ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి... | Daredevil yogi performs acrobatic stunts on a highline in front of a crashing waterfall in Yosemite | Sakshi
Sakshi News home page

చూస్తుంటునే భయంతో వణుకు పుడుతుంది

Published Tue, Jun 28 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి...

ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి...

కాలిఫోర్నియా: సాహసమే ఊపిరిగా బతికేవాళ్లు తాడు మీద బ్యాలెన్స్‌గా నడవడం, దానిపై యోగాలాగా ఆక్రోబేటిక్ విన్యాసాలు చేయడం మనకు కొత్తేమి కాదు. ఓ ఎత్తై పర్వత శిఖరాగ్రం నుంచి మరో ఎత్తైన పర్వత శిఖరాగ్రంపైకి తాడుకట్టి దానిమీద బ్యాలెన్స్‌గా నడిచే వాళ్లను కూడా చూసే ఉంటాం. కానీ ఎత్తైన పర్వత శిఖరంపై నుంచి కిందకు జాలువారే బీభత్సమైన జలపాతాల ముందు నుంచి కొండలపైకి సురక్షితంగా తాడుపై బ్యాలెన్స్‌గా నడవడాన్ని చూడకపోవచ్చు. అరుదుగా చూసినా  నిమిషానికి 8, 60,000 గ్యాలన్ల నీరు కిందకు పడే వర్నల్ జలపాతం ముందు ఓ సాహసి నిర్వహించిన ఆక్రోబేటిక్ విన్యాసాలను మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చూడలేదు. కారణం ఈ వాటర్ ఫాల్ ముందు ఇలాంటి విన్యాసాలు సాహసించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటిది.

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోస్‌మైట్ నేషనల్ పార్కులో వర్నల్ అనే జలపాతం ఉంది. దాన్ని దూరం నుంచి చూస్తుంటే పర్యాటకులకు భయంతో వణుకు పుడుతుంది. అలాగే చూస్తే కళ్లు కూడా తిరుగుతాయి. ఎక్కువ సేపు ఉంటే వాటర్ సిక్‌కు కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి అతి సమీపం నుంచి ఓ కొండపైనుంచి మరో కొండకు తాడుకట్టి దానిపై బ్యాలెన్స్‌గా నడవడమే కాకుండా విన్యాసాలు చేయడం అంటే సాహసానినే సాహసం. ఎందుకంటే అక్కడ బయట సాధారణ తాడుపై నడిచినట్లు అక్కడి తాడుపై ఉండదు. చిమ్ముతున్న నీటి తుంపర్లతో కాళ్లు చేతులు తడుస్తుండడమే కాకుండా తాడు కూడా తడిసిపోయి జారుడుగా ఉంటుంది.

దానిపై కింబర్లి వెల్‌జిన్ అనే 23 ఏళ్ల ముందుగా విన్యాసాలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ జెంక్స్, స్నేహితులు స్కాట్ హాంగ్, ఎలెనా పోల్‌చుక్, మైఖేల్ మెల్నల్, సారా విహాన్‌లు ఒక పర్వతం నుంచి ఒక పర్వతానికి తాడుపై నడిచి రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఇలాంటి ప్రయత్నం సాహసికులు ఎవరూ చేయలేదు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటి సారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement