
సాక్షి, హైదరాబాద్: కులగణ అంశంలో తన పాత్ర లేదని.. గాలి మాటలు మాట్లాడితే కుదరదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘‘తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది. నన్ను ఎవరు తిట్టిన నేను పట్టించుకోను. తీన్మార్ మల్లన్న ప్రెస్మీట్ పెట్టికుంటే.. ఏంది..ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి ఏమైనా పెట్టుకొని.. ప్రత్యేక్ష రాజకీయాలకు నేను దూరం.. సలహాలు అడిగితే ఇస్తాను’’ అని జానారెడ్డి పేర్కొన్నారు.
‘‘పరిపాలన చేసే వారు సైతం అడిగితేనే సలహాలు సూచనలు ఇస్తాను. నా పార్టీ నాయకులు నన్ను విమర్మిస్తే... ఖండిస్తలేరు... అలాగని సమర్థించడం లేదు.. ఎందుకో వారినే అడిగి తెలుసుకోండి. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు’’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

నాకు సంబంధం లేదు: వీహెచ్
వీహెచ్ హనుమంతరావు రావు మాట్లాడుతూ.. కామెంట్స్ తీన్మార్ మల్లన్న అంశం తనకు సంబంధం లేదని.. పార్టీ చూసుకుంటుందన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్‌కు చెప్పా.. ఆమె నన్ను ఏమి అడగలేదు.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మీనాక్షి నటరాజన్‌కు సూచించాను’’ అని వీహెచ్ చెప్పారు.
ఇదీ చదవండి: బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment