nithish
-
నితీశ్ ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు జట్టుతో జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర బ్యాట్స్‌మన్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (407 బంతుల్లో 301 నాటౌట్; 41 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధరణి కుమార్ (101; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ చేయడంతో ఆంధ్ర భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 320/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద ఇన్నిం గ్స్‌ను డిక్లేర్ చేసింది. 190 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన నితీశ్... 318 బంతుల్లో డబుల్ సెంచరీని, 406 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. ధరణి, నితీశ్ జోడి నాలుగో వికెట్‌కు 229 పరుగుల్ని జోడించింది. తమిళనాడు బౌలర్లు రోజంతా శ్రమించి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తమిళనాడు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 126 పరుగులు చేసింది. -
స్పీడ్ కిల్స్!
► సిటీలో వాహనాల సరాసరి వేగం: గంటకు 18 కి.మీ ► నిశిత్ నారాయణ నడుపుతున్న కారు స్పీడు: గంటకు 205 కి.మీ... ► మెర్సిడెస్ బెంజ్ జీ 63 ఏఎంజీ మోడల్ వాహనం గరిష్ట వేగం: గంటకు 230 కి.మీ ► అతివేగం..ర్యాష్ డ్రైవింగ్లతోనే ప్రమాదాలు ► నగరంలో ఏటా వేల కేసులు నమోదు ► నగర రోడ్లకు–వాహనాలకు పొంతనే లేదు ► అడ్డుకోవడానికి అవసరమైన నిబంధనలు కరవు సిటీబ్యూరో: వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిశిత్ నారాయణ బుధవారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తేలింది. ఈనేపథ్యంలో నగరంలో వాహనాల వేగంపై మరోసారి చర్చ తలెత్తింది. కేవలం ఈ సమయాల్లో, ఈ మార్గాల్లోనే కాదు... సిటీలో ఎక్కడ చూసినా ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్డ్రైవింగ్స్ కనిపిస్తాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారు సైతం 20–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉంటున్నారు. అదో ప్యాషన్‌గా మారిపోయి... స్పీడ్ థ్రిల్స్... బట్ కిల్స్ అనే నానుడిని పోలీసు, ఆర్టీఏ విభాగాలు నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ హైఎండ్ వాహనాల్లో/వాహనాలపై, వీలున్నంత వేగంగా దూసుకుపోవడం కొందరు వాహనచోదకులకు నిత్యకృత్యమైంది. అధికారులు రహదారి నిబంధనల ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదాన్ని చేకూర్చేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదకరమైనవి. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్, ర్యాష్‌డ్రైవింగ్ ఉల్లంఘనలు మూడో కోవకు చెందుతాయి. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా వాహనచోదకుడినే కాదు అనేక సందర్భాల్లో ఏ పాపం ఎరుగని ఎదుటి వారినీ మింగేస్తాయి. అయినప్పటికీ రద్దీ రోడ్లలోనూ విచ్చలవిడి స్పీడుతో, విన్యాసాలతో దూసుకుపోయే యువత ఎందరో ఉంటున్నారు. రాత్రి వేళల్లో, విశాలంగా... ఖాళీగా కనిపిస్తున్న రోడ్లపై వీరి విషయం ఇక చెప్పక్కర్లేదు. ఆ రెంటికీ పొంతనే ఉండదు... నగరంలోని రోడ్ల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం తదితర అంశాలపైనే ఇక్కడ పరిగెత్తే వాహనాలు ఆధారపడి ఉంటాయి. అయితే సిటీలో సరాసరి వేగం గరిష్టంగా గంటకు 18 కి.మీగా ఉంటే...ఇక్కడ అందుబాటులో ఉంటున్న, దిగుమతి చేసుకుంటున్న వాహనాల గరిష్టం వేగం గంటలకు 200 కిమీ కంటే ఎక్కువే ఉంటోంది. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదాలకు హేతువుగా మారింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిరోధించే చట్టాలు, నిబంధనలు అంటూ మచ్చుకైనా కనిపించవు. సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ స్థాయిలో మౌలిక వసతులు, రోడ్ల విస్తరణ చేడుతున్న దాఖలాలు లేవు. ఇవన్నీ సైతం పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ‘బెల్ట్’ అంటే నిర్లక్ష్యం... ద్విచక్ర వాహనచోదకుడికి హెల్మెట్ ఎలానో.. తేలికపాటి వాహనం నడిపే వారికి సీటుబెల్ట్ అలానే తప్పనిసరి. అయితే వీటిని ధరించి కార్లు నడుపుతున్న వారి సంఖ్య ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలను డ్రైవ్ చేసే వారు మాత్రమే కాదు.. వాటిలో ప్రయాణించే వారు సైతం సీటుబెల్టులు ధరించాల్సిందే. కానీ పాటిస్తున్న దాఖలాలు తక్కువే. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లో జరిగిన నిశిత్ నారాయణ ప్రమాదంలో ప్రాణనష్టానికి సీటుబెల్ట్ వాడకపోవడమే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టకేలకు మేల్కొన్న పోలీసులు... సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే రేసింగ్స్, ర్యాష్డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిని కట్టడి చేయడానికి ‘ఆర్ఆర్ డ్రైవ్’ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. వీటిలో చిక్కిన వారికి జరిమానాతో సరిపెట్టకుండా వాహనాలు స్వాధీనం చేసుకోవడం, కౌన్సిలింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నారు. -
నాచినపల్లి టూ నేపాల్
కబడ్డీలో రాణిస్తున్న గ్రామీణ విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ నేపాల్ అంతర్జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక ప్రయాణ ఖర్చులు లేక ఇబ్బందులు దాతల సాయం కోసం ఎదురుచూపులు నాచినపల్లి (దుగ్గొండి) : ఒకప్పుడు గ్రామీణ ప్రాంతానికే పరిమితమై.. కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన కబడ్డీలో ఇద్దరు విద్యార్థులు రాణిస్తున్నారు. పేదరికంలో పుట్టినప్పటికీ వారు మెుక్కవోని దీక్షతో, అకుంఠిత పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడంతోపాటు తాజాగా నేపా ల్ దేశంలో జరిగే సౌత్ ఏషియన్ అంతర్జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై సత్తాచాటారు. అనిల్ క్రీడా ప్రస్థానం మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన నర్సయ్య, ప్రమీల దంపతుల కుమారుడు అనిల్ 1 నుం చి 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. నర్సంపేట కాకతీయ జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేశాడు. 2010–11లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో, అదే ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం ఆయన వరంగల్ సీకేఎం కâ శాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, అనిల్ ఈనెల 14 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ అండర్–19 విభాగంలో పాల్గొని సత్తాచాటారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనను ఆగస్టు 4 నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికచేశారు. సత్తాచాటుతున్న ‘నితీష్’ పేదరికం వెక్కిరిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కన్నెబోయిన నితీష్ కృషి చేస్తున్నాడు. నాచినపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమారస్వామి–కవిత దంపతుల కుమారుడు నితీష్ 1 నుంచి 5 వరకు స్థానిక పాఠశాలలో, 6 నుంచి 10 వరకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివానీ విద్యాలయంలో చదువున్నాడు. ఆరేళ్ల క్రితం భ ర్త అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ భార్య కవిత కుమారుడిని కష్టపడి చదివిస్తోంది. నర్సంపేట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన నితీష్ కబడ్డీలో రాణిస్తున్నాడు. 2013–14లో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. 2014–15లో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాజీ పేటలో జరిగిన జిల్లాస్థాయి పైకా పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఆగస్టు 16న నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగే సౌత్ ఏషియన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు నిరుపేద కుటుంబాలకు చెందిన అనిల్, నితీష్‌కు నేపాల్‌కు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కబడ్డీలో రాణిస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. దాతలు, క్రీడాభిమానులు ఆర్థిక సాయం అందిస్తే నేపాల్‌లో జరిగే సౌత్ ఏషియన్ పోటీల్లో సత్తాచాటి ఓరుగల్లు కీర్తిని నిలబెడుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్
పాట్నా: ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను నితీష్ తన వద్దే ఉంచుకున్నాడు. నితీష్ కేబినెట్లో లాలు ప్రసాద్ కుమారులకు కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. లాలు చిన్న కుమారుడు 26 ఏళ్ల తేజస్వికు రోడ్డు, భవనాల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదాను ఇవ్వడం జరిగింది. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు ఆరోగ్యశాఖను కేటాయించారు. నితీష్ కేబినెట్లో మొత్తం 28 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అబ్దుల్ బారి సిద్ధిఖీ, రాజీవ్ రంజన్ సింగ్, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జయ కుమార్ సింగ్, శ్రావణ్ కుమార్ సింగ్, అలోక్ మెహతా తదితరులు ఉన్నారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాండ్రంగి నితీష్(3) ఇంటి ముందు ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట ఆడుకుంటున్న సమయంలో గోస్తని నది నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో నితీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మహాకూటమి విజయం ప్రజాస్వామ్య విజయం'
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి అభివర్ణించారు. బిహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి సరైన గుణపాఠం చెప్పారన్న ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారికి భంగపాటు తప్పదని తెలిపారు. బిహార్ ప్రజలు మహాకూటమి వైపు నిలిచి మతపరమైన శక్తులకు బుద్ధి చెప్పారన్నారు. -
ఆ అయిదు కీలక అంశాలు
పట్న: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి బిహార్ రాష్ట్ర ప్రజల అనూహ్య మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానంగా యాదవులు, ముస్లింల ఓట్లే మహాకూటమి గెలుసును నిర్దేశించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో పాటు అయిదు ప్రధాన అంశాలను అటు మహాకూటమి విజయానికి, ఇటు ఎన్డీయే కూటమి ఘోర పరాజయానికి కీలకమైనవి భావిస్తున్నారు. ముందుగా మహాకూటమి అద్భుత విజయానికి గల కారణాలను పరిశీలిస్తే.. 1. రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడిన తరగతుల కు చెందిన కలాల ఓటర్లను మహాకూటమి ప్రభావితం చేయగలిగింది. ప్రధానంగా యాదవులు, ముస్లిం, కుర్మి తదిరత సామాజిక వర్గాలను తన వైపు తిప్పు కోవడంలో కూటమి నాయకత్వం విజయం సాధించింది. 2. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఎండగట్టడంలో మహాకూటమి సక్సెస్ అయింది. రిజర్వేషన్ల విషయంలో ఆయా వర్గాల ప్రజలకు లాలూ ప్రసాద్ లాంటి అగ్రనేతలు మద్దతుగా నిలిచారు. 3. తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ముందుగానే ప్రకటించి తమ కూటమి విశ్వసనీయతను పెంచారు. 4. మత విద్వేషాలను, మత రాజకీయాలను ఎండగట్టడంలో మహాకూటమి చాలా ధృఢంగా వ్యవహరించింది. ఆ మేరకు ప్రజల్లో ప్రజాస్వామ్య భావాలను పాదుకొల్పగలిగింది. 5. ఈ బిగ్ ఫైట్ లో కీలక మైన అంశాలను గెలుపు గుర్రాలను ఎంపిక. ఈ విషయంలోపార్టీల నేతల చేసిన కసరత్తు మంచి ఫలితాలనిచ్చింది. ఎన్డీయే కూటమికి ఎలా ప్రతికూలంగా అంశాలను పరిశీలిస్తే.. 1. బిహార్ రాజకీయ దిగ్గజాలు లాలూ, నితీష్ ల కరిష్మాను, వారి స్థాయిని అంచనా వేయడంలో ఎన్డీయే కూటమి విఫలమైంది. వారి శక్తి సామర్ధ్యాలను, రాష్ట్ర ప్రజల్లో వారికున్నపునాదిని లైట్ తీసుకోవడం కొంపముంచింది. 2. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ నేతల వైఖరి, వ్యాఖ్యనాలు ప్రధానంగా బీజేపి ఇమేజ్ ను దెబ్బతీశాయి. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యనాలు పార్టీ విజయాన్ని సుదూరం నెట్టివేశాయని అంచనా. 3. బీజేపీ కూటిమికి ముసలం తెచ్చిపెట్టిన మరో కీలక అంశం ఆర్ ఎస్ ఎ స్ అధినేత మోహన భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అవసరం లేదన్న భగవత్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇవి ఆయా వర్గాల ప్రజల్లోతీవ్ర అసంతృప్తిని రాజేశాయని పరిశీలకుల భావన. 4. ఇక మరో ప్రధాన అంశంగా చెప్పుకోవాల్సింది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. టిక్కెట్ల కేటాయింపులో రగిలిన అసంతృప్తులు మహాకూటమి విజయాన్ని సానుకూలం చేశాయి. 5. చివరిది అతి కీలకమైన అంశం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో పూర్తిగా వైఫ్యలం చెందడం ఎన్డీయేకి ప్రతికూలంగా మారిపోయింది. ఈ విషయంలో సాధించని ఏకాభిప్రాయం కూటమిలోని విభేదాలు చెప్పకనే చెప్పింది. -
సహనమే గెలిచింది...
కోల్ కతా: బిహార్ ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఫలితాలు అసహనంపై సహనంసాధించిన విజయానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో దీదీ సోషల్ మీడియాలో స్పందించారు. నితిష్, లాలుతో కూడిన మహాకూటమికి దీదీ అభినందనలు తెలిపారు. సహనానికి గెలుపు, అసహనానికి ఓటమి అంటూ ట్వీట్ చేశారు. బిహార్ లోని నా సోదర సోదరమణులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. -
నితీష్ ఫేసు.. లాలూ బేసు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు అధినేతల ఫేసు, బేసు మహాకూటమికి మహావిజయాన్ని అందించాయని జేడీయూ నేత నావల్ శర్మ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు. ఒకరు జేడీయూ అధినేత నితీష్ కుమార్, రెండోవారు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్. ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించిన ఆయన.. నితీష్ మెరిసిపోయే ముఖం, రాష్ట్రంలో లాలుకున్న పటిష్టమైన పునాదే తమకు ఇన్ని స్థానాలను సాధించి పెట్టాయన్నారు. రాష్ట్రప్రజలకు తాము చేసిన సేవలే తమకు ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించాయన్నారు. బీజీపీ కుట్రపూరిత ఎత్తుగడలే వారిని ఓడించాయన్నారు. దాద్రి, పాకిస్తాన్, ఆవు, బీఫ్ లాంటి అంశాలేవీ బీజేపీ కాపాడలేకపోయాయన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మహాకూటమి ఇప్పటికే 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు వేస్తోంది. అటు బీజేపీ కూటమికి ఓటమిని అంగీకరించినట్టే. -
'మోదీ ఇండియాను కోల్పోతారేమో'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మోదీ బిహార్‌లో గెలుపు కోసం చేస్తున్న విభజనవాద రాజకీయంతో ఇండియాను కోల్పోతారేమోనని భయంగా ఉందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురాశతో మోదీ ప్రజల మధ్య విభజన సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ, ఈ పరిణామాలతో ఆయన దేశాన్ని కోల్పోతారేమోనని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇటీవల బిహార్‌లో మోదీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మోదీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని నితీష్ ధ్వజమెత్తారు. Astonished at Modiji’s brazen use of divisive language. In his desperation to win the losing battle of Bihar, I'm afraid he might lose India — Nitish Kumar (@NitishKumar) October 30, 2015 -
పేదింట పూసిన విద్యాకుసుమాలు
