రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్నజర్నలిస్టులు
ఘట్‌కేసర్‌టౌన్(రంగారెడ్డి జిల్లా): ఓటుకు కోట్లు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు తెలంగాణ మీడియా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ, నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు ఆదివారం ఆందోళన నిర్వహించారు.
ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు మేడబోయిన నర్సింహ, పల్లికొండ కిరణ్, వేణుగోపాల్‌రెడ్డి, ప్రమోద్, నిరంజన్, మీసాల సత్యనారాయణ, శివరామరెడ్డి, రాకేష్, కొంతం అంజిరెడ్డి, బాబు చారి, బూడిద కృష్ణమూర్తి మేకల నర్సింగ్‌రావ్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.