loud music
-
విషాదం: డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు
ఇటీవల డీజే ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతి శుభకార్యంలో భారీ భారీ సౌండ్ సిస్టమ్ కామన్ అయిపోయింది. దద్దరిల్లిపోయే డీజే చప్పుళ్లకు చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. మితిమీరిన సౌండ్, అత్యుత్సాహంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ డాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఓ బాలుడు భారీ డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.భోపాల్‌లో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల బాలుడు స్థానిక పండుగ వేడుకలో తన వివాసం వెలుపల డీజే సౌండ్‌కు ప్రజలు డ్యాన్స్ చేస్తుండగా.. ఆ సంగీతానికి ఆకర్షితుతయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అందరితోపాటు డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పిల్లవాడని ఆరోగ్య పరిస్థితి గురించి తెలియక అతని చుట్టుపక్కల వారు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే గమనించిన తల్లి జమునా దేవి సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో అందరూ ఆగిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యు ప్రకటించారు.అయితే సమర్ తండ్రి, కైలాష్ బిల్లోర్, డీసే సౌండ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటమే తన కొడుకు చావుకు కారణమని ఆరోపించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆగలేదని, తమ అబ్బాయి ప్రాణం పోయినా ఆ సందడిని ఏదీ ఆపలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల కారణంగా ఇంట్లోని రోగులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇటువంటి సమస్యలను నివారించడానికి డీజేలకు ఖచ్చితమైన సమయం, వాల్యూమ్ పరిమితులు ఉండాలని కోరారు. -
డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?
పెళ్లిళ్లలోనూ ఏదైన పండుగ, జాతర్లలో పెట్టే డీజే మ్యూజిక్ వల్ల గుండె పోటు వస్తుందా?. ఈ ఏడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సురేంద్ర కుమార్ డీజే సౌండ్ తనకు చాలా అసౌకర్యంగా ఉందని, తగ్గించమని చెప్పినట్లు సమాచారం. ఆ భారీ శబ్దాల వల్లే సురేంద్ర కూమార్ చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు కూడా. అలాగే తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అంతేకాదు గతేడాది నవండర్ 25న ఇలానే డీజే మ్యూజిక్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. భారతదేశంలో ఇలాంటి ఘటనలు గతకొంతకాలంగా కోకొల్లలుగా జరగడంతో ప్రజల్లో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. ఎందుకిలా జరుగుతుంది?. శబ్దానికి గుండెపోటుకి సంబంధం ఏంటి? చెవికి గుండెకు ఉన్న లింక్ ఏమిటి తదితరాల గురించే ఈ కథనం.. భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారంతా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. నిత్యం భారీ శబ్దాల మధ్య పనిచేయడం లేదా నివశిస్తుంటారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో గుండె జబ్బు లక్షణాలు లేని వ్యక్తులు సైతం హృదయ సంబంధ వ్యాధులకు గురైనట్లు గుర్తించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరగుతున్న మార్పలను గుర్తించారు. అలాగే మెదడులో ఉండే బూడిద రండు పదార్థాం అమిగ్డాలాపై తీవ్ర ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఒక రకంగా బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనునిత్యం పెద్ద శబ్దాల వద్ద పనిచేసే వ్యక్తుల్లో మానసిక కల్లోలం, అసహనం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. హృదయ స్పందనలు క్రమరాహిత్యం.. జర్మనీలో మెయిన్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో కూడా 35 నుంచి 74 ఏళ్ల వయసు ఉన్న 15 వేల మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. ఏ సంగీతాన్ని అయినా ఓ నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే మానవ హృదయాలపై హానికరమైన ప్రభావం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది. భారీ శబ్దానికి గురైనప్పుడూ హృదయ స్పందన వేగం ఒక్కసారిగా మారిపోవడం, భయం ఆందోళన ఒక్కసారిగా ఉత్ఫన్నమవుతున్నట్లు గుర్తించారు. చాలామంది, జాగింగ్ చేసేటప్పుడూ వ్యాయామాలు చేసేటప్పుడూ మ్యూజిక్ పెట్టుకుని చేస్తుంటారు ఇది అంత మంచి పద్ధతి కాదనే అంటున్నారు. ఓ మోస్తరుగా మనిషి వినగలిగేంత పరిమితి సౌండ్‌తోనే సంగీతం వింటే ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని వినడం తగ్గించాలి.. చాల ఎక్కువ వాల్యూమ్‌లో ధ్వనిని వినడం చెవిలోని ఇంద్రియ కణాలు, నిర్మాణాలు అలసిపోతాయి. ఇది చాలాకాలం పాటు కొనసాగితే శాశ్వతంగా వినికిలోపం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని అధ్యయనంలో తేలింది. అందువల్ల ఎక్కువ గంటలపాటు పెద్ద పెద్ద వాల్యూమ్‌లో హెడ్‌ఫోన్ పెట్టుకుని వినడం, వివాహ ఫంక్షన్లో పెట్టే భారీ సంగీ మ్యూజిక్ల్లో పాల్గొనడం వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండెకు చెవికి ఉన్న సంబంధం ఏంటీ .. ఏదైన ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్న జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తే.. మోతాదుకు మించిన వాల్యూమ్‌తో వినే మ్యూజిక్ గుండె, మెదడుపై అదే స్థాయిలో ప్రభావం చూపిస్తాయి. మన శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి లింక్ అప్ అయ్యే ఉంటాయి. ఒక అవయవానికి ఏర్పడిన నష్టం దేహంలోని మిగతా అవయవాలపై ఎంతోకొంత ప్రభావం తప్పక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
ఆ ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి..
ఢిల్లీ: ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ఇంట్లో నగలు చోరీ చేసిందనే అనుమానంతో 23 ఏళ్ల మహిళను ఆమె బంధువులే చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. సమీనా అనే మహిళ ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్‌లో ఉన్న తన బంధువులు హీనా, రమేష్‌ల ఇంటికి బర్త్‌డే వేడుకకు వెళ్లింది. ఇంట్లో రూ.5 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో సమీనా చోరీ చేసిందని ఆ దంపతులు అనుమానించారు. చేసిన తప్పు ఒపుకోవాలంటూ బ్లేడ్, రాడ్‌తో దాడి చేశారు. వారికి బంధువులు కూడా తోడయ్యారు. ఆ మహిళ రక్షించాలంటూ కేకలు వేయడంతో, అరుపులు వినపడకుండా అధిక సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేశారు. చిత్రహింసల కారణంగా సమీనా మృతిచెందగా, నిందితులు పరారయ్యారు. కానీ మ్యూజిక్ ఆఫ్ చేయడం మరిచిపోయారు. రెండు రోజులుగా ఇంట్లో పెద్దగా సంగీతం వినిపించడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ తెలిపారు. చదవండి: యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి.. -
దారుణం: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..
డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..హరీష్ అనే వ్యక్తి కొడుకుకి కువాన్ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్ కోసం అని డీజే పెట్టారు చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్ తగ్గించమని హరీష్‌ని కోరింది. అంతే హరీష్ తన స్నేహితుడు అమిత్ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్ డెలివరీ బాయ్‌గానూ, అమిత్ మొబైల్ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు. (చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..) -
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
సీనియర్ హీరోకు పోలీసుల వార్నింగ్
ఈమధ్యనే జైలు జీవితం ముగించుకుని సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన సీనియర్ హీరో సంజయ్ దత్‌కు పోలీసులు ఈమధ్య ఒక వార్నింగ్ ఇచ్చారట. పోలీసులకు.. సంజూబాబాకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. అయితే తాజా వార్నింగ్ మాత్రం పాత కేసులకు సంబంధించినది కాదు. ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు వచ్చారు. విషయం ఏమిటంటే.. జనవరి 14వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా సంజయ్ దత్ కుటుంబం వాళ్లు మేడమీదకు చేరుకుని పెద్ద సౌండుతో మ్యూజిక్ పెటప్టారు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఎవరికీ నిద్ర అన్నది లేకుండా పోయింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్లొచ్చి సంజయ్ దత్‌కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి మరీ మ్యూజిక్ ఆపించారు. అంతకుముందు సంజయ్ దత్ ఉండే ప్రాంతానికి చెందిన అసోసియేషన్ వాళ్లు కూడా ఈ విషయమై లేఖలు రాసినా ఆయన మాత్రం మారలేదట. ఈ విషయాన్ని జోనల్ డీసీపీ వరకు తీసుకెళ్లి సంజయ్ దత్ మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామంటున్నారు. -
సౌండ్ పెద్దగా పెట్టాడని చంపేశారు
ఇండోర్: మొబైల్ ఫోన్లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటున్నందుకు ఓ గిరిజన యువకుడిని కిరాతకంగా చంపేశారు. 15 మంది అగ్రవర్ణాలకు చెందిన వారు అతణ్ని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లా అచ్చోడ అనే గ్రామంలో గత ఆగస్టు 15న జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ధర్ జిల్లా ఎస్పీ, మనావర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్‌కు సమన్లు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా ఇండోర్ బెంచ్ జస్టిస్ ఎస్ ఆర్ వాఘ్మరే ఆదేశించారు. మృతుడి సోదరుడు అబాన్.. జాగృత్ దళిత్ ఆదివాసి సంఘతన్ సాయంతో పిటిషన్‌ను దాఖలు చేశాడు. అగ్రవర్ణాలకు చెందిన యువకులు.. మొబైల్లో మ్యూజిక్ సౌండ్‌ను తగ్గించుకోవాల్సిందిగా తన సోదరుడికి చెప్పారని, వారి మాట విననందుకు గొడవ పెట్టుకున్నారని చెప్పాడు. అనంతరం యువకులు గ్రామ సేవాదళ్‌తో కలసి వచ్చి తన సోదరుడిని చంపేసి, తమ ఇంటికి ఎదురుగా చెట్టుకు వేళాడతీశారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పరాదని గ్రామస్తులు బెదిరించారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని చెప్పాడు.