ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణకు వ్యతిరేకంగా సాగుతున్న సీమాంధ్ర ఉద్యమానికి సహకరిస్తున్నారన్న ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ కార్యకర్తలు బుధవారం జడ్పీ సెంటర్‌లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అజీం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కావాలని సీఎం పట్టుబట్టడం సరికాదన్నారు. హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయడం ద్వారా అక్కడి ఆస్తిపాస్తులను లూటీ చేసేందుకు పాలకులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లిస్తున్న చంద్రబాబుకు పతనం తప్పదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి షఫీ, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, నగర అధ్యక్ష,కార్యదర్శులు షంషుద్దీన్, బాబా, క్రిస్టియన్ విభాగం నాయకులు ప్రసన్న, అలెక్స్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రాము తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ
బోనకల్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండుతో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బోనకల్‌లో పాఠశాల విద్యార్థులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఎం.సురేష్, నాయకులు కె.నవీన్‌కుమార్, అశోక్, సలీం, ప్రశాంతి, త్రివేణి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
Published Thu, Sep 5 2013 4:15 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement
Advertisement