'రిగ్గింగ్ ను ఆపడంలో ఎన్నికల కమీషన్ విఫలం'
అసాన్సోల్(పశ్చిమ బెంగాల్): బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ లో రిగ్గింగ్ ను ఆపడంలో విఫలమైందని ఎన్నికల కమిషన్ ను బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ తప్పుపట్టారు. హింసాత్మక సంఘటనలను పోల్ ప్యానెల్ ఆపలేకపోయిందన్నారు.
ఈసీ విఫలమైందనేందుకు తన వద్ద అనేక ఆధారాలున్నాయని మోడీ అన్నారు. బీజేపీ అభ్యర్ధి బాబుల్ సుప్రీయోపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఓటర్ల ప్రయోజనాలు కాపాడటం ఎన్నికల కమిషన్ ప్రథమ కర్తవ్యమని.. తన భాధ్యతల్ని నిజాయితీగా నెరవేర్చాలని విజ్క్షప్తి చేస్తున్నానని మోడీ అన్నారు. ఈసీ నిజాయితీగా వ్యవహరించకుంటే ప్రజాస్వామ్యానికి అర్ధం లేదన్నారు.