south carolina
-
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీదనుంచి, వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్ , మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. మితిమీరిన వేగంతో గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి లేచి, అనంతరంఅదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. కారు ముక్కలైన తీరు చెట్టుపై కారు ఇరుక్కున్న వైనం వేగానికి అద్దం పడుతోందని తెలిపారు. కారులోని క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు, దితర అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
South Carolina Primary: హాలేపై ట్రంప్ ఘన విజయం
కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ట్రంప్‌నకు 63 శాతం ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. హాలేకు ఇది అవమానకరమైన ఓటమిగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. హాలేకు సౌత్ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం చాలా ఐక్యంగా ఉందని సౌత్ కరోలినా ప్రైమరీ పోలింగ్ ముగిసిన తర్వాత సౌత్ కరోలినా రాజధాని కొలంబియాలో ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌత్ కరోలినాలో ఓటమి తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి నిక్కీ హాలే తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే తాను రేస్ నుంచి తప్పుకోనని హాలే ప్రకటించారు. మార్చి5 మంగళవారం(సూపర్ ట్యూస్డే)నాడు జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, ట్రంప్ ఇప్పటివరకు 5 ప్రైమరీల్లో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరూ అందుకోలేనంత ముందంజలోకి వెళ్లారు. ప్రైమరీలు ముగిసిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమొక్రాట్ల ప్రైమరీల్లో ప్రస్తుత దేశ అధ్యక్షకుడు జో బైడెన్ రేసులో ముందున్నారు. ఇదీ చదవండి.. న్యూయార్క్ అపార్ట్మెంట్లో మంటలు.. భారత యువకుడి మృతి -
వంద కోట్ల యువతకు శబ్దపోటు
వాషింగ్టన్: నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకునే సంగీతం వింటున్నారా ? ప్రతి ఫోన్‌కాల్, ఆడియో, వీ డియో శబ్దాలు నేరుగా కాకుండా కేవలం ఇయర్ బడ్స్ ద్వారానే వింటున్నారా ? చెవులు చిల్లులు పడే శబ్దమయ సంగీత విభావరిలకు హాజరవుతున్నారా ? అయితే వినికిడి సమస్య మిమ్మల్ని వెంటాడటం ఖాయమని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్యాడ్జెట్లకు అతుక్కుపోతున్న దాదాపు 100 కోట్ల మంది టీనేజీ వయసువారికి చెముడు సమస్య పొంచి ఉందని బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురి తమైన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ దేశాలు తమ టీనేజర్ల కోసం అత్యవసరంగా శబ్ద సంబంధ చట్టాలకు పదునుపెట్టాలని అమెరికా లోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయం పరిశో ధకులతో కూడిన అంతర్జాతీయ అధ్యయన బృందం సూచనలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి సమస్యతో బాధపడుతు న్నారని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయ ని పరిశోధకులు గుర్తుచేశారు . ‘‘సొంత శబ్ద సాధనాలు(పర్సనల్ లిజనింగ్ డివైజెస్–పీఎల్డీ) స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, ఇయర్బడ్స్ల అతివాడకమే సమస్యకు కారణం. వాస్తవానికి వయోజనులు 80 డెసిబెల్స్, చిన్నారులు 75 డెసిబెల్స్ స్థాయిలోనే శబ్దాలు వినాలి. కానీ, పీఎల్డీ వినియోగదారులు అత్యధికంగా 105 డెసిబెల్స్ వాల్యూమ్స్‌లో శబ్దాలు వింటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఇది 112 డెసిబెల్స్‌కు చేరుతోంది. 2022 ఏడాదిలో 12–34 ఏళ్ల వయసువారిలో ఏకంగా 280 కోట్ల మంది వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది’’ అని అంచనావేశారు. -
‘డబుల్’ జాక్‌పాట్..
ఎవరికైనా భారీ లాటరీ తగలడమంటే మామూలు విషయం కాదు.. వేల మంది లేదా కొన్ని రకాల లాటరీల్లోనైతే లక్షల మంది టికెట్లు కొంటే వారిలో ఏ కొందరినో అదృష్టం వరిస్తుంటుంది. అలాంటిది ఒకరికే రెండోసారి కూడా లాటరీ తగిలితే..! అది కూడా మొదటిసారి కొన్న షాపులో మళ్లీ టికెట్ కొన్న వ్యక్తినే జాక్‌పాట్ వరిస్తే...! అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఓ మహిళకు ఇలాగే అదృష్టం కలిసొచ్చింది. 2020లో ఆ మహిళ 20 రెట్లు ప్రైజ్‌మనీ అందించే ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. కొందరు బంధువులతో కలసి వెళ్లి ఓ కన్వీనియన్స్ స్టోర్ ప్రతినిధుల నుంచి ఆ టికెట్ కొన్నది. చివరకు లక్కీడ్రా తీయగా ఆమెకు రూ. 1.9 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఎగిరి గంతేసిన ఆమె ఆ సొమ్ముతో తనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంది. ఈ ఏడాది అదే లాటరీ సంస్థ మళ్లీ టికెట్లు అమ్మడంతో ఆవిడ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. గతంలో తన వెంట వచ్చిన బంధువులను మళ్లీ అదే స్టోర్‌కు వెంటబెట్టుకెళ్లింది. అలాగే తొలిసారి టికెట్ అమ్మిన ప్రతినిధుల చేతుల మీదుగానే మళ్లీ టికెట్ అందుకుంది. ఆశ్చర్యకరంగా ఆమెకు మళ్లీ జాక్‌పాట్ తగిలింది. ఈసారి లాటరీలో ఆమె రూ. కోటిన్నర గెలుచుకుంది. ఈ సొమ్ముతో మంచి ఇల్లు కొనుక్కుంటానంటూ ఎంతో మురిపెంగా చెప్పింది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
అమెరికా: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం
గ్రీన్విల్లే: అమెరికా దక్షిణ కరోలినాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులను గ్రీన్విల్లేకు చెందిన మైకాల బెల్ (23), డంకన్‌కు చెందిన క్లారెన్స్ జాన్సన్ (51)గా గుర్తించారు. జాన్సన్ నైట్ క్లబ్లో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవారని అధికారులు వెల్లడించారు. అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నైట్ క్లబ్లో నిర్వహించిన వేడుకలకు దాదాపు 200 మంది హాజరయ్యారు. తుపాకీ కాల్పు చోటు చేసుకోవడంతో అప్పటి వరకు ఆనందంగా వేడుకలకు సిద్ధం అవుతున్న నైట్ క్లబ్లో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. అయితే వారి ఆచూకీ సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదు. గాయపడిన వారు గ్రీన్విల్లే మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ముఠా సంబంధిత గొడవల కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత) -
పెరటిలో మొసలి..ఫర్నీచర్ ధ్వంసం
-
వైరల్: ఇది చాలా భయంకరంగా ఉంది
కొలంబియా : లాక్డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఏ వార్త, వీడియో కనిపించినా నిమిషాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని దక్షిణ కారోలినాకు చెందిన ఫెర్నాండో లోసాడా అనే కుటుంబం.. ఓ మొసలికి చెందిన వైరల్ వీడియోను సోమవారం ఫేస్బుక్లో షేర్ చేశారు. లోసాడా కుటుంబం ఇంటి వెనక భాగంలో ఓ పెరడు ఉంది. అలాగే వారికి కొంత దూరంలోనే లాగున్(మడుగు) ఉండటంతో తరచుగా ఆ మడుగు నుంచి అనేక మొసళ్లు తమ పెరటిలో తిరుగుతూ దర్శనమిస్తుంటాయి. ఇటీవల బిగ్ జార్జ్ అని స్థానికంగా పిలువబడే ఓ మొసలి వారి పెరటిలోకి ప్రవేశించిది. అయితే కోపంలో ఉన్న ఆ మొసలి పెరటిలోని కొన్ని వస్తువులను ద్వంసం చేసింది. (చిరంజీవి ఉప్మా పెసరట్టు... ) దీనిపై ఇంటి యాజమాని మాట్లాడుతూ.. ప్రతి రోజు మొసళ్లు తమ లాగున్లోకి వస్తుంటాయని తెలిపారు. కానీ ఈ మొసలిలాగా మిగతావి తమ పెరటిలోని వస్తువులను చెల్లాచెదురు చేయలేదన్నారు. ఇది చాలా కోపంగా కనిపించిందని, పెరటిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిందన్నారు. అయితే మనుషులెవరికి హానీ చేయలేదని, దాంతో తాము జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలిపారు. ఇక చివరికి శాంతించిన మొసలిని నాలుగురు సెక్యూరిటి గార్డులు తిరిగి లాగున్లో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. కాగా మొసలి వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘మొసలి చాలా పెద్దగా ఉంది. ఇది భయానకంగా ఉంది.’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూన్నారు. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ ) -
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్‌లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్‌కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్‌లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
దారుణం : తాగే నీటిలో చుక్కల మందు కలిపి..
వాషింగ్టన్ : కంట్లో వేసే చుక్కల మందు తన భర్త ప్రాణం తీస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. రెండు సంవత్సరాల కింద చేసిన పని ఆమెను కటాకటాల వెనక్కి నెట్టేలా చేసింది. తన భర్తకు విషం ఇచ్చినట్లు అటాప్సీ రిపోర్టులో తేలడంతో కోర్టు ఆమెకు 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. దక్షిణ కరోలినా ప్రాంతానికి చెందిన స్టీవెన్ క్లేటన్ (64), లానా స్యూ క్లేటన్ (53) భార్యభర్తలు. లానా నర్స్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త స్టీఫెన్ వాలంటరీ రిటైర్మంట్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాడు. వీరిద్దరు కలిసి షార్లెట్ సమీపంలోని క్లోవర్‌లో నివసిస్తున్నారు. కాగా 2018 జూలైలో ఆమె తన భర్త స్టీవెన్‌కు తాగేనీటిలో చుక్కల మందును కలిపి ఇచ్చినట్లు తెలిసింది. మొదట్లో ఆమె భర్త సాధారణంగానే చనిపోయాడని అందరూ భావించారు. అయితే అటాప్సీ టాక్సికల్ రిపోర్ట్‌లో విషపదార్థం కలవడంతోనే స్టీవెన్ మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.స్టీవెన్ తాగిన నీటిలో టెట్రాహైడ్రోజోలిన్ ఎక్కువ మోతాదులో ఉండడంతో అతను మృతి చెందినట్లు రిపోర్టులో తేలింది. దీంతో 2018 ఆగస్టులో పోలీసులు లానా క్లేటన్పై కేసు నమోదు చేశారు. 2016లోనూ లానా క్లేటన్ ఇదే విధంగా స్టీఫెన్‌ను గొడ్డలితో తల వెనుక భాగంలో కొట్టి చంపడానికి ప్రయత్నించడంతో పాటు దానిని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు స్టీఫెన్ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే సాక్షాలన్నీ లానాకు వ్యతిరేకంగా ఉండడంతో.. తన భర్తను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు కోర్టు నిర్ధారించి ఆమెకు 25 సంవత్సరాలు శిక్షను ఖరారు చేసింది. 'నేను నా భర్తను చంపడానికి ప్రయత్నించలేదు. కేవలం అతన్ని మత్తులోకి తీసుకెళ్లాలనే తాగేనీటిలో కంటి మందును కలిపి ఇచ్చాను. కానీ ఆ మందు అతని ప్రాణం తీస్తుందని నేను ఊహించలేదంటూ' లానా కన్నీటీ పర్యంతమైంది'. ' నా సోదరుడిని లానా స్యూ క్లేటన్ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. ఇంత దారుణంగా స్టీఫెన్‌ను చంపుతుందని నేను ఊహించలేదు. ఎంతో తెలివిగా తాగేనీటిలో కంటి చుక్కల మందును కలిపి చంపిందని' స్టీఫెన్ సోదరి రోస్‌మేరీ క్లేటన్ ఆవేదన వ్యక్తం చేసింది. -
మరణ శిక్ష కోసం మళ్లీ హత్యలు
కొలంబియా: తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది వారి పరిస్థితి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల డెన్వర్ సైమన్స్, 28 ఏళ్ల జాకోబ్ ఫిలిప్ప్‌లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసులకు సంబంధించి 2015లో ఈ ఇద్దరు నేరస్థులకు రెండేసి జీవితఖైదులు పడ్డాయి. జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూట్’కు పంపించారు. కనీసం పెరోల్ కూడా లభించని జైలు జీవితం పట్ల వారికి విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు. పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్ (44), జిమ్మీ హామ్ (56), జాసన్ కెల్లీ (35), జాన్ కింగ్ (52) అనే నలుగురు తోటి ఖైదీలను హత్య చేశారు. ఆ కేసును విచారించిన రిచ్మండ్ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగి పోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించండని బాధితుల కుటుంబీకులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. మరణ శిక్షల కోసమే హత్యలు చేసినట్లు డెన్వర్ సైమన్స్, జాకోబ్ ఫిలిప్ప్‌లు చెప్పిన కారణంగా బాధితుల బంధువులు వారికి మరణ శిక్ష వద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
‘ఇప్పుడు మీరు లాటరీ టికెట్ కొనొచ్చు’
వర్షం వస్తే చాలు ఆకాశంలో మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడటం సహజమే. అయితే ఆ సమయంలో చెట్ల కింద కాని ఎత్తైన వాటి కింద ఉండొద్దని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే పిడుగులు, మెరుపులు పడే ప్రమాదం ఎక్కవ కాబట్టి. కానీ వాటిని పెడచెవిన పెట్టి ఎమౌతుందిలే అని అనుకునే వాళ్లు ఈ దృశ్యాన్ని తప్పక చూడాల్సిందే. వర్షంలో బయటకు వెళ్లిన ఓ వ్యక్తిపై ఒక్కసారిగా ‘మెరుపు దాడి’ చేయడంతో షాక్ గురయ్యాడు. ఈ భయానకమైన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... దక్షిణ కరోలీనాకు చెందిన రోములస్ మెక్నీల్ గొడుగుతో వర్షంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా తనపైకి మెరుపు రావడంతో ఉలిక్కిపడిన సంఘటన అక్కడి కెమరాలలో రికార్డు అయ్యింది. ‘నేను ఓ భయానక సంఘటనను ఎదుర్కొన్నాను కానీ ఈ ఘటనలో నాకు పెద్దగా గాయాలేమి కాలేదంటూ’ మెక్నీల్ తన ఫేస్బుక్లో ‘మెరుపుదాడి’కి సంబంధించిన వీడియో, ఫోటోలు షేర్ చేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లంతా షాక్‌కి గురై.. కామెంట్స్ రూపంలో మెక్‌నీల్‌పై సానుభూతి తెలుపుతున్నారు. ‘హమ్మయ్య మీకు ఏమి జరగలేదు సంతోషం’, ‘మీరు చాలా అదృష్టవంతులు రోమ్ పెద్దగా గాయపడలేదు.. కానీ ఇలాంటి సమయంలో అందరు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే మరికొందరు ‘ఇప్పుడు నువ్వు లాటరీ టిక్కెట్ కొనుక్కోవాలి’ అంటూ సరదా కామేంట్స్ పెడుతున్నారు. -
10 వేల కోట్ల లాటరీ విజేత ఏమయ్యాడు?
సింప్సన్‌విల్లే: అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలోని సింప్సన్‌విల్లే అనే పట్టణంలో ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10,000 కోట్లు) లాటరీ గెలిచిన వ్యక్తి ఆ సొమ్మును ఇప్పటివరకు తీసుకోకపోవడం, అతను/ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీకపోవడం మిస్టరీగా మారింది. అమెరికా చరిత్రలోనే లాటరీలో గెలిచిన రెండో అతిపెద్ద మొత్తం ఇదే. సింప్సన్విల్లేలోని కేసీ మార్ట్‌లో గతేడాది అక్టోబర్ 20 నుంచి 23 మధ్య ఎవరో ఒకరు ఈ లాటరీ కొన్నట్లు తెలుస్తోంది. అయితే గెలిచిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదో, ఆ డబ్బును ఎందుకు తీసుకోలేదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై స్థానికులు ఎవరికి తోచిన కారణాలు వారు చెప్పుకుంటున్నారు. కొందరేమో అంత డబ్బు గెలిచిన వ్యక్తి ఆ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె ఆగి చనిపోయి ఉంటారని అంటున్నారు. మరికొందరు ఆ లాటరీ టికెట్ ఎక్కడో గాలికి కొట్టుకుపోయి ఉంటుందనీ, అందుకే ఆ వ్యక్తి ఇప్పటివరకు డబ్బు తీసుకునేందుకు రాలేదని అంటున్నారు. ఇంకొందరేమో అతను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటాడనీ, లాటరీ సొమ్ము ఇచ్చే ముందు అతని నేపథ్యాన్ని పరిశీలిస్తే ఏమైనా నేరాలు బయటపడే అవకాశం ఉండటంతో ఇలా చేస్తుండొచ్చని అంటున్నారు. మరికొందరు అంత డబ్బు తీసుకునే ముందు ఇంకొన్ని రోజులు సాధారణ జీవితం గడపాలని అనుకుంటూ ఉండొచ్చని చెబుతున్నారు. ఏదేమైనా లాటరీ గెలిచిన వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 19లోపు ఆ డబ్బును తీసుకోకపోతే అది ఇంకెప్పటికీ ఆ వ్యక్తికి దక్కదు. ఆ లాటరీ టికెట్‌ను రద్దు చేస్తారు. -
వామ్మో.. పదకొండు వేల కోట్ల లాటరీ ఒక్కరికే!!
వాషింగ్టన్: లాటరీలో అదృష్టం వరించిన వారి గురించి వార్తలు నిత్యం చూస్తుంటాం. కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ లాటరీ అమెరికాలో ఎవరినో వరించింది. విచిత్రం ఏమిటంటే ఈ లాటరీ ఎవరికి తగిలిందో ఇప్పటివరకు తెలియదు. ఎప్పటికీ తెలియకపోవచ్చు. దక్షిణ కరోలినాకు చెందిన వారికి 1.6 బిలియన్ డాలర్ల (సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు) జాక్‌పాట్ తగిలిందని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన మెగా బాల్ డ్రాలో దక్షిణ కరోలినాలో కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ దక్కిందని మెగా మిలియన్ నిర్వాహకులు తెలిపారు. టికెట్‌లోని ఆరు నంబర్లు.. డ్రా తీసిన అంకెలతో సరిగ్గా సరిపోయాయని ప్రకటించారు. అయితే లక్ష కోట్ల రూపాయలు గెల్చుకున్నదెవరో ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు! సింగిల్ టికెట్.. జాక్‌పాట్ ఒక్క లాటరీ టిక్కెట్‌కు 1.6 బిలియన్ డాలర్ల లాటరీ దక్కడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రాలో 5, 28, 62, 65, 70, 5 నంబర్లకు బిలియన్ మెగా మిలియన్స్ జాక్‌పాట్ తగిలింది. ప్రపంచంలో ఒక టిక్కెట్‌కు ఇంత మొత్తం ఏ లాటరీలోనూ లేదు. అయితే బుధవారం ఉదయం జాక్‌పాట్ మొత్తాన్ని 1.54 బిలియన్ డాలర్లుగా సవరించారు. దీంతో అమెరికా లాటరీలో రెండో అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచింది. 2016లో ముగ్గురు 1.56 బిలియన్ డాలర్ల మొత్తాన్ని గెల్చుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన డ్రాలో ఒక్కరే 1.54 బిలియన్ డాలర్లు గెల్చుకోవడం విశేషం. లాటరీ టిక్కెట్ల కోసం క్యూ కట్టిన ఆశావహులు ఎనిమిది రాష్ట్రాలకు జాక్‌పాట్ దక్షిణ కరోలినాతో పాటు డెలావర్, జార్జియా, కాన్సాస్, మేరీల్యాండ్, ఉత్తర డకోటా, ఒహియో, టెక్సాస్ రాష్ట్రాల్లోని వారికి కూడా లాటరీ తగిలింది. వాషింగ్టన్ డీసీ, వర్జిన్ ఐలాండ్‌తో పాటు 44 రాష్ట్రాల్లో ఈ లాటరీ నిర్వహిస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌కు రెండు డాలర్లు వెచ్చించి ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే విజేతలు ఎవరనేది అత్యంత గోప్యంగా ఉంచుతారు. బిలియన్ మెగా మిలియన్స్ మొత్తాన్ని 29 ఏళ్లలో ఏడాదికి కొంత చొప్పున చెల్లించే అవకాశం కూడా ఉంది. అయితే ఎక్కువ మంది ఒకేసారి డబ్బు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. చెప్పలేనంత ఉద్వేగం.. ‘మేం ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. అమెరికా లాటరీ చరిత్రలో ఇది నిజంగా చారిత్రక సందర్భం. చెప్పలేనంత ఉద్వేగం ఉంది. ఒక్కరే బిలియన్ డాలర్ల లాటరీ సొంతం చేసుకోవడం చాలా సంతోషం. విజేతను కలుసుకునేందుకు సౌత్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ నిర్వాహకులు ఆత్రుతగా ఎదురు చేస్తున్నార’ని మెగా మిలియన్స్ గ్రూపు ప్రధాన డైరెక్టర్ గొర్డన్ మెడినికా పేర్కొన్నారు. మల్టీ-స్టేట్ లాటరీ అసోసియేషన్, ఇతర సంఘాల సమన్వయంతో మెగా మిలియన్స్ గ్రూపు ఈ భారీ లాటరీ నిర్వహిస్తోంది. -
అమెరికాలో మాజీ సైనికుడి కాల్పులు.. పోలీసు మృతి
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
తలుపు తెరవగానే అనుకోని అతిథి
-
తలుపు తెరవగానే అనుకోని అతిథి
పొద్దున్నే నిద్ర లేవగానే తలుపు చప్పుడైతే ఇంత పొద్దున్నే వచ్చి డిస్ట్రబ్ చేసేది ఎవరని విసుక్కుంటాం. కానీ అమెరికాలోని సౌత్ కరొలినా ప్రాంతంలోని మౌంట్ ప్లెజెంట్లో ఉండే కుటుంబానికి మాత్రం అలా విసుక్కునే అవకాశం కూడా రాలేదు. పొద్దున్నే ఇంటి తలుపు బయట వాళ్లకు ఏదో శబ్దం వినిపించింది. ఎవరైనా దొంగలు తలుపు పగలగొట్టుకుని లోపలకు వద్దామని అనుకుంటున్నారా అన్న అనుమానం వచ్చింది. కానీ జాగ్రత్తగా తలుపు తీసి చూస్తే.. అక్కడో పెద్ద మొసలి నోరు తెరుచుకుని కనిపించింది. తన కూతురు మేడ మీద ఉంటుందని, ఆమె కిందకు దిగి ఉంటుందని తాము అనుకున్నామని.. తన కూతురేమో తన భార్య బయటకు వచ్చి ఉంటుందని అనుకుందని, కానీ చివరకు ఇద్దరూ కాకుండా తొమ్మిది అడుగుల పొడవున్న మొసలి కనిపించేసరికి గుండె ఝల్లుమందని ఇంటి యజమాని స్టీవ్ పాల్స్టన్ చెప్పారు. 15 అడుగుల ఎత్తున్న మెట్లను కూడా ఎక్కేసి మరీ ఆ మొసలి ఇంటి వరకు వచ్చింది. దారిలో ఒక అద్దాన్ని కూడా పగలగొట్టింది. రెండో అంతస్తులో ఉన్న ఇంటికి వచ్చి.. అక్కడ తలుపు దగ్గర ఒకటే గొడవ చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి దాన్ని తరిమేయడానికి ఎంత ప్రయత్నించినా అది మాత్రం కదలకపోగా.. మరింత కోపంగా కనిపించింది. నోరు బార్లా తెరిచి కనిపించినవాళ్లను తినేస్తానన్నట్లు చూసింది. దాంతో దిక్కుతోచని ఆ కుటుంబ సభ్యులు వన్యప్రాణి నిపుణులను పిలిపించారు. ఆ మొసలికి సుమారు 60 ఏళ్ల వయసుంటుందని వచ్చిన నిపుణులు చెప్పారు. ఎన్ని గంటలు ప్రయత్నించినా అది ఎవరికీ లొంగలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వన్యప్రాణి నిపుణులు దాన్ని చంపేశారు. -
కుక్కను కట్టేసినట్టు యువతిని కట్టి..
కరోలినా: గత అగస్టు నుంచి కనిపించకుండా పోయిన కాలా బ్రౌన్(30) అనే యువతి అత్యంత ధీన స్థితిలో పోలీసులకు కనిపించింది. ఓ కుక్కను కట్టేసినట్టు యువతిని చైన్‌తో, తాళం వేసి ఉన్న షిప్పింగ్ మెటల్ కంటైనర్‌లో కట్టేసి ఉంది. ఈ సంఘటన దక్షిణ కరోలినాలో ఉడ్రఫ్ నగరంలోని ఓ మారు మూల ప్రాంతంలో చోటు చేసుకుంది. కంటైనర్ నుంచి శబ్ధం వస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ వారంట్‌తో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాము ఆ కంటైనర్ తాళం తెరిచేసరికి కాలా బ్రౌన్ మెడ చుట్టూ కుక్కలను కట్టేసే చైన్‌తో కట్టేసి కిందపడి అత్యంత దారుణమైన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. తాము అక్కడికి చేరుకునే వరకు కాలా బ్రౌన్ బతికే ఉండటం నిజంగా అదృష్టమే అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాలా బ్రౌన్పై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేప్ కేసులో పాత నేరస్తుడు టాడ్ కోహ్లీప్(45)కు సంబంధించిన ప్రాంగణంలో ఈ ఘటన వెలుగు చూసింది. టాడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత రెండు నెలలుగా అదే కంటైనర్‌లో ఉంటున్నట్టు కాలా బ్రౌన్ పోలీసులకు తెలిపింది. అదే ప్రాంతంలో నలుగురి మృతదేహాలు లభించే అవకాశం ఉందని కాలా బ్రౌన్ తమతో చెప్పిందని పోలీసులు తెలిపారు. బ్రౌన్ బోయ్ ఫ్రెండ్ చార్లెస్ కార్వర్(32) కూడా రెండు నెలల నుంచి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అతను క్షేమంగానే ఉండాలని భావిస్తున్నామని పోలీసులు ఉన్నతాధికారి అన్నారు. కాలా బ్రౌన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బ్రౌన్‌ని విచారించి మరింత సమాచారం తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. టాడ్ కోహ్లీప్ సీరియల్ కిల్లరా అనే కోణంలో కూడా విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. -
'నా కోడలు ఆ పని చేయదు'
న్యూయార్క్: నాలుగు రోజుల పసికందును రిఫ్రిజిరేటర్లో పెట్టి ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన దక్షిణ కరోలినాలో చోటుచేసుకుంది. ఎంజెలా బ్లాక్ వెల్ (27) అనే మహిళ తన నాలుగు రోజుల పసికందు విలియం డేవిడ్ బ్లాక్ వెల్ ను మూడు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అతడు హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు విడిచిపెట్టాడని పోలీసులు చెప్పారు. వాస్తవానికి ఈ ఘటన ఆరు నెలల కిందేట జరిగినా కేసు నిర్థారించేందుకు ఇన్ని రోజులు పట్టింది. ఆధారాల కోసం, విచారణ కోసం తాము ఇంత సమయం తీసుకున్నామని, ఆమెనే ఈ హత్య చేసిందని నిర్ధారణకు వచ్చాకే ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చామని చెప్పారు. కోర్టు ఆమెను ప్రశ్నిస్తున్న సమయంలో ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి తల మాత్రమే ఊపుతూ నిశ్శబ్దంగా కోర్టు హాలును వదిలి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనపై ఆ బాలుడి తాత ఇంటివద్ద స్పందిస్తూ ఎంజెలా తల్లి అయిన సందర్భంలో ఎంత సంతోషంగా ఉందో తనకు తెలుసు అని, తన కోడలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనిచేసి ఉండదని, అయితే, అసలు ఎవరు, ఎందుకు ఈ పనిచేశారో మాత్రం తనకు అర్థం కావడం లేదని చెప్పారు. కాగా, నవంబర్ 10న మరోసారి కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
పోలీసుల దిమ్మ తిరిగింది..
దక్షిణ కరోలినా : మూడు రోజుల పాటు సోదాలు, ట్రాక్టర్ల కొద్దీ మారణాయుధాలు.. వేల సంఖ్యలో తుపాకీలు... ఇవీ ఓ నేరస్థుడి ఇంట్లో దొరికిన సరకు సరంజామా. అమెరికా పేజ్ల్యాండ్ సిటీకి చెందిన బ్రెంట్ నికోల్సన్ (51) కథ కమామిషు ఇది. మత్తుమందులు హెరాయిన్, ఒపియం అమ్ముతున్నట్టుగా అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న బ్రెంట్ నికోల్సన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. దీని ఆధారంగా అతడి ఇంటిని సోదా చేయడానికి వెళ్లిన పోలీసులు దిమ్మ తిరిగింది. బాణాలు, మందుగుండు సామాగ్రి, ఎయిర్ కంప్రెషర్స్ ఇలా ఒకటా రెండు వేలకొద్దీ మారణాయుధాలు. వీటన్నింటినీ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా పదివేల తుపాకులు దొరికాయి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యారేజ్ నుంచి తీస్తున్న కొద్దీ ట్రాక్టర్లు నిండిపోయాయి. అయినా ఓ దశలో లెక్క చిక్కలేదు. అవి కూడా సరదాగా సేకరించినవో.. కొన్నవో కాదు సుమా. బ్రెంట్ నికోల్సన్ దొంగతనంగా ఎత్తుకొచ్చిన ఆయుధాలు. అక్కడా ఇక్కడ కొట్టేసినవన్నీ ఇంట్లో దాచుకున్నాడతను. ఆ ఇంట్లో సోదాలకు వెళ్లిన తాము తుపాకులు లెక్కపెట్టలేక సొమ్మసిల్లిపోయామని..తమ సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని పోలీసు అధికారి తెలిపారు. అయితే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో వారు అన్వేషణ మొదలుపెట్టారు. పోలీసులు సుమారు మూడు రోజులు పాటు ఈ దాడులు కొనసాగించారు. దాడుల్లో ఆయుధాలతో పాటు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన సొత్తు విలువ ఏడు కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 150 రంపాలు, 300 మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమెరికా మెథడిస్ట్ చర్చిలో కాల్పులు
-
అగ్రరాజ్యంపై ‘నల్ల’ నెత్తుటి మరక
తరతరాలుగా జాత్యహంకార వారసత్వం ఉన్న దక్షిణ కరోలినా నేడు తొమ్మిది మంది నల్ల జాతీయులను పొట్టన పెట్టుకొంది. ఇలాంటి దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అన్ని రంగాలలోనూ అమలవుతున్న వివక్ష వల్ల మానవాభివృద్ధిలో నల్ల జాతీయులు పూర్తిగా వెనుకబడి పోయారు. ఈ వివక్షకు, అణచివేతకు ముగింపు ఎప్పుడో తెలియదు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తూ, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా ఈ మారణకాండ గురించిగానీ, వివక్ష గురించిగానీ నోరు విప్పడం లేదు. ‘‘నీవు, నీ నల్లజాతి పుట్టగతులు లేకుండా పోతారు. త్వరలోనే మా శ్వేత జాతి ఉగ్రరూపంతో లేచి మీ భార్యాపిల్లలతో సహా మీ నీచ జాతినంతటినీ ఖండఖండాలుగా నరికివేస్తాం. ఒక్కరూ మిగలకుండా మీ జాతిని నిర్మూ లిస్తాం’’ అంటూ జూన్, 3, 2007న అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బవియా ప్రాంతానికి చెందిన ఒక ఆఫ్రికన్ అమెరికన్ జర్నలిస్టును ఒకరు ఫోన్లో బెదిరించారు. మార్చి, 1, 2008న న్యూజెర్సీ రాష్ర్టంలోని ఒక ఆఫ్రికన్ అమెరికన్ జాతి మేయర్ కు ఇలాంటి ఫోన్ కాలే వచ్చింది. ‘నువ్వో నీగ్రోవి. ఏ ఒక్క తెల్లజాతి మనిషిపైనా నీ పాలన సాగదు’’ అంటూ నానా తిట్లూ తిట్టారు. శ్వేత జాత్యహంకారులలో నల్ల జాతీయులపై నరనరానా జీర్ణించు కుపోయిన వ్యతిరేకతకు, వివక్షకూ ఇవి మచ్చుతునకలు మాత్రమే. 2008 నవంబర్‌లో దేశాధ్యక్షునిగా ఆఫ్రికన్ అమెరికన్ జాతీయుడైన బరాక్ ఒబామా గెలుపు ఖాయమైన ఆ రాత్రి... శ్వేత జాతీయుల అహం దెబ్బతిన్న వేళ... తరతరాలుగా బానిసలుగా పడివున్న ఓ తెగ మమ్మల్ని పరిపాలించడమా? అంటూ శ్వేత జాత్యహంకారులు ఆగ్రహంతో దహించుకుపోతుండగా... ఒక ఆఫ్రికన్ అమెరికన్ యువకుడు స్నేహితుడి ఇంట్లో టీవీ చూసి ఇంటికి వెళుతుండగా ముగ్గురు శ్వేతజాతి యువకులు ఇనుప రాడ్లతో కాళ్ళు, చేతులు విరగ్గొట్టి వెళ్ళిపోయారు. కార్లోంచి దిగుతూ వారు ‘ఒబామా!’ అంటూ పెద్ద అరుపులతో ఆ ప్రాంతమంతా భయోత్పాతాన్ని సృష్టించారు. అదేవిధంగా నవంబర్ 5, 2008న ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన కొన్ని గంటల వ్యవధి లోనే మాసిడోనియాలోని ‘గాడ్ ఇన్క్రిస్ట్’ చర్చిని తగలబెట్టారు. ఇవన్నీ నియోనాజీ గ్రూపుల ఆధ్వర్యంలో జరిగినట్టు వార్తలొచ్చాయి. ఉన్మాదం కాదు పకడ్బందీ దుర్మార్గం ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నట్టుగానే వారం రోజుల క్రితం దక్షిణ కరోలినా రాష్ట్రం చార్లెస్టన్ పట్టణంలోని మదర్ ఎమాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ఒక శ్వేత జాతి యువకుడు తొమ్మిది మంది ఆఫ్రికన్లను దారుణంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ప్రముఖ రాజకీయ వేత్త క్లెమెంటా పింక్నే అనే సెనేటర్ కూడా ఉన్నారు. ఆయన 1990లోనే 23 సంవత్సరాల వయసులో రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన అద్భుత ప్రతిభాశాలి, విద్యావంతుడు. పైగా ఆయన పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఉత్తర చార్లెస్టన్ పట్టణానికి చెందిన మైఖేల్ స్లాగర్ అనే శ్వేత జాతి పోలీస్ అధికారి అన్యాయంగా ఆఫ్రికన్ యువకుడు వాల్టెర్ స్కాట్‌ను కాల్చిచంపిన ఘటనపై జరిగిన ఉద్యమాలకు ఆయన నేతృత్వం వహించారు. వ్యాసం ఆరంభంలో పేర్కొన్న ఘటనలకు, ఈ నరమేధానికి సంబంధ ముందనేది స్పష్టమే. నల్లజాతివారు, పేదలు, బానిసలు అణిగిమణిగి ఉండా ల్సిందే కానీ అధికారం నెరిపితే సహించేదిలేదని హెచ్చరించడానికే పింక్నే లక్ష్యంగా, మిగతా ఎనిమిది మందిని కూడా హతమార్చినట్టు కనిపిస్తున్నది. డైలాన్ స్మార్ట్ రూఫ్ అనే 21 సంవత్సరాల యువకుడు ఈ దురాగతానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మారణకాండతో అమెరికాలో జాతుల మధ్య యుద్ధం మొదలవుతుందని ఆశిస్తున్నట్టు డైలాన్ అన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి ఇది కేవలం ఉన్మాదంతో చేసిన మారణకాండ కాదు, ఒక దుర్మార్గ లక్ష్యంతో జరిగిన హత్యాకాండ. డైలాన్ గత కార్యక్రమాలే అందుకు సాక్ష్యాలు. ఈ హత్యాకాండ తదుపరి నేర పరిశోధనా సంస్థలకు డైలాన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతడు ‘‘ది లాస్ట్ రొడీషియా’’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుతం జింబాబ్వేగా పిలు స్తున్న ఒకప్పటి రొడీషియాలో శ్వేత జాతీయులకు, నల్లజాతీయులకు మధ్య యుద్ధాలు జరిగాయి. దానికి గుర్తుగా డైలాన్ తన జాకెట్‌పై ఒకప్పటి రొడీ షియా, దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వాల చిహ్నాలను ముద్రించుకు న్నాడు. ఒకప్పటి నాజీ అసోసియేషన్‌తో సంబంధాలున్న ‘కౌన్సిల్ ఆఫ్ కన్సర్వేటివ్ సిటిజన్స్’తో డైలాన్‌కు సంబంధాలున్నట్టు వెల్లడైంది. ‘‘చార్లెస్ టన్ పురాతన పట్టణం. అందుకే దీన్ని ఎన్నుకున్నాను. చాలా మంది ఇంట ర్నెట్లో డాంబికాలు పలుకుతున్నారు. ఎవరో ఒకరు సాహసించాలి. అది నేనే ఎందుకు కాకూడదనుకున్నాను’’ అంటూ అతగాడు ట్వీట్ చేసినట్టు పత్రికలు తెలిపాయి. అంటే ఒక పథకం ప్రకారం తెల్ల, నల్లజాతి ప్రజల మధ్య అంత ర్యుద్ధాన్ని ప్రేరేపించాలనేదే డైలాన్ ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఈ రక్తపిపాస ఈనాటిది కాదు ఆఫ్రికన్ ప్రజల పట్ల శ్వేత జాతి దురహంకారం అమెరికా అంతటా పాల్పడ్డ దారుణాలకు ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు. అసలు దక్షిణ కరోలినా రాష్ట్రానికే ఈ జాత్యహంకార చరిత్ర ఉన్నది. ఇక్కడ నల్లజాతి ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 1860లో అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహం లింకన్‌కు దక్షిణ ప్రాంతం నుంచి సరియైన మద్దతు లభించలేదు. బానిసల వ్యాపా రాన్ని నిషేధిస్తూ లింకన్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించిన దక్షిణ రాష్ట్రాల నాయ కులు ఆయనపై తిరుగుబాటు చేశారు. 1861 ఫిబ్రవరిలో దక్షిణ కరోలినాతో పాటూ, మిస్సిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, టెన్నిసి, ఉత్తర కరోలి నాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. ఇలా తరతరాలుగా జాత్యహంకా రం వారసత్వంగా ఉన్న దక్షిణ కరోలినా నేడు తొమ్మిది మంది నల్ల జాతీ యులను పొట్టన పెట్టుకొని, అలనాటి దాని రక్తపిపాసను గుర్తుకు తెచ్చింది. అమెరికాలో ఇటువంటి దారుణాలు కోకొల్లలు. హత్యలు, అత్యాచా రాలు మాత్రమేగాక, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో కూడా నల్లజాతి వారిని వివక్షకు గురిచేసి, ద్వితీయశ్రేణి పౌరులుగా అణచివేయడం సర్వసాధా రణం. ఇక విద్యారంగంలో నల్ల జాతీయుల పరిస్థితి మరీ అధ్వానం. విద్యాల యాల్లో నల్లజాతీయులను వెలివేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎక్కువ ఫీజుల వల్ల ఇరుగు పొరుగు పాఠశాలల్లో వీరు చేరలేకపోతున్నారు. పాఠశాల విద్యలోనే చాలా మంది బడి మానేయాల్సి వస్తున్నది. 17 శాతం మంది నల్ల జాతీ యులు మాత్రమే హైస్కూలు స్థాయి చదువులు కొనసాగిస్తున్నారు. 5.8 శాతం మంది నల్లజాతీయులు మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. మొత్తం గా విద్యాసూచికలో శ్వేత జాతీయులు 5.62 శాతం ఉంటే ఆఫ్రికన్లు కేవలం 3.10 శాతం మాత్రమే ఉన్నారు. నల్లజాతీయులు నివాసం, ఆదా యం, ఉద్యోగ రంగాల్లో తీవ్ర వివక్షలకు గురవుతున్నట్టు ఆధారాలున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కల్పన విషయంలో కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నప్ప టికీ అవి ఆచరణలో తగిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మానవాభివృద్ధిలో నల్ల జాతి ప్రజలు అమెరికాలోని మిగతా జాతులన్నిటికన్నా వెనుకబడి పోయారు. జాతి వివక్ష అగ్రరాజ్యపు అసలు రూపం అమెరికాలో పేదరికం ఉన్నదంటే మనకు నమ్మశక్యం కాదు. కానీ అమె రికాలోని ఆఫ్రికన్లలో, అక్కడి భూమి పుత్రులైన నేటివ్ అమెరికన్లలో పేదరికం చాలా ఎక్కువ. దేశ జనాభాలో 13 శాతంగా ఉన్న నల్లజాతీయులలో దాదాపు 28 శాతం పేదరికంలో మగ్గుతున్నారు. వారిలో కనీసం పిడికెడు అన్నం దొర కని వాళ్ళు 33 శాతం వరకు ఉన్నారు. నల్ల జాతీయులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతారనే దురవ గాహన కూడా మనలో బలంగా ఉంది. తాజా లెక్కల ప్రకారం మొత్తం 94,99,725 అరెస్టులు జరిగితే, ఇందులో 65,78,133 అరె స్టులు శ్వేతజాతీయులవి. 26,97,539 అరెస్టులు మాత్రమే నల్లజాతీయులవి. అయితే జైళ్లలో మాత్రం నల్లజాతీయుల సంఖ్యే అధికం. మొత్తం జైళ్లలో ఉన్నవారిలో 40 శాతంపైగా నల్లజాతీయులే. శ్వేత జాతీయులతో పోలిస్తే పది రెట్లు అధికంగా నల్లజాతీయులకే శిక్షలు పడతాయి. అరెస్టుల విషయంలో శ్వేత జాతీయులు చాలా ఎక్కువైనా శిక్షలు మాత్రం అత్యధికంగా నల్లజాతీ యులకే పడటం అక్కడి న్యాయవ్యవస్థలోనే వేళ్లూనుకొని ఉన్న వివక్షకు అద్దం పడుతుంది. ఇక నల్లజాతి మహిళల పరిస్థితి మరీ దారుణం. గత పాతికేళ్లలో నల్లజాతి మహిళల నేరాలు దాదాపు నాలుగు వందల శాతం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. 4 లక్షల మందికిపైగా మహిళలు జైళ్లలో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. శ్వేతజాతి మాఫియాలు నల్ల జాతి మహిళలను ఎక్కువగా మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించుకుంటోంది. కటిక పేద రికం, ఆకలి తీరే దారిలేక వారీ ఉచ్చులో కూరుకుపోతున్నారు. అమెరికాలో ఆఫ్రికన్ల పట్ల అమలవుతున్న వివక్షకు, అణచివేతకు ముగింపు ఎప్పుడో కూడా తెలియదు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తూ, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న అమెరికా తన దేశంలోనే జరుగుతున్న ఈ మారణకాండ గురించిగానీ, వివక్ష గురించి గానీ నోరు విప్పడం లేదు. తాను ఏది చెబితే అదే ప్రజాస్వామ్యంగా, తమదే అత్యంత ప్రజాస్వామిక దేశంగా ప్రచారం చేసుకుంటున్న అమెరికా ప్రజాస్వా మ్యం ముసుగులో అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. తన దేశంలోనే అమలవుతున్న వివక్ష, అసమానతలను ఎంతమాత్రం పరిష్కరించలేకపో తోంది. పైగా జాతి వివక్షను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారినే నేరస్తు లుగా నిలబెడుతోంది. ఒక జాతి పట్ల వివక్షాపూరితమైన వైఖరిని, విద్వేషంతో కూడిన దాడులను ఆపగలిగే ఒక నిజమైన ప్రజాస్వామిక పాలనను, సామా జిక, ఆర్థిక సమానత్వాన్ని అందించగలిగినప్పుడే అమెరికాలో జాతి వివక్షకు చరమగీతం పాడడం సాధ్యం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
ఆ దాడి మన చరిత్రలో చీకటి అధ్యాయం
వాషింగ్టన్: దక్షిణ కరోలినాలోని చారిత్రక చర్చిపై దాడిపట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించారు. అమెరికాలో తుపాకీ సృష్టిస్తున్న విద్వంసాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాన్ని దశలవారిగా చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో నిర్మూలించుకోవాలని కోరారు. 'ఇది ఎంతో విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భం.. అలాగే నిర్మూలించాల్సిన సమయం' అని ఒబామా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినాలోని ఎమ్మాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్టు చర్చిపై ఓ శ్వేత జాతీయుడు దాడి చేసి తొమ్మిదిమందిని పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం శ్వేత సౌదం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేయడంతోపాటు శ్వేత జాతీయులు చేస్తున్న చర్యలను విమర్శించారు. ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలకు స్వస్థిపలకాల్సిన అవసరంఉందని, అత్యధిక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రజలపై తుపాకీ దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. తక్షణమే వీటి విషయంలో వెనక్కి తిరగి చూసుకొని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రికార్డుల ప్రకారం ఇది పద్నాలుగో దాడి అని.. తాజాగా నల్లజాతీయుల చర్చిపై జరిగిన దాడి అందరినీ ప్రశ్నింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అమెరికాలో చరిత్రలో మచ్చగా ఉంటుందని, చీకటి అధ్యాయంలాంటిదని చెప్పారు. -
అమెరికాలో పురాతన చర్చిపై కాల్పులు
-
అమెరికాలో కాల్పులు, 9 మంది మృతి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు చార్లెస్టన్ పోలీసులు వెల్లడించారు. 8 మంది చర్చిలోనే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. మరోవైపు దుండగుడిని పట్టుకునేందుకు చార్లెస్టన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడి వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుందని, తెల్లరంగులో ఉన్నాడని ట్విటర్ లో పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో హెలికాప్టర్ ద్వారా భద్రతను సమీక్షిస్తున్నారు. అమెరికాలో పురాతమైన చర్చిలలో ఒకటైన చార్లెస్టన్ చర్చ్ పై దాడి జరగడం పట్ల నగర మేయర్ జోయ్ రిలే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ... సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ ఈ దాడిని ఖండించారు. -
మూడేళ్ల పాప కాల్పుల్లో రెండేళ్ల తమ్ముడి మృతి
లాస్ ఏంజెలిస్: అమెరికాలో లోకం తెలియని పిల్లలు తుపాకులు పేల్చిపారేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం యూటా రాష్ట్రం కేచీ కౌంటీలో మూడేళ్ల పాప పొరపాటున రైఫిల్‌తో రెండేళ్ల వయసున్న తమ్ముడిని కాల్చేసింది. పొట్టలో తీవ్ర తూటా గాయంతో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన కు కాసేపు ముందు ఇంట్లోని పెద్దలు ఈ రైఫిల్‌ను వాడి లివింగ్ రూమ్‌లో ఉంచారు. ఈ నెలలో అమెరికాలో పిల్లలు తుపాకులతో పొరపాటున ఎదుటి మనుషులను చంపడం ఇది నాలుగోసారి. గురువారం దక్షిణ కరోలినాలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఆరే ళ్ల బాలుడు పొరపాటున తుపాకీ కాల్చడంతో ముందు సీట్లోని మహిళ మృతిచెందింది. -
రూమ్మేట్పై కత్తితో దాడి చేసిన మహిళ
ఇష్టంలేని సంగీతం వినిపించాడన్న కోపంతో ఓ అమెరికా మహిళ తనతో కలిసివుంటున్న వ్యక్తిపై కత్తితో పొడిచింది. మద్యం మత్తులో ఆమె ఈ దురాగతానికి పాల్పడింది. దక్షిణ కరోలినాలో ఉంటున్న వెర్నెట్ బాడర్(54) అనే మహిళ 14 అంగుళాల కత్తితో 64 ఏళ్ల రూమ్మేట్పై పలుమార్లు దాడి చేసిందని స్థానిక మీడియా తెలిపింది. ఉత్తర చార్లెస్టన్ తన ఇంట్లో ఉండగా బాడర్ రూమ్మేట్ టీవీ చూస్తూ 'ద ఈగల్స్' మ్యూజిక్ వింటున్నాడు. అయితే తనకు ఇష్టం లేని మ్యూజిక్ పెట్టాడనే కోపంతో అతడిపై బాడర్ కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి చేతులకు తీవ్రగాయాలయ్యాయని వీరితో కలిసివుంటున్న మరో వ్యక్తి పోలీసులకు తెలిపాడు. బాధితుడు బాడర్ చేతిలోని కత్తిని లాక్కున్నప్పటికీ మరో కత్తి తీసుకొచ్చి దాడికి పాల్పడిందని వివరించారు. బాడర్పై గృహహింస నిరోధక చట్టం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. బాడర్ తో సహజీవనం చేస్తున్నట్టు బాధితుడు వెల్లడించాడు.