వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ విభాగం తన కీలక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ట్రంప్‌పై హత్యాయత్నం తమ అతిపెద్ద వైఫల్యమని కాంగ్రెషనల్ కమిటీ విచారణలో ఈమె ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో కింబర్లీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈమె 2022 నుంచి సీక్రెట్ సర్వీస్ అధిపతిగా పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ చేపట్టిన ప్రచార ర్యాలీ సందర్భంగా ఒక దుండగుడు దగ్గర్లోని భవనంపై నుంచి కాల్పులు జరపడం, ఆయన త్రుటిలో తప్పించుకోవడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment