గ్రీన్‌విల్లే: అమెరికా దక్షిణ కరోలినాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులను గ్రీన్‌విల్లేకు చెందిన మైకాల బెల్ (23), డంకన్‌కు చెందిన క్లారెన్స్ జాన్సన్ (51)గా గుర్తించారు. జాన్సన్ నైట్ క్లబ్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవారని అధికారులు వెల్లడించారు. అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నైట్ క్లబ్‌లో నిర్వహించిన వేడుకలకు దాదాపు 200 మంది హాజరయ్యారు.
తుపాకీ కాల్పు చోటు చేసుకోవడంతో అప్పటి వరకు ఆనందంగా వేడుకలకు సిద్ధం అవుతున్న నైట్ క్లబ్‌లో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. అయితే వారి ఆచూకీ సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదు. గాయపడిన వారు గ్రీన్‌విల్లే మెమోరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ముఠా సంబంధిత గొడవల కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత)
Comments
Please login to add a commentAdd a comment