Rigging
-
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు. -
పచ్చ మూక రిగ్గింగ్.. బయటపడ్డ సంచలన నిజాలు
-
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్‌కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్‌లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్‌లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్‌లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్‌ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్‌లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్, కాసు మహేష్‌రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్‌నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్‌కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్‌కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి -
‘రిగ్గింగ్’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. మిగతా వాటి సంగతేంటి? ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధంపోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్‌కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు? రీపోలింగ్‌కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. బాబు నోట నీతులా..?నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్‌లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి. -
కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం
సాక్షి, అమరావతి: ఏ విధంగా అయినా సరే పోలింగ్ రోజు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి టీడీపీ తొక్కని అడ్డదారులంటూ లేవు. గూండాయిజం, దౌర్జన్యం, బెదిరింపులు, రిగ్గింగ్.. ఇలా అన్ని విధాలా అక్రమాలకు పాల్పడింది. ఎక్కడైనా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గట్టిగా ప్రతిఘటిస్తే ఈసీ అండతో పోలీసులను అడ్డుపెట్టుకుని ఎదురు దాడులు చేస్తూ.. ‘పచ్చ’ మూక ఎదురు కేసులు పెడుతోంది. నానా యాగీ చేస్తూ రాద్ధాంతం చేస్తోంది. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే ‘ఫ్యాన్’ గుర్తుపై రెండు బటన్లు నొక్కి.. ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున స్పందిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘోర పరాజయం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళనకు గురై ధ్వంస రచనకు తెరలేపారు. పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించడం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఓట్లు వేసేందుకు బయటకు రాకుండా చేయాలని కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పోలింగ్ రోజు (ఈనెల 13న) ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను గొడవలకు ఉసిగొల్పారు. దీంతో వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దారుణకాండ వెబ్ కాస్టింగ్‌లో లైవ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ గూండాల పైశాచికత్వానికి వత్తాసు పలికారు. టీడీపీ రౌడీల అరాచకాలను అడ్డుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, ఎస్పీలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోన్లు చేసినా, వారు స్పందించలేదు. మాచర్ల నుంచి తాడిపత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ రౌడీల దారుణకాండ మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓట్లు వేసేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఈ అరాచక పర్వం గురించి ఓటర్లు మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పిన్నెల్లి ఫిర్యాదు చేసేందుకు పదే పదే ఫోన్లు చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిచి.. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు పిన్నెల్లి పాల్వాయిగేటుకు చేరుకున్నారు. టీడీపీ రౌడీల దారుణకాండను అడ్డుకునే యత్నం చేశారు. తమ కుట్ర విఫలమవడంతో పిన్నెల్లిపై పచ్చమూక దు్రష్ఫచారం చేస్తోంది.బడుగులపై దాడులు.. ఈవీఎంల ధ్వంసం మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ బూత్ 251లో ఓటు వేసేందుకు వచ్చిన ఎస్టీ వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావుపై టీడీపీ రౌడీలు దాడి చేసి, చితకబాదారు. భయోత్పాతం సృష్టించడం ద్వారా ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను బెదరగొట్టాలని కుట్ర చేశారు. మాచర్ల మండలం తుమ్మురుకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు ఏకపక్షంగా ఓట్లు వేస్తుండటంతో టీడీపీ గూండాలు జీరి్ణంచుకోలేకపోయారు. ఎలాగైనా సరే ఆ ఓట్లను చెల్లకుండా చేయాలనే లక్ష్యంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఆ నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో పోలింగ్ సజావుగా జరగకుండా విఘాతం కల్పించడానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. జమ్మలమడుగు నవాజ్ కట్టలోని 116, 117 పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్‌ను అడ్డుకోవడానికి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి భూపే‹Ùరెడ్డి కవ్వింపు చర్యలకు దిగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి సు«దీర్‌రెడ్డిపై రాళ్ల దాడికి దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తేలప్రోలు జెడ్పీ హైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్పించడానికి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలోని పచ్చమంద బరితెగించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలను కవ్విస్తూ దాడికి దిగి భయోత్పాతం సృష్టించింది. -
నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపు
టెక్కలి: కింజరాపు కుటుంబం ఆనవాయితీగా చేస్తున్న రిగ్గింగ్ల పర్వానికి మరోసారి తెరతీసింది. పోలింగ్ ప్రక్రియలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలోని పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్ కింజరాపు అప్పన్నను బెదిరించిమరీ.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు రిగ్గింగ్ చేశారు. తులసీపేట, భగీరథపురం తదితర గ్రామాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీల్లేకుండా టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడలోని 287, 289, 290 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌లు జరిగినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిమ్మాడతో పాటు 16 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌లు చేసినట్టు దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఎదుటే టీడీపీ, బీజేపీ కార్య కర్తలు, నాయకులు వైఎస్సార్సీపీ నాయకు లతో బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. -
దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే..
సాక్షి, అనంతపురం: 'తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అడ్డదారులు తొక్కుతోంది. మైనర్లను ఓటర్లుగా చేర్పించడం.. అనుకూలమైన వారికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించడం చేస్తోంది. అవకాశమున్న చోట్ల భారీగా దొంగ ఓట్లను జాబితాలోకి చేరుస్తోంది. చేసేదంతా చేసి తమకే పాపమూ ఎరుగనట్టు వైఎస్సార్‌సీపీపైకి నెపం నెడుతోంది. జాబితాను పరిశీలిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దొంగ ఓట్ల దందా ఇట్టే తెలిసిపోతుంది.' ఆత్మకూరు రాప్తాడు నియోజకవర్గం తమకు కంచుకోటగా భావిస్తూ వచ్చిన టీడీపీకి 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రజల పక్షాన నిలిచి ఓటర్లను తమవైపు ఆకట్టుకోవడం మరచి.. తప్పుడుదారిని ఎంచుకున్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరుతో పాటు మరికొన్ని మండలాల్లో కొంతమంది టీడీపీ నాయకులు తమకు తగ్గిపోయిన ఓట్ల స్థానంలో బోగస్ ఓటర్ల ద్వారా భర్తీ చేసుకోవాలని భావించారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అవకాశమున్న చోట్ల డబుల్ ఓటు హక్కుకు దరఖాస్తు చేయించారు. చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లిళ్లయ్యి మెట్టినిళ్లకు వెళ్లిపోయినా.. వారి ఓట్లను స్థానికంగా తొలగించకుండా అలానే ఉంచారు. అంతేకాదు పద్దెనిమిదేళ్లలోపు వయసు కలిగిన వారిని ఓటరుగా చేర్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓటరు జాబితా సవరణలోనూ దొంగ ఓట్లను తొలగించడానికి టీడీపీ నాయకులు ససేమిరా అంటుండటం గమనార్హం. ► ఈ ఓటరు కార్డులో ఉన్న వ్యక్తి పేరు నరేంద్ర చౌదరి. ఈయనకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ► ఈ బాలుడి పేరు మనేరి దేవ నంద. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామం. ఆధార్ వివరాల ప్రకారం 2007 సంవత్సరంలో పుట్టాడు. 16 ఏళ్ల వయసున్న ఈ బాలుడికి టీడీపీ కార్యకర్తలు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేశారు. ► ఈ ఓటరు కార్డులో కనిపించే మహిళ పేరు సాయి గీత. ఈమెకు ఆత్మకూరు మండలం సిద్దరాంపురంలోను, ఉరవకొండ మండలం 9వ వార్డులోను ఓటు హక్కు ఉంది. ► రాప్తాడు మండలం గాండ్లపర్తి గ్రామంలో అలివేలమ్మ స్థానికంగాను, అనంతపురంలోను ఓటు హక్కు కలిగి ఉంది. అలాగే తిమ్మక్కకు గాండ్లపర్తి, అనంతపురంలో రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల టీడీపీ సానుభూతి పరులు రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటమి భయంతోనేనా..? వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఉచితంగా పొలాల్లో బోర్లు వేయించారు. రైతులు, కూలీల వలసలు తగ్గించారు. అనారోగ్యంతో ఉన్న వారిని, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అమ్మ డెయిరీ ఏర్పాటు చేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందేలా చూశారు. ప్రజల్లో ప్రకాష్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం టీడీపీకి పట్టుకుంది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను చేర్చడం ద్వారా ఓటమి నుంచి గట్టెక్కాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని వారికి కూడా రామగిరి మండలంలో ఓటు హక్కు కల్పించినట్లు గతంలో సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. ఇవి చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడంతోనే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో దాదాపు అన్ని పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. శుక్రవారం వికాస్‌రాజ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడిన వారందరికీ నిబంధనల ప్రకారం ఓటేసే అవకా శం కల్పించామని వికాస్‌రాజ్ వివరించారు. అందువల్ల ఆయాచోట్ల రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధికారులు ఈవీఎంలు, ఇత ర సామగ్రిని సర్దుకుని రిసెప్షన్ కేంద్రాలకు చేరు కునే సరికి మరింత ఆలస్యమైందని చెప్పారు. రిసె ప్షన్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. ప్రాథమిక స్రూ్కటినీ తర్వాతే 70.6 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమి కంగా అంచనాకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు కూర్చుని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తుది స్రూ్కటినీ నిర్వహిస్తున్నారని వివరించారు. చాంద్రాయణగుట్ట సహా ఇతర స్థానాల్లో రిగ్గింగ్ జరిగినట్టు వచ్చిన ఫిర్యా దుల మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. స్క్రూటి నీ ముగిశాకే కచ్చితమైన పోలింగ్ శాతంతోపాటు రిగ్గింగ్ ఆరోపణల్లో నిజానిజాల పై స్పష్టత వస్తుందని.. ఆయా అంశాల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంతంగా పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్‌రాజ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నట్టుగా ధ్రువీకరించుకున్నామ ని వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.158పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయాచోట్ల కొత్త ఈవీఎంలను పెట్టి పోలింగ్ నిర్వహించామని.. దీనివల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 45 నిమిషాల వరకు ఆలస్యమైందని అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్ వివరించారు. నాగార్జున సాగర్ అంశానికి ఎన్నికలతో సంబంధం లేదు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగభాగాన్ని ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న ఘటనకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. డీప్ ఫేక్, ఇతర తప్పుడు ప్రచారాల ఆరోపణలపై సోషల్ మీడియాలోని 120 లింక్‌లను తొలగించామన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై విశ్లేషణ జరుపుతామన్నారు. డబ్బులు పంచుతూ కొందరు అభ్యర్థులు, వారి బంధువులు పట్టుబడిన ఘటనలపై స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రులపై కేసులు నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో 13వేలకుపైగా కేసులు పెట్టామని వికాస్‌రాజ్ వివరించారు. భారీగా పెరిగిన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని వికాస్‌రాజ్ తెలిపారు. 16,005 మంది 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, 9,459 మంది దివ్యాంగ ఓటర్లు, 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ రిజర్వ్డ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. 500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14+14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. 119 స్థానాలకు సంబంధించి 1,766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయని.. వీటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయని వివరించారు. ఉదయం 10.30 కల్లా లీడ్‌పై స్పష్టత కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వికాస్‌రాజ్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడితే.. సమాంతరంగా ఈవీఎం ఓట్ల లెక్కింపూ మొదలవుతుందన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా కౌంటింగ్‌లో ముందంజలో ఉన్న అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వికాస్‌రాజ్ అంచనా వేశారు. కొన్ని స్థానాల్లో అధిక పోలింగ్ జరగడం, చాలాచోట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు
Miss World 2000: గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాపై మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ 2000 పోటీలో రిగ్గింగ్ చేసి ప్రియాంక గెలిచిందంటూ ఆమె షాకింగ్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా ఇటీవల జరిగిన యూఎస్ఏ 2022(Miss USA 2022) పోటీల్లో రిగ్గింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో టెక్సాస్‌కు చెందిన రాబోన్ గాబ్రియేల్ కిరీటం గెలుచుకుంది. చీటింగ్ చేసి ఆమె గెలిచిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ లీలానీ ఓ యూట్యూబ్ వీడియో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ యూఎస్ఏ 2022 పోటీల్లో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్ని గెలిపించారని వ్యాఖ్యానించింది. అనంతరం ‘మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు. మిస్ వరల్డ్ 1999లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 సంవత్సరంలో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది. అప్పడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాను. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్‌లో అందరూ బికినీలు వేసుకుంటే.. ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా న్యాయనిర్ణేతలు ఆమెను క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది’ అని పేర్కొంది. అలాగే ఈ పోటీలో ప్రియాంకను ప్రత్యేకంగా చూసేవారు. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ ఈ పోటీల్లో పాల్గొన్న అందరికి జాసన్ వు డిజైనర్‌గా వ్యవహరించాడు. మా అందరికి ఒకే రకమైన ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. కానీ ప్రియాంకకు మాత్రం స్పెషల్‌గా డిజైన్ చేశాడు. ఇక 1999లోనే యుక్తాముఖి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. అలాగే 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్ నిలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు’ అంటూ బార్బడోస్ పేర్కొంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి. -
డూయింగ్ బిజినెస్ నివేదిక నిలిపివేత
వాషింగ్టన్: వివిధ దేశాల్లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులకు సంబంధించి విడుదల చేసే ’డూయింగ్ బిజినెస్’ నివేదికను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది. చైనాతో పాటు కొన్ని దేశాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇందుకు కారణం. 2018, 2020 నివేదికల్లో డేటాపరమైన అవకతవకలు, బ్యాంకు సిబ్బంది నైతిక విలువలు పాటించకపోవడం వంటి ఆరోపణలపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన నేపథ్యంలో డూయింగ్ బిజినెస్ నివేదికను నిలిపివేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్, సీఈవో క్రిస్టలీనా జార్జియేవా.. ఆమె సలహాదారు ఒత్తిడి మేరకు చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బంది డేటాను మార్చేశారని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయసేవల సంస్థ విల్మర్హేల్ నిర్ధారించింది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి డైరెక్టరుగా ఉన్న జార్జియేవా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. విచారణ నివేదికలో వెల్లడైన విషయాలతో విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రపంచ బ్యాంకు ఈ వివాదంపై సమగ్రమైన విచారణ నిర్వహించాలని, విశ్వసనీయతను పాటించాలని చైనా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత రెండు దశాబ్దాలుగా ఐఎంఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై పట్టు సాధించేందుకు చైనా ప్రయతి్నస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ట్రంప్ నోట అదే మాట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అదే పాట పాడుతున్నారు. ఎన్నికల్లో తానే అసలైన విజేతని మళ్లీ చెప్పుకున్నారు. పూర్తి స్థాయిలో రిగ్గింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో మోసం చేసి మరీ బైడెన్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నారని ఆరోపించారు. ‘‘డెమొక్రాట్లు మోసం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. అలా రిగ్గింగ్ చేసిన ఎన్నికల్లో బైడెన్ విజేతగా నిలిస్తే, నేను ఓడిపోయాను’’ అని అన్నారు. జనవరి 5న జరగనున్న స్పెషల్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున శనివారం జార్జియాలో ప్రచారం చేసిన ట్రంప్ ఈ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ‘‘నేను నిజంగా ఓడిపోయి ఉంటే ఆ పరాజయం చాలా గొప్పగా ఉండేది. అప్పుడు నేనే ఓడిపోయానని చెప్పుకొని నా ఇంటికి వెళ్లిపోయేవాడిని’’ అని పేర్కొన్నారు. బైడెన్ విజయం ఖరారయ్యాక ట్రంప్ ప్రజల మధ్యన మాట్లాడడం ఇదే తొలిసారి. (చదవండి: రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..) -
చంద్రగిరిలో నేడైనా ఓటేయనిస్తారా?
-
చంద్రగిరిలో రిగ్గింగ్‌కు ఇవిగో సాక్ష్యాలు!
సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడాన్ని తప్పుబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. చంద్రగిరిలో రిగ్గింగ్ జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో సాక్ష్యాలను చూపడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఐదు కేంద్రాల్లో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన తీరును వీడియో ఫుటేజీ ద్వారా చంద్రబాబుకు చూపించినట్లు తెలిసింది. మొత్తం 7 కేంద్రాలకు సంబంధించి ఫిర్యాదులు అందగా రెండు కేంద్రాల్లో కెమెరాలు పని చేయకపోవడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాటిని వదిలేశామని కేంద్ర ఎన్నికల కమిషనర్లు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రిగ్గింగ్‌పై చంద్రబాబు మారు మాట్లాడకుండా తాము ఇప్పటివరకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్య తీసుకోలేదని విన్నవించారు. అయితే రిగ్గింగ్‌కు సంబంధించి ఆధారాలుంటే సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో చంద్రబాబు మౌనం వహించారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అశోక్ లావాసా, çసుశీల్చంద్రలను కలసినప్పుడు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బట్టబయలైన బూత్‌ల ఆక్రమణ ఎన్నికల సంఘం వద్ద ఉన్న వీడియోల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసిన తీరు నిక్షిప్తమైంది. ఐదు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు బూత్‌ల ఆక్రమణలకు పాల్పడగా ఇందుకు ఎన్నికల సిబ్బంది సహకరించారు. ఓటర్లు క్యూలో నిలబడడం, సిబ్బంది దగ్గరకు వెళ్లడం, తమ పేరు చెప్పడం, ఆ తరువాత చివరగా ఓటేసినట్టుగా సిరా గుర్తు పెట్టడం, బయటకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోల్లో నిక్షిప్తమయ్యాయి. ఓట్లేయాల్సిన ఈవీఎంల వద్ద ముగ్గురు చొప్పున టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసినట్లు సమాచారం. మా ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు ఈసీతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మళ్లీ మళ్లీ ఎన్నికల సంఘం వద్దకు రావాల్సి వస్తోంది. చాలా బాధ పడుతున్నా. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈసీని ప్రశ్నిస్తున్నాయంటే బాధ్యతగా వ్యవహరించడం లేదనే లెక్క. మొన్ననే ప్రధాని ఎంపైర్(ఎన్నికల సంఘం) పై కావాలని విమర్శలు చేస్తున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. ఈసీ చేసిన తప్పులను ప్రశ్నించటానికే వచ్చాం. 25 రోజుల తరువాత చంద్రగిరిలోని ఐదు బూత్‌ల్లో రీ పోలింగ్‌కు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో హోం కార్యదర్శి సీఈవోకు ఒక లేఖ రాశారని ఆయన్ను బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారనే కారణంతో బదిలీ చేశారు. మరి ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు స్పందిస్తూ 5 బూత్‌ల్లో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ఇది పక్షపాత ధోరణి. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని మేం అడిగాం. మా ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తే ఇప్పుడు తీసుకుంటామని చెబుతున్నారు. మేం ప్రశ్నించాం కాబట్టి మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల రీ పోలింగ్ జరిపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. 9 లక్షల ఓట్లను ఫామ్ 7 ద్వారా తొలగించాలని చూస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇవ్వడం లేదు. ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. నువ్వు రాజకీయ పార్టీ కార్యకర్తవి కాదు.. హోం సెక్రటరీ లేఖ రాస్తే బదిలీ చేశారు. మన దగ్గర సీఎస్ రాస్తే చర్య లేదు. సీఎస్‌కు, ఈ విధులకు సంబంధం లేదు. ఎన్నికల్లో ఎలా జోక్యం చేసుకుంటారు. నువ్వు రాజకీయ పార్టీ కార్యకర్తవి కాదు. ఎన్నికల విధుల్లో లేవు. ఎన్నికల విధుల్లో కలెక్టర్ ఉన్నాడు. ఆయన చేయొచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ చేయొచ్చు. సీఎస్‌కు సంబంధం ఏమిటి?’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఇట్ నాట్ వివక్షత? చంద్రగిరిలో రిగ్గింగ్‌కు సంబంధించి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే రీపోలింగ్‌కు ఆదేశించామని, ఇతర చోట్ల అలాంటివి ఏమైనా ఉంటే టీడీపీ చూపించాలంటూ సీఈవో చెబుతున్నారని మీడియా పేర్కొనగా.. ‘ఇప్పుడు మేం అడిగితే రెండు చోట్ల రీ పోలింగ్‌కు సూచిస్తున్నట్లు చెప్పారు. ఇదేనా నిష్పాక్షికత?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘పశ్చిమ బెంగాల్లో కార్యదర్శిని బదిలీ చేశారు. మన సీఎస్‌ను ఎందుకు బదిలీ చేయరు? ఈజ్ ఇట్ నాట్ వివక్షత?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రగిరిలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అన్న రీతిలో ఎన్నికలు జరిగాయని సీఈవో వ్యాఖ్యానించారని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. ‘ఎక్కడా? ఏపీలోనా? పులివెందుల, వీటన్నింటిలో ఏం జరిగింది? వాళ్ల చిన్నాన్నను చంపేస్తే దిక్కు తెలియలా? ఏం మాట్లాడుతున్నారండీ ఈయన. వాళ్ల చిన్నాన్నను ఇంట్లో చంపేస్తే, సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగాయా? ఏం మాట్లాడతారండీ..? ఎన్నికల సంఘం హద్దులు పెట్టుకుని మాట్లాడాలి. ఒక ప్రాంతంపై వివక్షతో మాట్లాడడం సరికాదు’ అని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలసి పనిచేస్తాం.. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు 21 పార్టీల సమావేశం గురించి మీడియా ప్రశ్నించగా ‘అందరూ ఎన్నికల బిజీలో ఉన్నారు. వర్కవుట్ చేస్తున్నాం..’ అని చంద్రబాబు చెప్పారు. టీఆర్ఎస్ లాంటి పార్టీలను పిలిస్తే మీకు అభ్యంతరం లేదా? అని ప్రశ్నించగా.. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసొచ్చినా కలిసి పనిచేస్తాం..’ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గురించి మరోసారి మీడియా ప్రశ్నించగా ‘ఊహాతీతమైన ప్రశ్నలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఎవరెవరు వస్తారో వారందరికీ స్వాగతం.. ఒక పార్టీని వివక్ష చూపక్కర్లేదు. పార్టీల పేర్లు అవసరం లేదు..’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
రిగ్గింగ్‌పై ఈసీ కొరడా
తిరుపతి రూరల్: అడుగడుగునా అక్రమాలు.. ఓటర్లను భయపెట్టడం, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించడం, పోటీలో ఉన్న అభ్యర్థులను కొట్టడం, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పక్కన పెట్టి బలవంతంగా వారి ఓటును వేసుకోవడం.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనరల్ ఏజెంట్లను తరిమికొట్టడం.. ఇలా ఒకటా.. రెండా ఎన్నికల్లో చేయాల్సిన అన్ని రకాల అక్రమాలు టీడీపీ నాయకులు చేసేశారు. ఏజెంట్లను బయటకు పంపించి యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోవాల్సిన అధికారగణం, ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. తలలు పగులగొట్టారు. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం, పాకాల మండలాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిని పరిశీలించినఎన్నికల కమిషన్ చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదు గత నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల అక్రమాలపై చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం(313), కొత్తకండ్రిగ(316), కమ్మపల్లి(318), ఎన్ఆర్ కమ్మపల్లి(321)తో పాటు పాకాల మండలంలోని పులివర్తివారిపల్లి(103) పోలింగ్ కేంద్రం లోనూ రీ–పోలింగ్ చేయాలని కోరారు. సీసీ ఫుటేజీలు, కలెక్టర్ నివేదికతో.. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదుపై విచారణ చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, ఎన్నికల అధికారులు నుంచి సేకరించిన సమాచారంతో పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలను నిర్ధారించినట్లు సమాచారం. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌కు కలెక్టర్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. సమగ్రంగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ–పోలింగ్‌కు ఆదేశించింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత గ్రామం పులివర్తివారిపల్లి పోలింగ్ బూత్‌లో కూడా రీ–పోలింగ్ జరగడం గమనార్హం. ఆ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీ–పోలింగ్ జరిపిం చాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశిం చింది. ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహిం చాలని సూచించింది. -
బయటపడిన టీడీపీ రిగ్గింగ్ బాగోతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నేతలు యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు రిగ్గింగ్‌కు పాల్పడిన వైనానికి సంబంధించిన ఆధారాలు విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. కురుపాం నియోజకవర్గం కుదుమ పంచాయతీ చినకుదుమలోని బూత్ నంబర్ 152లో ఎన్నికల రోజున(11వ తేదీన) టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకునేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, ఆమె భర్త వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అక్కడికి వెళ్లగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అయితే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న విషయాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు, ఫొటోలు నాలుగు రోజుల తర్వాత బయటపడ్డాయి. ఇందులో టీడీపీ కార్యకర్తలు యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు స్వీయ పర్యవేక్షణలో ఇదంతా జరిగినట్లు తెలిసింది. 950 ఓట్లు ఉన్న ఈ పోలింగ్ బూత్‌లో ఆ రోజు 667 ఓట్లు పోలయ్యాయి. వీటిలో అత్యధిక శాతం ఓట్లను టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ ద్వారా తమ సైకిల్ గుర్తుపైనే వేసేసుకున్నారు. ఆ సమయలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈవో ఎస్.శ్రీనివాసరావుతో పాటు మిగిలిన సిబ్బంది అంతా ప్రేక్షక్ష పాత్రకే పరిమితమయ్యారు. (చదవండి: వ్యూహాత్మకంగా అలజడి..) -
యనమల ఇలాకలో రిగ్గింగ్
సాక్షి, తూర్పుగోదావరి : నేడు జరుగుతున్న పోలింగ్‌లో టీడీపీ నేతలు ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలకు ఒడిగడుతుండగా.. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులే దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. యదేచ్చగా రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపించి టీడీపీ నాయకులు ఓట్లు వేయిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి.. యనమల అనుచరులు దగ్గరుండి మరీ ఓట్లు వేయిస్తున్నారు. ఇంత బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడినా.. అధికారులు, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రిగ్గింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
అది కాంగ్రెస్ ప్రాయోజిత కుట్ర
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని లండన్‌లో సైబర్ భద్రతా నిపుణుడు ఆరోపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రా యోజిత కుట్రలో భాగమని మంగళవారం తిప్పికొట్టింది. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘానికి తలవంపులు తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే సాకులు వెతకడం ప్రారంభించిందని ఎద్దేవా చేసింది. షుజా పాల్గొన్న లండన్ ఈవీఎం హ్యాకథాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి గత ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందిందని సయ్యద్ షుజా అనే నిపుణుడు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. షుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసే, వదంతులు వ్యాపింపజేసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని కోరింది. సిబల్‌కు అక్కడేం పని? కపిల్ సిబల్ ఏ హోదాతో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘సిబల్ అక్కడ ఏం చేస్తున్నారు? ఏ హోదాతో ఆయన అక్కడికి వెళ్లారు? భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన కుట్ర ఇది. అంతా కాంగ్రెస్ రచించిన ప్రణాళిక ప్రకారమే జరిగింది’ అని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతోనే లండన్ కార్యక్రమానికి వెళ్లానన్న సిబల్ వివరణను రవిశంకర్ కొట్టిపారేశారు. ఆ కార్యక్రమానికి హాజరైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియనంత అమాయకుడు సిబల్ కాదని అన్నారు. సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా సైబర్ భద్రతా రంగంలో వస్తున్న మార్పులపై నిత్యం నిపుణులతో మాట్లాడతానని, కానీ తాను సయ్యద్ షుజా అనే పేరును ఎప్పుడూ వినలేదని చెప్పారు. లండన్‌లో జరిగిన ప్రెస్ మీట్ ఒక డ్రామా అని, ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా మీడియా ముందుకు రాకుండానే షుజా పెద్దపెద్ద ఆరోపణలు చేశారని అన్నారు. షుజా మా ఉద్యోగి కాదు: ఈసీఐఎల్ షుజా చెప్పుకున్నట్లుగా ఆయన తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) స్పష్టతనిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను రూపొందించిన ఈసీఐల్ నిపుణుల బృందంలో తానూ ఒకడినని షుజా తెలిపిన సంగతి తెలిసిందే. ఈవీఎంల రూపకల్పనకు షుజాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ సంస్థలో ఉద్యోగి కూడా కాదని ఈసీఐఎల్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్‌కు లేఖ రాసింది. రేడియో ఫ్రీక్వెన్సీతో చొరబడలేం: ఈసీ ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని వాటిని రూపొందించిన నిపుణుల కమిటీ పునరుద్ఘాటించిందని తెలిపింది. ఈవీఎం యంత్రాలు..బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లకు మాత్రమే అనుసంధానమై ఉంటాయని, ఏదైనా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్ మార్గం లో వాటిలోకి చొరబడటం సాధ్యం కాదని నిపుణుల కమిటీని ఉటంకిస్తూ ఈసీ పేర్కొంది. నిర్వాహకుడు కాంగ్రెస్ మనిషి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వయం ప్రకటిత సైబర్ భద్రతా నిపుణుడు షుజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగను రేపాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లండన్‌లో షుజా పాల్గొన్న మీడియా సమావేశం నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ చీఫ్ ఆశిష్ రే కాంగ్రెస్ మనిషని అన్నారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగుడుతున్న రే...కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు వ్యాసాలు రాస్తున్నారని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని తరచూ విమర్శించారని ప్రస్తావించారు. గతంలో లండన్‌లో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై రే స్పందించలేదు. -
పాక్ కింగ్.. ఖాన్!
ఇస్లామాబాద్: పాక్ ప్రధానిగా పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనబడుతోంది. కడపటి వార్తలందేసరికి 104 సీట్లలో గెలిచిన పీటీఐ మరో 14 సీట్లలో ముందంజలో ఉంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్థాపించిన పీఎంఎల్–ఎన్ 58 చోట్ల గెలిచింది. మరో 4 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని పీపీపీ 37 సీట్లలో గెలిచి మరో 6 స్థానాల్లో ముందంజలో ఉంది. పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. అధికారానికి కావాల్సిన 137 స్థానాల మేజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఉంది. కౌంటింగ్ ప్రారంభానికి ముందునుంచే విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీ పార్టీలు రిగ్గింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడా రిగ్గింగ్ జరగలేదని పోలింగ్, కౌంటింగ్ పారదర్శకంగా జరిగాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ముహ్మద్ రజా ఖాన్ గురువారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి.. ఓటింగ్‌లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతున్నందున ఫలి తాలు ఆలస్యంగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన రిజల్ట్స్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కారణంగానే ఆలస్యం జరుగుతోందన్నారు. ‘రిగ్గింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. మా విధులను సమర్థవంతంగా నిర్వహించాం. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. విపక్షాలు ఏమైనా ఆధారాలు సమర్పిస్తే.. చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ప్రావిన్సుల్లోనూ పీటీఐ పీఎంఎల్–ఎన్‌కు కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో పీటీఐ పాగా వేయనుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో పీటీఐ 120 సీట్లలో, పీఎంఎల్–ఎన్ 119 సీట్లలో ముందువరసలో ఉన్నాయి. సింధ్‌లో పీపీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటోంది. 113 స్థానాల్లో వెలువడిన ఫలితాల ఆధారంగా పీపీపీ 72 సీట్లలో భారీ ఆధిక్యంతో ముందుంది. ఖైబర్–ఫక్తున్ఖ్వాలో పీటీఐ భారీమెజారిటీ సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 99 స్థానాల్లో 67 చోట్ల పీటీఐ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బెలూచిస్తాన్ మాత్రం భిన్నంగా హంగ్ దిశగా వెళ్తోంది. బెలూచిస్తాన్ అవామీ పార్టీ 12 చోట్ల, ఎంఎంఏ 9 చోట్ల, బెలూచిస్తాన్ నేషనల్ పార్టీ 8 చోట్ల ముందంజలో ఉన్నారు. -
పార్టీ ఎన్నికల్లోనూ రిగ్గింగేనా?
భరూచ్/సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికను ఒక ప్రహసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్నిక జరగకమునుపే ఫలితం వెల్లడయిందని, ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడవుతారని అందరి కీ తెలిసిపోయిందన్నారు. దీనిని బట్టి సంస్థాగత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వెల్లడయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సురేంద్రనగర్, భరూచ్లలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడగలుగుతారని కాంగ్రెస్‌ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రిగ్గింగ్ ఆనవాయితీగా మారిందన్నారు. ముందుగా ఆ పార్టీలోనే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు. జవహ ర్లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కే అప్పటి పార్టీ సమావేశంలో ఎక్కువ ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారన్నారు. మొరార్జీ దేశాయ్ విషయం లోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా కూడా పార్టీ అంతర్గత ఎన్నికల తీరును తప్పుబట్టారని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ యువనేతను గద్దెపైన కూర్చోబెట్టేందుకు నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. సమాజాన్ని విభజించాలని చూస్తోంది కులాలు, మతాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములమధ్య, ధనిక పేద, వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి, అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆయా కులాల నాయకులు హార్దిక్‌పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి వారితో ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు. వాళ్లు చేయలేని పనిని మేం చేశాం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ. వారు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు కాంగ్రెస్‌కు మంటగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చౌకబారు విమర్శలకు చేస్తున్నారని అన్నారు. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించటం వారికి ఇష్టం లేకుంటే ఎద్దుల బండ్లపై తిరగొచ్చునని ఎద్దేవాచేశారు. జాతీయతే మనల్ని సాయపడేలా చేస్తుంది: మోదీ అహ్మదాబాద్: జాతీయత భావమే తనకు, తన ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా ఉంటూ, క్రైస్తవులు సహా వివిధ వర్గాల ప్రజలకు సాయపడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వ విద్యాప్రతిష్టానమ్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గాంధీనగర్ ఆర్చిబిషప్ థామస్ మెక్వాన్ గత నెలలో క్రైస్తవులకు రాసిన లేఖను ప్రస్తావించారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రార్థన చేయాలని క్రైస్తవులను ఆ లేఖలో కోరటం తనను ఎంతో ఉత్తేజితుడిని చేసిందన్నారు. ఆ లేఖ ప్రతి భారతీయుడికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. -
నిలిచిన ఇసుక అక్రమ తవ్వకాలు
కొవ్వూరు : కొవ్వూరు పరిధిలోని చిడిపి, బల్లిపాడు, గూటాల ర్యాంపులతోపాటు పోలవరంలోని రెండు ఇసుక ర్యాంపులను శనివారం మూసివేశారు. ‘ఈ ర్యాంపుల మాటేమిటో!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాంపుల్లో పనిచేస్తున్న యంత్రాలు, లారీలు ఒడ్డుకు చేరాయి. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు ర్యాంపుల్ని మూసివేసినట్టు సమాచారం. ఆచంట మండలం కోడేరు ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ దాడిచేసి 28 లారీలు, 6 పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అధికార పార్టీ నేతల అండదండలతో పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో యంత్రాలను వినియోగిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, నేతల్లో గుబులు రేగింది. మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ తంతుకు ‘సాక్షి’ కథనంతో బ్రేక్ పడింది. ర్యాంపులు మూసివేసిన వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఆ రెండు శాఖల అధికారులతో మాట్లాడగా.. ర్యాంపుల మూసివేత వ్యవహారం తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు. -
ట్రంప్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాసిన ట్రంప్.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. రిగ్గింగ్ వ్యవహారంపై సొంతపార్టీ (రిపబ్లికన్) నేతలు మౌనంగా ఉండటాన్ని ఆక్షేపించారు. 'ఈ ఎన్నికల్లో కచ్చితంగా రిగ్గింగ్ జరుగుతోంది. వికృతరూపాన్ని సంతరిచుకున్న మీడియా, ఆ మీడియా వెనకేసుకొస్తున్న హిల్లరీ క్లింటన్, ఆమె పార్టీనే ఇందుకు బాధ్యులు. వైట్ హౌస్ కు కూడా ఈ కుట్రలో భాగం ఉంది. ఎన్నికలు జరగబోయే నవంబర్ 8న పలు పోలింగ్ స్టేషన్లలోనూ రిగ్గింగ్ జరగబోతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇది జరిగింది' అని ట్రంప్ అన్నారు. మహిళలపై ట్రంప్ కంపు వ్యాఖ్యలంటూ.. కీలక ఘట్టానికి కొద్ది రోజుల ముందు వరుసగా వీడియోలు వెలుగులోకి రావడం, తద్వారా మీడియా తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు. ట్రంప్ సహచరుడు, ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్(ఇల్లినాయిస్ గవర్నర్) మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మైక్.. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి ట్రంప్ వాటిని అంగీకరిస్తారని అన్నారు. రిగ్గింగ్ వ్యవహారంపై డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గత వారం చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ తప్పుపడుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నమ్ముతున్నట్లు హిల్లరీ చెప్పడం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం కదులుతారని, తద్వారా ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుందని ఆమె వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ అవకాశాలను బట్టే హిల్లరీ అలా మాట్లాడి ఉండొచ్చని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. చివరిసారి అంటే 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 57.5 శాతం ఓటింగ్ నమోదయింది. అదే 2008లో ఓటింగ్ శాతం 62.3గా ఉంది. మొదటిసారి ఒక నల్లజాతీయుడైన ఒబామా అధ్యక్ష రేసులో ఉన్నందున ఓటింగ్ శాతం అమాంతం పెరిగింది. బుష్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన ఎన్నికల్లో(2004లో) 60.4 శాతం, 2000 సంవత్సరంలో 54.2 శాతం ఓటింగ్ నమోదయింది. మునుపెన్నడూలేని విధంగా విత పోకడలున్న 2016 ఎన్నికల్లో ప్రజలు ఏమేరకు ఓటింగ్ లో పాల్గొంటారో మరో 20 రోజుల్లో తేలిపోనుంది. -
రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పాక్ జెండా తగులబెట్టారు
నీలం వ్యాలీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) నీలమ్ వ్యాలీలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పాకిస్తాన్ జెండాను తగులబెట్టి నిరసన తెలిపారు. జులై 21న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ 41 సీట్లకు గాను పీఎంఎల్-ఎన్ 31 సీట్లు గెలుచుకుంది. ముస్లిం కాన్ఫరెన్స్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు కేవలం మూడేసి సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రజలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముజఫరాబాద్, కొట్లీ, చినారి, మిర్పుర్ ప్రాంతాల్లో అల్లర్లు వ్యాపించాయి. Angry over rigged PoK elections, locals burnt Pakistani flag in Neelum Valley (PoK) and faced police action. pic.twitter.com/TYqVZgnzQD— ANI (@ANI_news) 29 July 2016