effigy
-
దహనానికి ముందే కుప్పకూలిన రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో జరిగే దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కోటా నగరంలోని దసరా మైదానం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. అయితే ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 65 అడుగుల ఎత్తయిన రావణాసురిని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ, అది దహనం చేయడానికి ముందే నిట్టనిలువునా కూలిపోయింది. రావణాసురిని దిష్టిబొమ్మను నిలబెట్టేందుకు ఉపయోగించిన బెల్టు తెగిపోవడంతో ఒక్కసారిగా రావణాసురుని బొమ్మ కూలిపోయింది. దాదాపు నెల రోజుల పాటు శ్రమించి రావణుని దిష్టిబొమ్మను దహనం కోసం సిద్ధం చేశారు.క్రేన్ సాయంతో ఆ రావణాసురుని బొమ్మను నిలబెడుతుండగా ఒక్కసారిగా శబ్ధం చేసుకుంటూ అది కిందపడిపోయింది. రావణాసురుని దిష్టిబొమ్మ పడిపోయిన నేపధ్యంలో దాని వెనుక భాగం దెబ్బతింది. దీంతో దిష్టిబొమ్మకు మరమ్మతులు చేసి, దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం ఖురేషి మాట్లాడుతూ రావణుని దిష్టిబొమ్మను ఢిల్లీ నుంచి వచ్చిన కళాకారులు రూపొందించారని తెలిపారు. కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను ఇప్పటికే మైదానంలో నిలబెట్టారు. రావణుని దిష్టిబొమ్మను నిలబెట్టే సమయంలో అది ఒక్కసారిగా కూలిపోయింది. దానిని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఖురేషి తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
దసరా ఉత్సవాల్లో సనాతన ధర్మం విమర్శకులపై పోస్టర్లు
ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు. కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం
బ్రెజిల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాలర్ వినిషియస్ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ యాంటీ వయొలెన్స్ కమీషన్ సీరియస్ అయింది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్ జూనియర్ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్ వినిషియస్ వివక్షకు గురయ్యాడు. స్పానిష్ క్లబ్ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్ వినిషయస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. Ya que los que deberían no te explican qué es y qué puede hacer @LaLiga en los casos de racismo, hemos intentado explicártelo nosotros, pero no te has presentado a ninguna de las dos fechas acordadas que tú mismo solicitaste. Antes de criticar e injuriar a @LaLiga, es necesario… https://t.co/pLCIx1b6hS pic.twitter.com/eHvdd3vJcb — Javier Tebas Medrano (@Tebasjavier) May 21, 2023 Vinicius Jr ALL GOALS AND ASSISTS so far this season, let me know if i missed anything.pic.twitter.com/QY3IMI6ygW — Druchk (@andruchk) May 28, 2023 చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
ఓయూలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోరాడేందుకు సమస్యలు లేకనే రాహుల్ గాంధీ రాకను రాజకీయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. -
కేటీఆర్ దిష్టిదొమ్మలు తగలబెట్టండి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. మంగళవారం గాంధీ భవన్లో మాజీ ఎంపీ మల్లురవి, టీపీసీసీ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయా కర్, కల్వ సుజాత, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోరాటం చేస్తుంటే.. కేసులు పెడుతూ, దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క కాం గ్రెస్ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, వారి రక్షణ కోసం గాంధీ భవన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం టీఆర్ఎస్కు అలవాటుగా మారిందని మల్లు రవి, దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రోడ్లపై తిరగలేరన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పరువు పోగొట్టుకున్నారు కోర్టులో పరువునష్టం దావా వేసి మంత్రి కేటీఆర్ తన పరువు పోగొట్టుకున్నారని మల్లు రవి ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌ను కేటీఆర్ ఇప్పటికైనా స్వీకరించాలని అన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మల్రెడ్డి ఆరోపించారు. భౌతిక దాడులు సరికాదు జగిత్యాలటౌన్: మాదక ద్రవ్యాల కేసులో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టీఆర్ఎస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై భౌతికదాడులకు దిగడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు సినీ పరిశ్రమతో ఉన్న లోపాయికారి సంబంధాలే మాదకద్రవ్యాల కేసు విచారణకు అడ్డంకిగా మారాయని ఆరోపించారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. జగిత్యాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ సభలో రేవంత్ ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తే ఆయనపై కేసులు పెట్టడం ప్రభుత్వ నియంతృత్వధోరణికి అద్దం పడుతోందన్నారు. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించేందుకే రాహుల్ పేరు ను కేటీఆర్ ముందుకు తెస్తున్నారన్నారు. -
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్‌లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్‌లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్‌గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్‌లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం
బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమాకు వ్యతిరేకంగా చంఢీగఢ్‌లో ఆందోళనలు చేపట్టారు. గతంలో జోధా అక్భర్, పద్మావతి సినిమాలు వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. కొంచెం అలాంటి వివాదమే ఇప్పుడు పృథ్వీరాజ్‌ను చుట్టుముట్టింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని కోరుతూ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృత్వంలోని నాయకులు నిరసనలు చేపట్టారు. అంతేగాక అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘంలోని వ్యక్తులు మాట్లాడుతూ.. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్‌గా ఉండకూడదని.. పూర్తి పేరు ‘హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ లేదా ‘చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహన్’గా ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహన్ చివరి హిందూ చక్రవర్తి అని, అలాంటి సందర్భంలో ఈ చిత్రం పేరు అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్‌పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. అందువల్ల ఈ చిత్రంలో ఏదైనా వివాదం ఉందా అని, చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తెలుస్తుందని, అప్పుడే ఆ సన్నివేశాలను తొలగించేదుకు కోరవచ్చని అన్నారు. అయితే పృథ్వీరాజ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్న వివాదాలను తొలగించాలని, లేకపోతే క్షత్రియ సమాజ్.. పద్మావతి, జోధా అక్బర్ సినిమాలకు ఎదురైన పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు స్టార్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. చదవండి: ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్ -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం బాధాకరం: రాహుల్ గాంధీ
పట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై దాడిని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొనసాగించారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వలస కూలీల వెతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి ముఖ్యమంత్రి నితీశ్ పాలనే కారణమని మండిపడ్డారు. రాహుల్ ప్రసంగిస్తుండగా.. ‘మోదీ మమ్మల్ని పకోడీలు అమ్ముకోమన్నారు’ అంటూ ఒక వ్యక్తి గట్టిగా అరిచారు. దాంతో, ‘ఈ సారి మోదీజీ, నితీశ్‌జీ మీ వద్దకు వచ్చినప్పుడు వారికి పకోడీలు చేసిపెట్టండి’ అని రాహుల్ నవ్వుతూ జవాబిచ్చారు. కేంద్రం తీసుకువచ్చి న వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాహుల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. దసరా సందర్భంగా పంజాబ్‌లోని రైతులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయడం తనను బాధించిందన్నారు. ‘సాధార ణంగా దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. కానీ ఈ సారి, బహుశా తొలిసారి ఒక ప్రధాని దిష్టిబొమ్మను తగలపెట్టారు’ అన్నారు. ‘ఈ వార్త మీ వరకువచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మోదీజీ, నితీశ్‌జీ మీడియాను నియంత్రిస్తుంటారు’ అని విమర్శించారు. రాహుల్‌పై ఈసీకి ఫిర్యాదు బిహార్‌లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న రోజు కాంగ్రెస్‌కు ఓటేయాలని ట్వీట్ చేయడం ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కోరుతూ బిహార్ లీగల్ సెల్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. -
రఘురామ కృష్ణంరాజు దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను పీలేరులో దహనం చేశారు. మచ్చ లేని నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని, అటువంటి నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. (చదవండి: వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి ) -
వింత ఘటన : తండ్రి కోరిక మేరకు..
లక్నో : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మదురస్మృతిగా నిలిచిపోతుంది. పెళ్లి చేసుకునే వారు తమకు మంచి భార్య రావాలని కలల కంటారు. అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఆమె కోసం అన్వేషిస్తుంటారు.కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మను వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శివమోహన్(90)కు తొమ్మిది మంది సంతానం. అందరిలోకి చిన్నవాడైనా పంచరాజ్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. (ప్రగ్నెంట్ అని తెలీకుండానే బిడ్డకు జన్మనిచ్చింది) శివ మోహన్ తనకున్న ఆస్తితోనే పిల్లలందరిని పెద్ద చేసి వారికి వివాహాలు జరిపించాడు. అయితే పంచరాజ్‌కు కూడా పెళ్లి చేయాలని తండ్రి శివ మోహన్ అనుకున్నాడు. కానీ పంచరాజ్ మానసిక వికలాంగుడు కావడంతో అమ్మాయి దొరకడం కష్టంగా మారింది. దీంతో తన కుమారుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని సంకల్పించుకున్న శివమోహన్ పెళ్లికుమార్తెను పోలిన దిష్టిబొమ్మను తయారు చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పంచరాజ్‌కి వివాహం జరిపించారు. పైగా వివాహానికి హాజరైన వారికి చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లిని మొదట పంచరాజ్ తిరస్కరించాడు. చివరకు తండ్రి కోరిక మేరకు, ఆయన గౌరవాన్ని నిలబెట్టేందుకు దిష్టి బొమ్మతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై శివమోహన్ స్పందిస్తూ..' ఇప్పుడు నా వయసు 90 ఏళ్లు.. నాకు తొమ్మిది మంది పిల్లలు.. నా 8 మంది పిల్లలకు పెళ్లి చేశా. కానీ మానసిక వికలాంగుడైన నా చిన్నకొడుకు పంచరాజ్‌కు కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని తీర్మానించకున్నా. అందుకే వాడిని ఒప్పించి పెళ్లికూతురు రూపంలో ఉన్న దిష్టిబొమ్మను తయారు చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
చంద్రబాబుపై భగ్గుమన్న బీసీలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు. (చదవండి: బీసీల కోటాపై టీడీపీ ఆట) -
ఎమ్మెల్సీ వెంకన్న దిష్టిబొమ్మ దహనం
తిరుపతి కల్చరల్: ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టిబొమ్మను చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అనుచరులు దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. -
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
చింతలపూడి : కార్పొరేట్ శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జన ఆవేదన సదస్సులో భాగంగా పీసీసీ కార్యదర్శి ఎం.ధామస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తాపత్రయం అంతా తన పుత్రరత్నం లోకేష్ గురించేనన్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మోడీ మెప్పు కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తుందుర్రు ఘటనలో మహిళలను తీవ్రంగా కొట్టి పోలీసులతో ఈడ్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా మంత్రి పీతల సుజాత కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో లాభపడింది విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు పంచి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20లోగా ప్రజా బ్యాలెట్‌ను పూర్తిచేసి పంపించాలని కోరారు. అనంతరం ఏలూరుచింతలపూడి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం సిటీ : ఇల్లెందు ఏరియాలో పోడు భూముల్లో పంటల విధ్వంసం, ఆదివాసీలపై పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొలుత ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలు దేరి బైపాస్ రోడ్డు వరకు చేరుకుని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కెచ్చెల రంగయ్య మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆదివాసీల పంటలను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. అడ్డు వచ్చిన మహిళలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి వారికి పట్టాలివ్వాలని ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు. -
ఆ మూడు రాష్ట్రాలే ఆదర్శం
మద్యాన్ని నిషేధించాలంటూ జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్‌నగర్ వై జంక్షన్లో ప్రభుత్వ దిష్టిబ్మొను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.రాధిక, యాదమ్మ, కె.ధర్మెంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, టి.సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ మద్యం ద్వారానే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తోందని ప్రభుత్వమే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. బిహార్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు విశాల్, సతీష్, చైతన్య యాదవ్, లక్ష్మణ్, సాయినాధ్ తదితరులు పాల్గొన్నారు. -
అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం
ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితులకు న్యాయ సాయం చేస్తామంటూ మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీని వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ సరూర్‌నగర్ మండలాధ్యక్షుడు మద్ది రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు మామిడిపల్లిలో ఆదివారం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.....దేశ వ్యతిరేక కార్యాకలాపాలను అవలంభిస్తున్న మజ్లీస్ పార్టీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఉగ్రవాదులను ఉపేక్షించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌లో మారణ హోమం సృష్టించాలనుకున్న ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తామంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించడం సహించరాని విషయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజేందర్ రెడ్డి, పద్మారావు, రంగనాథ్, వెంకటేష్, కష్ణ, మల్లేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ నేతలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు న్యాయవాదులు బార్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ర్యాలీ నిర్వహించారు. రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామకంలో అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులంతా రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో నాయకత్వం వహించిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌లను సస్పెండ్ చేశారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణకు కేటాయించడాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్యాతం సిద రాములు, సీనియర్ న్యాయవాదులు వీఎల్ నర్సింహారెడ్డి, మంద వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గన్నారు. -
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
విద్యుత్‌చార్జిల పెంపునకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ..ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మ దహనం సిగ్గుచేటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీ నాయకులు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మను దహనం చేయడం సిగ్గుచేటైన విషయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో టీడీపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఆయన ఖండించారు. అధికార పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం సహజమని, ఒక ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మను దహనం చేయాలిసన అవసరం ఏమిటని ప్రశ్నించా రు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. -
రాజంపేటలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చి.. ఇప్పుడు హామీ నెరవేర్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్శిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వరుసగా పెట్రోలు ధరలు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు చెప్పారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
నల్గొండ జిల్లా: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధరలు పెంచడం దారుణమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
విద్యారంగానికి ప్రభుత్వం తక్కువగా నిధులు కేటాయించిందంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా ఉన్నప్పటికీ, విద్యారంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. విద్యారంగం అభివృద్ధికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.