలిన్‌లోని ఓ రెస్టారెంట్ దగ్గర సాకర్ అభి మానులు కాల్చి చంపారు. తాను పొరపాటున సెల్ఫ్ గోల్ చేశానని చెప్పినా వారు వినలేదు. దీంతో కొలంబియా ఓ అద్భుత ఆటగాడిని కోల్పోయింది. అయితే సాకర్‌పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే. అభిమానుల ఆగ్రహం కట్టలు తెగితే... ఓ ఆటగాడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా ప్రత్య ర్థులకు ఏదైనా నష్టం జరగడం వల్లనో, లేదంటే ఆటగాడి పేలవ ప్రదర్శన కారణంగా తమ జట్టు ఓడి పోవడం వల్లనో అభి మానులు కోపోద్రిక్తులైన ఘటనలు కోకొల్లలు. క్లబ్ మ్యాచ్ దగ్గరి నుంచి ప్రపంచకప్ వరకు కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కొన్నిసార్లు అభి మానులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఈజిప్ట్‌లో అల్ అహ్లి-అల్ మస్రీ అనే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 70 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మస్రీ జట్టు 3-1తో తమ జట్టు అహ్లిపై విజయం సాధించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతే స్టేడియంలో బీభత్సం సృష్టించారు. రెండు జట్ల అభిమానులు మారణా యుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనికి తోడు తొక్కిసలాట కూడా జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన 21 మంది సాకర్ అభిమానులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2003లో పొలాండ్‌లో జరిగిన ఓ సాకర్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. 1974లో టోటెన్ హాట్స్పూర్-ఫెయెనూర్డ్ మధ్య జరిగిన యూఈఎఫ్ఏ కప్ ఫైనల్ మ్యాచ్‌లో...1985 యూరోపియన్ కప్ ఫైనల్లో లివర్‌పూల్-జువెంటస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో... 1985లో బర్మింగ్ హామ్-లీడ్స్ మధ్య జరిగిన ఈపీఎల్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన అభిమానులు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు గాయపర్చుకున్నారు. రిఫరీలూ బలయ్యారు ఫుట్‌బాల్‌లో రిఫరీల పాత్ర కీలకం. ఒక రకంగా మైదానంలో వాళ్లు చెప్పిందే వేదం. అయితే రిఫరీలు కూడా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసు కుంటారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఆటగాళ్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది రిఫరీల ప్రాణాలను కూడా తీసింది. గత ఏడాది అమెరికా ఉతా రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ సిటీలో రికార్డో పొర్టిల్లో అనే రిఫరీకి ఓ టీనేజ్ సాకర్ ప్లేయర్ పంచ్ ఇచ్చాడు. యెల్లో కార్డ్ చూపినందుకు గట్టిగా కొట్టడంతో రిఫరీ గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చని పోయారు. 2013లో బ్రెజిల్‌లోని సావోపాలోలో జరిగిన ఓ సాకర్ మ్యాచ్‌లో రిఫరీని అభిమానులు కొట్టి చంపడమే కాకుండా.. శవా న్ని ముక్కలు ముక్కలుగా కోసి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. అయితే వాళ్లు అలా వ్యవహరిం చడానికి కారణం కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా జోస్నిర్ అనే ఆటగాడిని రిఫరీ సిల్వా బహిష్కరిం చడంతో వివాదం మొదలైంది. అది కాస్తా చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆగ్రహోదిక్తుడైన రిఫరీ కత్తితో ఆటగాడిని పొడిచాడు. జోస్నిర్ ఆస్పత్రిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా రిఫరీపై ఇలా దాడులకు దిగారు. -
ఇద్దరు జిల్లా యువకులను మింగేసిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన
పెంటపాడు/గణపవరం : నిరుపేద కుటుంబాలు వారివి. .నేలతల్లిని మన్ముకుని జీవించే వారి తల్లిదండ్రులకు చేతికంది వచ్చారు. తమ బిడ్డలు ప్రయోజకులవటంతో కష్టాలు, కన్నీళ్లు ఉండవని సంబరపడుతున్న తరుణంలో వారి జీవితాలతో విధి ఆడుకుంది. తూర్పుగోదావరి జిల్లా నగరంలో సమీపంలో జరిగిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన ఇద్దరి యువకుల్ని పొట్టనబెట్టుకుని. వారి తల్లిదండ్రులకు కడుపుకోతతోపాటు, వృద్ధాప్యంలో ఉన్న తమను చక్కగా చూసుకుంటారని భావించిన వారి ఆశలకు నిప్పు పెట్టింది. సరిగ్గా వారం క్రితం ఇదే రోజు చెల్లెలి నిశ్చితార్థం కావటంతో ఆ వేడుకలో సందడి చేశాడు గోపిరెడ్డి దివ్వతేజ(24). పనులన్నీ తన భుజాన వేసుకుని చక్కబెట్టాడు. వచ్చిన బంధువులందరినీ పేరుపేరునా పలకరించాడు. పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు సత్యనారాయణ కుమారుడు దివ్యతేజ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. జయసుందర్ ఇంజనీరింగ్ వర్క్స్‌లో మెకానికల్ వింగ్‌లో సూపర్వైజర్గా ఏడేళ్లుగా నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తమ ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు గ్యాస్ పైప్‌లైన్ రూపంలో మింగేసిందని తెలిసి అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. తేజ తల్లి లక్ష్మి, చెల్లెలు మౌనిక షాక్‌నుంచి తేరుకోలేదు. కష్టపడి పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించిన సత్యనారాయణ చెట్టంత కొడుకును పోగొట్టుకుని విలపిస్తున్నారు. గణపవరం గ్రామానికి చెందిన మద్దాల శాంతబాలాజీ (25) ఇదే ప్రమాదంలో మృతిచెందాడు. బాలాజీ రెండేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో గెయిల్ పైప్‌లైన్ మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్టర్ వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ తండ్రి ధనం వ్యవసాయ కూలీ. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులుకాగా బాలాజీ న్న అన్న కూడా వ్యవసాయ కూలీ. రామలక్ష్మణుల్లా ఉండే తమ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొడుకుపై వారికి ఉన్న మమకారం తెలిసిన బందువులు ప్రమాదంలో బాలాజీ మృతి చెందిన వార్తను చాలా సమయం వరకు అతని తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. టీవీలో వార్తలు చూసి కలవరపాటుకు గురైన బాలాజీ తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగానే ఉన్నాడని భావించారు. అతనికి ఏమీ కాకూడదని దేవుడ్ని వేడుకున్నారు. కానీ వారికి కడుపుకోత మిగిలింది. -
రైల్వే చార్జీలను తగ్గించాలి
- కాంగ్రెస్ నాయకుల డిమాండ్ - రైల్వేస్టేషన్ ఎదుట ధర్నా - ప్రధాని దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ సిటీ : పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం 14 శాతం రైలు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్, నగర అధ్యక్షుడు కేశవేణు, మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేషన్ ఎదుట బైఠాయించి పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తాహెర్ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటని, చేసేది ఒకటని చెప్పడానికి రైలు చార్జీల పెంపు ఒక నిదర్శనమన్నారు. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టక ముందే రైలు చార్జీలు పెంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ఎనలేని భారం మోపడం సరికాదన్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే తగ్గించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రైల్వేస్టేషన్ లోపలకు వెళ్ళకుండా స్థానిక ఒకటో టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా అనంతరం రైల్వే పోలీసులు నాయకుల వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నవారి వివరాలు సేకరించారు. ధర్నాలో టీపీసీసీ సహాయ కార్యదర్శి రత్నాకర్, కార్పొరేటర్లు దారం సాయిలు, మాయావార్ సాయిరాం, డీసీసీ ప్రధాన కార్యాదర్శి పోలా ఉషా, కోశాధికారి మీసాల సుధాకర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ, అర్బన్ అధ్యక్షుడు బంటురాము, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సుమన్, మాజీ కార్పొటర్ బంటు శంకర్, నాయకులు ఫయాజుద్దీన్, సిర్పరాజ్, రాజేష్, పార్ధసారధి,హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణకు వ్యతిరేకంగా సాగుతున్న సీమాంధ్ర ఉద్యమానికి సహకరిస్తున్నారన్న ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ మైనార్టీ సెల్ కార్యకర్తలు బుధవారం జడ్పీ సెంటర్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అజీం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కావాలని సీఎం పట్టుబట్టడం సరికాదన్నారు. హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయడం ద్వారా అక్కడి ఆస్తిపాస్తులను లూటీ చేసేందుకు పాలకులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లిస్తున్న చంద్రబాబుకు పతనం తప్పదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి షఫీ, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, నగర అధ్యక్ష,కార్యదర్శులు షంషుద్దీన్, బాబా, క్రిస్టియన్ విభాగం నాయకులు ప్రసన్న, అలెక్స్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ర్యాలీ బోనకల్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండుతో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బోనకల్లో పాఠశాల విద్యార్థులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఎం.సురేష్, నాయకులు కె.నవీన్‌కుమార్, అశోక్, సలీం, ప్రశాంతి, త్రివేణి పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
తాంసి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం దహనం చేశారు. ముడుపులిచ్చి సీఎం పదవి తెచ్చుకున్న ఆయన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి సీమాంధ్రుల నుంచి ఎంత తీసుకున్నాడో చెప్పాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ సామ నాగారెడ్డి డిమాండ్ చేశారు. నాయకులు శ్రీనివాస్, భగవాండ్లు, మహేందర్, అశోక్, కాంతారావు, బీజేపీ నాయకులు స్వామి, అడెల్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు చరిత్రహీనుడు..’ ఉట్నూర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై వ్యతిరేక వైఖరి బయటపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చరిత్రహీనుడుగా మిగిలిపోనున్నాడని జేఏసీ కన్వీనర్ మర్సకోల తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ రాయడం, సీమాంధ్రలో అక్కడి మంత్రులు ప్రత్యేక రాష్ట్ర ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడాన్ని నిరసిస్తూ ఉట్నూర్‌లోని ఐబీ ప్రాంతంలో శనివారం చంద్రబాబు, సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మ దహనం చేశారు. పూటకో మాట మార్చుతున్న చంద్రబాబును నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని తిరుపతి పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖను వెనక్కి తీసుకుని ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు బానోత్ రామరావు, ధరణి రాజేశ్, కందుకూరి రమేశ్, లక్ష్మీపతి, శ్యామ్, రాథోడ్ జనార్దన్, సోఫియాన్, భీమ్రావు, మధు, సతీశ్, గోపాల్‌రావు, వసంత్ పాల్గొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి బోథ్ (ఇచ్చోడ) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ బోథ్ మండలం సోనాలలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు. నాయకులు చంద్రశేఖర్, మేస్రం భూమన్న, పోశేట్టి, సోంనాథ్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.