ఆంధ్రా అమ్మాయి ఉషా చిలుకూరిని పెళ్లి చేసుకున్న జేమ్స్ డేవిడ్ వాన్స్
దశాబ్దాల కిందటే యూఎస్‌లో స్థిరపడ్డ ఉష తల్లిదండ్రులు
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు..
వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్‌గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్‌పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్‌లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు.
చరిత్ర విద్యార్థిగా..
ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్‌మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు.
2015–2017 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment