Presidential election
-
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్‌కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్‌పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్‌ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్‌గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్‌ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్‌్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్‌్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్‌కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్‌లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్‌ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్‌్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్‌ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్‌ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్‌కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్‌ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
-
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్‌పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్‌ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు. 2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్‌లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్‌ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు. వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్‌తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్‌పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.ట్రంప్‌కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.ట్రంప్‌ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
USA Presidential Elections 2024: ట్రంప్ నోట ఓటమి మాట
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడితే ఇంకెప్పుడూ పోటీ చేయబోనని రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేతిలో ఓడితే మళ్లీ పోటీ చేస్తారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు. అయితే విజయం తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తన ఓటమి గురించి మాట్లాడటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. తాను ఓడటమంటూ జరిగితే యూదు ఓటర్ల వల్లేనని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలోని యూదుల్లో 60 శాతం శత్రువుకు మద్దతిస్తున్నారు. ఆ కారణంగా నేనోడితే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండదు’’అంటూ హెచ్చరించారు. 78 ఏళ్ల ట్రంప్ గత మూడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్షునిగా రెండుసార్లకు మించి పని చేయడానికి వీల్లేదు. కనుక ఈసారి ట్రంప్ గెలిస్తే 2028లో పోటీ చేయలేరు. -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్‌పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్‌పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్‌పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్‌కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్‌ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్‌కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్‌కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
ట్రంప్ సమాచారాన్ని దొంగిలించి.. బైడెన్ టీంకు ఆఫర్?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన కీలకమైన విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ప్రచార, వ్యక్తిగత సమాచారాన్ని ఇరానియన్ సైబర్అటాకర్లు దొంగిలించాలరని పేర్కొన్నాయి. ఆ సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు సిబ్బందికి ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు తెలిపాయి.‘‘అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార సిబ్బందికి ఇరానియన్ సైబర్ అటాకర్లు గుర్తు తెలియని ఈ మెయిల్స్ పంపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించి దొంగిలించిన ప్రచార, వ్యక్తిగత విషయాలను పంపించారు. ట్రంప్ ప్రచారానికి సంబంధించి దొంగిలించిన సమాచారాన్ని యూఎస్ మీడియా సంస్థలతో పంచుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఏ మీడియా సంస్థలకు ఇవ్వాలనుకున్నారో విషయంపై స్పష్టత లేదు’ అని ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి.ఇరానియన్ సైబర్ అటాకర్ల మెయిల్స్‌కు బైడెన్ ప్రచార బృందం స్పందించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగస్టులో పలు ఎజెన్సీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. రష్యా, ఇరాన్, చైనాలు అమెరికా సమాజంలో విభేదాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆరోపణలు చేశాయి. ఇక.. జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.చదవండి: ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్ అనుమానం -
ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన కీలక యూనియన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్‌స్టర్స్ యూనియన్‌కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్‌లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్‌లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్‌కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్‌ను విడుదల చేశారు. ఈ పోల్స్‌లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్‌వైపే మొగ్గుచూపారు.యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్‌కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్‌కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్‌లో మెజార్టీ ఓటర్లు ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్కు1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యు బుష్‌తో సహా రిపబ్లికన్లను ఆమోదించారు.1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం! -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్‌లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్‌కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్‌కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
Nostradamus: కమలా హారిస్‌దే విజయం
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్‌కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్‌గోర్‌పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్‌మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలిపిస్తే టిక్‌టాక్‌ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం. -
కమలా హారిస్‌కు ఒక్క నెలలో రూ.3,030 కోట్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది. తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్‌కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి. -
దూసుకుపోతున్న కమల.. ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ప్రచారంలో కమలా హారీస్ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్‌పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం విశేషం.కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, తాజాగా ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం గమనార్హం. ఇందులో భాగంగా కమలా హారీస్ ఆగస్టులో 30లక్షల మంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇదే ఊపులో సెప్టెంబర్‌లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది.మరోవైపు.. ట్రంప్ మాత్రం కమలా హారీస్‌తో పోల్చుకుంటే కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ ఆగస్టులో కేవలం 13కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. -
‘ట్రంప్’ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధం: కమలా హారీస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ అనే పేజీని తిరగేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా కమలా హారీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు కొత్త చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ పేజీని తిరగేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ట్రంప్ మాటలను నమ్మడానికి అమెరికన్లు సిద్ధంగా లేరు. ప్రజలు కొత్త మార్గం కోసం సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ గత దశాబ్దంలో మన దేశాన్ని విభజించడం గురించి ఎజెండాను ముందుకు తెచ్చే వ్యక్తిని మాజీ అధ్యక్షుడి(ట్రంప్)గా కలిగి ఉన్నాము. ఇకపై అలాంటి తప్పు జరగదని భావిస్తున్నాను. ట్రంప్.. అమెరికా అభివృద్ధిలో పలువురి పాత్ర, వారి కృషిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవ్వన్నీ ప్రజల మనస్సుల్లో ఉన్నాయి.ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే కేబినెట్లోకి రిపబ్లికన్ను తీసుకుంటానని ప్రకటించారు. ఇక, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. Vice President Harris: I think that people are ready for a New Way Forward. Sadly, in the last decade, we have had in the former president, someone who has been pushing an agenda that is about diminishing the character and the strength of who we are as Americans and dividing our… pic.twitter.com/r78F4cC2ys— Kamala HQ (@KamalaHQ) August 30, 2024ఇదే అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మొదటగా, మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి, వారిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా అత్యంత ప్రాధాన్యతలలో ఇది ఒకటి. నేను అమెరికా ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యం. సరిహద్దుల్లో అక్రమ వలసలపై కఠినంగా ఉండేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. అక్రమ వలసలను అసలు అంగీకరించేది లేదు. పన్నుల విషయంలో కూడా కొన్ని విధివిధానాలను రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ముందుకు సాగుతాం. శిలాజ ఇంధనాలు అధికంగా ఉండే పెన్సిల్వేనియాలో వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎన్నికల సందర్బంగా అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ వరాలు ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లేనిపక్షంలో బీమా కంపెనీలు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, దీన్ని ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమల పౌరసత్వంపై కొత్త ట్విస్ట్.. అమెరికాలో చర్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో, ఈసారి అధ్యక్ష ఎన్నికల మరింత రసవత్తరంగా మారింది.కాగా, యూఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ (ఎన్ఎఫ్ఆర్ఏ) అనే సంస్థ కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదనను ప్రచారంలో పెట్టింది. ‘సహజ పౌరసత్వం’ ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నది దాని వాదన. ‘అమెరికా పౌరసత్వం ఉన్న దంపతులకు ఈ గడ్డపై పుట్టినవాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యంగం నిర్వచిస్తోంది. 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారం హారిస్‌తో పాటు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటివాళ్లు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే’ అని ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పుకొచ్చింది. ఈ కీలక మౌలిక ప్రాతిపదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్ పార్టీ హారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందని ఆరోపించింది.మరోవైపు.. న్యాయ నిపుణులు మాత్రం ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను కొట్టిపారేస్తున్నారు. ‘ఇది రాజ్యాంగానికి వక్రభాష్యమే. పైగా ఎన్ఎఫ్ఆర్ఏ ఉటంకిస్తున్న డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయింది. తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చింది. ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను వర్తింపజేయాల్సి వస్తే బ్రిటిష్ మూలాలున్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ కూడా ఆ పదవికి అనర్హులే’’అని వారంటున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికిన ఎన్ఎఫ్ఆర్ఏ హారిస్‌పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హారిస్ తల్లి భారత్‌కు, తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే.ఏమిటా తీర్పు? డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసు 1857 నాటిది. అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్ స్కాట్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బానిస సుప్రీంకోర్టుకెక్కాడు. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ‘ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు’’అని కోర్టు పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్‌కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు. -
ట్రంప్‌కు భారీ షాక్, సొంత పార్టీలోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా.. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్‌తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారుఅంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్‌తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. -
ట్రంప్‌కు కెన్నెడీ జూనియర్ మద్దతు
ఫీనిక్స్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరిచాక డెమొక్రటిక్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్ ప్రచారంలో వెనుకబడ్డారు. పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌నకు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్ ఎఫ్.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు. రాబర్ట్ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్‌కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్‌ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్ ఎఫ్.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్ రాబర్ట్ కెన్నడీ కుమారుడే రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్. -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్‌పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్‌జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్‌తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
కమలతో డిబేట్.. ట్రంప్ ‘తులసి’ వ్యూహం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు, ఇండో అమెరికన్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 10న జరిగే డిబేట్‌పై ఇప్పటికే కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌పై పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష డిబేట్‌కు సన్నద్దం కోసం మాజీ డెమోక్రటిక్ నేత తులసి గబ్బర్డ్ సాయం తీసుకుంటున్నారని న్యూయార్ టైమ్స్ కథనం వెల్లడించింది. ట్రంప్ తన ప్రైవేట్ క్లబ్ హోమ్ మార్-ఎ-లాగోలో డిబేట్ కోసం ప్రాక్టిస్ మొదలు పెట్టారు. అయితే ఈ ప్రాక్టిస్ సెషన్లో తులసి గబ్బర్డ్ చేరినట్లు పేర్కొంది. అయితే తులసి గబ్బర్డ్ డిబేట్ ప్రాక్టిసులో పాల్గొన్నట్లు ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ధృవీకరించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ‘‘ మొదటి డిబేట్లో ప్రెసిడెంట్ జో బిడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో చరిత్రలో అత్యుత్తమ డిబేటర్లలో ట్రంప్ ఒకరిగా నిరూపించబడ్డారు. మామూలుగా అయితే ట్రంప్‌కు డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ, 2020లో జరిగిన డిబేట్ స్టేజ్‌లో కమలా హారిస్‌ను తులసి గబ్బర్డ్ విజయవంతంగా ఓడించారు. అందుకే అటువంటి పాలసీ అడ్వైజర్లు, ప్రభావవంతమైన కమ్యూనికేటర్ల సాయం తీసుకోవటం జరుగుతోంది’’ అని ట్రంప్ ప్రతినిధి తెలిపారు.2019లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎంపిక సమయంలో హారిస్‌తో డిబేట్ చేస్తున్నప్పుడు తులసి ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. హారీస్ విధానాలకు వ్యతిరేకంగా తులసి గబ్బార్డ్ తీవ్రంగా దాడి చేశారు. ఇదే కారణంతో గబ్బర్డ్ని ఎంపిక చేశారనే చర్చ కూడా సాగుతోంది. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తులసి డెమోక్రటిక్ పార్టీ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ట్రంప్ మద్దతుతో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా ట్రంప్‌తో తులసి స్నేహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్: కమలా హారీస్ కాదు.. ఓన్లీ ‘కమల’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని ‘కమల’ అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ‘కమల’ అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఓటర్లతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి ప్రచారంలో ఆమె మొదటి పేరు ‘కమలా’ను స్వీకరించారు. మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా, పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్ తన పేరును ‘కమల’గా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, డెమోక్రటిక్ మద్దతుదారులు కూడా ఆమెను కమలా.. కమలా అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కమలా అంటే ఆమె తల్లి పెట్టిన సాంస్కృతిక మరియు జాతి పేరు. ఇదిలా ఉండగా.. కమలా హారీస్‌ను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించిన 48 గంటల్లో పార్టీ ప్రచార సోషల్ మీడియాను 'బిడెన్ హెచ్‌క్యూ' నుండి 'కమలా హెచ్‌క్యూ'కి త్వరగా రీబ్రాండ్ చేసింది. 'హారీస్' నుండి 'కమల'కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమె పలుమారు కమలా అని సంబోంధించడంతో ఈజీగా ఆ పేరు ప్రజల్లోకి వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
అమెరికా పోరు.. పెద్దన్న ఎవరు?
-
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
అమెరికా పీఠం ఎవరిది ?
-
Weekly roundup: కమలా హారీస్ సరికొత్త రికార్డు.. 36 ఏళ్ల తర్వాత..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి వైదొలగటంతో.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తెరమీదకు వచ్చారు. ఎట్టకేలకు ఆమె అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు అయ్యారు. వారం రోజుల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరులో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష బరి నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గత ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ‘ఎక్స్’లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే ఈ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. అందుకే ఆయన ఎన్నికల పోటీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇక.. ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణ భాగస్వామి అని ప్రశంసలు కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారాయన. అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంట్ను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరవుతారు అనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా వైపు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీ పడవచ్చు) జరుగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన బైడెన్ తిరుగులేని మెజార్టీ కూడగట్టుకున్నారు. 4000పై చిలుకు డెలిగేట్లలో 3900 మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్ వీరందరూ బైడెన్‌కు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం బైడెన్ స్వయంగా వైదొలిగారు కాబట్టి.. డెమోక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడవచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమోక్రాటిక్ పార్టీ ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారాలుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగువేల పైచిలుకు డెలిడేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలి రౌండ్ ఫలితాలు తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమోక్రాటిక్ నామినీ ఎన్నికయ్యే వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో ముమ్మర లాబీయింగ్, తెరవెనక మంత్రాంగాలు జరగటం ఖాయం.డెమోక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలాకు గట్టి పోటీదారులుగా మారుతారని భావించిన పలు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహాటంగా ప్రకటించారు. ఇక పార్టీలోని సహచరులకు కమలా ఆదివారమే 100 పైగా ఫోన్ కాల్స్ చేసి మద్దతు కూడా గట్టునే పనిలో నిమగ్నమయ్యారు. భారతీయ అమెరికన్, ఆఫ్రికా అమెరికన్ చట్ట సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాలలోని మహిళలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీంలో 1000 మంది ఉద్యోగులు ఆమె కోసం పని చేయడానికి సిద్ధం అయ్యారు. గట్టి పోటీదారులు అయిన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఆదివారమే ఆమెకు మద్దతు తెలిపారు.కీలక నేతల మద్దతు...ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమోక్రాటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం కమలకు మద్దతు ప్రకటించారు. శ్రామిక కుటుంబాల కోసం శ్రమించే సునిశిత మేథోశక్తి గల రాజకీయ నాయకురాలు అని కమలను అభివర్ణించారు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ గ్రూప్ వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జేబి ఫ్రిట్జ్‌కర్, రెండు సార్లు కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ అభ్యర్థిత్వ రేసులో ఉంటారని భావించినా వారిద్దరూ కమలకే జై కొట్టారు. మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు కూడా అదే బాటలో నడిచారు. మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా హారిస్‌కే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ మద్దతు కూడా కమలకు లభించింది. కమలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని సోమవారం హిల్లరీ పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు లభిస్తే ఇక కమలకు తిరుగు ఉండదు. కమల్ ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67) , అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపించాయి.అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉండటంతో, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.మరోవైపు.. కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్న జో బైడెన్ ఫోన్లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి కృషి చేయాలని డెమోక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి హారిస్ కు 40 మందికి పైగా డెమోక్రాటిక్ సెనేటర్లు, దాదాపు వంద మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అంతే కాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ తో పాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బేషీర్, యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు.రికార్డ్ స్థాయిలో విరాళాలు...కమల హారిస్ ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే పార్టీని విరాళాలు వెల్లువెత్తాయి. 24 గంటల్లో 81 మిలియన్ డాలర్లు వచ్చాయి. అందులో 60 శాతం మొదటిసారి ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా ఒక రోజులోనే ఇంత మొత్తం విరాళంగా రావడం డెమోక్రాట్ల చరిత్రలో తొలిసారి.ట్రంప్‌పై విమర్శలు.. ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల్లో ఓడించడమే తన ధ్యేయం అని కమలా హారిస్ అన్నారు. ఆమె మంగళవారం విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అభ్యర్థిత్వానికి సరిపడ మద్దతు కూడగట్టుకున్న తర్వాత కమలా మాట్లాడినా మొదటి సమావేశం ఇది. గతంలో కాలిఫోర్నియా ప్రాసిక్యూటర్ గా పని చేశానని, తన రికార్డు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయకపు ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలను అతిక్రమించిన దుష్టులను ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా తొలుత బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలను నుంచి వచ్చిన విరాళాలను కమల కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.సర్వేల్లో కమలదే పైచేయి...అధ్యక్ష రేసులో జో బైడెన్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ కు కమలా వచ్చి రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను ఎదుర్కొనే సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్ కే అమెరికన్లు జై కొట్టడం విశేషం. ఈ విషయమై రాయిటర్స్/ ఇప్సోస్ చేసినా తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్ ఓటు వేయగా, ట్రంప్ కు 49 శాతమే ఓట్లు దక్కాయి. పలు సర్వేలల్లో కూడా కమలా దూసుకుపోతున్నారు.కమలా హారిస్‌కు భారీ అడ్వాంటేజ్ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకోనున్నారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్.. 1836లో ఉపాధ్యక్షుడు మార్టిన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మార్టిన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నా స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ‘ఎక్స్’ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.కమలా హారిస్ నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు.అటార్నీ జనరల్‌గా..హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
USA Presidential Elections 2024: డెమొక్రటిక్ అభ్యర్థిగా కమల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. తమ అభ్యర్థిగా కమలా హారిస్ పేరును డెమొక్రటిక్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు పారీ్టలో కమలా హారిస్ మినహా ఇతరులెవరూ అభ్యర్థిత్వం కోసం పోటీపడలేదు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ నిబంధనల ప్రకారం ఆగస్టు 1న పార్టీ ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో తమ నామినీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఇతరులు పోటీ పడకపోతే కమలా హారిస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమే. అలాగే ఆగస్టు 7లోగా ఆమె తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని(రన్నింగ్ మేట్) ఎంపిక చేసుకోవాల్సి ఉంది. షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 వరకు డెమొక్రటిక్ జాతీయ సదస్సు జరుగుతుంది. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విజయం తనదేనని కమలా హారిస్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందడానికి, ప్రతి ఓటునూ సంపాదించడానికి కష్టపడి పని చేస్తానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రచారం సాగిస్తానని, వారి మద్దతుతో రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తానని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ గత ఆదివారం ప్రకటించిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ తెరపైకి వచి్చంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇప్పటికే 40కిపైగా రాష్ట్రాల డెమొక్రటిక్ ప్రతినిధులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ట్రంప్‌కు సమఉజ్జీగా... న్యూయార్క్ టైమ్స్ పోల్ వెల్లడి జో బైడెన్ నిష్క్రమణలో అర్ధాంతరంగా అమెరికా అధ్యక్ష రేసులోకి వచి్చనప్పటికీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో సమానంగా కమల ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారిస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారిస్‌కు 46 శాతం మద్దతు లభించింది. సొంత పారీ్టల్లో సమాన మద్దతు రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమొక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారిస్‌కు ఈ వర్గాల మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది. -
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.I will work hard to earn every vote.And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7— Kamala Harris (@KamalaHarris) July 27, 2024అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ పేరును డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు.నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. అటార్నీ జనరల్‌గా..హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
‘‘మేముండగా నువ్వు పిల్లలు లేనిదానివెలా’’: జేడీ వ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన ‘ఎల్లా’
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. మరోవైపు అమెరికా సెనేటర్, రిపబ్లిక్ ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా దుమారం రేగుతోంది. దీనిపై కమలా భర్త మొదటి భార్య కూతురు ఎల్లా ఎమ్హాఫ్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఎల్లా తల్లికూడా కమలకు మద్దతుగా నిలిచారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై చైల్డ్‌లెస్ క్యాట్ అంటూ గతంలో జేడీ వ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కమల భర్త మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్ కమలకు మద్దతుగా నిలిచారు. గత పదేళ్లుగా తన పిల్లలైన కోల్, ఎల్లా ఎమ్హాఫ్కు ఆమె తల్లిగా ప్రేమించారని, తమ కుటుంబానికి ఆమె ఎంతో అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కమలా సవతి కుమార్తె (డగ్లస్ ఎమ్హాఫ్ ,కెర్స్టిన్ ఎమ్హాఫ్) ఇన్‌స్టాలో కౌంటర్ ఇచ్చారు. నేను, కోల్ (ఎల్లా సోదరుడు) ఉండగా నువ్వు పిల్లలు లేని దానివి ఎలా అవుతావంటూ కమలపై తన ప్రేమను చాటుకున్నారు. తద్వారా జేడీ వ్యాన్స్‌కు సమాధానం చెప్పారు.2021లో జేడీ వ్యాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పిల్లలు లేనివారు పాలించేందుకు తగరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని స్త్రీల జీవితం దయనీయం. అలాంటి వారు దేశాన్ని కూడా దయనీయంగా మార్చాలనుకుంటారు. కమల లాంటి పిల్లలు లేని వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదంటూ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా తీవ్రంగా ఖండించారు.కాగా కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య కెర్స్టిన్ ఎమ్హాఫ్. ఈ దంపతులు పిల్లలే కోల్, ఎల్లా ఎమ్హాఫ్. వీరు కమలా హారిస్‌ను మోమలా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఎల్లా మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. అల్లికలద్వారా మంచి కళాఖండాలను తయారు చేయడంలో ఆమె దిట్ట. -
కమలా హారీస్పై నమ్మకముంది: బైడెన్ సతీమణి జిల్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్.. కమలా హారీస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు.కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్ బైడెన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జిల్ బైడెన్..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్‌పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
ట్రంప్ Vs హారీస్.. ఎన్నికల సర్వే పోల్స్‌లో బిగ్ ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల పోల్స్ ట్రంప్‌పై కమలా హారీస్దే పైచేయి అని చెబుతున్నాయి. ఆమె గెలుపు ఖాయమంటూ నంబర్స్ రిలీజ్ చేస్తున్నాయి.కాగా.. తాజాగా నిర్వహించిన ఐపీఎస్ఓఎస్, నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలో ఉన్నారు. ఈ పోల్స్ ఫలితాల్లో కమలా హారీస్‌కు 44 శాతం ఓట్లు నమోదు కాగా, ట్రంప్‌కు మాత్రం 42 శాతం పోలయ్యాయి. దీంతో, రెండు శాతం ఓటింగ్‌లో కమలా ముందంజలో ఉన్నారు. ఇక, సర్వే సందర్భంగా సందర్భంగా ఓటర్లు మాట్లాడుతూ.. తమ మద్దతు కమలా హారీస్‌కే అంటున్నారు. ఆమె సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం 22 శాతం ఓటు షేర్ రావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో డెలావెర్‌లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు. -
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డెమోక్రటికల్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారం రిపబ్లిక్ పార్టీదే అని చెప్పుకొచ్చారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్ రంగంలోకి దిగారు. తాజాగా ఆమె నిధుల సేకరణ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలవబోతుందన్నారు. బైడెన్ తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికా ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే, ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కమలా హారీస్లో పోటీలో ఉండాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీసే కరెక్ట్ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో, ట్రంపే గెలుస్తారనే చర్చ నడుస్తోంది. -
USA Presidential Elections 2024: బైడెన్ కంటే కమల బెటర్
వాషింగ్టన్: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఆఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్‌లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్‌తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్‌ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. బైడెన్‌తో ఫోన్లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్ కొనసాగితే వైట్‌హౌస్‌ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ డెమొక్రాటిక్ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వైదొలగడం లేదు: ప్రచార సారథి జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్‌కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. -
బైడెన్ ఫ్యామిలీలో చర్చ.. అమెరికా అధ్యక్ష పోటీకి దూరం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.కాగా, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, బైడెన్‌ను ఇలా సడెన్‌గా అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ నేతలే తప్పుకోమనడం సరైన పద్దతి కాదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు ఎన్బీసీ న్యూస్ రాసుకొచ్చింది. అలాగే, తన రాజకీయ జీవితంలో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇక, తాజాగా బైడెన్ కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్న వేళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ పరిశీలిస్తున్నట్టు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.ఇక, ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
బైడెన్‌కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది. -
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్‌గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్‌పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్‌లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు. చరిత్ర విద్యార్థిగా.. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. -
ట్రంప్ కొత్త ప్లాన్.. కమలా హారీస్ టార్గెట్‌గా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్‌ను టార్గెట్ చేశారు. ఇక, తాజాగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్పై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ట్రంప్ మాట్లాడుతూ..‘ఓ విషమంలో జో బైడెన్ మెచ్చుకుంటున్నాను. కమలా హారీస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చు. అలాగే, కమలా హారీస్‌ను బైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. ఇదే సమయంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.బైడెన్ ప్రభుత్వంలో కమలా హ్యారిస్‌కు రెండు కీలక అంశాలు అప్పగించారు. ఒకటి బోర్డర్ సెక్యూరిటీ కాగా.. రెండోది ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడమని పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదు. కనీసం బోర్డర్‌కు కూడా వెళ్లలేదని ట్రంప్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపేందుకు ఆమెను ఐరోపాకు పంపించారని ట్రంప్ పేర్కొన్నారు. అది కూడా ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వలేదని సెటైర్లు వేశారు.ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీన జరిగిన డిబెట్లో జోబైడెన్ ప్రదర్శనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హారీస్‌ను పోటీ నిలపాలని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్.. కమలా హారీస్‌ను టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం గమనార్హం. మరోవైపు.. బైడెన్‌కు ట్రంప్ సరికొత్త సవాల్ విసిరారు. సౌత్ ఫ్లోరిడాలోని డోరల్ కోర్సులో గోల్ప్ మ్యాచ్‌కు బైడెన్ రావాలని సూచించారు. తనతో కలిసి గోల్ప్ ఆడాలని సవాల్ చేశారు. ఒక వేళ ఈ గేమ్‌లో ట్రంప్ ఓడిపోతే బైడెన్ ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రతిపాదించారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై బెడైన్ ప్రతినిథి జేమ్స్ సింగర్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ తాను చేసిన మంచి పనులు ఏమీ లేక ఇలా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. కానీ, బైడెన్ మాత్రం అమెరికా ప్రజల కోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు అని అన్నారు. -
Iran election 2024: మతవాద పాలనకు ఎదురుదెబ్బ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాదులదే పైచేయి అయింది. కరడుగట్టిన మతవాది సయీద్ జలిలిపై మితవాది, సంస్కరణాభిలాషి మసూద్ పెజెష్కియాన్ ఘనవిజయం సాధించారు. జూన్ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థుల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. దాంతో విజేతను తేల్చేందుకు తొలి రెండు స్థానాల్లో నిలిచిన జలిలి, పెజెష్కియాన్ మధ్య శుక్రవారం తిరిగి ఎన్నిక అనివార్యమైంది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. పోలైన దాదాపు 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు 1.64 కోట్లు వచ్చాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అనుచరునిగా పేరుబడ్డ జలిలి 1.35 కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. దేశ తొమ్మిదో అధ్యక్షునిగా పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌పై దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్న మతవాద కూటమికి ఈ ఫలితాలు గట్టి షాకివ్వడమే గాక సంస్కరణవాదుల్లో జోష్ నింపాయి. నిజానికి ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు శుక్రవారం రాత్రి దాకా జరిగిన ఓటింగ్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. దాంతో 53 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తద్వారా ఖమేనీ ఏకపక్ష పోకడలపై ప్రజలు స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫలితాల వెల్లడి మొదలవుతూనే రాజధాని టెహ్రాన్, పశి్చమ ఇరాన్‌లోని పెజెష్కియాన్ సొంత నగరం తబ్రీజ్తో పాటు దేశవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు, అభిమానులు భారీగా వీధుల్లోకి వచ్చి డ్యాన్సుల సంబరాలు చేసుకున్నారు. దేశాన్ని కాపాడేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో బూత్‌లకు తరలారంటూ నినాదాలు చేశారు. పెజెష్కియాన్ ఎన్నికల నినాదమైన ‘సేవ్ ఇరాన్’ సందేశాలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దేశంలో మెజారిటీలపై మైనారిటీల పెత్తనానికి మొత్తానికి తెర పడ్డట్టేనంటూ సంస్కరణవాదులు సంబరపడుతున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల ఫలితాలను ఖమేనీ లాంఛనంగా ఆమోదముద్ర వేశాక 30 రోజుల్లో పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు.పోలింగ్ శాతం పెరగడం వెనక... → నిజానికి ఏళ్లుగా తామెదుర్కొంటున్న పలు కీలక సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఇరానీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. → ఖమేనీ యంత్రాంగం తీరుకు నిరసనగా ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మూకుమ్మడిగా బహిష్కరించారు. దాంతో తొలి రౌండ్లో దేశ చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 40 శాతం పోలింగ్ నమోదైంది. → అత్యంత మితవాదిగా పేరొందిన పెజెష్కియాన్ అనూహ్యంగా తుది పోరులో బరిలో నిలవడంతో ఆయనకు మద్దతుగా వారంతా భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలారు. → పోలింగ్‌కు ముందు నుంచీ పెజెష్కియాన్ ప్రచార సరళికి, ‘సేవ్ ఇరాన్’ నినాదానికి దేశ యువత బాగా ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన ర్యాలీలకు, సభలకు జనం పోటెత్తారు. → ఇస్లామిక్ పాలనకు తెర పడాల్సిందేనని యువతతో పాటు విద్యావంతులు కూడా తొలిసారిగా బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కరడుగట్టిన మతవాది అయిన జలిలి ఇరాన్‌ను ఎప్పటికీ ఏకం చేయలేరని మైకుల సాక్షిగా చెప్పుకొచ్చారు. → జలిలిని ఓడించడం ద్వారా నిరంకుశ మతవాద పాలనకు వ్యతిరేకంగా ఇరానీలు స్పష్టమైన తీర్పు వెలువరించారు. → ఖమేనీ మతవాద పాలన, హిజాబ్‌ను తప్పనిసరి వంటి కఠినతరమైన సామాజిక నిబంధనలు, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను ఎత్తేసేలా అంతర్జాతీయ సమాజంతో చర్చలకు ముందుకు రాని పోకడలపైనా ప్రజలు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో స్పష్టంగా వ్యక్తం చేశారంటున్నారు.హార్ట్ సర్జన్‌పై ఆశలెన్నో...! 69 ఏళ్ల పెజెష్కియాన్‌కు హార్ట్ సర్జన్‌గా దేశవ్యాప్తంగా అపారమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఇరాక్–ఇరాన్ యుద్ధంలో పాల్గొన్న వార్ వెటరన్ కూడా. 16 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా, నాలుగేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు. ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ పేరెంట్‌గా పిల్లలను అన్నీ తానై పెంచారు. మతపరమైన మైనారిటీ అయిన అజెరీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈ ఎన్నికల్లో పెజెష్కియాన్‌కు మరింత కలిసొచి్చంది. ప్రచారం పొడవునా కూతురిని వెంట ఉంచుకోవడం ద్వారా మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు భారీగా ఓటేశారు. సవాళ్ల స్వాగతం... లెక్కలేనన్ని సమస్యలు పెజెష్కియాన్‌కు స్వాగతం పలుకుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయంగా ఉంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు దారుణంగా దిగజారాయి. యెమన్, లెబనాన్ గుండా ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు ఇరాన్ అన్నివిధాలా సాయపడుతూ అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఆగ్రహం చవిచూస్తోంది. ఆ క్రమంలో గత ఫిబ్రవరిలో అమెరికాతో, అనంతరం ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ముంగిటి దాకా వెళ్లొచి్చంది. ఈ రుగ్మతలకు పెజెష్కియాన్ ఎలాంటి వైద్యం చేస్తారో చూడాలి. అయితే ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టు ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రత్యర్థులతో కూడా కలిసి పని చేస్తానని ఫలితాల అనంతరం ప్రకటించారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. ఇది మనమంతా సహకరించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. నేను మిమ్మల్ని ఏకాకులను చేయను. మీరూ నన్ను ఏకాకిని చేయొద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. తద్వారా అందరినీ కలుపుకుని పోతానంటూ అతివాద వర్గానికి స్పష్టమైన సందేశమిచ్చారు. అదే సమయంలో, ‘ఇరాన్ ఇరానీలందరిదీ’ అంటూ పునరుద్ఘాటించడం ద్వారా ప్రజల సంక్షేమానికే ప్రథమ తాంబూలమని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు సర్వం సహా చక్రవర్తి అయిన ఖమేనీతో అధ్యక్షునిగా ఆయన సంబంధాలు ఏ మేరకు సజావుగా సాగుతాయన్నది ఆసక్తికరం. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. దేశ ప్రగతి కోసం పెజెష్కియాన్‌కు మనమంతా దన్నుగా నిలవాల్సిన అవసరముంది.– ఫలితాల అనంతరం సయీద్ జలిలి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran presidential election 2024: సంస్కరణవాదా ? అతివాదా?
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌తో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో నేడు రెండో దఫా ఎన్నికలకు ఓటర్లు సిద్ధమయ్యారు. జూన్ 28న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ, ఎవరికీ కీలక 50 శాతం ఓటింగ్‌ను ఓటర్లు కట్టబెట్టకపోవడంతో రన్ఆఫ్(రెండోసారి ఎన్నికలు)కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మతబోధకుడి పాలనను జనం ఎంతగా తిరస్కరిస్తున్నారనేది జూన్ 28నాటి అత్యల్ప ఓటింగ్ సరళి కళ్లకు కట్టింది. కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, యువతలో అసహనం, మతఛాందసవాదం, ఉద్యమాలు, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, అమెరికాలతో కయ్యంతో ఇంటాబయటా ఇబ్బందులు పడుతున్న దేశాన్ని ఎవరు ఏలుతారన్న విషయం నేటి ఎన్నికలతో తేలిపోనుంది. తొలి రౌండ్లో ఏం జరిగింది? మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ మరణించడంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు, ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు. తొలి రౌండ్లో సంస్కరణవాది డాక్టర్ మసూద్ పెజెష్కియన్ అందరికంటే ఎక్కువగా 42.5 శాతం ఓట్లు సాధించారు. అతివాది సయీద్ జలిలి 38.6 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. దేశంలో 6 కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 2.5 కోట్ల మంది ఓటేశారు. దేశ చరిత్రలోనే అత్యల్పంగా 40 శాతం పోలింగ్ నమోదైంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండోదశ పోలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెక్కన మసూద్, జలిలి మాత్రమే ఈరోజు జరిగే ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పిడివాదుల్లో పొరపొచ్చాలు? అతివాద నేతల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు, అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్‌కే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తొలి రౌండ్లో పోటీపడి ఓడిన గలీబాఫ్కు ప్రచారసారథ్యంవహించిన సమీ నజారీ తర్కరానీ సైతం మసూద్‌కే తన ఓటు అని ప్రకటించారు. మసూద్ గెలిస్తే? తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రందాకా రాని 60 శాతం ఓటర్లపైనే ఈ ఇద్దరు అభ్యర్థులు దృష్టిసారించారు. తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలిలి కంటే 3.9 శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ పెజెష్కియన్ ఇప్పటికే నిరూపించుకున్నారు. కొన్ని అంశాల్లో మసూద్‌ను సమరి్థస్తున్నట్లు ఎన్నికలపర్వం మొదలవడానికి ముందు జలిలి కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మైనారిటీలు, యువత, మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తనవైపునకు తిప్పుకుంటున్నారు. మసూద్ గెలిచి దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగునపడిన 2015నాటి అమెరికా–ఇరాన్ అణుఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయొచ్చు. పశి్చమదేశాలతో దోస్తీకి ప్రయతి్నంచవచ్చు. దీంతో ఆంక్షలు తొలగి, విదేశీ పెట్టుబడులు పెరిగి దేశారి్థకం బాగుపడే అవకాశముంది.జలిలి గెలిస్తే? సయీద్ జలిలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దేశాభివృద్ధి కోసం పశి్చమదేశాలపై ఆధారపడాల్సిన పనిలేదని సుప్రీంలీడర్ ఖమేనీ అన్న మాటలనే జలిలి వల్లెవేస్తున్నారు. ‘‘ అసలు ఇరాన్‌పై ఎందుకు ఆంక్షలు విధించాం? అని పశి్చమ దేశాలే బాధపడాలి. ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలచుకోవాలి’ అన్న జలిలి మాటలు చూస్తుంటే ఈయన గెలిస్తే దేశంలో మతచాంధస పాలనను కొనసాగిస్తారని అర్థమవుతోంది.స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గముందా? దేశ కీలక అంతర్గత వ్యవహారాలు అన్నీ సుప్రీంలీడర్ ఖమేనీ కనుసన్నల్లో జరుగుతాయి. అలాంటపుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్గానీ, జలిలిగానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరా? అనేది భేతాళ ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే విదేశీవ్యవహారాల్లో అధ్యక్షుడు, మంత్రివర్గం నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలతో శతృత్వం విషయం పక్కనబెడితే ఇతర పశి్చమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయతి్నస్తే దేశంలో ప్రగతి సాధ్యమే. మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ‘మార్పు’కు ఖమేనీ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ డిబేట్లో బైడెన్ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’
వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ట్రంప్‌తో సాగిన డిబేట్లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్‌ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్‌కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్‌ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్‌డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్‌లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్‌కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్‌లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్‌డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు ఈసారి బరిలో దిగారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్‌దిన్‌ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్‌ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్‌కోవ్, ఖరిటోనోవ్‌లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్‌ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్‌కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్‌ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్‌కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్‌కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA presidential election 2024: ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. 2024 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్ 3) ప్రకారం ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్ పార్టీ నిరాకరించింది. వివేక్ రామస్వామి అండ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్‌తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్‌కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. -
అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ ఘన విజయం
బ్యూనోస్ ఎయిరీస్ (అర్జెంటీనా): అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఆర్థికవేత్త, టీవీ విశ్లేషకుడు జేవియర్ మిలే ఘన విజయం సాధించారు. ఆర్థిక మంత్రి సెర్గియో మస్సాను మట్టికరిపిస్తూ 55.7 శాతం ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 99.4 శాతం ఓట్లను లెక్కించగా ప్రత్యర్థి సెర్గియోకు 44.3 శాతం ఓట్లు పడ్డాయి. ఈ దక్షిణ అమెరికా దేశంలో 1983లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తే ఒక నేతకు అధిక మెజారిటీ రావడం ఇదే తొలిసారి. -
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్‌రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్‌లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్‌ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్‌ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. -
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూలవాది గెలుపు
మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత మహ్మద్ ముయిజ్ 53 శాతం ఓట్లతో అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలెహ్కు 46 శాతం ఓట్లు రాగా, మొత్తమ్మీద 18వేల మెజారిటీతో ముయిజ్ విజయం సాధించారని అక్కడి మీడియా తెలిపింది. అధ్యక్ష బరిలోకి ఆలస్యంగా దిగిన ముయిజ్ రెండో రౌండ్లో విజయం సాధించడం గమనార్హం. సెప్టెంబర్‌లో జరిగిన మొదటి రౌండ్ పోలింగ్ ముయిజ్, సోలెహ్ల్లో ఎవ్వరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదు. దీంతో, శనివారం రెండో రౌండ్ పోలింగ్ జరిగింది. ముయిజ్‌కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌ను చైనా అనుకూల పార్టీగా భావిస్తుంటారు. అధికారంలోకి వస్తే మాల్దీవుల్లో ఉన్న భారత్ బలగాలను వెనక్కి పంపించివేస్తానని, భారత్‌పై ఆధారపడటం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. -
Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సుమారు ఏడాది సమయం వుంది. ఈలోపే ఎన్నికల వేడి మొదలైనట్లు అక్కడి వాతావరణం గమనిస్తే అర్ధమవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ బైడెన్ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది నాలుగోసారి. కాకపోతే ఇప్పటివరకూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు తొలిసారిగా ట్రంప్‌ను, అతని అనుచరులను ఉద్దేశిస్తూ నేరుగా విరుచుకుపడ్డారు. బరిలోకి ట్రంప్.. బైడెన్ విసుర్లు అదే సమయంలో, రిపబ్లికన్ పార్టీపైనా విసుర్లు విసిరారు. అరిజోనాలో తన ఒకప్పటి సహచరుడు, దివంగత జాన్ మైకెన్ స్మృతిగా చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమం వేదికగా బైడెన్ తన వాగ్బాణాలను ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సభ్యుల మద్దతు బలంగా కూడగట్టుకొనే దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. గత మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్స్ ఓడిపోవడంతో రిపబ్లికన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది ప్రస్తుతం అమెరికాలో జో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం, 80ఏళ్ళ ముదుసలి ప్రాయానికి దగ్గర కావడం మొదలైన అంశాలు డోనాల్డ్ ట్రంప్‌కు తన విజయం పట్ల విశ్వాసాన్ని కలుగజేస్తున్నట్లు భావించాలి. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం వున్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బీదపలుకులు పలకడం ఏమీ బాగాలేదు. దీని ద్వారా తన ఓటమి, తన పార్టీ ఓటమి తధ్యమని సంకేతం ఇచ్చినట్లైంది. మొన్నటి మిడ్ టర్మ్ ఎన్నికల ముందు ట్రంప్‌పై ఎదురుదాడికి దిగిన సందర్భం డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది. చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! ట్రంప్ సునిశిత పరిశీలన అదేంటంటే? అతి స్వల్ప తేడాతో మెజారిటీని కోల్పోయారు. లేకపోతే, ఇంకా ఎక్కువ బలహీన పడివుండేవారనే వ్యాఖ్యలు వినపడ్డాయి. ఈ అంశాన్ని డెమోక్రట్స్ తేలికగా తీసుకోరాదు. జో బైడెన్ పాలనలోని ప్రతి తప్పటడుగును ట్రంప్ చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారు. బైడెన్/ డెమోక్రట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చేసింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ పాలన గొప్పగా లేకపోయినా, నేటి బైడెన్ పాలన అద్భుతంగా వుందని చెప్పడానికి వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ట్రంప్ నియంతగా, అహంకారిగా,సంపన్నుల పక్షపాతిగా కనిపిస్తాడు.అంతకు మించి శ్వేత జాత్యహంకారం, మిగిలిన జాతుల పట్ల వివక్ష ట్రంప్ లో పతాకస్థాయిలో కనిపిస్తాయి.జో బైడెన్ ఆ పార్టీ పేరుకు తగ్గట్టుగా ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తాడు. మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు పిచ్చిచేష్టలు, కోవిడ్ కష్టాలు మొదలైనవి ట్రంప్ పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతను రగల్చడంతో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వక తప్పలేదు. ట్రంప్ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు. తన పరిపాలనాకాలంలో అంతర్జాతీయ సంబంధాలను కూడా అడగంటించాడు. అభివృద్ధి ఎటూ లేదు. మంచిపేరు కూడా తెచ్చుకోలేకపోయాడు. దేశం పరువూ పోగొట్టాడు. కాకపోతే, శ్వేత జాతీయుల్లో తమ జాతినేతగా ముద్రవేయడంలో కొంత విజయం సాధించాడు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ విషయానికి వస్తే, బలమైన నేతగా ముద్రవేసుకోలేకపోయాడని చెప్పవచ్చు. ఏడాది ఆగాల్సిందే డెన్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని నినాదం పదే పదే వినిపిస్తున్నారు. అమెరికా గొప్పతనం తగ్గుముఖం పట్టిందని, మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆ వాఖ్యలే చెప్పకనే చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం కష్టాలు అమెరికాను వెంటాడుతూనే వున్నాయి. ఏ రీతిన చూసినా అటు అమెరికా పరిస్థితి ఇటు జో బైడెన్ స్థితి అంత ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సర కాలంలో ఏవైనా బలమైన మార్పులు జరిగితే, బైడెన్‌కు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఇంకా కొందరు నేతలు లేకపోలేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై కూడా కొన్ని ఆలోచనలు అలుముకుంటున్నాయి. ఏది ఏమైనా, అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల అగ్గి మొదలైంది. రాజెవరో రెడ్డవరో తేలాలంటే ఒక ఏడాది ఆగాల్సిందే. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ -
‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ధ్వజమెత్తారు. పనికిమాలిన అధ్యక్షుడంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. బైడెన్‌కు పిచ్చి పట్టిందని.. ఆ పిచ్చి అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ట్రంప్ విడుదల చేశారు. ‘‘కీలక దర్యాప్తు సంస్థల విషయంలో.. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు అమెరికా భవిష్యత్తును ప్రమాదంలో పడేసివిగా ఉన్నాయి. దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దు విషయంలో బైడెన్ ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గోడ లేకపోతే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆయన మానసిక స్థితి ద్వారా విపత్తు సంభవించొచ్చు. ఆయనకు మతి భ్రమించింది. ఆయన అనాలోచిత నిర్ణయాలు, చేష్టలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు’’ అని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష బరిలో నిల్చునే ప్రయత్నంలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.. తీవ్రస్థాయిలో బైడెన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆయన కోర్టు కేసులతో చిక్కుల్లో పడుతున్నారు కూడా. అయితే ట్రంప్ విమర్శలను అంతే తేలికగా తీసుకుంటున్న అధ్యక్షుడు బైడెన్.. వెటకారంగా స్పందిస్తున్నారు కూడా. Pretty comical to hear the Projection King say this about Biden today: “I believe that he has gone mad. A stark raving lunatic.” pic.twitter.com/0EQBVYwz9V — Ron Filipkowski (@RonFilipkowski) August 30, 2023 -
జైలులో లొంగిపోతా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్‌తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్‌తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: ట్రంప్ -
మళ్లీ ఎన్నికల బరిలోకి
వాషింగ్టన్: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌నే మరోసారి తన రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ కి చెందిన బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గారికార్డు సృష్టించారు. బైడెన్‌పై ట్రంప్ ధ్వజం: బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ల అతివాదంపై పోరు 2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్ అభివర్ణించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు. ‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
US presidential election 2024: ట్రంప్ కేసు దారెటు!?
అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది. ట్రంప్‌పై నమోదైన హష్ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది... గాగ్ ఆర్డర్ ఇస్తారా? ► డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ► న్యాయమూర్తులపై ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మెర్చాన్, మన్‌హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్పై విరుచుకుపడ్డారు. ► ట్రంప్ మంగళవారం మన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది. ► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు, ప్రవర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్ హితవు పలికారు. ► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్ నోరు పారేసుకున్నారు. జువాన్ మెర్చాన్, అల్విన్ బ్రాగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్ బ్రాగ్ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అల్విన్ బ్రాగ్ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్ మండిపడ్డారు. ► ట్రంప్ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ గాగ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ► గాగ్ ఆర్డర్ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు. ► గాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్‌కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో? ► ట్రంప్ హష్ మనీ చెల్లించిన కేసులో మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది. ► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్బ్రాగ్ చెబుతున్నారు. ► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు. ► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్ బ్రాగ్ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ పోటీ ఖాయమేనా? ► ట్రంప్ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. ► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్‌పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ► మార్చి నుంచి జూన్ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు. ► ట్రంప్‌పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు. ► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు. ► రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెడతారా? ► ట్రంప్‌ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్‌కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ► ట్రంప్ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్‌హట్టన్ నుంచి సమీపంలోని స్టాటెన్ ఐలాండ్‌కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్హట్టన్లో ట్రంప్ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్ బృందానికి జడ్జి మెర్చాన్ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్ 19వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించారు. ► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్ న్యాయవాది జోయ్ టాకోపినా చెప్పారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్‌లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
నేపాల్ ప్రభుత్వంలో కుదుపు
కాఠ్మాండు: వచ్చే నెలలో జరగబోయే నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార కూటమి పార్టీ సీపీఎన్–యూఎంఎల్ బలపరిచిన అభ్యర్థినికాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థికి ప్రధాని ప్రచండ మద్దతు పలకడం సీపీఎన్–యూఎంఎల్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలైన ఉపప్రధాని, ఆర్థికమంత్రి బిష్ణు పౌద్యాల్, విదేశాంగ మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల క్రితమే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశాలు ఎక్కువయ్యాయి. విపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర పౌద్యాల్కు గత శనివారం ఎనిమిది రాజకీయ పార్టీలు సమ్మతి తెలపడం, అధికారకూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం, ఉపప్రధాని పదవికి రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్టెన్ రాజీనామాచేయడం తెల్సిందే. సీపీఎం–యూఎంఎల్ మద్దతులేకున్నా పార్లమెంట్లో 89 మంది సభ్యులున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీతో విశ్వాసతీర్మానాన్ని ప్రచండ సర్కార్ గట్టెక్కే వీలుంది. గత డిసెంబర్లో 7 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికార కూటమి పార్టీలు మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజుల్లోపు పార్లమెంట్లో విశ్వాసపరీక్షలో నెగ్గాలి. -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
ముందు మీ పార్టీలో ఎన్నికలు పెట్టుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ప్రహసనమంటూ బీజేపీ పేర్కొనడంపై కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు ముందుగా కాషాయ పార్టీ ఎన్నికలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘మా అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగల సత్తా మాకుంది. మా పార్టీ ఎన్నికల్లో మీ జోక్యం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఒక ప్రహసనమే అని తేలింది. పోటీ సమఉజ్జీల మధ్య జరగడం లేదు. థరూర్‌కు సరైన వివరాలతో కూడిన డెలిగేట్ల జాబితాను కూడా ఇవ్వలేదు’ అంటూ అంతకుముందు బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు. ‘పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నారు. గాంధీ కుటుంబానికి మరో ఎంఎంఎస్ 2.0 వెర్షన్ రానుంది’ అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌నుద్దేశించి పరోక్షంగా అందులో పేర్కొన్నారు. -
గెహ్లాట్‌పై చర్యలకు శశిథరూర్ డిమాండ్
భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్ తన ట్విటర్లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్ సదరు వీడియో సందేశంలో కోరారు. ఈ పరిణామంపై గురువారం భోపాల్(మధ్యప్రదేశ్) పార్టీ కార్యాలయంలో శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్గానీ, ముఖ్యమంత్రిగానీ, పీసీసీ చీఫ్‌లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. मैं उम्मीद करता हूं जो भी डेलीगेट हैं वो भारी बहुमत से श्री मल्लिकार्जुन खड़गे को कामयाब करेंगे।कामयाब होने के बाद में वो हम सबका मार्गदर्शन करेंगे व कांग्रेस मजबूत होकर प्रतिपक्ष के रूप में उभर कर सामने आएगी।यह मेरी सोच है, मेरी शुभकामनाएं है खड़गे साहब भारी मतों से कामयाब हों। pic.twitter.com/OQ4Nk8zFKa — Ashok Gehlot (@ashokgehlot51) October 13, 2022 అలాంటిది గెహ్లాట్ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్ పేర్కొన్నారు. చాలా చోట్లా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు! -
ప్రియాంక గాంధీల కుటుంబానికి చెందినది కాదు! కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక వాద్ర ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేఖ్. హిందు సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఆమె వాద్రా కుంటుంబానికి చెందిన ఇంటి కోడలే గానీ గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు కదా అని ఖలేఖ్ అన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్ చీఫ్‌గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా అని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండమని పలుమార్లు కోరారు. ఐతే రాహుల్ గాంధీ కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల గాంధీ కుటుంబంలోని వారెవ్వరూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండకూడదని నిర్ణయించకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం శశిథరూర్ పోటీ చేస్తున్నట్లు తేలింది గానీ ఇంకా రాజస్తాన్ సంక్షోభం విషయమై అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 1 చివరి తేది కాగా, నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 8 . అంతేగాక అదే రోజు(అక్టోబర్ 8న) సాయంత్రం 5 గంటల ఫైనల్ లిస్ట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది పార్టీ. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్?) -
రాహుల్ అంగీకరించకపోతే...బయటవారికే పగ్గాలు ఇస్తే?
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? ఇప్పుడు కాంగ్రెస్‌లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడంతో అందరి దృష్టి రాహుల్ తదుపరి అడుగులపై పడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండడంతో పార్టీని ముందుకు నడిపించే నాథుడెవరన్న ఆందోళన మొదలైంది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తారో లేదో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21 సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో జీ–23 పేరుతో కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చెయ్యడంతో సోనియా పదవిని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ఇంకా కొనసాగుతున్నారు. గాంధీ కుటుంబానికే సారథ్యం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్ ముక్త భారత్ అని నినదిస్తున్న నేపథ్యంలో గాంధీ కుటుంబమే పార్టీకి రథసారథిగా ఉండాలన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు తెరతీస్తూ ఎదురు తిరిగిన వారిపై సీబీఐ, ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబానికి చెందిన వారే పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధ్యక్ష పదవిపై ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ పదే పదే వంశపారంపర్య రాజకీయాలను ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఆ తరహా రాజకీయాలపై దేశంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ తాను అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆత్మరక్షణలో పడిపోతానని, ఆ పదవి తనని మరింత బలహీనుడిగా మారుస్తుందన్న ఆందోళన రాహుల్ గాంధీలో ఉందని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘24 అక్బర్ రోడ్: ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది పీపుల్ బిహైండ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ది కాంగ్రెస్’’తో పాటు పలు పొలిటికల్ పుస్తకాలు రచించిన ఆయన రాహుల్ ఆందోళన సరైనదే అయినప్పటికీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథిగా ఉంటేనే అధికార పార్టీ వారిని టచ్ చేయడానికి జంకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేస్తే కాంగ్రెస్‌కి పూర్వ వైభవం వస్తుందని ఇటీవల ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో కొందరు నాయకులు డిమాండ్ చేసినప్పటికీ ఆమె మాత్రం అందుకు సుముఖంగా లేరు. బయటవారికే ఇస్తే.. ? గాంధీ కుటుంబం కాకుండా బయటవారు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసికంగా సంసిద్ధులవుతున్నారు. అలాంటప్పుడు పార్టీ పగ్గాలు ఎవరు స్వీకరిస్తే బాగుంటుందన్న చర్చ కూడా మొదలైంది. సీనియర్ నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే, అశోక్ గెహ్లాట్, కుమారి సెల్జా వంటి నాయకులైతే బాగుంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. స్వాతంత్య్రదినోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అంబికా సోని జాతీయ జెండాని ఎగురవేయడంతో ఆమె కూడా రేసులో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. సోనియాకి కరోనా సోకడంతో అంబికా సోని జెండా ఎగురవేశారే తప్ప ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బయటవారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే పరిస్థితి రాదని, ఎన్నికలొచ్చే సమయానికి రాహుల్‌ని ఒప్పించగమన్న ధీమాలో ఓ వర్గం ఉంది. రాహుల్ అంగీకరించకపోతే...? ఒకవేళ రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియాగాంధీయే అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నాయకు లు అభిప్రాయపడుతున్నారు. బయట వారికి పార్టీ పగ్గాలు అప్పగించి రాహుల్ గాంధీ వారికి ఒక గైడ్‌లా వ్యవహరిస్తే కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి బయటపడవచ్చునని మరి కొందరి ఆలోచనగా ఉంది. గాంధీ కుటుంబానికి మన్మోహన్ సింగ్ లాంటి అత్యంత నమ్మకమైన నాయకుడి అవసరం కూడా ఉంది. కానీ కాగడా పెట్టి వెతికినా అలాంటి నాయకుడెవరూ కనిపించడం లేదని, ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అదేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మణీంద్ర నాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు
-
రాష్ట్రపతి ఎన్నికలు.. ఢిల్లీలో ఓటేసిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
-
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
అప్పటి వరకు ఒక స్టార్ హోటల్లోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు: హైకమాండ్ ఆదేశం
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు (జులై 18) తన 122 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు నగరంలో ఒక స్టార్ హోటల్లో బస చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు విప్ల చేత సమాచారం పంపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు చేయాలనేది హోటల్లోనే బోధిస్తారు. ఇందుకోసం ఢిల్లీలో ముగ్గురు నాయకులను శిక్షణనివ్వడానికి పంపించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అత్యవసర కారణాలతో మినహాయింపు కోరిన కొందరు మంత్రులు మినహాయించి మిగతా వారంతా హోటల్లో ఉండే అవకాశముంది. ఓటింగ్ రోజున హోటల్ నుంచి నేరుగా విధానసౌధకు చేరుకుంటారు. చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
ఈ నెల 12న విజయవాడకు ద్రౌపది ముర్ము రాక
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరేందుకు మంగళవారం విజయవాడకు వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మంగళగిరి సమీపంలోని కన్వెన్షన్ హాల్లో జరిగే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ పదవుల వరకూ దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. తద్వారా ఆ వర్గాల సామాజిక, రాజకీయ, విద్య, ఆర్థిక సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో.. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీగా ద్రౌపది ముర్ముకు ఇప్పటికే వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. దీంతో.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొని.. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరనున్నారు. -
చెన్నైలో స్టాలిన్‌ను కలిసిన యశ్వంత్ సిన్హా
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురువారం చెన్నైకి వచ్చారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీఎంకే మిత్రపక్ష పార్టీల అగ్ర నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా వారిని కోరారు. ఇదిలా ఉండగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై 2న చెన్నై, పుదుచ్చేరిలో పర్యటించి మిత్రపక్షాలను కలుసుకుని మద్దతు కోరనున్నారు. చదవండి: (మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం) -
ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?
భారత రాష్ట్రపతి స్థానానికి తమ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును నిలబెట్టింది. ఆమె గెలిస్తే తొలిసారిగా రాష్ట్రపతి పదవి చేపట్టిన గిరిజనురాలిగా చరిత్ర సృష్టిస్తారు. ఎన్నిక లాంఛనప్రాయమే అనే అంచనాలున్న నేపథ్యంలో భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్నవేళ ఇదొక శుభ పరిణామం అనుకోవచ్చు. అయితే, ఒక ఆదివాసీ... దేశ అత్యున్నత స్థానానికి చేరడానికి 75 సంవత్సరాలు పట్టిందనేది కఠిన వాస్తవం. మితవాద పక్షం నుంచి ఈ ముందడుగు పడుతుందనేది మరొక నిజం. ఉదారవాద పార్టీలు ఇప్పటికీ కొన్ని చట్రాల్లోంచి బయటకు రాలేదన్నది ఇంకో నిజం. ఇన్ని నిజాల మధ్యలో ఇంకో నిజం ఏమిటంటే, దేశంలో ముస్లింలకు తమ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం దక్కడం లేదు. అందర్నీ కలుపుకొని పోయేట్టుగా మన విధానాలు ఉండాలన్నది మరిచిపోరాదు. ‘‘భారత రాష్ట్రపతి పదవికి తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్మును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతున్నందుకు గర్వంగా ఉంది. లక్షలాదిమంది ప్రజలు, ముఖ్యంగా దారిద్య్ర బాధల్ని, కష్టనష్టాలను అనుభవించి వాటిని ఎదుర్కొంటున్న ప్రజలు ముర్ము జీవితం నుంచి గొప్ప ధైర్యాన్ని పొందుతారు. విధాన నిర్ణయాల పట్ల ఆమె అవగాహన, కారుణ్య దృష్టి మన దేశానికి ఎంతగానో తోడ్పడ తాయి. ఎందుకంటే, ద్రౌపది ముర్ము సమాజ సేవకు, పేదలు, అణగారిన, విస్మరించబడిన వర్గాల ఉద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న మహిళ. – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించాలని ఒక వైపున మితవాద పార్టీ అయిన బీజేపీ నిర్ణయించగా, దేశంలోని అభ్యుదయకర అతివాద పార్టీలుగా పేరున్న రాజకీయ పక్షాలు ఇప్పటికీ అగ్రవర్గాలకు చెందిన అభ్యర్థులనే పట్టుకుని వేలాడ వలసి రావడం విచారకరం. ‘అభ్యుదయవాదులం’ అనుకునే సవర్ణులు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవడం అంత కష్టమైన పనా? కాగా, అదే సమయంలో దేశానికి తొలి ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి 75 సంవత్సరాల కాలం పట్టడం, అందులోనూ మితవాద పక్షమైన బీజేపీ అభ్యర్థిగా నిలబడవలసి రావడం ఆశ్చర్యకరం’’. – ‘కఠువా’ అత్యాచార కేసులో వాదించిన సుప్రసిద్ధ న్యాయవాది దీపికా సింగ్ రజావత్ ‘‘తనకు అనుకూలమైన ‘డమ్మీ’ రాష్ట్రపతిగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థిని బీజేపీ నిలబెట్టడం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ తరగతుల ప్రజలను మోసం చేయడానికే. అయితే రాజకీయ, పరిపాలనా సంబంధమైన శక్తియుక్తులున్న మహిళ ద్రౌపది ముర్ము అని మరచిపోరాదు.’’ – జాతీయ కాంగ్రెస్ ప్రకటన అయితే, వ్యక్తి శక్తియుక్తులకన్నా కీలకమైన అంశం – గత 75 ఏళ్లుగా భారత రాజకీయాల్నీ, అధికార పదవులలో ఉన్న పాలక శక్తుల్నీ నడిపిస్తున్నది భారత సెక్యులర్ రాజ్యాంగమూ కాదు; దేశానికీ, పాలనకూ దిక్సూచిగా ఉండవలసిన అందలి విస్పష్టమైన ఆదేశిక సూత్రాలూ కావు. ‘భారత ప్రజలమైన మేము’ (ఉయ్ ది పీపుల్) ‘మాకై అంకితమిచ్చుకున్న రాజ్యాంగ పత్రం’ అని పేర్కొన్నా, ‘మీరెవరు మమ్మల్ని శాసించడానికి?’ అని ఎదురు ప్రశ్నలకు దిగిన రాజకీయ పాలకులున్న దేశం మనది. ‘ఆదేశిక సూత్రాల’నే కాదు, ‘పౌర బాధ్యత’ల ప్రత్యేక అధ్యాయం ద్వారా దేశ ప్రజలలో శాస్త్రీయ ధోరణులను ప్రబుద్ధం చేయాలన్న స్పష్టమైన ‘తాఖీదు’ను కూడా కాంగ్రెస్–బీజేపీ పాలకులు పక్కకునెట్టి యథేచ్చగా తిరుగుతున్నారు. ఇక అధికార పార్టీ నేతృత్వంలో హిందూత్వ రాజకీయాల ద్వారా విద్యా వ్యవస్థ స్వరూప స్వభావాన్నే తారుమూరు చేసే ప్రయత్నాలు శరవేగాన జరుగుతున్నాయి. ఇందుకు విద్యా, విశ్వవిద్యాలయ స్థాయిలో స్థిరపడిన అభ్యుదయకర నిబంధనల్నీ, చట్టాలనే మార్చే యత్నాలు వేగంగా సాగుతున్నాయని మరచిపోరాదు. అనేక మతాలు, మత విశ్వాసాలు, ప్రత్యేక సంప్రదాయాలు, అనేక తెగలు, బహుళ జాతులు, బహు భాషలతో కూడిన భారత ప్రజలందరినీ తాను విశ్వసించే ‘మూస’లో బంధించడానికి బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రయత్నిస్తోంది. అవే ఎత్తుగడలతో 2024 ఎన్నికల వైపు కూడా దూసుకుపోతోంది. ఇందుకు అన్ని ఎత్తుగడలకంటే కీలకమైన మాధ్యమం విద్యా రంగం అని భావిం చింది. అందుకే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ప్రాతినిధ్యం దక్కడం లేదు బహుళ జాతులతో కూడిన భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్య కేంద్రంగా వర్ధిల్లాల్సిన పార్లమెంట్‌ను సహితం స్వభా వంలోనూ, ఆచరణలోనూ సంకుచిత స్థాయికి దిగజార్చుతూ వచ్చారు. సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవీ రసవిహీనమైన ఉబుసుపోని చర్చలతోనే ముగుస్తున్న సందర్భాలే ఎక్కువ. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి పాత్ర నామమాత్రం. ఇక యూరప్‌తో పోల్చితే అక్కడి ఎన్నో దేశాల కంటే భారత ముస్లిం జనాభా ఎక్కువ. అనేక దేశాల స్థాయిలో భారత ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయినా రాజకీయ స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ ముస్లింల ప్రతిపత్తికి విలువ లేనట్టుగా పాలక విధాన పోకడలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో ప్రజా రాజకీయ కార్యాచరణకూ, ప్రజాస్వామ్య మనుగడకూ కీలకం – విస్పష్టమైన విధానాల ఆచరణే నని చరిత్ర రుజువు చేస్తోంది. కనుకనే, భారతదేశంలో విశిష్ట ‘ఎమెరిటిస్’ ప్రొఫెసర్ జోయా హాసన్ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ) ప్రస్తుతం దేశంలో ముస్లిం మైనారిటీల దుఃస్థితిని గురించి ఇలా పేర్కొనక తప్పలేదు: ‘‘గత పదేళ్లలోనే భారతదేశ సెక్యులర్ (అన్ని మతాలనూ సమంగా పరిగణించే) వ్యవస్థ రాజ్యాంగ పునాదులు కాస్తా దేశ రాజకీయ పాలనా పద్ధతుల వల్ల బీటలు వారుతున్నాయి.’’ ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ముస్లింల ప్రాతినిధ్యం వారి జనాభాకు తగిన దామాషాలో పెరగనే లేదు. పైగా జనాభాలో 20 కోట్ల మందికిపైగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టేలా పాలకపక్ష ప్రతినిధి ప్రవక్త మహమ్మద్‌ను తూలనాడుతూ ప్రకటనలు చేయడంతో దేశవ్యాప్తంగా అశాంతిని ప్రజ్వలింపజేసింది. అందరూ కలిస్తేనే... హిందూస్థాన్ ఒక ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి స్థానంలో నిలబెట్టడానికి బీజేపీ పడుతున్న తాపత్రయంలో ఒక్క శాతం అభిమానాన్ని కూడా ముస్లిం మైనారిటీల మనోభావాలపట్ల చూపక పోవడం క్షమించరాని వివక్షగా పరిగణించక తప్పదు. అంతేగాదు, ఈ వివక్ష చివరికి ఎక్కడికి దారి తీసి మరింత అలజడికి కారణమవుతోందంటే, ఫలానావాడు ‘హిందువుల’ వ్యతిరేకి అని ఎక్కడ ముద్ర పడుతుందోనన్న జంకు కొద్దీ హిందూ రాజకీయ పక్షీయులూ, పార్టీలూ న్యాయబద్ధంగా ముస్లింలకు ఇచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించేయడం జరుగుతోందని ప్రొఫెసర్ జోయా హాసన్ వెల్లడించారు. అంతేగాదు, ప్రజాస్వామ్య విలువలకూ, వ్యక్తి ఉనికికీ కూడా గౌరవం పూజ్యం. పైగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పాలకులు ప్రజా కోర్కెలను లేదా ప్రజా ఉద్యమాలను అణచటానికి, కట్టడాలను కూలగొట్టడానికి ఇటీవల ‘బుల్డోజర్’లను కూడా యథేచ్చగా వాడుతున్నారు. ఇప్పటికైనా మనం గుర్తించి తీరవలసిన సత్యం – భారతదేశం ఒకప్పుడు నాగరిక దేశంగా ప్రపంచ ఖ్యాతి గడించడానికి కారణం ఏమిటో భారతీయుడైన రఘుపతిరాయ్ ఫిరాక్ అనే కవి లిఖించిన ఆర్ద్రమైన ఈ క్రింది కవితలో వెల్లడవుతోంది: ‘‘ప్రపంచంలోని నలు మూలల ఉన్న దేశాల నుంచి వచ్చే పోయే వర్తక సమూహాలతోనే ఈ దేశం కిటకిటలాడే హిందూస్థాన్‌గా రూపు దిద్దుకుంది.’’ దానికి అనుగుణంగానే సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులలో ఒకరైన గణేష్ దేవో, భారతదేశంలో ప్రచలితమవుతున్న అనేక భాషలలో ప్రాంతీయ భిన్నత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలుకు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ప్రకటన రాకున్నా కేటీఆర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం గమనార్హం. విపక్షాలతోనే టీఆర్ఎస్ పార్టీ ఉందనే సంకేతాలు పంపించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతున్నట్లు సమాచారం. -
ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా!
స్వతంత్ర భారతదేశం అమృతోత్సవాలు జరుపుకొంటున్న సంవత్సరమిది. మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వించదగిన కొన్ని మధుర క్షణాలను కూడా ఈ యేడు మోసుకొస్తున్నది. ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి హోదా! ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడా హోదా మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దక్కబోతున్నది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదా కలిగిన పదవులేవీ దేశంలో 12 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్ తెగలకు ఇంతవరకూ దక్కలేదు. పీఏ సంగ్మా కొంతకాలం లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కారణంగా ఎస్.టీ. గుర్తింపు లభించిందే తప్ప స్వతహాగా గిరిజన జీవితంలోంచి వచ్చినవాడు కాదు. అధిక జనాభా కలిగిన ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్ తెగకు చెందిన ద్రౌపదీ ముర్మూ ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. 1857 నాటి సిపాయి తిరుగుబాటును మనం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తిస్తున్నాం. కానీ అంతకంటే ముందే అక్కడక్కడ విడివిడిగా జరిగిన ప్రతిఘటనా పోరాటాలు ఇప్పటికీ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తూనే ఉన్నాయి. కట్టబొమ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాలపై సినిమాలు కూడా వచ్చాయి. ఆ కోవలోనిదే, అంతకంటే విస్తృతమైనది, ప్రభావవంతమైనది సంతాల్ తిరుగుబాటు. 1855లో సంతాల్ గిరిజనులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. స్వతంత్ర భారతావని తొలి పారిశ్రామిక ప్రస్థానంలో ముందువరసలో నడిచిన కార్మికుల్లో సంతాల్ గిరిజనులున్నారు. అసన్సోల్, బీర్భూమ్ బొగ్గు బావుల్లోకి ప్ర«థమంగా దిగిన వారిలో, రూర్కేలా, జెమ్షెడ్పూర్లలో ఉక్కును మండించిన అగ్రగామి దళంలో అత్యధికులు సంతాల్ గిరిజనులే. ఇన్నేళ్లకైనా వారి త్యాగాలను దేశం గుర్తించి గౌరవించిందని భావించి ముర్మూ ఎంపికను స్వాగతించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. ప్రతిపక్ష శిబిరానికి రాజకీయ కారణాలుంటాయి కనుక, వారూ పోటీ అభ్యర్థిని రంగంలోకి దించారు. ప్రజాస్వామ్యంలో అది వారికి ఉన్న స్వేచ్ఛ, హక్కు. ఎవరూ కాదనలేరు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 48 శాతం ఓట్లున్నాయి. కొన్ని చిన్నాచితకా పార్టీలను సమీకరించి మెజారిటీ ఓట్లు సాధించడం బీజేపీ పెద్దలకు కష్టమేమీ కాదు. ఆ అవసరం లేకుండా ఇప్పటికే రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు ముర్మూ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాయి. ఒరిస్సా రాష్ట్ర మహిళ కనుక బీజేడీ అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మద్దతిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఐడియాలజీలో సామాజిక న్యాయం ఒక ముఖ్యాంశం. కనుక ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్మూకే తన ఓటని చెప్పారు. ముందుముందు మరికొన్ని పార్టీలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నది. వారు బీజేపీ అగ్రనేతల ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ, నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక, మహారాష్ట్ర సంక్షోభం... వగైరా బర్నింగ్ టాపిక్‌లకు దీటైన ఒక రాజకీయ కలకలాన్ని సృష్టించవలసిన అగత్యం ఈ సందర్భంగా ఎల్లో మీడియాకు ఏర్పడింది. చంద్రబాబు అవసరమే ఎల్లో మీడియా అగత్యం. ఆయన ఆలోచన, మనసులోని మాట ముందుగా ఎల్లో మీడియా ద్వారా జనంలోకి వస్తుంది. సదరు ఆలోచనకు జనం నుంచి వ్యతిరేకత రాకపోతే ఇక విజృంభిస్తారు. వస్తే మాత్రం తాత్కాలికంగా కొంతకాలం సద్దుమణుగుతారు. అదును కోసం వేచి చూస్తారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో జరిగిందదే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ముందు ఎల్లో మీడియాను ఉసిగొలిపారు. జనంలో వ్యతిరేకత కనబడటంతో చంద్రబాబు తాత్కాలికంగా సర్దుకున్నారు. కొంతకాలం తర్వాత విశాఖపట్నం జిల్లాలో రోడ్డుపక్కనున్న జన సమూహంతో ముచ్చటిస్తూ మరోసారి మనసులోని మాటను బయటపెట్టారు. మఖం మీద గుద్దినంత స్పష్టంగా జనం వ్యతిరేకించడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. బలహీనవర్గాల అభ్యున్నతి పట్ల, సాధికారత పట్ల ఆయనే స్వయంగా తన వ్యతిరేకతను పలుమార్లు బయట పెట్టుకున్న వ్యక్తి కనుక, పేదపిల్లలకు ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించడంలో ఎప్పటికీ తగ్గరు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన గానీ, ఎల్లో మీడియా గానీ బహిరంగంగా వ్యతిరేకించడం కష్టం. కానీ ద్రౌపదీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఈ కూటమి అసహనం స్పష్టంగా బయటకు వచ్చింది. ఉపరాçష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా గట్టిగా కోరుకున్న విషయం వాస్తవం. తప్పేమీ కాదు. ఆయన తెలుగువాడు కనుక, ఆయన రాష్ట్రపతి అయితే బాగుంటుందనుకోవడంలో ఏ దోషమూ లేదు. తెలుగుదేశం వారే కాదు. తెలుగువాళ్లందరూ సంతోషిస్తారు. కానీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవలసింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ తన జాతీయ అవసరాల కోసం, వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. అది సహజం. కానీ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక గిరిజన మహిళను మొట్టమొదటిసారిగా, అదీ ఆజాదీ అమృత మహోత్సవ సందర్భంలో ఎంపిక చేయడం స్వాగతించవలసిన విషయం. రాజకీయ ఎజెం డాలను పక్కన పెట్టి మద్దతు ఇవ్వవలసిన సందర్భం. కానీ ముర్మూ అభ్యర్థిత్వం పట్ల ఎల్లో ముఠా ఒక్క మాటయినా మాట్లాడకుండా, వెంకయ్యనాయుడును ఎంపిక చేయకపోవడం తెలుగు జాతిని అవమానించడమే అనే పాటను అందుకున్నది. అభ్యర్థి ఎంపికకు ఒకటి రెండు రోజుల ముందు ‘ఆయన అత్యున్నత పదవిలో ఉండాలని దేశం కోరుకుంటున్నట్టు’ ప్రత్యేక కథనాలు ఎల్లో మీడియాలో వచ్చాయి. ఎంపిక రోజున ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. ‘యోగా డే’లో పాల్గొన్నారు. వెంటనే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడంతో ఎల్లో ఛానల్స్‌లో కూడా హడావిడి మొదలైంది. ‘రాష్ట్రపతిగా మన వెంకయ్య’ అంటూ ప్రత్యేక చర్చాగోష్ఠులు నడిపారు. చివరకు ద్రౌపదీ ముర్మూను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఒక యాంకరైతే దక్షిణ భారతదేశం విడిపోవడం తప్ప మరో మార్గం లేదన్నట్టుగా మాట్లాడారు. వెంకయ్యను రాష్ట్రపతిని చేయకపోవడం వల్ల దక్షిణ భారతదేశం విడిపోవాలనే ఆలోచన చాలామందిలో వచ్చేసినట్టు ఆయన కనిపెట్టేశాడు. మరో చానల్ తన విచిత్ర కథనాన్ని నడిపింది. ఈ కథనం ప్రకారం రాష్ట్రపతి ఎంపికలో బీజేపీ బుర్ర లేకుండా వ్యవహరించింది. వెంకయ్యను ఎంపిక చేసి వుంటే తెలంగాణ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం వాళ్లు బీజేపీకి సహకరించే వారు. వారి మద్దతు లేకుండా తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? గోల్డెన్ ఛాన్స్‌ను బీజేపీ మిస్ చేసుకుంది... ఇలా సాగిందా కథనం. తెల్లారేసరికల్లా ఆ రెండు పత్రికల్లో విషాద కథనాలు... వెంకయ్యను మోసం చేశారు. వెంకయ్య ఎంత చేశారు మోదీకి! ఆయన ప్రధాని కావడానికి మన వెంకయ్యే కారణం. మోదీకి కృతజ్ఞత లేదు... ఇదీ సారాంశం. అంతా ఎల్లో మీడియా హడావిడే తప్ప రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి వెంకయ్య నాయుడు ఎక్కడా ఎవరితో మాట్లాడింది కూడా లేదు. ముర్మూ అభ్యర్థిత్వం గురించి తెలిసో తెలియదో కానీ, పార్టీ అవసరాల గురించీ, ఆలోచనల గురించీ ఆయనకు తెలిసే ఉంటుంది. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే తన ఆశీస్సుల కోసం వచ్చిన ముర్మూను సాదరంగా ఆహ్వానించారు. ఆయన ముఖంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనబడలేదు. కనిపించిన అసంతృప్తి ఛాయలు, విషాద ఛాయలన్నీ ఎల్లో మీడియాలోనే! ఎల్లో మీడియా అంటే చంద్రబాబు చేతిలోని మైకు తప్ప మరొకటి కాదు. కనుక ఎల్లో మీడియా విషాదమే చంద్రబాబు విషాదం. చంద్రబాబు విషాదమే తెలుగుదేశం పార్టీ విషాదం. అసలెందుకింత విషాదం? కోస్తా జిల్లాల్లోని ఒక బలమైన సామాజిక వర్గానికి ఈ ఎల్లో ముఠా తనను తాను వ్యాన్‌గార్డ్‌గా భావించుకుంటున్నది. ‘మీ రక్షకులం మేమే’నని సదరు సామాజిక వర్గాన్ని ఈ ముఠా భ్రమింపజేస్తున్నది. నిజానికి అనేక దశాబ్దాల కిందనే కృషితో, క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చిన సామాజిక వర్గమది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, అభ్యుదయవాదులు, హేతువాదులు, క్రాంతి కారులు ఆ వర్గం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత క్రమంగా అక్కడక్కడా కుక్కమూతి పిందెలు పడటం ప్రారంభమైంది. ఈ కుక్కమూతి పిందెలన్నీ కలిసే ఎల్లో సిండికేట్‌గా ఒక ముఠా ఏర్పాటైంది. ప్రగతిశీల సామాజిక వర్గంగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఈ ముఠా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీల్చి పిప్పిచేస్తున్నదని చాలామంది ప్రముఖులు ఇప్పుడు వాపోతున్నారు. వెంకయ్యనాయుడు ఈ ఎల్లో పార్టీతో సంబంధం లేని వేరే పార్టీకి జాతీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ వల్లనే తాను ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని గర్వంగా చెప్పు కుంటారు. ఆయన ఎల్లో ముఠా కబ్జా చేసిన సామాజిక వర్గంలో పుట్టినవారే. కనుక, ఆయన అత్యున్నత పదవిలో ఉంటే మన పార్టీని కష్టకాలంలో ఆదుకుంటారనేది ఎల్లో ముఠా తలపోత. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి బీజేపీకి బద్ధవిరోధం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉందన్న ఉద్దేశంతో కాబోలు, చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి వెంకయ్యనాయుడు ఢిల్లీ స్థాయిలో సహకరించి ఉంటారు. అందువల్ల ఆయన రాష్ట్రపతి కావాలని ఎల్లో ముఠా గట్టిగానే కోరుకున్నది. అయితే రాష్ట్రంలో ఆయన సొంత పార్టీ నేతలెవ్వరూ కూడా ముర్మూ ఎంపికను వ్యతిరేకించలేదు. పైగా స్వాగతించారు. ఎల్లో ముఠా కోరుకున్నట్టు ఏ ఉద్యమమూ జరగలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. పైగా ఎల్లో మీడియా ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఆశాభంగం చెందిన ఎల్లో మీడియా కొత్త ఎత్తు వేసింది. తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. ఇదా సందర్భం? ఒక అద్భుతమైన చరిత్ర పురుడు పోసుకోబోయే వేళ భ్రూణహత్యకు పురిగొల్పుతున్నది ఈ ముఠా. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఏ శక్తులు కుయుక్తులు పన్నాయో ఆ శక్తులన్నీ ఇప్పుడు ‘బేరాల’ పాట పాడుతున్నాయి. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు. అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్‌ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్‌ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్‌పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే తమ పదవుల్లో కొనసాగుతారు. ‘సంప్రదాయాలకు’ భిన్నంగా రాష్ట్రపతి తమ పూర్తి విచక్షణాధికారాలను ఉపయోగించుకోవచ్చు. బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ప్రతిపక్షాలు, అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. 1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రేరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, అంతరాత్మ ప్రబోధం అన్న నినాదంతో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరహగిరి వెంకట గిరి నెగ్గిన ఏకైక సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్టాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగడం మున్నెన్నడూ జరగలేదు. తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నిక కావాలని ఇందిరా గాంధీ పట్టుబట్టడం వెనుక స్పష్టమైన కారణం ఉందనేది జగద్విదితం. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్’ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేష అధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుండి తొలగించ డానికి సిండికేట్ పన్నిన కుట్రలో భాగంగానే తనకు ఇష్టంలేని అభ్యర్థిని ఎంపిక చేశారని ఇందిరాగాంధీ పసిగట్టారు. కారణాలు ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆయన పార్టీ లోనూ, పార్టీ వెలుపలా నరేంద్ర మోదీకి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, బీజేపీకి వ్యతిరేకంగా బలడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వ త్రిక ఎన్నిక తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్ర పతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. ఇందిరా గాంధీ హయాంలో లాగా బీజేపీలోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అవుతే మంచిదని భావిస్తుండవచ్చు కూడా. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటిష్ నమూనానూ, అక్కడి సంప్రదాయాలనూ మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటిష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంతమేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే గానీ ప్రధానిది కాదు. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలనూ, సూచనలనూ స్వీక రిస్తారని ఆర్టికల్ 74లో పేర్కొన్నారు. ఎన్నో ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తారు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమిషన్లను కూడా వారే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. ఆయన ఆమోదం కొరకు పార్లమెంటు అంగీకరించిన అన్ని బిల్లులూ రావాల్సిందే. ఆయన వాటిని ఆమోదించనూవచ్చు, తిరస్కరించనూవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపనూవచ్చు. రాజ్యాంగాధికార చక్రవర్తులతో (కాన్స్టిట్యూషనల్ మోనార్క్స్) రాష్ట్రపతి పాత్రను పోల్చవచ్చు. రాష్ట్రపతి అధికారాలను కార్యనిర్వా హక, శాసన, న్యాయ, మిలిటరీ, దౌత్య, ఆర్థిక, ఎమర్జెన్సీపరమైనవిగా విభజించవచ్చు. కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి ప్రధాన మంత్రినీ, ఆయన మంత్రివర్గ సహచరులనూ నియమించి వారికి పోర్ట్‌ఫోలియోలను కేటాయించడం జరుగుతుంది. ఆయన ద్వారా నియామకమైన వీరందరినీ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పద్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందు పరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్ష ణాధికారం. రాష్ట్రపతి దేశాధినేత అయితే, ప్రధాని కేవలం ప్రభుత్వా ధినేత మాత్రమే. దేశాధినేతగా, ఎవరిని ప్రభుత్వాధినేతగా ఎంపిక చేయాలనే విషయంలో, రాష్ట్రపతికి సంపూర్ణ హక్కు, విచక్షణాధికా రాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్‌లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. విక్టోరియా మహారాణి 1894లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించారు. తిరిగి 1957లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, ప్రధాని కావాల్సిన బట్లర్‌కు బదులుగా హెరాల్డ్ మాక్‌మిలన్‌ను ఆ పదవిలో నియమిం చారు. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్జర్వేటివ్ పార్టీ తమ నాయ కుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, గుల్జారీ లాల్ నందాను ప్రధానమంత్రిగా నియ మించారు. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. కాకపోతే రెండు సార్లు కూడా నందా కేవలం ఆపద్ధర్మ ప్రధానిగానే కొనసాగారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో... వీపీ సింగ్‌ను ప్రధానిగా నియమించడానికీ, ఆ తరువాత ఆయన రాజీ నామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీనీ, తరువాత చంద్రశేఖర్నూ ఆహ్వానించడానికీ, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షణా ధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు. 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్‌ను ఆహ్వానించడంలో, తరువాత మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వ కుండా ఉండటంలో, చరణ్ సింగ్‌ను చివరకు ప్రధానిగా నియమించ డంలో రాష్ట్రపతి వ్యవస్థకున్న విశేష అధికారాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఆ తరువాత చరణ్ సింగ్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అప్పటికి అదే మొదటిసారి. 25 రోజు ల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్‌కు వెళ్ళని మొదటి, చివరి ప్రధానిగా మిగిలిపోయారు. లోక్‌సభను రద్దు చేయ మన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కానీ ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. చరణ్ సింగ్‌ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి కోరడానికి కారణం, రాజ్యాంగపరమైన బాధ్యతే. ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందూ జరిగే అవకాశాలు లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానినీ, ఆయన ప్రభుత్వాన్నీ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఒక వేళ రాష్ట్రపతే కనుక తన విశేష–విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించు కోకపోతే, పదవీ స్వీకారం చేసినప్పుడు చెప్పే ‘‘రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ’’ అనే మాటలకు అర్థం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో? వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్ఓ మొబైల్: 80081 37012 -
ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు!
ఆటలోనైనా, వేటలోనైనా... గెలవాలంటే వ్యూహం ముఖ్యం. రాజకీయాలకూ అది వర్తిస్తుంది. ఆ సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తెలిసినంతగా విపక్షాలకు సైతం తెలిసినట్టు లేదు. భారత రాష్ట్రపతి పీఠానికి తాజాగా అధికార, విపక్ష కూటములు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తీరు అచ్చంగా అలాంటిదే. అభ్యర్థి ఎవరన్నది గుట్టుగా ఉంచి, మంగళవారం దాకా మంతనాలు సాగించిన బీజేపీ, చివరకు తన భాగస్వామ్య పక్షాలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి’ (ఎన్డీఏ) అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూ పేరు బయటపెట్టింది. ఒక మహిళను, అందులోనూ ఆదివాసీని అభ్యర్థిగా ప్రకటించి, ఆటలో మొదటి బంతిలోనే ప్రతిపక్ష కూటమిని దాదాపు అవుట్ చేసింది. మరోపక్క బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కలసి యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాయి. కానీ, అభ్యర్థి ఎంపికకే కష్టపడిన విపక్షాలు రేపు ఎన్నికలలో గట్టి పోటీనిస్తామన్న నమ్మకం మాత్రం కలిగించలేకపోయాయి. కిందిస్థాయి నుంచి పైకొచ్చిన ద్రౌపది ప్రస్థానం ఆసక్తికరం. ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. నీటిపారుదల శాఖలో క్లర్కుగా మొదలై, టీచరుగా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలరై, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆమెది. 2007లో రాష్ట్ర ఎమ్మెల్యేలలో బెస్ట్‌గా ఎంపికైన ఆమె నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ – బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించి పేరు తెచ్చుకోవడం విశేషం. మునుపు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ఈ సంథాల్ మహిళ సామర్థ్యానికి కొదవ లేదు. అయితే, అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికలో ఆమె సమర్థత కన్నా మహిళగా, ఆదివాసీగా ఆమె అస్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చారనేది విశ్లేషకుల వాదన. పైపెచ్చు, ఉత్తర, దక్షిణ భారతావనుల నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళను బరిలోకి దింపడం బీజేపీకి సామాజిక, రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెట్టే తురుఫుముక్క. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో దూరమైన ఆదివాసీ ఓటర్లను ఆకర్షించడానికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మహిళల– దేశంలోని 10 కోట్ల గిరిజనుల ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికీ బీజేపీకి ఇదొక మంచి ఛాన్స్. రాగల రెండేళ్ళలో గుజరాత్ సహా అనేక ఎన్నికలున్న వేళ ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలని ఆలోచించాకే ఆమెను అభ్యర్థిగా ప్రకటించారనుకోవచ్చు. మరోపక్క కారణాలు ఏమైనా, వయస్సు, అనుభవం ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ – ముగ్గురూ విపక్ష రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీకి నిరాకరించడం గమనార్హం. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిగా పని చేసి, జనతా పార్టీలో చేరి, ఆ పైన బీజేపీకి వలస వచ్చి, 2014లో మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరిచి, ఆనక పార్టీనీ, క్రియాశీలక రాజకీయాలనూ వీడి ఆయనకు తీవ్ర విమర్శకుడిగా మారిన యశ్వంత్ సిన్హా విపక్షాలకు దిక్కయ్యారు. 2020 బెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయ, సామాజిక అనుభవం మెచ్చ దగినదే. విపక్షాల చర్చల్లో ఆది నుంచీ ఆయన పేరు వినపడింది. విపక్షాలు మొదట ఇతర అభ్యర్థుల వైపు మొగ్గినా, చివరకు ప్రత్యామ్నాయాలు కరవయ్యాక సిన్హా పేరుకే సరే అనాల్సి వచ్చింది. ఆయన కాషాయ గతాన్ని పట్టించుకోనట్టు ప్రవర్తించాల్సి వచ్చింది. అయితే, ఆయన గెలుపు కష్టమే. నిజానికి, మండల్ కమిషన్ రోజుల నుంచి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తూ వచ్చిన అస్తిత్వ రాజకీయాల ఛాయలోకి రాష్ట్రపతి భవన్ వచ్చి చాలాకాలమైంది. దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్‌ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విశ్లేషణలూ లేకపోలేదు. అంత మాత్రాన ఆ మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ దృష్టితోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్‌నాథ్ కోవింద్‌తో, ఇప్పుడు అందుకు కొనసాగింపుగా ద్రౌపదితో బీజేపీ తిరుగులేని పాచిక విసిరింది. దుర్భర దారిద్య్రం నుంచి పైకొచ్చిన ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిస్తూనే, ఓటర్లకు పార్టీ నుంచి తగిన రాజకీయ సూచనలు చేసినట్టయింది. అలా అటు సామాజిక మార్పు, ఇటు రాజకీయ బలం – రెండూ సమకూరాలన్నది వ్యూహం. వ్యూహం నుంచి, ఓట్ల అంకెల దాకా అన్నీ అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే అనుకూలంగా ఉన్న వేళ... రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను నెల ముందే ఇప్పుడే ఇట్టే ఊహించవచ్చు. అటు మహిళ, ఇటు ఆదివాసీ కావడంతో ద్రౌపది అభ్యర్థిత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించడం కష్టమే. ఒడిశా మూలాల రీత్యా నవీన్ పట్నాయక్ బీజేడీ సైతం ఆమెకే జై కొడుతుంది. ఎలక్టోరల్ కాలేజీలో సానుకూలతతో ఆమె గెలుపు నల్లేరుపై బండి నడకే. అద్భుతాలేమైనా జరిగితే తప్ప అతి పిన్నవయసు రాష్ట్రపతిగా ద్రౌపది అత్యున్నత పీఠంపై అధివసిస్తారు. 75 ఏళ్ళ స్వతంత్రభారతంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డుకెక్కుతారు. ఇన్నేళ్ళకైనా దేశ అత్యున్నత పీఠం గిరిజనులకు దక్కడం స్వాగతించాల్సిన విషయం. రాజకీయ ఎత్తుగడగానైనా, సామాజిక మార్పు తెచ్చే నిర్ణయం తీసుకున్నందుకు ఎన్డీఏను అభినందించాల్సిందే. ఇలాగే మహిళలకూ, గిరి జనులకూ పెద్దపీట వేయడాన్ని ఇతర రంగాల్లోనూ పాలకపక్షం కొనసాగిస్తే తప్పక హర్షించాల్సిందే. -
ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?
న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ముని ప్రతిపాదించడానికి ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ని సంప్రదించి మరీ ఆమె పేరును ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేడీ ఆమెకు మద్దతు ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు మోదీ ప్రభుత్వం ఆమె పేరునే ఎందుకు? ప్రస్తావించింది. ఆమెకే ఈ అత్యున్నత పదవిని ఎందుకు? పట్టం గట్టాలనుకుంటోంది వంటి రకరకాల ప్రశ్నలు అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే... ఇంతకీ ఆమె ఎవరంటే... ఐతే గతంలో బీజేపి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితవ్యక్తిని రాష్ట్రపతిగా చేసి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. మళ్లీ ఇప్పుడూ అందరీ అంచనాలను తారుమారు చేస్తూ... మోదీ చెబుతూ ఉండే సబ్కా సాథ్ సబ్ కా బిస్వాస్ నినాదానికి అద్దం పట్టేలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్ంత్ సిన్హా పై పోటీ చేయనున్నారు. ద్రౌపది ముర్ము ఒక సాధారణ గిరిజన మహిళ. ఆమె 1997లోఒడిశాలోని రాయరంగ్‌పూర్ నగర్ పంచాయితీలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 2000లో బీజేపీ-బీజేడీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015 లో జార్ఖంఖ్ గవర్నర్‌గా అత్యున్నత పదవిని అలంకరించారు. అంతేకాదు ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆమెకు విభిన్న పరిపాలనా అనుభవం ఉంది. ఈ మేరకు ద్రౌపరి ముర్ము మాట్లాడుతూ...ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి పదవికి నామినేట్ అయ్యానని తెలుసుకుని చాలా ఆనందించానన్నారు. తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదన్నారు. ఒడిశా శాసనసభ్యులు, ఎంపీలు తనకు మద్దతిస్తారని విశ్వాసిస్తున్నాని చెప్పారు. అంతేకాదు తాను ఒక గిరిజన పుత్రికగా, ఒడియాగా నాకు మద్దతు ఇవ్వండని సభ్యులందరిని అభ్యర్థించే హక్కు కూడా ఉందని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనుందన్న వార్త తెలియగానే ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె నివశించే మయుర్‌భంజ్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే గనుక గిరిజన మహిళగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఖ్యాతీ గాంచుతుంది. (చదవండి: ‘మహా’ సంకటం: ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్!) -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో యాశ్వంత్ సిన్హా
-
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??