♦ పిల్లలిద్దరికీ ట్రిపుల్ ఐటీలో సీటు ♦ గతేడాది ఒకరికి.. ఈ యేడాది మరొకరికి ♦ ఆనందంలో తల్లిదండ్రులు కామారెడ్డి : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని జెడ్పీహెచ్ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో చదివించారు. పిల్లలిద్దరూ కష్టపడి చదివారు. గత యేడాది వారి కూతురు ట్రిపుల్ ఐటీకి ఎంపికైతే, ఈ యేడాది కొడుకు ఎంపికై నేనేం తక్కువ కాదని నిరూపించాడు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోరుుంది. పిట్లంకు చెందిన జంపగల్ల నగేశ్, అన్నపూర్ణ దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి వ చ్చారు. ఇద్దరూ చెరో పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని పోషిస్తున్నారు. చేసిన పనికి వచ్చే కూలీ డబ్బులు తిండికే సరిపోతుండడంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకుండా పోరుుంది. కానీ, వారి నమ్మకాన్ని పిల్లలు వమ్ము చేయలేదు. కష్టపడి చదివారు ఇద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ‘తమ కష్టాన్ని పిల్లలు గుర్తించి తగిన ఫలితం ఇచ్చారని’ చెమర్చిన కళ్లతో నగేశ్, అన్నపూర్ణ దంపతులిద్దరూ ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. పిల్లలే మా వెలుగు... మా ఇద్దరికీ చదువు రాదు. పిల్లలను సర్కారు బడిలో చది వించాం. పిల్లలిద్దరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీకి ఎంపికవడం ఆనందం గా ఉంది. మా బావమర్ది చంద్రకాంత్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకా రం అందించారు. పిల్లలే మాకు వెలుగు. నగేశ్,అన్నపూర్ణ, తల్లితండ్రులు నాకు తోడుగా తమ్ముడు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నాకు ఇప్పుడు తమ్ముడు తోడయ్యాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం మంచిగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. వాళ్లు పడే కష్టం రోజూ చూసి కష్టపడి చదివాం. నందిని, కూతురు ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు పదో తరగతిలో 9.7 జీపీఏ రావడానికి మా సార్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మా, నాన్నతో పాటు మామయ్య ప్రోత్సహించారు. మంచి చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాం. నితీష్, కుమారుడు -
బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల సయోధ్య * జేడీయూ నేత అభ్యర్థిత్వానికి లాలూ ఓకే న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని లాలూ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీల కూటమి తరఫున నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు సోమవారం లాలూ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ల సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. ‘నితీశ్ పేరును లాలూజీనే ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు’ అని ములాయం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. ‘మతతత్వం అనే విషనాగును అంతం చేసేందుకు ఏ విషాన్నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. మేమంతా కలసి ఆ విషనాగును అంతం చేస్తాం. బిహార్ నుంచి బీజేపీని తుడిచిపెట్టేస్తాం’ అని ప్రతిన బూనారు. ‘నేనీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. నా కుటుంబం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ సీఎం పదవికి పోటీ లేదు. నా భార్యాపిల్లలకు ఆ పదవిపై ఆసక్తి లేదు’ అని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలోనూ సామరస్యపూర్వక నిర్ణయాలుంటాయన్నారు. నితీశ్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ‘నితీశ్, నేను ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాం. పోరాటాలు చేసుకున్నాం. అయినా, రాజ్యసభ ఎన్నికల సమయంలో జేడీయూలో విభేదాలు వచ్చినప్పుడు బీజేపీ లబ్ధి పొందకుండా ఆ పార్టీకి మద్దతిచ్చాను’ అని వివరించారు. బిహార్ మాజీ సీఎం, నితీశ్ రాజకీయ శత్రువు మాంఝీతో సంబంధాలపై వివరణ ఇస్తూ.. ‘నితీశ్‌ను గద్దె దించితే.. నా నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు.నేను వారి వలలో పడలేదు’ అన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సహా పలువురు ఆర్జేడీ నేతలు నితీశ్ సీఎం అభ్యర్థిత్వంపై విముఖత వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ‘వారి అభిప్రాయాలు వారికుండొచ్చు.. కానీ నిర్ణయం తీసేసుకున్నాం’ అన్నారు. ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే.. బిహార్‌లో ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే ఆర్జేడీ, జేడీయూలు ఒక్కటయ్యాయని బీజేపీ పేర్కొంది. మునిగిపోతున్నవారు కనిపించిన చిన్న కొమ్మనైనా పట్టుకుని బయటపడాలనుకున్నట్లుగా వారి పొత్తు ఉందని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ తేల్చి చెప్పారు. -
బరిలో దూకేది మా వాడే
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ఏకమైన ఆరుపార్టీల కూటమి ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్వగృహంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్న ఈ భేటీలో లాలూ చేసిన ఈ ప్రతిపాదనకు నేతలు తమ ఆమోదం తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రతిపాదించిన లాలూకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం నితీష్, ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి అడ్డుకోవడం తమ ప్రధాన లక్ష్యమని ఆర్జేడీ అధినేత లాలూ తెలిపారు. ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి పోటీకి ఎవరూ ఆసక్తిగా లేరని ప్రకటించారు. తమ పార్టీ నుంచి గానీ, తన కుటుంబం నుంచి గానీ ఎవరూ పోటీకి సిద్ధంగా లేరు కాబట్టే తాను నితీష్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జేడీ (యూ) కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు గతంలోనే జేడీయూ నేత శరద్ యాదవ్ వెల్లడించారు. కాగా ఎన్డీఎ ప్రభుత్వానికి దీటుగా ఆరు పార్టీలు ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్‌జెపి, జేడీ(ఎస్), ఐఎన్‌ఎల్‌డిల నేతలు జనతా పరివార్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే -
మాంఝీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్ ) పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాజీముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తరువాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారంటూ మాంఝీ నితీశ్ పై విరుచుకుపడ్డారు. బీహార్ లో ఎస్పీ,ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్ నగర్ లోని మాతా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన తరువాత కూడా దేవస్థానం యాజమాన్యం దేవస్థానాన్ని శుభ్రం చేయించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత తన పరిస్థితికి జేడీయూ లోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టే తనకు అన్యాయం జరిగిందని మాంఝీ వాపోయారు. -
బీజేపీ కుట్ర భగ్నమైంది
పట్నా: బీహార్ సంక్షోభానికి తెరపడ్డట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో తన తన మెజార్టీ నిరూపించువాల్సిన మాంఝీ రాజీనామా చేసిన నేపథ్యంలో నితిష్ తిరిగి ఫామ్ లో కొచ్చారు. రాజీనామా చేసి తప్పు చేశాను క్షమించండి అంటూ బీహార్ ప్రజలను వేడుకొన్నారు. మళ్ళీ ఇలాంటి తప్పుచేయను.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవచేస్తానన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి నివ్వాల్సిందిగా గవర్నర్ కోరామని, ఆయన ఆహ్వానం కోసం చూస్తున్నామని నితీష్ వెల్లడించారు. మరోవైపు మొత్తం పరిణామాలకు బీజేపీ వైఖరే కారణమంటూ మండిపడ్డారు నితీష్. తమ పార్టీని విచ్ఛిన్నం చేసి, బీహార్ లో తమ పార్టీని లేకుండా చేయాలని చూసిందని మండిపడ్డారు. కానీ బీజేపీ ఎత్తులు పారలేదన్నారు. అసలు మాంఝీ ముందే రాజీనామా చేసి ఉంటే.. బీజేపీ బండారం ఇంకా బాగా బట్టబయలయ్యి ఉండేదన్నారు. . అంతేకాదు.. మాంఝీని బలపరుస్తూ బీజేపీ తప్పుచేసిందటూ వ్యాఖ్యానించి, తమకు మద్దతిచ్చిన శివసేనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
రాణే.. పరిస్థితి...
తన పరిస్థితి ఏంటో తనకే తెలియని దుస్థితి మాజీ మంత్రి నారాయణ్ రాణేకు దాపురించింది. లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకు ఘోర పరాభవంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన అడుగులు బీజేపీవైపు పడుతున్నట్లు కనిపిం చాయి. అందుకు ముండే మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ముండే మరణంతో రాణే పరిస్థితి అగమ్యగోచరంగా త యారైంది. బీజేపీ సీనియర్ నాయకుడు గోపినాథ్ ముండే అకాల మరణంతో కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే పరిస్థితి ముందు అగమ్యగోచరంగా తయారైంది. తాను బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాలు ముండే లేకపోవడంతో దాదాపుగా ఆవిరైపోయాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొడుకు నితేష్ రాణే దారుణంగా ఓడిపోవడంతో నారాయణ్ రాణే తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు నితేష్ ఓడిపోతే తన పదవికి రాజీనామ చేస్తానని ఎన్నికలకు ముందు రాణే బహిరంగంగా సవాల్ చేశారు. నితేష్ ఓడిపోవడంతో అన్నట్లుగా పదవికి రాజీనామ చేసిన రాణే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారని ఆయన సన్నిహితులు తెలిపారు. రాణే కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయం వెనుక బీజేపీలో చేరాలనే అభిప్రాయం దాగుందనే కథనాలు అప్పట్లో మీడియాలో ప్రసారమయ్యాయి. ఇందుకోసం గోపీనాథ్ ముండేతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే గోపీనాథ్ ముండే నుంచి రాణేకు ఎటువంటి హామీ లభించకపోయినా త్వరలో బీజేపీలో చేర్చుకునే విషయమై పార్టీ సీనియర్లతో మాట్లాడతాననే హామీ ముండే నుంచి లభించినట్లు రాణే సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు గోపీనాథ్ ముండే మరణించడంతో తనను బీజేపీ నావలోకి చేర్చే నాథుడెవరని రాణే ఆందోళనలో పడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రచారం జరగడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని, అటు బీజేపీలో చోటు దక్కకపోవడం, దక్కే అవకాశాలు గోపీనాథ్ ముండే మరణంతో ఆవిరికావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాణే పడిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. శివసేన అడ్డుపడే అవ కాశం... ఒకవేళ రాణేను బీజేపీలో చేర్చుకుంటే శివసేనతో బీజేపీకి ఉన్న తత్సంబంధాలు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముండే లేకపోయినా మరెవరితోనైనా బీజేపీ సీనియర్ నేతలను రాణే కలిసే ప్రయత్నం చేసినా అందుకు శివసేన అడ్డుపడే అవకాశముందంటున్నారు. ఒకవేళ గోపీనాథ్ ముండే బతికుంటే శివసేనను ఒప్పించే అవకాశముండేదని, ఇప్పుడు అంతటి స్థాయి ఉన్న నాయకుడు రాష్ట్రంలో బీజేపీకి ఎవరూ లేరని చెబుతున్నారు. సర్దుకుపోదామనే ధోరణిలో రాణే.. బీజేపీలో చేరేందుకు ఉన్న ఒక్క దారీ మూసుకుపోవడంతో రాణే ఇక కాంగ్రెస్‌లోనే సెటిలైపోదామనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు తనకు ప్రాధాన్యమివ్వకున్నా కొన్నిరోజులు సర్దుకుపోదామనే ధోరణిలో ఆయన కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకేనా? లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను తొలగిస్తారనే వార్తలు వెలువడిన వెంటనే రాణే ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న హామీతోనే రాణే కాంగ్రెస్‌లోకి వచ్చినా ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో కనీసం ఇప్పుడైనా సీఎం పోస్టు తనకు ఇవ్వాలని సోనియాను కోరాలనుకున్నారు. అయితే సోనియాగాంధీ రాణేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండానే తిప్పిపంపడంతో ఆయన ముండేతో సమావేశమయ్యారనే ప్రచారం జరిగింది.