రేప్ చేసి..నిప్పంటించాడు | Woman raped, burnt to death by neighbour | Sakshi
Sakshi News home page

రేప్ చేసి..నిప్పంటించాడు

Published Wed, Feb 24 2016 3:25 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

రేప్ చేసి..నిప్పంటించాడు - Sakshi

రేప్ చేసి..నిప్పంటించాడు

కాన్పూర్ :  ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది.  ఇంట్లో ఒంటరిగా వున్న వివాహిత మహిళ(30)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల  ప్రకారం  బాధితురాలి భర్త వ్యవసాయ కార్మికుడు. స్థానికంగా నివాసం ఉండే  బ్రిజ్ కిషోర్ అనే వ్యక్తి వివాహితపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం నిప్పంటించి పారిపోయాడు. 

 

చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం అందుకున్న భర్త.... తీవ్రంగా గాయపడిన ఆమెను  ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి   మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని  పోస్ట్మార్టానికి తరలించారు. అయితే  తమ ఫిర్యాదు స్వీకరించడానికి ముందు  స్థానిక పోలీసులు నిరాకరించారని బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారుల జోక్యం తరువాత మాత్రమే  స్పందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement