
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అదే పాట పాడుతున్నారు. ఎన్నికల్లో తానే అసలైన విజేతని మళ్లీ చెప్పుకున్నారు. పూర్తి స్థాయిలో రిగ్గింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో మోసం చేసి మరీ బైడెన్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నారని ఆరోపించారు. ‘‘డెమొక్రాట్లు మోసం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. అలా రిగ్గింగ్ చేసిన ఎన్నికల్లో బైడెన్ విజేతగా నిలిస్తే, నేను ఓడిపోయాను’’ అని అన్నారు. జనవరి 5న జరగనున్న స్పెషల్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున శనివారం జార్జియాలో ప్రచారం చేసిన ట్రంప్ ఈ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ‘‘నేను నిజంగా ఓడిపోయి ఉంటే ఆ పరాజయం చాలా గొప్పగా ఉండేది. అప్పుడు నేనే ఓడిపోయానని చెప్పుకొని నా ఇంటికి వెళ్లిపోయేవాడిని’’ అని పేర్కొన్నారు. బైడెన్ విజయం ఖరారయ్యాక ట్రంప్ ప్రజల మధ్యన మాట్లాడడం ఇదే తొలిసారి. (చదవండి: రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..)
Comments
Please login to add a commentAdd a comment