Kimberly
-
అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ మంగళవారం రాజీనామా చేశారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సర్వీస్ విభాగం తన కీలక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ట్రంప్‌పై హత్యాయత్నం తమ అతిపెద్ద వైఫల్యమని కాంగ్రెషనల్ కమిటీ విచారణలో ఈమె ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో కింబర్లీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈమె 2022 నుంచి సీక్రెట్ సర్వీస్ అధిపతిగా పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ చేపట్టిన ప్రచార ర్యాలీ సందర్భంగా ఒక దుండగుడు దగ్గర్లోని భవనంపై నుంచి కాల్పులు జరపడం, ఆయన త్రుటిలో తప్పించుకోవడం తెల్సిందే. -
ఏడు నెలల తర్వాత బరిలోకి...
కింబర్లీ: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు ఏడు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. సఫారీ పర్యటనలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సోమవారం ఇక్కడ జరుగనుంది. 2021లో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సంపాదించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు ఇది చక్కని అవకాశం. ఏడు నెలల క్రితం వీరోచిత ప్రదర్శనతో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ రాజ్ సేనకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పుడు తాజాగా బరిలోకి దిగేందుకు ఈ విరామం దోహదం చేస్తుంది. ఇక ఇప్పటి నుంచి తమకు ప్రతీ మ్యాచ్ పరీక్షలాంటిదేనని భారత సారథి మిథాలీ తెలిపింది. క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు మహిళల ఆటపై కూడా ఆసక్తి పెంచుకున్నారని చెప్పింది. సఫారీ గడ్డపై కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ సహచర క్రీడాకారిణిలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పింది. ఈ జట్టులో 17 ఏళ్ల ముంబై విద్యార్థిని జెమీమా రోడ్రిగ్స్ ప్రధానాకర్షణ కానుంది. దేశవాళీ క్రికెట్లో అమె అసాధారణ ఫామ్‌తో ఏకంగా సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు సఫారీ పిచ్‌లపై ఆమె ఏమేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. -
ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి...
కాలిఫోర్నియా: సాహసమే ఊపిరిగా బతికేవాళ్లు తాడు మీద బ్యాలెన్స్‌గా నడవడం, దానిపై యోగాలాగా ఆక్రోబేటిక్ విన్యాసాలు చేయడం మనకు కొత్తేమి కాదు. ఓ ఎత్తై పర్వత శిఖరాగ్రం నుంచి మరో ఎత్తైన పర్వత శిఖరాగ్రంపైకి తాడుకట్టి దానిమీద బ్యాలెన్స్‌గా నడిచే వాళ్లను కూడా చూసే ఉంటాం. కానీ ఎత్తైన పర్వత శిఖరంపై నుంచి కిందకు జాలువారే బీభత్సమైన జలపాతాల ముందు నుంచి కొండలపైకి సురక్షితంగా తాడుపై బ్యాలెన్స్‌గా నడవడాన్ని చూడకపోవచ్చు. అరుదుగా చూసినా నిమిషానికి 8, 60,000 గ్యాలన్ల నీరు కిందకు పడే వర్నల్ జలపాతం ముందు ఓ సాహసి నిర్వహించిన ఆక్రోబేటిక్ విన్యాసాలను మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చూడలేదు. కారణం ఈ వాటర్ ఫాల్ ముందు ఇలాంటి విన్యాసాలు సాహసించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటిది. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోస్మైట్ నేషనల్ పార్కులో వర్నల్ అనే జలపాతం ఉంది. దాన్ని దూరం నుంచి చూస్తుంటే పర్యాటకులకు భయంతో వణుకు పుడుతుంది. అలాగే చూస్తే కళ్లు కూడా తిరుగుతాయి. ఎక్కువ సేపు ఉంటే వాటర్ సిక్కు కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి అతి సమీపం నుంచి ఓ కొండపైనుంచి మరో కొండకు తాడుకట్టి దానిపై బ్యాలెన్స్‌గా నడవడమే కాకుండా విన్యాసాలు చేయడం అంటే సాహసానినే సాహసం. ఎందుకంటే అక్కడ బయట సాధారణ తాడుపై నడిచినట్లు అక్కడి తాడుపై ఉండదు. చిమ్ముతున్న నీటి తుంపర్లతో కాళ్లు చేతులు తడుస్తుండడమే కాకుండా తాడు కూడా తడిసిపోయి జారుడుగా ఉంటుంది. దానిపై కింబర్లి వెల్‌జిన్ అనే 23 ఏళ్ల ముందుగా విన్యాసాలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ జెంక్స్, స్నేహితులు స్కాట్ హాంగ్, ఎలెనా పోల్చుక్, మైఖేల్ మెల్నల్, సారా విహాన్‌లు ఒక పర్వతం నుంచి ఒక పర్వతానికి తాడుపై నడిచి రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఇలాంటి ప్రయత్నం సాహసికులు ఎవరూ చేయలేదు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటి సారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టింది.