Neighbour
-
ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
అల్జీర్స్: టీనేజీ వయసులో పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో అపహరణకు గురై ఏకంగా 26 సంవత్సరాలపాటు బందీగా ఉండిపోయిన అల్జీరియన్ వ్యక్తి వేదన ఇది. అల్జీరియా దేశంలోని డిజేఫ్లా రాష్ట్రంలో ఇటీవల కిడ్నాపర్ చెర నుంచి విముక్తుడైన 45 ఏళ్ల ఒమర్ బిన్ ఒమ్రాన్ గాథను స్థానిక అల్జీరియన్ ఎల్ఖబర్ వార్తాసంస్థ వెలుగులోకి తెచి్చంది. గడ్డితో నిండిన సెల్లార్లో ఏళ్ల తరబడి.. ఒమర్‌కు 19 ఏళ్ల వయసు ఉన్నపుడు అంటే 1998 సంవత్సరంలో ఒకరోజు ఉదయం వృత్తివిద్యా పాఠశాలకు ఒమర్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌చేసిన వ్యక్తి ఒమర్‌ను ఒక గడ్డితో కప్పిన నేలమాళిగలో దాచిపెట్టాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంచాడో ఎవరికీ తెలీదు. తోబుట్టువు పోస్ట్‌తో వెలుగులోకి కిడ్నాపర్‌కు ఒక తోబుట్టువు ఉన్నారు. ఆ వ్యక్తి ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక విషయం రాసుకొచ్చారు. ఊరిలో ఒక‡ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర కూడా ఉందని ఒక పోస్ట్‌చేశారు. ఈ పోస్ట్‌ను ఒమర్ కుటుంబం గమనించి వెంటనే దర్యాప్తు సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో నేషనల్ జెండర్మెరీన్( దేశ దర్యాప్తు సంస్థ) పాత కేసును తిరగతోడింది. పోస్ట్ పెట్టిన వ్యక్తిని విచారించి కిడ్నాపర్ ఇంటిని కనిపెట్టారు. అధికారులు ఆదివారం కిడ్నాపర్ ఇంటిపై మెరుపుదాడి చేసి ఇళ్లంతా వెతికారు. చివరకు గడ్డితో ఉన్న రహస్య సెల్లార్లో ఒమర్‌ను కనుగొన్నారు. 61 ఏళ్ల కిడ్నాపర్ పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇల్లు.. ఒమర్ సొంత ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ సెల్లార్ ఒక గొర్రెల కొట్టం కింద ఉన్నట్లు తెలుస్తోంది. కిటికీలోంచి చూసేవాడిని: ఒమర్ ‘‘కిడ్నాప్‌కు గురయ్యాక ఈ సెల్లార్లోనే ఉండిపోయా. నా కుటుంబసభ్యులు అటుగా వెళ్లేటపుడు సెల్లార్ కిటికీ నుంచి చూసేవాడిని. అరిచి పిలుద్దామని వందలసార్లు అనుకున్నా. కానీ పక్కనే కిడ్నాపర్ ఉండేవాడు. భయంతో నోరు మెదపలేదు’’ అని విడుదలయ్యాక ఒమర్ చెప్పారు. -
పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?
గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్చల్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది. Anger issues comedy: "Lappu sa Sachin" & "Jhingur sa ladka" 😂😂pic.twitter.com/2DI4dliGls — Marathi Walter 🇮🇳 𝕏 (@dotnagpur) July 19, 2023 ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి? వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్‌లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. Her kids learning alphabet: J for Jhingoor K for Keeda L for Lappu pic.twitter.com/TEmqGyp75A — Sagar (@sagarcasm) August 2, 2023 ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. Haha haha. “Kya hai Sachin mey” has been immortalised 😂#SeemaHaider pic.twitter.com/8GFpat6V17 — Smita Prakash (@smitaprakash) August 4, 2023 ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ -
మరో దారుణం.. మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి...
ముంబైకి చెందిన ఒక డెలివరీ బాయ్ పొరుగింటిలో ఉంటున్న వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వివాదమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని షాహూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న పాల్ కానారన్ అనే వ్యక్తి తన పొరుగు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని హత్య చేశాడు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ఒక ఇంటి నుంచి దుర్ఘంధం వస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ ఇంటిలో దుప్పటిలో చుట్టిన స్థితిలో ఒక మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను అతని పొరుగింటిలో ఉన్న వ్యక్తి మందు పార్టీకి ఆహ్వానించాడు. పార్టీ చేసుకుంటున్న సందర్భంలో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఫుడ్ డెలివరీ ఏజెంట్ పొరుగింటిలోని వ్యక్తిని దారుణంగా హతమార్చి, మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి, అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
దారుణం: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..
డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హరీష్ అనే వ్యక్తి కొడుకుకి కువాన్ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్ కోసం అని డీజే పెట్టారు చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్ తగ్గించమని హరీష్‌ని కోరింది. అంతే హరీష్ తన స్నేహితుడు అమిత్ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్ డెలివరీ బాయ్‌గానూ, అమిత్ మొబైల్ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
'కుక్క' అన్న పిలుపు విషయమై తలెత్తిన వివాదం..చివరికి..
చిన్న మాట పట్టింపు కాస్త చివరికి హత్యకు దారితీయడం బాధకరం. వారి మధ్య ఉన్న వివాదం పెద్దది కూడా కాదు. కేవలం తమ ఇగోతో ప్రస్టేజ్‌లకు పోయి చంపుకునేంత వరకు వెళ్లి చివరికి కటకటాల పాలవ్వు తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని ఉలగంపట్టియార్‌కొట్టంలె నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్, విన్సెంట్‌తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్(62).. దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్ హెచ్చరించారు ఫాతిమా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ రాయప్పన్ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో.. ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్ తన కొడుకు కెల్విన్‌కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా.. ఆ మాట విన్న డానియల్ కోపంతో నా పెంపుడు కుక్కను ‘కుక్క’ అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చాడు.ఆ తర్వాత రాయప్పన్ ఛాతిపై బలంగా ఒక పంచ్ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి.. నిర్మలా రాణి తోసహా ఆమె కుమారులను పట్టుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్) -
భార్యాభర్తల గొడవలోకి దూరాడు.. దారుణంగా హత్యకు గురయ్యాడు
భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న చిన్న విషయాలకు సైతం గొడవ పడినా.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఇరువురు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించటమూ మామూలే. కానీ, ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుందనేందుకు ఇదే సరైన ఉదాహరణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారని కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మా మధ్యకే వస్తావా అని దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు ఇంట్లో మటన్ కూర వండాలని భార్యకు చెప్పాడు. అయితే, మంగళవారం మాంసం తినకూడదని వాదించింది భార్య. ఈ విషయంపై ఇరువురు గొడవకు దిగారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను గమనించిన పొరుగింటి వ్యక్తి బిల్లు.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, బిల్లుపై కోపం పెంచుకున్న భర్త పప్పు.. అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదీ చదవండి: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన మందుబాబు.. -
తల్లికి అనారోగ్యం.. మందులు ఇప్పిస్తానని చెప్పి బాలికపై లైంగిక దాడి
న్యూఢిల్లీ: తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మందుల కోసం సహాయం కోరిన బాలికపై ఓ పొరుగు వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ దారుణం జనవరి 22న చోటు చేసుకోగా మరుసటి రోజు కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక తల్లి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో బాలిక తండ్రి కూడా ఇంట్లో లేడు. దీంత ఆ బాలిక తల్లికి మందుల కోసం ఆ ప్రాంతాంలోనే నివసిస్తున్న అరుణ్ అనే వ్యక్తిని సహాయం చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన అరుణ్ బాలికకు మందులు ఇప్పిస్తానని చెప్పి ఆ ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయం బయటకు తెలిస్తే ఆమెను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ( చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! ) -
పొరుగింటి లాయర్‌పై కక్షతో..
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన డీఆర్డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్ వశిష్ట్ స్థానిక అశోక్ విహార్ ఫేజ్–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక వేశాడు. మార్కెట్లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్ బాక్స్ బాంబు తయారు చేశాడు. ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్ హాజరయ్యే కోర్ట్ నంబర్ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను శనివారం అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. -
బాలిక అదృశ్యం కేసు విషాదాంతం
లక్నో: అదృశ్యమైన ఆరేళ్ల బాలిక కేసు విషాదాంతంగా ముగిసింది. రెండు రోజుల క్రితం తన ఇంటి నుంచి దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల బాలిక ట్రంక్ బాక్సులో శవమై కన్పించింది. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హపూర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక గురువారం (డిసెంబరు 2)న సాయంత్రం ఇంటి నుంచి చాక్లెట్ కొనుక్కుంటానని బయటకు వెళ్లింది. ఆ తర్వాత.. ఎంత సేపటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తండ్రి ఆరోజు రాత్రంతా బాలిక కోసం వెతికారు. అయినా.. బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయాన్నే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇంటి తాళలను పగులగొట్టారు. అప్పుడు వారికి ఒక ట్రంక్ పెట్టెలో బట్టలు, బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత.. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాలికను ఆ ఇంటి యజమాని బైక్ మీద కూర్చోబెట్టుకుని, అతని ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.కాగా, చాక్లెట్ కొనడానికి వెళ్లిన కూతురు.. రెండు రోజుల తర్వాత శవమై కనిపించడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యింది. దీంతో స్థానికులు ఆ నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి పాల్పడ్డారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రిపోర్టులు వచ్చాక.. పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వామ్మో.. కొంపముంచిన బైక్ స్టంట్.. వైరల్ వీడియో..
బెంగళూరు: కొంత మంది యువకులు అర్ధరాత్రికాగానే రోడ్డుపై వచ్చి ఇష్టమోచ్చినట్లు వాహనాలను నడుపుతుండటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వీరు అత్యధిక వేగంతో తమ బైక్‌లను నడుపుతూ.. రకారకాల స్టంట్లు చేస్తుంటారు. కొంత మంది యువకులు బైక్ నడుపుతున్నప్పుడు హ్యండిల్‌ను వదిలేస్తే.. మరికొందరు ఆకతాయిలు ముందు టైర్‌ను లేదా వెనుక టైర్‌ను గాల్లో అమాంతం పైకి ఎత్తి వెరైటీ డ్రైవ్ చేస్తుంటారు. అయితే, ఇలాంటి స్టంట్లు చేసే క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాగా, ఒక యువకుడు తన మోటర్‌బైక్‌తో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యువకుడు రోడ్డుపై బైక్ స్టంట్ చేస్తున్నాడు. అక్కడ రోడ్డంతా వర్షం నీరుతో నిండి ఉంది. అతను ఏమాత్రం భయపడకుండా.. అలాగే బైక్‌ను స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా.. బైక్‌ను వేగంగా నడిపిస్తూ ముందు టైర్‌ను అమాంతం గాల్లో పైకి లేపాడు. అతగాడి విన్యాసాన్ని చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు. అయితే, ఆ యువకుడు తొలుత బైక్‌ను బాగానే నడిపినా ఆ తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అతను పక్కనే ఉన్న ఒక ప్రహరీ గొడను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటనతో అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. మోటర్ బైక్ ఢీకొని గోడంతా కూలిపోయింది. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని.. స్ప్లెండర్ బుల్లెట్ లవ్ అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. ఏమన్న స్టంటా..’, ‘కొంచెంలో మిస్ అయ్యాడు..’, ‘ఇలాంటి ప్రమాదకర స్టంట్లు అవసరమా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by splendor_bullet_love (@splendor_bullet_love) -
ప్రాణం తీసిన సైకిల్ పార్కింగ్
చంఢీగడ్: హర్యానాలోని పంచకుల జిల్లాలో సైకిల్ పార్కింగ్ వివాదంలో ఓ 55 ఏళ్ల వ్యక్తిని పొరుగునవారు కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే.. బైందర్ అనే వ్యక్తి ఇందిరా కాలనీలోని సెక్టార్16 లో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం తన నివాసం వెలుపల సైకిల్‌ను పార్క్ చేశాడు. వీధిలో సైకిల్‌ను పార్కింగ్ చేయడంపై బాధితుడు, అతని పొరుగు వ్యక్తి సతీశ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సతీష్ కోపంతో బైందిర్ సైకిల్ని అతడిపై విసిరాడు. అంతటితో ఆగకుండా అతనికి ఓ పాఠం నేర్పుతా అంటూ బెదిరించాడు. తర్వాత సతీశ్ తన ఇద్దరు కుమారులు విక్కీ, సన్నీ, పొరుగునే ఉన్న మహిపాల్, మోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తి, రాడ్లు, కర్రలతో బైందర్ కుటుంబంపై దాడిచేశారు. విక్కీ బైందర్‌ను ఛాతిపై కత్తితో పొడవడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బాధితుడి భార్య, ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు. ఐదుగురు నిందితులపై 302, 321, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో ఇరు పార్టీలు పలుసార్లు గొడవ పడ్డాయని పోలీసులు తెలిపారు. -
పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు!
పెద్దపల్లిరూరల్: జల్సాలకు అలవాటు పడి డబ్బును సులువుగా సంపాదించేందుకు దొంగతనాన్ని ఎంచుకున్న సందిరి రాజు పక్కింటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. డీసీపీ రవీందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట ప్రాంతానికి చెందిన సందిరి రాజు కంప్యూటర్ హార్డ్‌వేర్ పనులు చేస్తూ కొంతకాలంగా పెద్దపల్లిలోని సాయినగర్‌లో నివాసముంటున్నాడు. అతడి ఇంటి పక్కనే పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సురేశ్ కుటుంబం ఉంటోంది. ఈ నెల 8న సురేశ్ కుటుంబం ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు సుత్తెతో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారు, 16 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సురేశ్ దొంగలుపడ్డారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసు అధికారులకు రాజు కదలికలపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన 12 గంటల్లోపే దొంగను పట్టుకుని సొత్తును స్వాధీనం పర్చుకున్న సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై రాజేశ్, సిబ్బంది దుబాసి రమేశ్, మాడిశెట్టి రమేశ్‌లను డీసీపీ, ఐపీఎస్ అధికారి నితికపంత్ అభినందించారు. చదవండి: మేనకోడలిని దారుణంగా చంపేశాడు! -
బాటిల్ తెచ్చిన వివాదం.. ముగ్గురు బలి
న్యూఢిల్లీ : అసహనం, కోపం మనిషి చేత ఎలాంటి పనులు చేయిస్తాయో ఇది చదివితే అర్థమవుతుంది. ఇరుగుపొరుగు ఇళ్ల మధ్య వచ్చిన ఓ చిన్న వివాదం ముగ్గుర్ని బలిగింది. వివరాలు.. ఢిల్లీలో ఉంటున్న ఆజాద్(40), వీరు(41) పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వీరు కూతురు ఓ బాటిల్‌ను తమ ఇంటి బాల్కనీ నుంచి రోడ్డు మీదకు విసిరింది. అయితే దురదృష్టవషాత్తు అది వెళ్లి రోడ్డు మీద నిల్చున్న ఆజాద్‌కు తగిలింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరకు ఎలాగోలా ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది. ఈ క్రమంలో బధవారం రాత్రి ఇరు కుటుంమాల మధ్య మరోసారి తగాద ప్రారంభమయ్యింది. ఈ వివాదం కాస్తా ముదరడంతో.. సహనం కోల్పోయిన ఆజాద్ కత్తి తీసుకుని వీరు కొడుకు మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన వీరు, అతని భార్య మీద కూడా దాడి చేశాడు. అనంతరం ఆజాద్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. వీరు భార్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. (వీరు భార్య, కుమారుడు (ఫైల్ ఫోటో)) ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరు, అతని కొడుకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత పెద్ద తగాద జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వారు ఆపకపోగా.. దీన్నంతా తమ ఫోన్లలో వీడియో తీయడంలో బిజీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆజాద్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
పక్కింటి మహిళతో వైరం.. బాలుడి హత్య
బొమ్మనహళ్లి : పక్కింటి మహిళ తరచూ గొడవ పడుతోందనే కారణంతో ఆమె కుమారుడిని హత్య చేసిన యువకుడు.. మృతదేహాన్ని నీటి ట్యాంక్‌లో వేసి ఉడాయించాడు. ఈఘటన బెంగళూరు మైకోలేఔట్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బిళ్లకహళ్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బిళ్లెకహళ్లిలో గౌరమ్మ అనే మహిళ తన ఆరేళ్ల కుమారుడు మనోజ్‌కుమార్‌తో కలిసి నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కన మహేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికీ, గౌరమ్మ మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. దీంతో మహేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. శనివారం ఉదయం మనోజ్‌కుమార్‌కు చాక్లెట్ ఆశ చూపిన మహేష్.. అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిని ఇటుకలతో కొట్టి చంపివేశాడు. మృతదేహాన్ని నీటి ట్యాంక్‌లో వేసి ఉడాయించాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో గౌరమ్మ స్థానికుల సహాయంతో పలు ప్రాంతాల్లో గాలించింది. చివరకు నీటి ట్యాంకులో మనోజ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మహేష్ కోసం గాలించారు. ఎట్టకేలకు యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ..తానే మనోజ్‌ను కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధ తల్లిపై దాడి...వైరల్ వీడియో
న్యూఢిల్లీ: 85 ఏళ్ల వృద్ధ తల్లిపై ఓ కూతురు చేయిచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదుగానీ, ఆమెపై అనుచితంగా ప్రవర్తించింది. నిస్సహాయంగా పెద్దగా రోదిస్తున్నా..కనీసం జాలి చూపకుండా తల్లి పై పలుమార్లు చేయి చేసుకుంది. చుట్టుపక్కల వారు చూస్తూ ఉండగానే మొఖంమీద, మూతిమీది దాడిచేసింది. డిల్లీలోని కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటు కూతురు కూడా (65) వయసు మళ్లిన మహిళ కావడం గమనించదగ్గ అంశం. అయితే ఈ దాడిని పొరుగు వారు ప్రశ్నించారు. తల్లిని అలా దండించడం తప్పని నిలదీశారు. దీంతోపాటుగా ఆ ఉదంతాన్ని మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తల్లిని కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. అయితే అందుకు నిరాకరించిన తల్లి ఇది కుటుంబ సమస్యఅనీ, ఫిర్యాదు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేయడం విశేషం. కాగా చుట్టు పక్కల చిత్రీకరించిన ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దాదాపు తొమ్మదిన్నర లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. -
నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం
గుర్గావ్: హర్యానాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై ఓ టీనేజీ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లో నివసించే నాలుగేళ్ల బాలుడిపై పదిహేనేళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొరుగింట్లో ఉండే యువకుడు ఒంటరిగా ఉన్న బాలున్ని ప్రలోభపెట్టి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యాచారానికి గురైన బాలుడి సోదరుడితో నిందితుడు చనువుగా ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తల్లి పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిపై లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. -
రేప్ చేసి..నిప్పంటించాడు
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న వివాహిత మహిళ(30)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలి భర్త వ్యవసాయ కార్మికుడు. స్థానికంగా నివాసం ఉండే బ్రిజ్ కిషోర్ అనే వ్యక్తి వివాహితపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం నిప్పంటించి పారిపోయాడు. చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం అందుకున్న భర్త.... తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే తమ ఫిర్యాదు స్వీకరించడానికి ముందు స్థానిక పోలీసులు నిరాకరించారని బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారుల జోక్యం తరువాత మాత్రమే స్పందించినట్లు తెలిపారు. -
యూపీలో మరో దారుణం
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని బదోహిలో మరో దారుణం చోటు చేసుకుంది. బధౌని జిలా సర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై మరో టీనేజ్ కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం పనిమీద బైటకు వెళ్లిన ఆ బాలికపై పొరుగున ఉండే అతడు ఈ అఘాయిత్యం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేంద్ర కుమార్ పాండే తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించామని, నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
పొరుగు ముఖ్యమంత్రికి మినహాయింపులుంటాయా?
సందర్భం రాజులకు ఎన్ని నేరాలైనా చేసే స్వేచ్ఛ ఉందనీ, ఏం చేసి నా ఏ శిక్షలూ ఉండవనే పాత యుగం వ్యవస్థ ఇంకా ఉందని ఎవరైనా అనుకుంటే అంతక న్నా దౌర్భాగ్యం లేదు. రాష్ర్టపతి, గవర్నర్లకు మాత్రమే ఆర్టికల్ 361 కింద రాజ్యాంగం మినహాయింపు ఇస్తున్నది. బాధ్యతలు, విధుల నిర్వహణలో తమ పనుల వల్ల ఏదైనా హాని జరిగితే అందుకు రాష్ర్టపతి, గవ ర్నర్లు కోర్టుల్లో జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈ అధికరణం తేల్చింది. వారి అధికారిక పదవీకాలంలో వారిపైన ఎటువంటి క్రిమినల్ కేసులూ పెట్టడానికి వీల్లే దని ఆర్టికల్ 361(2) వివరిస్తున్నది. పదవీకాలం ముగి సిన వెంటనే కేసులు రాకతప్పదని దీని అర్థం. ముఖ్య మంత్రులూ వారి అనుయాయులూ తెలుసుకోవలసిం దేమంటే రాజ్యాంగం ఆర్టికల్ 361గానీ, మరే ఇతర చట్టాలుగానీ ముఖ్యమంత్రులకు ఏ మినహాయింపులు ఇవ్వలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపైన కర్ణా టక జిల్లా నేరాల విచారణ న్యాయస్థానం జైలు శిక్ష విధిం చిన సంఘటన ఏ ముఖ్యమంత్రికీ, ఏ మినహాయింపూ లేదని చాటుతున్నది. పోనీ ముఖ్యమంత్రిగా కాకపోయినా ఒక ఎంఎల్ఏ గా మినహాయింపు ఉండే అవకాశం ఏమైనా ఉందా అం టే జవాబు కచ్చితంగా ఉంటుంది. కానీ, ఏ మిన హాయింపు? రాజ్యాంగం ఆర్టికల్ 194(2) కింద అసెంబ్లీ చెప్పిన మాటకు, వేసిన ఓటుకు సంబంధించి ఏ కోర్టు లోనూ చట్టసభ సభ్యుడు జవాబు చెప్పనవసరం లేదు. నోటు తీసుకుని సభలో ఓటు వేస్తే నేర విచారణ చేయడానికి వీల్లేదని పీవీ నరసింహారావు వర్సెస్ స్టేట్ (సీబీఐ) కేసులో సుప్రీంకోర్టు 1998లో తీర్పు చెప్పింది. ఇది ఒక రకంగా చాలా అన్యాయమైన తీర్పే. లంచాలు ఇచ్చిన వారికి శిక్షలు ఉంటాయంటూనే లంచాలు తీసు కుని చట్టసభలో ఓట్లేసిన వారిని విచారించడానికి వీల్లే దని మినహాయింపు ఇవ్వడం దారుణం. కానీ, ఆ దుర న్యాయ తీర్పు కూడా లంచాలు ఇచ్చిన ఎంఎల్ఏలకు, ఎంపీలకు మినహాయింపులు ఇవ్వలేదు. ఇచ్చిన వారికి విముక్తి లేదు కనుకనే ఎంఎల్ఏ రేవంత్‌రెడ్డిగారు లంచం ఇవ్వజూపి కెమెరాల్లో చిక్కి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో ఆం ధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 8 రక్షిస్తుందేమోనని కొందరు ఆశపడుతున్నారు. ఉమ్మడి రాజధాని హైదరా బాద్‌లో ఉన్న తెలంగాణేతర వ్యక్తుల ఆస్తిపాస్తులకు ప్రాణాలకు ఏదైనా ముప్పు ఏర్పడితే రక్షణకు గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఉంటాయనీ, శాంతి భద్రతల సమ స్యలు తలెత్తితే చర్యలు తీసుకునే అధికారాలు ఉంటా యనీ సెక్షన్ 8 వివరిస్తున్నదేగాని తెలంగాణేతరులు ఉమ్మడి రాజధానిలో హత్యలు, బందిపోట్లు, రేప్‌లు లం చాల నేరాలు యథేచ్ఛగా చేసుకోండి, పోలీసులు పట్టు కోరు అనే టోకు మినహాయింపులేవీ ఇవ్వలేదు. అటు వంటి మినహాయింపులు ఎవరికీ ఉండవు. ఒకవేళ ఉంటే పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రే ఎందుకు, తెలంగాణేతరు లంతా తోచిన నేరాలు, ఘోరాలు చేసుకుంటూ జైలు భయం లేకుండా జీవించేవారు. తమకు అటువంటి మినహాయింపులు ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు కూడా. మరొక అనుమానం.. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పొరుగు ముఖ్యమంత్రిగారి ప్రైవసీ హక్కును ధ్వంసం చేశారనే ఆరోపణ. ఫోన్లు ట్యాప్ చేయడానికి వీల్లేదన్న మాట నిజం. అయితే ఏ సందర్భాలలో టెలిఫోన్లను ట్యాప్ చేయొచ్చో సుప్రీంకోర్టు పీయూసీఎల్ కేసులో స్పష్టం చేసింది. లంచం ఇవ్వబోతున్నారని తెలిసి నియ మిత శాసన సభ్యుడు స్టీఫెన్సన్ ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఏసీబీ ట్రాప్‌కు ఏర్పాట్లు చేసింది. అం దులో భాగంగా ఆ ఎంఎల్ఏ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను పరిశీలనలో పెట్టడం ద్వారా దొరికిన డేటాలోంచి సాక్ష్యా లు వెతుక్కోవడమే దర్యాప్తు, పరిశోధన అంటే. ప్రైవసీ సూత్రానికి నేర జీవితం ఒక మినహా యింపు. ఎవరైనా సరే ఎవరూ చూడకుండానే నేరాలు చేస్తారు, కానీ, ఎవరైనా చూస్తే నా ప్రైవసీ భంగపడిం దంటే చెల్లదు. అట్లా అయితే నేరాలు చూసిన ప్రత్యక్ష సాక్షులందరూ ప్రైవసీ ఉల్లంఘన నేరానికి జైల్లో ఉండి పోతారు. నేరాలు చేసిన ఘరానా నిందితులంతా హాయి గా స్వేచ్ఛను అనుభవిస్తుంటారు. నేరాలను ప్రైవసీ పేరు తో రహస్యంగా దాచుకునే హక్కు ప్రపంచంలో ఏ చట్ట మూ ఇవ్వదు. నేరాలు చేశారని పోలీసులు అనుమానిస్తే ప్రైవసీకి స్థానం ఉండదు. ట్రాప్‌లో భాగంగా టాపింగ్ కూడా ఉంటుంది. మహిళల శరీరాలతో వ్యాపార నేరాలు చేసే వారిని, లంచాలు తీసుకునే వారిని ట్రాప్ ద్వారా పట్టుకోవడం చాలా సంవత్సరాల నుంచి అమలులో ఉన్న వ్యూహం. మరో రకంగా ఈ నేరగాళ్లను పట్టుకో వడం దాదాపు అసాధ్యం. అవినీతి నిరోధక చట్టంలో లేక పోయినా ట్రాపింగ్ అనే పదం అమలులో విస్తారంగా ఉంది. ట్రాపింగ్ చట్టబద్దమే అని అనేకానేక కేసుల్లో న్యాయస్థానాలు ప్రకటించాయి. స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట వర్సెస్ రషీద్ బి ములాని కేసులో 2006లో సుప్రీంకోర్టు ట్రాపింగ్ చట్టబద్దతను పునరుద్ఘాటించింది. విచిత్రమే మిటంటే ట్రాపింగ్లన్నీ లంచం అడిగితీసుకునే ప్రభు త్వాధికారులను పట్టుకోవడానికి పట్టిన వలలే. కానీ, లంచం ఇచ్చినందుకు ప్రజా ప్రతినిధి వలలో చిక్కు కోవడం ఇదే మొదటిసారి. అందుకే రివర్స్ ట్రాప్ అంటున్నారు. రికార్డయిన ఫోన్ మాటలు, వీడియో చిత్రాలు సాక్ష్యాలుగా పనికి వస్తాయా అనేది మరొక అనుమానం. కోర్టులు ఎన్నో తీర్పుల్లో ఈ సాక్ష్యాలను అనుమతించి శిక్షలు విధించాయి. అయితే ఈ రికార్డులు మిమిక్రీతో అతికినవి కాదనీ, ఆడియో వీడియో టేపుల్లో అతుకులు కత్తిరింపులు లేవనీ, ఈ రికార్డు అసలైనదే అని ఫోరెన్సిక్ లేబొరేటరీలో రుజువైతే ఆ సాక్ష్యం తిరుగులేనిదవుతుం దని కోర్టులు నిర్ధారించాయి. అనిరుద్ధ బహల్ వర్సెస్ స్టేట్ కేసులో ఢిల్లీ హైకోర్టు 2010లో మీడియా వారి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన చిత్రాలను సాక్ష్యాలుగా అను మతించారు. బీఎండబ్ల్యూ కారును కాలి బాట మీద పడు కున్న బీదలపైకి ఎక్కించి చంపేసిన కేసులో పోలీసు సాక్షిని కొనడానికి లాయర్ లంచం ఇస్తుండగా ఒక ప్రైవేట్ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌తో బయట పెట్టింది. ప్రజాప్రయోజనం ఉన్న ఈ స్టింగ్ సరైనదే అని, సాక్ష్యం చెల్లుతుందని ప్రకటించి లాయర్‌ను కూడా శిక్షించింది సుప్రీంకోర్టు. నేరం రుజువు కావడానికి సాక్ష్యాలు అవసరం. అభిప్రాయాలు కాదు, ఓట్లు కాదు. వ్యక్తి ఎవరనీ ఎంత గొప్పవాడనే స్థాయితో, హోదాతో సంబంధం లేకుండా రుజువులు ఉంటే చాలు నేరగాళ్లు జైలు పాలవుతారన్నదే సమన్యాయసూత్రం. - మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com