
శరీరం, మనస్సును సమన్వయం చేయడంలో శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. యోగా ద్వారా శ్వాసలోని లోపాలు, ఒత్తిడి, నిరాశ లను అదుపు చేయవచ్చు. మానసిక స్థిర త్వాన్ని మెరుగ పరచుకోవచ్చు.
శ్వాస వ్యాయామాలు...
ఉజ్జయి శ్వాసను సముద్ర శ్వాస పద్ధతితో పోల్చుతారు. ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలడం. దీనిని సాధారణంగా అష్టాంగ, విన్యాస తరగతులలో ఉపయోగిస్తారు.
మూడుభాగాల శ్వాసగా పిలిచే ఈ పద్ధతిలో బొడ్డు, ఛాతీ, దిగువ వీపును గాలితో నింపి, ఆపై రివర్స్ క్రమంలో ఉచ్ఛ్వాసం చేయడం జరుగుతుంది. ఇది విశ్రాంతిని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెరుగైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.
నాలుకను గొట్టం మాదిరి ముడిచి, వంకరగా ఉంచుతూ నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం, ఆపై ముక్కు ద్వారా ఊపిరి పీల్చడాన్ని సితాలి శ్వాస అంటారు.
భ్రమరి శ్వాస ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చూపుడు వేలును ముక్కుపైన ఉంచాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు తేనెటీగ లాగా హమ్ చేయాలి.
చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
కపాలభాతి శ్వాసను ‘బ్రెయిన్ మెరిసే శ్వాస’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న, శక్తివంతమైన ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, ఆపై ముక్కు ద్వారా 15–30 సార్లు గాలిని వదలాలి.
చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
నాడి శోధన శ్వాసను ‘ప్రత్యామ్నాయ నాసికా ప్రాణాయామం’ అని కూడా అంటారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొకదాని ద్వారా శ్వాస తీసుకొని, వదలాలి. ఈ వివిధ యోగా శ్వాస పద్ధతులను సాధన చేయడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు బాగా పెరుగుతుంది.