'మోదీ ఇండియాను కోల్పోతారేమో'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మోదీ బిహార్లో గెలుపు కోసం చేస్తున్న విభజనవాద రాజకీయంతో ఇండియాను కోల్పోతారేమోనని భయంగా ఉందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురాశతో మోదీ ప్రజల మధ్య విభజన సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ, ఈ పరిణామాలతో ఆయన దేశాన్ని కోల్పోతారేమోనని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇటీవల బిహార్లో మోదీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మోదీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని నితీష్ ధ్వజమెత్తారు.
Astonished at Modiji’s brazen use of divisive language. In his desperation to win the losing battle of Bihar, I'm afraid he might lose India
— Nitish Kumar (@NitishKumar) October 30, 2015