కోటా: రాజస్థాన్‌లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కోటా నగరంలోని దసరా మైదానం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
65 అడుగుల ఎత్తయిన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. రావణాసురిని దిష్టిబొమ్మను నిలబెట్టేందుకు ఉపయోగించిన బెల్టు తెగిపోవడంతో ఒక్కసారిగా రావణాసురుని బొమ్మ కూలిపోయింది. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రావణుని దిష్టిబొమ్మను దహనం కోసం సిద్ధం చేశారు.
క్రేన్ సాయంతో ఆ రావణాసురుని బొమ్మను నిలబెడుతుండగా ఒక్కసారిగా శబ్ధం చేసుకుంటూ అది కిందపడిపోయింది. రావణాసురుని దిష్టిబొమ్మ పడిపోయిన నేపధ్యంలో దాని వెనుక భాగం దెబ్బతింది. దీంతో దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం ఖురేషి మాట్లాడుతూ రావణుని దిష్టిబొమ్మను ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు రూపొందించారని తెలిపారు. కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను ఇప్పటికే మైదానంలో నిలబెట్టారు. రావణుని దిష్టిబొమ్మను నిలబెట్టే సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఖురేషి తెలిపారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
Comments
Please login to add a commentAdd a comment