యోగాభ్యాసం చేస్తున్న ఉపాధ్యాయులు
సిరిసిల్ల టౌన్ : యోగాభ్యాసం సంపూర్ణ ఆరోగ్య ప్రదాయని అని మైసూరుకు చెందిన అవధూత దత్తపీఠం ప్రతినిధి లీలావతి అనానరు. డివిజన్ స్థాయి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదివారం చివరిరోజు యోగా సాధనపై మెలకువలు నేర్పించారు. ఉపాధ్యాయులు యోగా నేర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాంచందర్‌రావు, యోగా శిక్షకులు వెనిగల్ల గోపాలకృష్ణ, బాలయ్య, కిరణ్, లీలావతి, దత్తపీఠం సిరిసిల్ల శాఖ ప్రతినిధులు గుండ్లపల్లి సుదర్శన్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, వరదవెల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.