తూర్పుగోదావరి: ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేక పోయిందని నిరసించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 20న బంద్ పాటించాలని నాయకులు పిలుపునిచ్చారు.