బెంగళూరు సిస్టర్స్ సక్సెస్ స్టోరీ
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.
ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్‌తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్‌నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.
యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్‌బార్‌తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.
తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్‌లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్‌లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ.
సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్‌ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు.
కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట.
Comments
Please login to add a commentAdd a comment