hearing impaired
-
సైగలకు మాటలొచ్చాయి
న్యాయవాది అడ్వా సారా సన్ని భారతదేశపు మొట్టమొదటి వినికిడి లోపం గల రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్‌గా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 4న ఆమెకు సహాయం చేయడానికి సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫైడ్ ఇంటర్ప్రెటర్ సేవలను పొందాలని కోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్ 8న కర్ణాటక హైకోర్ట్ రిజిస్టర్డ్ సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడి లోపం ఉన్న న్యాయవాది నుంచి వాదనలు విన్నది. దీంతో అడ్వకేట్ సారా సన్నీతోపాటు కర్ణాటక హైకోర్ట్ కూడా దివ్యాంగులకు ఒక గొప్ప బాసటగా నిలిచినట్లయింది. ఇది న్యాయ నిపుణులకు మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న పౌరులకు కూడా సమగ్ర న్యాయవ్యవస్థకు మార్గం మరింతగా సుగమం చేస్తుంది. జస్టిస్ ఎం నాగప్రసన్న, అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్‌లతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అడ్వా సన్నీ నమోదును ప్రశంసించింది. ఏఎస్జీ కామత్ మాట్లాడుతూ ‘ఇంటర్ప్రెటర్ ద్వారా హియరింగ్, స్పీచ్ ఇంపెయిర్డ్ అడ్వకేట్ వాదనను విన్న మొదటి హైకోర్టుగా కర్ణాటక హైకోర్టు చరిత్రలో నిలిచిపోతుంది. సారా సన్నీ సంకేత భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడిలోపం, ప్రసంగం బలహీనంగా ఉండటం వల్ల కలిగే వైకల్యాన్ని ఓడించింది. అందుకు సారా సన్నీని అభినందించాల్సిందే. సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వాదప్రతివాదనలు జరిగినప్పటికీ ప్రశంసలు రికార్డులలో నమోదు అవుతాయి’ అని తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ‘భారత న్యాయవ్యవస్థలో వివిధ నేపథ్యాల నుండి ఎక్కువ మంది మహిళలు చేరాల’ని పదే పదే ప్రస్తావించారు. ప్రోత్సహించడానికి... అడ్వా సారా సన్నీ కేరళలోని కొట్టాయం వాసి. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. కేవలం స్వీయ ఆసక్తితో మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న ఇతరులను కూడా ప్రోత్సహించడానికి న్యాయవాద వృత్తిని ఎంచుకుంది. అడ్వకేట్ సన్నీ ఇప్పుడు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సెప్టెంబరు 2023లో న్యాయవాది సన్నీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కేసు వాదించిన, వినికిడి లోపం ఉన్న మొట్ట మొదటి లాయర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంలో సన్నీ ‘డీవై చంద్రచూడ్ ఓపెన్ మైండ్ ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం తలుపులు తెరిచింది’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సన్నీ కోర్టు సబిమిషన్స్‌లో సహాయం చేయడానికి సంకేత భాషా ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు గతంలో తన రిజిస్ట్రీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అది అమలు అయ్యింది. వైకల్యాలున్నవారు తమ అడ్డంకులను అధిగమించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయ్యింది. -
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’
ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్ కలెక్టర్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. (చదవండి: పేగుబంధం 'అన్వేషణ') వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్షిప్లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. -
మాటలొద్దు.. సైగలే
‘నాతో ఏదైనా చెప్పాలంటే మాట్లాడకండి.. సైగ చేయండి’ అంటున్నారు కథానాయిక శ్రియ. అలా సైగ చేస్తే విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటానని చెబుతున్నారట. కానీ, ఇదంతా వెండితెరపై మాత్రమే. నిజ జీవితంలో కాదు. తన తాజా చిత్రంలో శ్రియ వినికిడి లోపం ఉన్న పాత్రను చేయనున్నారని సమాచారం. ఈ సినిమాతో సృజన అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో బోలెడంత ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని టాక్. కథ ముఖ్యంగా శ్రియ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలిసింది. శ్రియ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పైనే అయింది. ఇన్నేళ్ల జర్నీలో చేయనటువంటి చాలెంజింగ్ రోల్ ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలు ఉంటాయట. ప్రతి పాత్రకూ ఓ సొంత కథ ఉంటుందని సమాచారం. -
‘కేఫ్ కాఫీ డే’లో మరో కొత్త కోణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కాఫీ సంస్కృతిలో కొత్త విప్లవానికి వాకిటి తెరచిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట. ఇలాంటి వాళ్లను కార్పొరేట్ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణన్ తెలిపారు. ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క ‘కేఫ్ కాఫీ డే’లకే పరిమితం కాలేదు. కేఎఫ్సీలోని ‘కాఫీ కోస్టా’ అవుట్లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ ‘కాఫీ కోస్టా’ అవుట్ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్లెట్ మేనేజర్ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు. స్టార్‌బక్ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్ అమెరికా రాజధాని వాషింగ్టన్లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే. -
శస్త్రచికిత్సతో వినికిడి లోపం మాయం
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ‘హైరెన్ ఆల్ట్రా కాక్లియర్ ఇంప్లాంటేషన్’వినికిడి శక్తిని ప్రసాదించింది. దేశంలోనే ఈ తరహా ఇంప్లాంటేషన్ ఇదే తొలిదని ప్రముఖ కాక్లి్లయర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ ఈసీ వినయ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన చికిత్స వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన నర్సింగరావు, నిత్య కుమారుడు యశ్వంత్(6) పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అపోలో ఆస్పత్రి డాక్టర్ వినయ్‌కుమార్‌ను సంప్రదించారు. ఆయన కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి శక్తితో పాటు మాటలను తెప్పించవచ్చని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా దీన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో యశ్వంత్‌కు విజయవంతంగా అమర్చారు. ఈ సర్జరీ సులువుగా, సురక్షితంగా నిర్వహించామని డాక్టర్ వినయ్ చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి చిన్న సాధనాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల పిల్లలకు సరిగ్గా అతుకుతుందన్నారు. ఈ పరికరాన్ని ఎముక, చర్మానికి మధ్యలో పెడతారని తెలిపారు. ఉత్తమ వినికిడికి వీలుగా విస్తృత స్థాయిలో శబ్దాలను గ్రహిస్తుందని చెప్పారు. -
పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెన్షన్
ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. అక్కడున్న మూగ, చెవిటి పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటున్నందుకు ఆమెను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అకోలాలో జరిగింది. శీతల్ అవచార్ అనే ఈ ఉపాధ్యాయిని మూగ, చెవిటి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈమె కాళ్లు నొక్కించుకోవడమే కాదు.. పాఠశాల నడిచే సమయంలో నిద్రపోవడం, విద్యార్థులను వేధించడం లాంటి పనులు కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీన్నంతటినీ ఓ విద్యార్థి వీడియో తీసి, వాటిని స్కూలు అధికారులకు పంపడంతో మొత్తం వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే జడ్పీ సీఈవో అరుణ్ ఉన్హాలే ఆమెపై విచారణ జరిపించగా, ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. దాంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మానవహక్కుల సంఘాల వారు డిమాండ్ చేశారు. టీచర్‌పై ఫిర్యాదు చేసినందుకు తమను కొట్టారని విద్యార్థులు విలేకరులకు చెప్పారు.