వాషింగ్టన్: నిరంతరం హెడ్‌ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు
. ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్‌డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్‌బడ్స్‌ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్‌డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు.
Comments
Please login to add a commentAdd a comment