బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి అభివర్ణించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి అభివర్ణించారు. బిహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి సరైన గుణపాఠం చెప్పారన్న ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారికి భంగపాటు తప్పదని తెలిపారు. బిహార్ ప్రజలు మహాకూటమి వైపు నిలిచి మతపరమైన శక్తులకు బుద్ధి చెప్పారన్నారు.