డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హరీష్ అనే వ్యక్తి కొడుకుకి కువాన్ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్ కోసం అని డీజే పెట్టారు చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్ తగ్గించమని హరీష్‌ని కోరింది.
అంతే హరీష్ తన స్నేహితుడు అమిత్ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్ డెలివరీ బాయ్‌గానూ, అమిత్ మొబైల్ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు.
(చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..)
Comments
Please login to add a commentAdd a comment