burnt
-
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్‌లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు. ఆస్తులు జప్తు చేస్తాంఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్స్పెక్టర్లు, జీఆర్పీ పోలీసులు ఉన్నారు. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకుని విచారణ చేపట్టారు. వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ఇటీవలే వివాహమైన జంటతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతవారమే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో స్లీపర్ బస్సు.. ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. చదవండి: Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్ -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
ఇటీవల మొబైల్ ఫోన్లు పేలుడు గురించి తరుచుగా వింటున్నాం. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్ మహమ్మారీ నుంచి పిల్లలకు ఆన్లైన్లో క్లాసులకు అలవాటుపడ్డారు. దీంతో పిల్లలు మనకు తెలియకుండానే సెల్ఫోన్లకు బానిసవ్వుతున్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్‌కి బాగా అతుక్కుపోతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సెల్ఫోన్ల పేలుడు ఘటనలు ప్రజలను కాస్త భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలానే ఇక్కడోక చిన్నారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ చిన్నారి తన చదువు కోసం అని తండ్రి ఫోన్‌ని తరుచుగా ఉపయోగిస్తుంటాడు. అందులో భాగంగానే ఆరోజు కూడా ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి అందులో గేమ్ ఆడుతున్నాడు. ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి...హుటాహుటినా వచ్చి చూడగా...బాలుడు తీవ్రగాయాలపాలై మంచంపై పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. ఆ చిన్నారి దుస్తులు కాలిపోయి, ఛాతీపై పలు తీవ్రగాయాలయ్యాయి. తొలుత తమకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశీలించి చూడగా ఫోన్ ముక్కలై పడి ఉండటంతో..మొబైల్ బ్లాస్ట్ అయ్యిందని తెలిసిందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు. 24 గంటలు పిల్లలను మానిటర్ చేస్తూ కూర్చొవడం అసాధ్యం అని అంటున్నాడు. పిల్లలు కూడా కాస్త అసహనంగా ఫీలవుతారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ చదువులు కాబట్టి వారు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకని మొబైల్ ఫోన్లు ఇస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గేమ్‌లు కూడా ఆన్లైన్లో ఆడుతుంటారు. అందువల్ల ఇలాంటి ఘటనలు ఎదురైతే తాము ఏంచేయాలని చిన్నారి తండ్రి జావేద్ కన్నీటిపర్యంతమయ్యాడు. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్ రేప్ -
నిప్పు రాజేసిన వివాహేతర సంబంధం... భర్త చేతిలో తల్లి కూతుళ్లు సజీవ దహనం
థానే: మహారాష్ట్రలోని ఒక వ్యక్థి ఘోరమైన అకృత్యానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని, కూతుళ్లను నిర్ధాక్షణ్యంగా సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డోంబివిలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఈ ఘటనలో నిందితుడి భార్య 35 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కూతుళ్లు సమీర(14), సమీక్ష(11) 90 శాతం తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఐతే వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితుడు ప్రీతీ శాంతారామ్ పాటిల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు విచారణలో నిందుతుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని కూతుళ్లను వేధిస్తున్నాడని, అందులో భాగంగానే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఐతే ఈ ఘటన శనివారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరిగితే సుమారు 8.30 గం.లకు...అంటే దాదాపు మూడు గంటల ఆలస్యంతో వెలుగులోకి వచ్చిందని, అందువల్లే బాధితులు తీవ్రంగా గాయలపాలయ్యారని అన్నారు. (చదవండి: దారుణం.. కత్తులతో పొడిచి చంపుతున్నా చూస్తూ ఉండిపోయారు!) -
ఘోర బస్సు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ బస్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ముల్తాన్ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్కి బయులు దేరుతున్న ప్యాసింజర్ బస్సుని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు. (చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం) -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి
ఇస్తామాబాద్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్‌లోని ది చిల్డ్రన్స్ హాస్పిటల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు. 40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన అత్యంత వృద్ధుడు) -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ముంచంగిపుట్టు: బంగారుమెట్ట పంచాయితీ వదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వదనపల్లిలో కొర్రా సన్యాసిరావు ఇంటిలో సాయంత్రం అతని భార్య బాలబుడి టీ పెట్టడం కోసం గ్యాస్ స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించకపోవడంతో స్టౌ వెలిగించిన వెంటనే సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సన్యాసిరావు, అతని భార్య బాలబుడి, మనవరాలు భవానీతో బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.రూ.90వేలు డబ్బులతో పాటు 10 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్ కార్డు, గృహోపకరణ వస్తువులు కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు సన్యాసిరావు, బాలబుడి తెలిపారు. తహసీల్దార్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కొండమ్మ, వైఎస్సార్సీపీ మండల నేత జగన్నాథం, వీఆర్వో రమేష్‌లు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు రేషన్ సరుకులు అందించారు. (చదవండి: ప్లాస్టిక్ నిషేధం తక్షణ అవసరం) -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
అనుమానాస్పద మృతి.. కూతురిని స్కూల్ కిచెన్‌లో అలా చూసేసరికి..
చైన్నై: ఇంటికి రావాల్సిన తమ చిన్నారి సమయం దాటుతున్న రాలేదు. తీరా వెతుకుతూ వెళ్లిన ఆ తల్లిదండ్రులకు సగం కాలిపోయిన తమ బిడ్డని చూసి తట్టుకోలేకపోయారు. కాపాడుకునే ప్రయత్నం చేసే లోపే వారి కంటి పాప కనుమూసింది. ఈ ఘోరం తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఓ 5వ తరగతి బాలిక మధ్యాహ్నం విరామ సమయంలో తన ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. బాలిక కోసం వారు పాఠశాలకు వెళ్లి చూడగా పాఠశాల వంటగది సమీపంలో ఆమె తీవ్రంగా కాలిపోయి, కొన ఊపిరితో కనిపించింది. బాలికను చికిత్స నిమిత్తం తక్షణమే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కూతురు తమ కళ్ల ముందే మృతి చెందడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబ సభ్యులుతో పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం పాప ఒంటిపై లైంగిక దాడికి సంబంధించిన గాయాలు లేవని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
ఘోరం: యువతిని వివస్త్రను చేసి.. ప్రైవేట్ భాగాలను కాల్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డ్రాబ్రీ పీఎస్ పరిధిలోని ఓ నాలాలో గుర్తు పట్టలేకుండా ఉన్న ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి అందులో పడేశారని తెలిపారు. ఆమె వివరాలు తెలియకుండా యువతి ముఖంతో పాటు ప్రైవేటు భాగాలను కూడా కాల్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ఆ ప్రాంత డీసీపీ.. తమకి సోమవారం సాయంత్రం యువతి మృతదేహం లభ్యమైందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న క్రైమ్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించగా, పలు ఆధారాలు లభించాయన్నారు. దీంతో పాటు, చుట్టుపక్కల ఉన్న సీసీటీవి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అలానే, ఈ వయస్సు గల అమ్మాయిలు ఎవరైనా తప్పిపోయిన సమాచారాన్ని కూడా వివిధ స్టేషన్లో పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు. దీంతో పాటు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Love Couple Suicide: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య -
పప్పూ... ఇది తప్పు!!
జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశానికి ప్రధాన కార్యదర్శి. మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా పనిచేశాడు. మరి ఈయనకు ప్రజాస్వామ్యమన్నా... దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేశ్‌ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలి. తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలి. (అది చిడతల నాయుడికే చెల్లింది: పేర్ని నాని) -
పెళ్లి కోసం దాచిన 9 లక్షలు బూడిద
సాక్షి, శ్రీకాకుళం: కొత్తూరు మండలం హంస కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతోపాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు) కాలిపోయిన నగదు -
ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు
వాషింగ్టన్: కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు నల్లజాతీయులు నిరసనతో కూడా అట్టుడుకుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనల్లో భాగంగా మిన్నియాపోలీస్‌లోని ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్ ‘గాంధీ మహల్’కు నిరసనకారులు నిప్పు పెట్టారు. హఫ్సా ఇస్లాం కుటుంబం ఈ రెస్టారెంట్‌ను చాలా ఏళ్లుగా సౌత్ మిన్నియాపోలిస్‌లో నడుపుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి రెస్టారెంట్ యజమాని కుమార్తె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (విడాకులకు దారి తీసిన జార్జ్ మృతి) ‘రెస్టారెంట్ మంటల్లో తగలబడిపోయినందుకు బాధగా ఉంది. అయితే మా నాన్న గారు నాతో ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. రెస్టారెంట్ తగులబడితే తగులబడని. కానీ జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలి. ఆ అధికారులను జైళ్లో పెట్టాలి అని అన్నారు. మా రెస్టారెంట్‌ను కాపాడానికి చుట్టుపక్కల వారు చాలా ప్రయత్నించారు. మళ్లీ మేం మా రెస్టారెంట్‌ను తిరిగి నిర్మించుకోగలమనే నమ్మకం ఉంది’ అని ఆమె పోస్ట్ చేశారు. హఫ్సా కుటుంబం ఎన్నో ఏళ్లుగా నల్లజాతీయుల నిరసనలకు అండగా నిలబడుతూ వస్తోంది. ఈ విషయంలో కూడా జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలని హఫ్సా కుటుంబం కోరుకుంటుంది.(ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!) Powerful words from the family that owns Gandhi Mahal, hours after the restaurant burned down.#Minneapolis #wcco #GeorgeFloyd pic.twitter.com/AgGng0gsEP — Christiane Cordero (@ChristianeWCCO) May 29, 2020 ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసులు మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
చంద్రబాబుపై భగ్గుమన్న బీసీలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు. (చదవండి: బీసీల కోటాపై టీడీపీ ఆట) -
ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం
చండీగఢ్: చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెక్టార్ 32 వద్ద ఉన్న పీజీ వసతి గృహంలో శనివారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. ల్యాప్‌టాప్ చార్జ్ చేస్తుండగా మంటలంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అగ్నిప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తేల్చలేదు. అలాగే ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ, అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెప్పారు. సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు తెలిపారు. భవనం పై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్ గెస్ట్లుగా వుంటున్నారని చండీగఢ్ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 19-22 సంవత్సరాల వయస్సు వీరిని పంజాబ్, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మరో విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు సమాచారం. పోలీసు, రక్షక బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
నిండు చూలాలు దారుణ హత్య
సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్– బీజాపూర్ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించి మిస్సిం గ్ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అబార్షన్ వికటించిందా..? లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు. -
పేలిన రెడ్మీ నోట్–4 సెల్‌ఫోన్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ పేలిపోయింది. రామ్‌నగర్ కాలనీకి చెందిన సూర్యచంద్ర ఏడాదిగా రెడ్మీ నోట్–4 ఫోన్ వాడుతున్నాడు. శుక్రవారం ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఇంటి బయట ఉన్నాడు. ఉన్నట్టుంది శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పేలిన మొబైల్
కృష్ణరాజపురం : ఛార్జింగ్ పెడుతుండగా సెల్‌ఫోన్ పేలిపోయిన ఘటన సోమవారం బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన చంద్రు అనే యవకుడు కొద్ది రోజుల క్రితం రెడ్మి మొబైల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన చంద్రు వెంటనే దూరంగా పారిపోయాడు. పొగలు రావడం మొదలైన కొద్ది క్షణాల్లో మొబైల్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.