democratic
-
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
Kamala Harris: ట్రంప్ వస్తే వినాశనమే
షికాగో: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ’ఏ మాత్రం సీరియస్‌నెస్ లేని వ్యక్తి’గా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. ‘పొరపాటున ఆయన మళ్లీ అధ్యక్షుడైతే అంతులేని వినాశనమే. దేశాన్ని ట్రంప్ అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనక్కు తీసుకెళ్తారు‘ అంటూ అమెరికన్లను హెచ్చరించారు. డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చివరి రోజు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని ఆమె లాంఛనంగా స్వీకరించారు. ‘జాతి, లింగ, భాషా భేదాలకు అతీతంగా, తమ కలల సాకారానికి అహరహం శ్రమిస్తున్న అమెరికన్లందరి తరఫున ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నా‘ అంటూ కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా హారిస్ అభివరి్ణంచారు. ‘నన్ను గెలిపిస్తే పార్టీ భేదాలు తదితరాలకు అతీతంగా, అమెరికన్లందరి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తా. దేశ మౌలిక విలువలను, సూత్రాలను సమున్నతంగా నిలబెడతా. రాజకీయంగా, సైనికంగా సూపర్ పవర్‌గా అమెరికా స్థానాన్ని అన్నివిధాలా సుస్థిరం చేస్తా. అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పోరాడతా. గత పాలన తాలూకు విద్వేషాలు, విభజనవాదాలను రూపుమాపి దేశాన్ని ఒక్కటి చేస్తా‘ అని ప్రకటించారు. 59 ఏళ్ల హారిస్ వేదిక మీదకు వస్తుండగా పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. పలు అంశాలను స్పృశిస్తూ 40 నిమిషాల పాటు ఏకధాటిగా సాగిన ఆమె ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంతసేపూ, ’ఎస్, యూ కెన్ (నువ్వు సాధించగలవ్)’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారమే హారిస్ పదో పెళ్లి రోజు కూడా కావడం విశేషం. హిల్లరీ క్లింటన్ తర్వాత డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత, ఆఫ్రికన్ మూలాలున్న నేత హారిసే. ఆమె గెలిస్తే అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.ట్రంప్‌పై నిప్పులు ట్రంప్‌పై హారిస్ తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ఏ కోణంలో చూసినా ఆయన అత్యంత నాన్ సీరియస్ వ్యక్తి అని దుయ్యబట్టారు. ట్రంప్ హయాంలో దేశంలో అయోమయం, గందరగోళమే రాజ్యం చేశాయన్నారు. చివరికి ఓటమిని ఒప్పుకోకుండా పార్లమెంటు మీదికే అల్లరిమూకలను ఉసిగొలి్పన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. హష్ మనీ మొదలుకుని ఫ్రాడ, లైంగిక వేధింపుల దాకా నానారకాల ఆరోపణలు, లెక్కలేనన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విచి్ఛన్నకర శక్తిగా ట్రంప్‌ను అభివరి్ణంచారు. ‘ట్రంప్ రష్యాకు అన్ని అరాచకాలకూ లైసెన్సు ఇచ్చారు. అమెరికా మిత్రదేశాలపై దండెత్తేలా ప్రోత్సహించారు‘ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే కేవలం తనకోసం, తన బిలియనీర్ మిత్రుల ప్రయోజనాల కోసమే పాటుపడతారని దుయ్యబట్టారు. ‘నేనలా కాదు. అమెరికన్లందరి కోసం పోరాడతా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంతలను ట్రంప్ మాదిరిగా నేను ఉపేక్షించను. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దుతా. సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ట్రంప్‌లా ఎన్నటికీ కించపరచను‘ అని చెప్పారు. గాజా యుద్ధాన్ని ఆపేందుకు బైడెన్‌తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు సర్వ హక్కులూ ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.కోర్టు హౌస్ నుంచి వైట్ హౌస్ దాకా... అనూహ్య ప్రస్థానాలు అలవాటేఅధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అత్యంత అనూహ్యంగా తాను అధ్యక్ష రేసులోకి వచి్చన వైనాన్ని హారిస్ ప్రస్తావించారు. ఇలాంటి అనూహ్య ప్రస్థానాలు జీవితంలో తనకు కొత్తేమీ కాదన్నారు. అమెరికాను తిరిగి ఐక్యం చేసి నూతన దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నేతగా తనను తాను పరిచయం చేసుకున్నారు. కోర్టు హౌస్ నుంచి ఇప్పుడు వైట్ హౌస్‌కు పోటీపడే దాకా తన జీవనయానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందన్నారు. ‘ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశ ఘన చరిత్రకు వారసులం మనం. అమెరికా అంటే అనంతమైన అవకాశాలకు, అంతులేని ప్రేమకు, అపరిమితమైన స్వేచ్ఛకు ఆలవాలమని ప్రపంచానికి మరోసారి చాటుదాం‘ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు.తల్లీ నిన్ను తలంచి.. తన తల్లి శ్యామలా గోపాలన్‌ను ఈ సందర్భంగా హారిస్ గుర్తు చేసుకున్నారు. ఆమెను రోజూ మిస్సవుతున్నానని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రధానమైన గాజుతెరను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో అమ్మ మరీ మరీ గుర్తొస్తోందని చెప్పారు. ఆమె నూరిపోసిన విలువలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. ఏ పనీ సగంలో వదలొద్దని తల్లి తనకు మరీ మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నారు. ‘నా తల్లి కేవలం 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి ఎన్నో కలలతో భారతదేశం నుంచి అమెరికాలో అడుగు పెట్టింది. ఒక సైంటిస్టుగా రొమ్ము క్యాన్సర్‌కు మందు కనిపెట్టడమే లక్ష్యంగా శ్రమించింది. ఉన్నది ఐదడుగులే అయినా అనంతమైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. భారత్ తిరిగి వెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ సమయంలో జమైకా నుంచి వచి్చన మా నాన్న డొనాల్డ్ హారిస్‌తో అమ్మకు పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. నన్నూ, చెల్లెలు మాయను అమ్మే పెంచింది. ఈస్ట్ బేలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. శ్రామిక తరగతి వ్యక్తుల నడుమ పెరిగాం. అమ్మ రోజంతా పనిచేస్తే మా బాగోగులు ఇరుగుపొరుగు చూసుకునే వాళ్లు‘ అంటూ వారిని పేరుపేరునా హారిస్ గుర్తు చేసుకున్నారు. ‘వాళ్లంతా మాకు రక్త సంబం«దీకులు కాకున్నా ప్రేమ బాంధవులు. కలసికట్టుగా నెగ్గడం ఎలానో వారి మధ్య పెరగడం వల్లే నేర్చుకున్నా‘ అన్నారు. ‘ఈ క్షణం అమ్మ పైనుంచి నన్ను కచి్చతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది‘ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కూడా ఈ సందర్భంగా ఆప్యాయంగా స్మరించుకున్నారు. -
ఏకైక చాయిస్ హారిస్..
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఫక్తు షోమ్యాన్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..హారిస్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమర్‌గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్‌డొనాల్డ్స్‌లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్‌గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్‌పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..హారిస్ రన్నింగ్మేట్గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్‌కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.హారిస్‌కు ఓప్రా మద్దతు..వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.‘‘హారిస్‌ను, ఆమె రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్‌ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్‌తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్‌కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్‌లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్‌కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్‌లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్‌ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్‌లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్‌తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్‌కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
ప్రజాస్వామ్యం పతనం కాకుండా...
భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు దారుణంగా పతనమయ్యాయని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వి–డెమ్’ వెల్లడించింది. పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య పెరిగిందని కూడా నమోదు చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక వారు ప్రాణాలు విడుస్తున్న ఉదాహరణలను చూస్తూనే వున్నాం. విష వాయు మాళిగల్లోకి వారిని ‘తోసి’ ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడం. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామమాత్రం అయిపోయాయి. ఇన్ని సమస్యలు దేశంలో ఉండగా, పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. ‘‘2014 తర్వాత భారతదేశంలో ప్రజా స్వామ్య విలువలు దారుణంగా పతనమై నాయి. ఈ పతన దశ 1975 నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితుల స్థాయికి 2022లో చేరుకుంది. 2014–2022 మధ్య కాలంలో ఇండియాలో ప్రజాస్వామ్య విలువల పతనం గ్రీస్, బ్రెజిల్, పోలెండ్, ఫిలిప్పీన్స్లలో పతన దశకు సమాన స్థాయిలో నమోదయింది.’’ – అమలులో ఉన్న వివిధ రకాల ప్రజాస్వామ్యాల గురించి గోథెన్బర్గ్ నగరంలోని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ’ (క్లుప్తంగా వి–డెమ్) పరిశోధనలో ఈ సత్యాలు వెల్లడ య్యాయి. ‘హిందూ’ పత్రిక ‘డేటా పాయింట్’ విశ్లేషకుడు విఘ్నేశ్ రాధా కృష్ణన్ ఈ వివరాలను పొందుపరిచారు. (20 మార్చ్ 2023) ఈ వెల్లడి ఇలా ఉన్న సమయంలోనే బీజేపీ ప్రభుత్వ న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేస్తూ (19 మార్చ్ 2023)– భారతదేశంలో కొందరు రిటైర్డ్ (విశ్రాంత) న్యాయమూర్తులు భారత వ్యతిరేక ముఠాతో చేతులు కలిపి పనిచేస్తున్నారనీ, వీరు భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించాలని చూస్తున్నారనీ ఆరోపించారు. ఇది చెల్లుబాటు కాదని కూడా అన్నారు. ‘ఇది మంత్రి బెదిరింపు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఖండించారు! ఆట్టే చూస్తుంటే ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల తంతు ఎలా ఉందంటే, ‘అభిరుచి భేదాల’ గురించి రష్యన్ మహాకవి మయ కోవస్కీ చెప్పిన వ్యంగ్య రచన గుర్తుకొస్తోంది: వెనకటికొక ‘‘గుర్రం ఒంటె వైపు చూపు సారించి అరిచింది, ఛీ! ఇది సంకర జాతికి చెందిన గుర్రం’ అని. ఒంటె (తాను మాత్రం తక్కువ తిన్నానా అనుకుని) అన్నది కదా ‘నువ్వు గుర్రానివి కావు చిన్న సైజు ఒంటెవి అంతే అనుకో’ అని! కానీ అసలు సంగతి ఆ దేవునికే తెలుసు! విశాల నక్షత్ర వీధుల్లో ఆ విశ్వ ప్రభువుకి, ఈ రెండూ రెండు విభిన్న జాతులకి చెందిన మృగాలని తెలుసు’’! భారత లౌకిక రాజ్యాంగం గుర్తించి రూపొందించిన వాక్, సభా స్వాతంత్య్రం లాంటి ప్రాథమిక హక్కులను నర్మగర్భంగా అణచివేసే పద్ధతుల్ని ఏ పాలకులు అనుసరిస్తున్నా, కనీస ప్రజాస్వామ్య విలు వల్ని రకరకాల ‘మిష’ చాటు చేసుకుని గౌరవించని దశలోనే ఇలా ‘అభిరుచిలో భేదాలు’ బాహాటంగా చోటు చేసుకుంటాయని మరచి పోరాదు! అంతేగాదు, 2014–2022 మధ్య కాలంలో దేశంలో పెక్కు మంది పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య కూడా పెరిగిందని ‘వి–డెమ్’ సంస్థ నమోదు చేసింది. పశువులకు మేత లేక తిండి కరవుతో చస్తున్నా, ‘మతం’ పేరిట ముస్లిం యువకుల్నీ, వారి కుటుంబాలనూ వేధిస్తున్న ఘటనలకు అసాధారణ చొరవ చూపారు ఉత్తర ప్రదేశ్ పాలకులు. ‘గోరక్షణ’ పేరిట పలుచోట్ల జరిగిన దారుణమైన దాడులు సామాజిక అశాంతికి దారి తీశాయి. ఇలాంటి ఎన్నో ఘటన లను ‘హిందూ’ పత్రిక అనుబంధ విశిష్ట పక్ష పత్రిక ‘ఫ్రంట్‌లైన్’ (మార్చి 10, 2023) నమోదు చేసింది. ఇదిలా ఉండగా– చివరికి పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక అనేక సీవేజ్ గుంటల్లో ప్రాణాలు విడుస్తున్న ఉదా హరణలను పేర్కొంటూ సుప్రీంకోర్టు చలించిపోయింది. దుర్గంధపూరిత విష వాయువుల మధ్య చనిపోతున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితులను ప్రస్తావించి, ఇలా ‘విష వాయు మాళిగ (గ్యాస్చాంబర్స్)ల్లోకి తోసి ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడ బోమని’ (2019లో) వ్యాఖ్యానించింది! పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమ నాయకుడు బెజవాడ విల్సన్ దేశంలో వీరి పరిస్థితి ఎందుకు మెరుగవటం లేదో కారణాలు వివరంగా పేర్కొన్నారు: ‘‘కుల వ్యవస్థ దేశంలో బలంగా ఉన్నందున, ఈ కార్మికుల ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు. పాలకులు రాజ్యాంగ విధుల్ని పాటించడం మానేశారు. దేశంలో ప్రతి మూడవ రోజున ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతున్నాడు. అయినా వారి రక్షణ గురించిన పల్లెత్తు హామీ లేదు.’ (ఫ్రంట్‌లైన్, 10 మార్చ్ 2023)ఇలాంటి పరిస్థితుల్లో చివరికి పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామ మాత్రం అయిపోయాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలాంటి దీన పరిస్థితుల్ని తలచుకున్నప్పుడల్లా ‘మాకు గాదులు లేవు, ఉగాదులు లేవ’ని పలుమార్లు ఎత్తిపొడుస్తూ వచ్చాడు. చివరికి ‘ఎంత పెద్ద పండుగ’ వచ్చినా పేదసాదలు యథాలాపంగా జరుపుకోవడమేగానీ, వారి బతుకుల్లో నిజమైన వెలుగులు చూడలేక పోతున్నాం! అందుకే శ్రీశ్రీ కూడా ‘పండుగెవరికి? పబ్బమెవరికి?’ అన్న పాటలో సమాధానాలు లేని ప్రశ్నల వర్షం కురిపించాల్సి వచ్చింది: ‘‘పెద్ద పండుగ, పెద్ద పండుగ, పేరు దండగ! పండుగెవరికి, పబ్బమెవరికి? తిండి లేక, దిక్కు లేక దేవులాడే దీన జనులకు పండుగెక్కడ! పబ్బమెక్కడ? ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల బానిసీండ్రకు పండుగేమిటి? పబ్బమేమిటి? ఉండటానికి గూడు లేకా ఎండవానల దేబిరించే హీన జనులకు పేద నరులకు పండుగొకటా? పబ్బమొకటా?’’ ఇన్ని ఈతిబాధలు పేద వర్గాలను నిత్యం వెంటాడుతుండగా– పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. అఖిల పక్ష– పాలక వర్గ, ప్రతిపక్ష, న్యాయ వ్యవస్థ ప్రతినిధులతో సమాన ఫాయాలో ఏర్పడే క్రియాశీల సంస్థ ఉంటేనే వివక్షకు తావుండదని న్యాయ వ్యవస్థ భావించింది. ఇది ఆచరణలోకి వస్తే పాలక వర్గ ఏకపక్ష నిర్ణయాలూ, ఆటలూ సాగవు. అలాంటి పరిణామానికి ప్రస్తుత క్రియాశీల అత్యున్నత ధర్మాసనం సానుకూలం. కేంద్రం ప్రతికూలం. ఈ వైరుధ్యం, రాజ్యాంగం ఉభయ శాఖలకు నిర్దేశించిన పరిధుల్ని గౌరవించి వ్యవహరించినంత కాలం తలెత్తదు. ఇప్పుడా పరిధిని పాలకులు అతిక్రమించడానికి ఘడియలు లెక్కపెడుతూ కూర్చున్నందుననే ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి! ప్రస్తుత పాలకవర్గానికి అసలు భయమంతా – 2024 జనరల్ ఎన్నికల వరకే గాక ఆ తరువాత కూడా ప్రస్తుత క్రియాశీల ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మరికొంత కాలం పదవిలో ఉండ బోవడమే! ప్రస్తుతం కిరణ్ రిజిజు మనోవేదనంతా సుప్రీం చుట్టూనే తిరుగుతోంది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మోదీ ప్రజాస్వామిక నేత
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రజాస్వామిక నాయకుడని అభివర్ణించారు. మునుపెన్నడూ లేని రీతిలో మోదీ హయాంలో కేంద్ర మంత్రివర్గం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తోందని, ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారని అన్నారు. మోదీ నిరంకుశ నాయకుడన్న ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ఎవరు చెప్పినా ఓపికతో వింటారని, ఇతరుల సలహాలు, సూచనలను గౌరవిస్తారని చెప్పారు. ఇంత ఓపికగా వినే నేతను తాను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆదివారం సంసద్ టీవీ చానల్ ఇంటర్వూ్యలో అమిత్ షా మాట్లాడారు. దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి.. రాజకీయంగా నష్టం ఉన్నా ఏమాత్రం వెనుకాడబోరని చెప్పారు. ప్రజల సంక్షేమం, జాతి భద్రత కోసం ఆయన ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మోదీ నిరంకుశుడు కాదు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే నాయకుడు అని తేల్చిచెప్పారు. అదే మోదీ ప్రత్యేకత ప్రధానమంత్రిని, ఆయన పనితీరును తాను చాలా దగ్గరగా గమనిస్తున్నానని అమిత్ షా అన్నారు. మోదీ ఇతరులు చెప్పేది చక్కగా వింటారని, తక్కువ మాట్లాడుతారని, అందరి అభిప్రాయాలు తెలుసుకొని సహనంతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఉద్ఘాటించారు. చిన్నస్థాయి ఉద్యోగి లేదా కార్మికుడు చెప్పేది కూడా వినడం మోదీ ప్రత్యేకత అని కొనియాడారు. ప్రధాని క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు, దేశంలో మార్పు తీసుకురావడానికే పదవిలో ఉన్నానని సదా భావిస్తుంటారని వివరించారు. గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ ఎన్నెన్నో విజయాలు సాధించారని అన్నారు. అధికారం తమ జన్మహక్కు అని కొన్ని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని అమిత్ షా విమర్శించారు. మోదీ ఈ పరిస్థితిని మార్చేశారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరిగితే, వైఫల్యాలు ఉంటే ప్రజలకు వివరించాలి తప్ప వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు పలికారు. -
మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ
బెర్లిన్: జర్మనీ ఎన్నికల్లో చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన యూనియన్ కూటమి ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్ డెమోక్రాట్ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 నియోజకవర్గాల్లో సోమవారం ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్ డెమోక్రాట్లకు 25.7% ఓట్లు(206 సీట్లు), యూనియన్ కూటమికి 24.1%ఓట్లు(196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్ పార్టీ 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు 11.5% ఓట్లు(92 సీట్లు)సాధించాయి. వైస్ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్ డెమోక్రాట్ పార్టీ చాన్సెలర్ అభ్యర్థి ఒలాఫ్ షోల్జ్ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్ కూటమి పేర్కొంది. సోషల్ డెమోక్రాట్లు, యూనియన్ కూటమి కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్ పార్టీ సోషల్ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్ కూటమి’ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. -
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పెగాసస్
కోల్‌కతా/న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దేశంలో సంక్షేమానికి బదులుగా నిఘా దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని, ఇందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల స్మృత్యర్థం బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న మమత రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా అన్ని వర్గాలపైన కేంద్రం నిఘా పెట్టినందుకు సుప్రీంకోర్టు దీనిని సూమోటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర వస్తువులపై వేసిన పన్నుల్ని ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ల కొనుగోలుపై కేంద్రం ఖర్చు చేస్తోందని మమత ధ్వజమెత్తారు. ‘ విపక్ష నేతలందరి ఫోన్ల సంభాషణలు రికార్డు అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ఫోన్లో ఎన్సీపీ నేత పవార్, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నాను. మా అందరి మీద ఇలా నిఘా పెట్టినంత మాత్రాన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎవరూ కాపాడలేరు’’ అని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఎడిటర్స్ గిల్డ్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వెంటనే సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, వారి కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. పాత్రికేయులపై సైతం నిఘా పెట్టడం అంటే అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఎడిటర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పత్రికా స్వేచ్ఛను హరించే యత్నాలు చేయడం దారుణమని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వమే కాపాడకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించేదెలా? అని నిలదీసింది. ఎంక్వైరీ కమిటీలో జర్నలిస్టులకు, సామాజిక ఉద్యమకారులకు స్థానం కల్పించాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్‌పై 28న విచారణ..! పెగాసస్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సన్నద్ధమయ్యింది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై శశిథరూర్ నేతృత్వంలో ఏర్పాటైన 32 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 28న సమావేశం కానుంది. ‘సిటిజెన్స్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’ అజెండాతో భేటీ జరుగనుందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ట్యాపింగ్‌పై విచారణకు రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులకు స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. నా ఫోన్‌కి ప్లాస్టర్ వేశా పెగాసస్ ప్రమాదకరమైనదన్న మమత... అందుకే తన ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానంటూ దానిని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్లాస్టర్ వెయ్యాలి. లేదంటే దేశం సర్వనాశనమైపోతుంది’ అని మమత అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా అత్యంత ముఖ్యమైనవని, పెగాసస్ వలలో ఈ మూడే చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సూమోటోగా విచారణ జరిపించాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మమత అన్నారు. -
డొల్ల పాలన... గుల్ల ప్రజాస్వామ్యం!
డెబ్భై నాలుగేళ్ల స్వతంత్ర భారత పాలకులు సహితం ప్రజల ప్రాణరక్షణకోసం అవసరమైన మందుల్ని, మాకుల్ని, ప్రాణవాయువును, దాని నిర్వహణా యంత్రాలను సహితం సమకూర్చుకోలేక తిరిగి విదేశాలకు, విదేశీ మందుల కంపెనీలకోసం ఎగబడవలసి రావడం ఇన్నేళ్ల స్వాతంత్య్రానికి తీరని మచ్చను మిగిల్చింది. కరోనా ఒకవైపున ప్రజల ఊపిరిని తోడుకుంటూ శవాలుగా, జీవచ్ఛవాలుగా వదిలి వెళుతున్నా, మరోవైపున పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు కరోనా విజృంభణ దశలోనే ప్రజారోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ, ప్రజల పట్ల అణకువ భావం లేకుండా వివిధ దశల్లో ఎన్నికలను బలవంతంగా నిర్వహించి కరోనాకు సహకరించడం దుస్సహం, దుర్మార్గం! అందుకే మన దేశంలో ఉన్నది డొల్లపాలన, గుల్ల ప్రజాస్వామ్యం అని భావించక తప్పడం లేదు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడలేని పాల కులను, పాలనా వ్యవస్థల్ని ‘డొల్ల పాలకులు’ ‘గుల్ల ప్రజాస్వామ్యాలు ’ అని ప్రపంచ ప్రసిద్ధ భాషా వేత్తలలో, చరిత్రకారులలో ఒకరైన నోమ్ చామ్స్కీ (అమెరికా) ఏనాడో నిర్వచించాడు! ఆ మాట ఎందుకన్నాడు? అచరణలో పెక్కు పాలనా సంస్థలు– ప్రజాస్వామ్యానికి అవసరమైన సమాచారాన్ని, వారి మధ్య దైనందిన జీవితాలకు సంబంధించిన అంశాలపై చర్చలను తొక్కిపెడుతూ, భిన్నాభిప్రాయాలను అణచివేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను తొక్కిపెట్టడానికి అలవాటు పడినందున ఈ తరహా పాలనా వ్యవస్థను భ్రష్టు (చెడిపోయిన) ప్రజా స్వామ్యా లుగా’’చామస్కీ నామకరణం చేయాల్సి వచ్చింది! మనదేశంలో డెబ్బైనాలుగేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా జనాభాలో 34–35 శాతం ప్రజా బాహుళ్యం రోజుకి ఒక్క డాలర్ (రూ.78) లేదా అంతకన్నా తక్కువ ఆదాయంతో సరిపెట్టుకుంటూ నికృష్ట స్థితిగతుల్లో బతుకు లీడుస్తున్నారని సాధికార అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన మన దేశంలో 40 కోట్ల మందికి పైగా ప్రజాబాహుళ్యం ఎలా అర్ధాకలితో బొటాబొటి జీవితాలు వెల్లబుచ్చుకోవలసి వస్తోందో అర్థమవుతుంది! అందువల్లనే ధనిక వర్గ ‘ప్రజాస్వామ్య’’ వ్యవస్థల్లో ‘‘లోటు’’ బడ్జెట్లతో పాటే ప్రజాస్వామ్యం కూడా ‘‘వోటి’’ కుండలు గానే గడపవలిసివస్తోంది. ఈ వాస్తవాల్ని మరింత వివరంగా శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్తలయిన కారల్‌మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగెల్స్ కన్నా కొలది రోజులకు ముందే అమెరికా నీగ్రో బానిసల విమోచన ప్రదాత అయిన అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గుండెలోతుల నుంచి ఎంతో ఆర్ద్రంగా ప్రపంచం ముందు చాటాడని మరచిపోరాదు. లింకన్ మహాశయుని మాటల్లోనే విందాం. మార్క్స్ రచనలు చదివే అవ కాశం అప్పటికి లింకన్‌కు ఉందో లేదో మనకు తెలియదు గాని, సామాజిక వాస్తవాలు కొన్నింటిపైన ఈ ఉభయుల అభిప్రాయాలు దాదాపు ఒకటిగానే ఉండటం వల్ల వాటి మధ్య సమకాలీనత సాధ్యపడి ఉండవచ్చు. అబ్రహం లింకన్ కుండ బద్దలు కొట్టి చెప్పిన ఈ కింది వాస్తవాలను నేటి సమకాలీన భారత రాజకీయ పాలకులు, నాయకులూ పట్టించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. లింకన్ ఇలా ప్రకటించాడు: ‘‘ఏ పనిలోనైనా ముందుగా శ్రమ శక్తి విలువకు కొలమానం నిర్ణయించకుండా ఏ మంచిపనికీ తగిన విలువ కట్టకుండా ఆ శ్రమను అనుభవించలేం. సామాజికులు అనుభవించే పెక్కు వస్తువులు ఉత్పత్తి అయ్యేది శ్రమజీవుల శ్రమ శక్తి నుంచేనని మరవరాదు. అలాంటి ఉపయోగకర వస్తుజాలం అంతా శ్రామికుడి శ్రమ ఫలితం. కాని దురదృష్టవశాత్తు అన్ని యుగాలలోనూ జరిగిన దురదృష్టకర పరిణామం– సామాజికుల్లో కొందరే తమ చెమటోడ్చి సరుకులను ఉత్పత్తి చేయడం మిగతా వారు ఇవతల పుల్లని అవతల పెట్టలేని వారు సహితం భారీ స్థాయిలో శ్రమజీవుల శ్రమఫలితాలను తేరగా అనుభవించడం పరిపాటైంది. ఇది దుర్మార్గం, ఈ దుర్మార్గం ఇకనెంత మాత్రం కొనసాగరాదు. శ్రమజీవికి తన యావత్తు శ్రమ ఫలితాన్ని లేదా సాధ్యమైనంత హెచ్చు వాటాను పొంది అనుభవించే హక్కును అనుమతించడం ఏ మంచి ప్రభుత్వానికైనా, పరిపాలనా వ్యవస్థ కయినా ధర్మంగా ఉండాలి!! కాని, ఈ మహోన్నత లక్ష్యాలు 21వ శతాబ్దం కొలది సంవత్సరాలలో ముగియబోయేనాటికైనా నెరవేరగలవా అన్నది నేటి ‘‘భ్రష్టు ప్రజాస్వామ్య’’ వ్యవస్థలో ‘డొల్ల పాలకుల’ అధ్వర్యంలో సాధ్యపడదని ప్రభుత్వాలను వాటి ఆధ్వర్యంలో ఒక లక్ష్యం, దిక్కు దివాణం లేక నడుస్తూ, ప్రజాతంత్రశక్తుల నోర్లు నొక్కి ప్రజా బాహుళ్యంలోని నిరక్ష్యరాస్యత ఆధారంగా గత 74 ఏళ్లుగానూ పరి పాలన వెలగబెడుతున్న (కాంగ్రెస్/ బీజేపీ లేదా యూపీఏ / ఎన్.డి.ఎ ముద్రల కింద) రాజకీయ నాయకులకు తక్షణం సమీక్షిం చుకొని భ్రష్టు పట్టిన పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ‘‘ఓవర్‌హాల్’’ చేసుకోగల స్తోమత ఉందా? లేక ఇదంతా 74 ఏళ్లుగా సాగించిన ‘జాగరణ’గానే ఇకముందు కొనసాగుతుందా? ప్రసిద్ధ భారత చరిత్రకారులలో ఒకరు, అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ అత్యున్నత ప్రతి ష్టాత్మక బహుమతులు పొందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ రొమిలా థాపర్ ’’స్వతంత్ర భారతంలో ప్రజాబాహుళ్యాన్ని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచించగల విశాల మనస్తత్వం గల పాలక శక్తి ఇంకా ఉదయించవలసి ఉంది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఏ పరిణామాలు ప్రొఫెసర్ థాపర్ లాంటి చరిత్రకారులను ఈ అభి ప్రాయానికి నెట్టి ఉంటాయి?. ఇదే స్వతంత్ర భారతంలో రెండు పరినాలనా వ్యవస్థల్లోనూ (కాంగ్రెస్– బీజేపీ) ఎమర్జెన్సీ ప్రకటన అనంతరం, ఆ తరువాత బీజేపీ హయాంలోనూ, వాక్సభా స్వాతం త్య్రాలను, ప్రజాతంత్ర ఉద్యమాలను, ఉద్యమకారులను (పాత్రికేయులతోసహా) రకరకాల వేధింపులకు ఇప్పటికీ ఆటవిడుపు లేకుండా చేస్తూ వస్తున్న సంగతి ప్రజాబాహుళ్యానికి అనుభవమే. చివరికి మన దేశ సంస్కృతీ సంపదకు, పరిశోధనలకు నిలయమైన భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ (పుణే) సహితం సెన్సార్షిప్ నిబంధనలకు తలొగ్గి తన ఉన్నత పరిశోధనా భాండాగారానికి తాళాలు పెట్టి తప్పుకోవలసి వచ్చింది. ఎన్నో పత్రికా సంస్థలు, పత్రికలు మూతపడ్డాయి. ఫైర్, వాటర్, పర్జానియా, రంగ్‌దే బసంతి లాంటి ఉత్తమ చలనచిత్రాలు దాడులకు గురికావలిసి వచ్చింది. ఆ తరువాతి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసి, దేశాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించేరకంగా పెద్ద కరెన్సీ నోట్లను ఉపసంహరించి, వేరే ప్రయోజనాలకు వాటిని మళ్లించి ఉంటారన్న అపవాదునో, నిజవాదనకో బీజేపీ పాలన తెరలేపింది. ఈ పరిణామాల ఫలితంగా జరిగిన, జరుగుతున్న పెక్కు అవకతవకలను సరిదిద్దుకునే బదులు, ఈ ప్రజావ్యతిరేక పరిణామాలను విమర్శించిన వివిధ స్థాయి ప్రజాస్వామ్య పక్షాలపై, ప్రజాజీవనంలో తలలో నాల్కలుగా భావించే ప్రజాస్వామ్య శక్తులైన ప్రొఫెసర్లు, ఉద్యమ కారులైన ప్రసిద్ధ రచయితల పైన, కవులు, కళాకారుల పైన నిర్బంధ విధానాలు అమలులోకి వచ్చాయి. ఎం.ఎఫ్ హుస్సేన్, సురేంద్రన్ నాయక్, భూపేన్ ఖాఖర్, అపితా సింగ్... ఆ తరువాత కాలంలో ప్రజా బాహు ళ్యానికి వెన్నుదన్నుగా నిలిచిన దభోల్కర్ కల్బుర్గి, లంకేష్ లాంటి పలువురు పౌరహక్కుల నాయకులపైన మేధావులపైన నిర్బంధ విధానం అమలులోకి వచ్చింది. అయినా కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అన్న సామెతలాగా, అసమానతల పర్వాన్ని రూపుమాపే ఏకైక శక్తిని నేనే అంటూ విరుచుకుపడిన కరోనా (కోవిడ్–19) మహమ్మారికి ఈ దేశంలో ఎంతటి వాళ్లయినా జోహుకుం అనవలసిన స్థితి వచ్చింది. ఈ దుస్థితిలో 74 ఏళ్ల స్వతంత్ర భారత పాలకులు సహితం ప్రజల ప్రాణరక్షణకోసం అవసరమైన మందుల్ని, మాకుల్ని, చివరికి అవసరమైన ప్రాణవాయువును, దాని నిర్వహణా యంత్రాలను సహితం సమకూర్చుకోలేక తిరిగి విదేశాలకు, విదేశీ మందుల కంపెనీలకోసం ఎగబడవలసి రావడం –– ఇన్నేళ్ల స్వాతంత్య్రానికి తీరని మచ్చను మిగిల్చింది. కానీ కరోనా ఒకవైపున ప్రజల ఊపిరిని తోడుకుంటూ శవాలుగా, జీవచ్ఛవాలుగా వదిలి వెళుతున్నా, మరోవైపున పౌలకులకు, రాజకీయ పార్టీల నాయకులకు కరోనా విజృంభణ దశలోనే ప్రజారోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ, ప్రజల పట్ల అణకువ భావం లేకుండా వివిధ దశల్లో ఎన్నికలను బలవంతంగా నిర్వహించి కరోనాకు సహకరించడం దుస్సహం, దుర్మార్గం! అందుకే మన దేశంలో ఉన్నది డొల్లపాలన, గుల్ల ప్రజా స్వామ్యం అని భావించక తప్పడం లేదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
యూఎస్ అధ్యక్ష అభ్యర్థిపై లైంగిక ఆరోపణలు
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో లైంగిక ఆరోపణలు అంశం కలకలం రేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగేందుకు సిద్ధవుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడిన్పై లైంగిక ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన సెనేట్ మాజీ సహాయకురాలు తారా రీడే ఈ ఆరోపణలు చేశారు. జో బైడిన్ తనను అనేక సార్లు లైంగికంగా వేధించారని ఆరోపించడం ఇప్పుడు అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ఆరోపణలు రావడం డెమోక్రటిక్ అభ్యర్థికి కొంతమేర ఇబ్బందికర విషయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. (చైనాపై మళ్లీ కారాలు మిరియాలు) అయితే తారా చేసిన ఆరోపణలను జో బైడిన్ తీవ్రంగా ఖండించారు. తానెవ్వరనీ లైంగిక వైధింపులకు గురిచేయలేదని, ఇదంతా రాజకీయ కుట్రని అని కొట్టిపారేశారు. కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈసారి జో బైడిన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఆయన సమీప అభ్యర్థి బెర్నీ శాండర్స్ కూడా జో కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ బరిలో నిలువనున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1371282435.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్@42
న్యూఢిల్లీ: పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనా రిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసా గుతోంది. కాగా, ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది. భారత్‌లో దోషపూరిత ప్రజాస్వామ్యం! దేశంలో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం అంశాల్లో మొత్తమ్మీద పది పాయింట్లకు గాను 9.17 దక్కగా పౌరస్వేచ్ఛ, రాజకీయ సంస్కృతి, ప్రభుత్వ పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం అంశాల్లో వెనుకబడినట్లు ఈఐయూ పేర్కొంది. లౌకిక దేశంలో అతివాద హిందూ ధోరణులు, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై హింస పెరగటమే భారత్ స్థానం పడిపోవటానికి కారణమంది. భారత్‌లో మీడియా స్వేచ్ఛ కూడా పాక్షికంగానే ఉందని, ఛత్తీస్‌గఢ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పాత్రికేయులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపింది. అట్టడుగున ఉత్తరకొరియా: దోషపూరిత ప్రజాస్వా మ్య దేశాల్లో.. భారత్‌తోపాటు అమెరికా(21), జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, హాంగ్‌కాంగ్ కూడా ఉన్నాయి. మిశ్రమపాలన ఉన్న పొరుగుదేశాలు.. బంగ్లాదేశ్ 92, నేపాల్ 94, భూటాన్ 99, పాకిస్తాన్ 110వ స్థానాల్లో ఉన్నాయి. నిరంకుశపాలిత దేశాల జాబితాలో మయన్మార్ 120, రష్యా 135, చైనా 139, వియత్నాం 140, సిరియా 166వ స్థానంలో ఉండగా, ఉత్తర కొరియాకు అట్టడుగు 167 స్థానం దక్కింది. ప్రపంచ జనాభాలో కేవలం 4.5% మంది సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన కింద జీవిస్తున్నారు. దాదాపు సగం (49.3%) మందికి ఏదో ఒకరకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నట్లు ఈఐయూ గుర్తించింది. -
ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అగ్రపీఠాన్ని వరించబోయేది ఎవరా.. అని ఓటర్లలో తెగ ఉత్కంఠ నెలకొంటోంది. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై స్వల్పంగా 4 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ కొనసాగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ పేర్కొంది. తగ్గాపోరుగా ఈ ఇద్దరి నేతలు అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాతీయ పోల్స్ అన్నింటిలో కూడా హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. తాజా పోల్ సర్వేలో ఆధిక్య పాయింట్లను హిల్లరీ కోల్పోయినప్పటికీ, 4 పాయింట్లతో ముందంజలోనే ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది. ఒకవేళ అమెరికాకు నేడే ఎన్నికలు జరిగితే 41 శాతం మంది రిజిస్ట్రర్ ఓటర్లు హిల్లరీకే మద్దతు పలుకుతారని ప్యూ సర్వేలో వెల్లడైంది. 37 శాతం ట్రంప్‌కు మొగ్గుచూపుతున్నట్టు సర్వే తెలిపింది. ఈ ఏడాది మొదటి వరకు చాలామంది ఓటర్లు అమెరికా అభ్యర్థిత్వానికి క్లింటన్ లేదా ట్రంప్‌ల్లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థతలో ఉండేవారని.. ప్రస్తుతం క్లారిటీతో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడవుతున్నట్టు సర్వే వివరించింది. కేవలం 27 శాతం మందే ట్రంప్‌ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్‌గా అభివర్ణిస్తుంటే.. దానికి డబుల్ శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్‌ను పోల్చుతున్నారని సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్..యావరేజ్ ప్రెసిడెంటని చెబుతున్నట్టు పేర్కొంది. ట్రంప్ కంటే ఆధిక్యంలో గ్రేట్ ప్రెసిడెంట్‌గా హిల్లరీనే ఓటర్ల మన్ననలను పొందుతున్నారని.. 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారట. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో(1,567 రిజిస్ట్రర్ ఓటర్లు కలిపి) ప్యూ రీసెర్చ్ ఈ తాజా సర్వే నిర్వహించింది. . -
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం!
న్యూ ఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ చర్యలు ఉంటున్నాయని, ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్త పరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి మంచి అవకాశం ఉందని, ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వంగా ఉందంటూ అరుణ్ జైట్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికట్లో ఢిల్లీలో బిజేపీ అతి తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చుకానీ, ప్రస్తుతం తిరిగి ఆ మెజారిటీని సంపాదించుకున్నామని ఢిల్లీ బిజేపీ కార్యవర్గ సమావేశంలో జైట్లీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, ఒక్క పని కూడ పూర్తి చేయలేదని అన్న ఆర్థిక మంత్రి... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కేజ్రీవాల్ తీరును ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ లెక్కల్లోనే లేకపోగా, బిజెపి తిరిగి రాజకీయ స్థానాన్ని సంపాదించేందుకు ఇదే మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు ఇదే సరైన సమయమని, వారు చాలా నిరాశలో ఉన్నారని మంత్రి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, ఢిల్లీ ప్రభుత్వ చర్యలను కూడ ఎత్తి చూపాలని ఆయన కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు దారి తీసిందని, దేశంలో అన్ని మూలలా రాజకీయ ఉనికిని పెంచేందుకు పోరాడాలని సూచించారు. దేశ వ్యతిరేక నినాదాలను అన్ని విధాలా మౌఖికంగా ఖండించాల్సిన అవసరం ఉందని, జాతి వ్యతిరేక అంశాలను సమ్మతిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై అసమ్మతి తెలపాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. తాముకూడ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే పార్లమెంట్ లో ప్రస్తుత పరిస్థితులు అపూర్వంగా కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జైట్లీ ఆరోపించారు. -
'ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం'
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు అనైతికమని ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ... న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమన్నారు. కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకున్నా దేశద్రోహం కేసు పెట్టారని అగ్నివేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోహిత్ విషయంలో బీజేపీ కేంద్రమంత్రులు అత్యుత్సాహం చూపారని స్వామి అగ్నివేశ్ చెప్పారు. -
'ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరపున ముందున్న హిల్లరీ క్లింటన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోవాలో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్సియల్ డిబేట్లో పాల్గొన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తన భర్త బిల్ క్లింటన్ సలహాలు సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడుతాయని అంది. అయితే పాలనకు సంబంధించిన ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు హిల్లరీ వెల్లడించారు. 'నాకున్న బెస్ట్ సలహాదారుడు బిల్. 1990 లలో అమెరికా పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగవడంలో అతని పాత్ర ఎంతో ఉంది. నేను తప్పకుండా బిల్ సలహాలు తీసుకుంటాను' అని హిల్లరీ తెలిపారు. అమెరికా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని తెలిపిన ఆమె.. ముఖ్యంగా పేద ప్రజలు స్వతహాగా అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి
డల్లాస్: 8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇల్లినాయిస్ నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా డల్లాస్‌లోని పలువురు భారతీయులు కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిసి, ఆయనకు తమ మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు గతంలో విధాన సలహాదారుగా కృష్ణమూర్తి పనిచేశారు. -
'మహాకూటమి విజయం ప్రజాస్వామ్య విజయం'
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి సాధించిన విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి అభివర్ణించారు. బిహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి సరైన గుణపాఠం చెప్పారన్న ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారికి భంగపాటు తప్పదని తెలిపారు. బిహార్ ప్రజలు మహాకూటమి వైపు నిలిచి మతపరమైన శక్తులకు బుద్ధి చెప్పారన్నారు. -
ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం
సమకాలీనం సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపిస్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు బయట కనిపించకూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు తెలుగునాట తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మూడిటిదీ అటు ఇటుగా ఇదే వైఖరి. ‘‘మనం దేశంలో అతి పెద్ద పార్టీ కావాలి!’’ అని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంలో తప్పు లేదు. ‘‘మనం మాత్రమే మిగలాలి’’ అనే వైఖరిని ప్రదర్శించడం మింగుడుపడేది కాదు. చిన్న చిన్న కంపెనీల్ని విలీనం చేసుకుంటూ బహుళజాతి సంస్థలు బలపడే తరహాలోనే నేడు భారత రాజకీయాల్లో నూతన విధ్వంస సంస్కృతి పెచ్చరిల్లు తోంది. శరవేగంగా రాజకీయాల కార్పొరేటీకరణ జరుగుతోంది. ఇదివరలో రాజకీయ పక్షాలు తాము ప్రజలకు దగ్గరై బలపడాలనీ, ఇతర రాజకీయ పార్టీలు ప్రజల మద్దతు కోల్పోయి బలహీనపడాలని కోరుకునేవి. ఇప్పుడు ఆ వైఖరి పూర్తిగా మారుతోంది. కొన్ని రాజకీయ పక్షాల్లో, ఇతర రాజకీయ పార్టీల పొడ గిట్టని అసహనం పెరిగిపోతోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఉనికే ఉండకూడ దన్న ఏకపక్ష ధోరణితో అవి పార్టీలకు పార్టీలనే సమూలంగా నిర్మూలించే అనై తిక, అభ్యంతరకర చర్యలకు దిగుతున్నాయి. రాజకీయ స్పర్థలు ఎన్నికల వరకు ఉండటం, పిదప కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ ఎన్నికలవరకు ఎవరి పనుల్లో వారుండటం సహజంగా జరిగేది. కానీ, ఇటీవల ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపి స్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు బయట కనిపించనే కూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతోంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగునాట.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మూడూ పాలక పక్షాలుగా కొంచెం అటుఇటుగా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. చట్టాలు, సంప్రదాయాలు, కనీస విలువలకు తిలోదకాలిచ్చి ప్రత్యర్థి పార్టీల వారిని తమ పార్టీల్లోకి లాక్కుంటూ అవి అనుసరిస్తున్న విధానాలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. ఒక రకంగా ఈ మూడు పాలకపక్షాలు తమ నూతన విధ్వంస సంస్కృతి విస్తరణకు తెలుగునేలను ప్రయోగశాలగా వాడుకుంటున్నట్టు స్పష్టమౌతోంది. ఒకవంక ప్రత్యర్థి రాజకీయ పార్టీల నిర్మూలన, మరో వంక బాగా పలుకుబడి, అర్థ-అంగ బలమున్న కార్పొరేట్ శక్తుల్ని కీలక పదవుల్లోకి తెస్తూ అతివేగంగా రాజకీయాల్ని కార్పొరేటీకరణ చేస్తున్న తీరూ కలసి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తల ప్రాధాన్యత క్రమంగా తగ్గు తోంది. పెట్టుబడిదారులకు, వ్యవహారకర్తలకు, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నయా రాజకీయ సంస్కృతిలో కుల సమీకరణలు, సామాజిక అమరికలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. విలువలు, విధానాల కన్నా ఎత్తులు-ఎత్తుగడలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఒకసారి గెలిచామంటే ఎదురులేని విధంగా స్థిరపడాలి. మళ్లీ ఎన్నికల నాటికి ‘ఏ పరిస్థితుల్నయినా’ ఎదుర్కోగల బలాన్ని, బలగాన్ని, ఇతర వన రుల్ని, సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. పనిలో పనిగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వీలయినంతగా బలహీనపర్చడం, అవకాశముంటే పూర్తిగా మట్టుపె ట్టడం అన్న పంథాను బహిరంగంగానే కొన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇద్దరు మోదీలను చూశాం ఎన్నికల ముందు పవన్ కల్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని, తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి... తెలివైన సర్దుబాట్లు, వ్యూహాత్మక ఎత్తుగడలతో తలప డిన నరేంద్రమోదీని చూశాం. ఎన్నికల తర్వాత, బీజేపీని, ఆ పార్టీ నేతృత్వం లోని ఎన్డీఏ కూటమిని ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయ తీరాలు దాటించిన నవ్య నరేంద్ర మోదీని చూశాం. ఇద్దరు మోదీల మధ్య ఎంత వ్యత్యాసముందో, అంతగానూ దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలు నేడు మార్పులకు గురవు తున్నాయి. సరిగ్గా ఆరేడు మాసాల క్రితం.. ప్రాంతీయ రాజకీయశక్తులు ప్రధాన జాతీయ పార్టీలకే వెన్నులో చలిపుట్టించే స్థితి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారు మారైంది. ఎన్డీఏ, ముఖ్యంగా దాని పెద్దన్న బీజేపీ దెబ్బకు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు కుదేలయ్యాయి. కాంగ్రెస్ ఖంగు తింది. 543 లోక్‌సభ స్థానా ల్లో కాంగ్రెస్ తనకు తానుగా 44 స్థానాలు తెచ్చుకోగా, దాని నేతృత్వంలోని యూపీఏ 58 స్థానాలకు పరిమితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంకీర్ణ ధర్మాల వ్యాకరణాన్నే మార్చేసిన రాజకీయ వాతావరణం పురుడు పోసుకుంది. ఇప్పుడు దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత బీజేపీ అధినాయకత్వం భుజాలకెత్తుకుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన జేడీ(యు), ఎస్పీ, ఆర్జేడీ, ఐఎన్ఎల్డి వంటి రాజకీయ శక్తులన్నీ ‘జనతా పరివార్’గా కూటమి కట్టి పునరేకీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలూ బలంగా ఉంటే తప్ప ప్రాంతీయ పార్టీల కథ ముగిసినట్టు కాదని సంకేతాలిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలపడ్డ క్రమంలోనే కాంగ్రెస్ బలహీన పడ్డ తీరు రాజకీయ శూన్యతకు ప్రతీకనీ, అది ప్రాంతీయ శక్తుల విస్తరణకు అనుకూలించే అంశమనీ వారి వాదన. కానీ, ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ నూతన అధ్యక్షుడు అమిత్ షాల జోడీ విజృంభిస్తున్న తీరు మాత్రం ప్రాంతీయ శక్తులది మేకపోతు గాంభీర్యమేనా? అన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది. నిన్నటి హర్యానా, మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, రేపటి ఎన్నికలకు సమాయత్తమౌతున్న జమ్మూ- కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పన్నుతున్న వ్యూహాలు ఈ అనుమా నాల్ని బలోపేతం చేస్తున్నాయి. ప్రాంతీయశక్తుల్ని కొల్లగొట్టయినా బీజేపీని అప్ర తిహత శక్తిగా మలచాలన్న వారి యుక్తులు అడుగడుగునా స్పష్టమౌతున్నాయి. మరిన్ని కుయుక్తుల బాటలో... ఎన్నికల ముందు మాయావతి, ములాయంసింగ్, లాలూప్రసాద్, మమతా బెనర్జీ, శరద్‌పవార్, కరుణానిధి, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్‌కు మార్... ఇలా ఎవరికి వారే బలమైన శక్తులుగా కనిపించారు. వారి ప్రభావం బలంగా ఉండి రెండు ప్రధాన జాతీయ పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు వణుకు పుట్టించాయి. బీజేపీ తనదైన శైలిలో ప్రచార వ్యూహాలు, పొత్తుల ఎత్తు లతో, ఆరెస్సెస్ వంటి శక్తుల ఎత్తుగడలతో కొంత ధీమాగానే సాగింది. అయితే, సొంతంగా 282 స్థానాలు గెలిచిన బీజేపీ మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను ఎన్టీఏకు 336 స్థానాలు గెలిపించి పెట్టడం రాజకీయ పక్షాల్లో కొంత విస్మయాన్ని కలిగించింది. కానీ, అది మోదీలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. మెలమెల్లగా పార్టీని ‘అఖండ బీజేపీ’గా మలచి, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని అప్రతిహత శక్తిని చేయాలన్న వ్యూహానికి అది ఊపిరి పోసింది. అమిత్‌షా అందుకు తోడయ్యాడు. ‘‘మనం దేశంలోనే అతిపెద్ద పార్టీ కావాలి’’ అని అమిత్ షా పార్టీశ్రేణులకు పిలుపునివ్వడంలో ఏ తప్పూ లేదు. కానీ, కాలక్రమేణా మనం మాత్రమే మిగలాలి అన్న ధోరణిని ప్రదర్శించడం ప్రత్యర్థి పక్షాలు జీర్ణించుకోలే కపోతున్నాయి. సంకీర్ణ భాగస్వాముల అలకలు, ప్రాంతీయ శక్తుల ప్రాబల్యా లకు మొన్నటి ఎన్నికలకు ముందు ఎంతగానో జడిసిన బీజేపీ... తద్విరుద్ధంగా ఎన్నికల తదుపరి శివసేన పట్ల అనుసరించిన వైఖరే అందుకు నిదర్శనం. పాతికేళ్ల మిత్రపక్షాన్ని మహా ఎన్నికల్లో దూరం పెట్టి, కడకు ఫలితాల్లో చుక్కలు చూపించింది. బెట్టు చేస్తే రేపు, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌కూ ఇదే గతి తప్పదేమో! అంతేగాక సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుమతి లభించిం దన్న ధీమాతో అది కశ్మీర్, బీహార్లలో కూడా కొత్త ఎత్తుగడలకుపోతోంది. ఇదొక పార్శ్వం మాత్రమే! అసలు ఎత్తుగడ అస్సాంలో కనిపిస్తోంది. 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరవచ్చన్న బీజేపీ శాసనసభా పక్షనేత మాటలకు అక్కడి తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుపా నులో అరటాకులా అల్లల్లాడుతోంది. మూడింట రెండొంతుల మందిని చేర్చు కుంటే పార్టీ మార్పిళ్ల చట్టం వర్తించదని, ‘విలీనం’ కిందకు వస్తుందని అటు పావులు కదుపుతున్నారు. 126 సభ్యుల సభలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 78. ఇప్పటికే 31 మంది కాంగ్రెస్ సభ్యులు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఇలాంటి అనైతిక పార్టీ మార్పిళ్ల గురించి, కార్పొరేట్ శక్తులకు పరుస్తున్న ఎర్ర తివాచీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ అసెంబ్లీలో ఏకపక్షంగా తెలుగుదేశం సభ్యుల్ని వారం పాటు సస్పెండ్ చేస్తే గట్టిగా గొంతెత్తే విపక్షం లేదు. తమ నాయకుల్ని పాలకపక్షం చట్ట వ్యతిరేకంగా లాక్కుంటోందని అరిచి గీపెట్టి, కడకు కాంగ్రెస్ కూడా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరీ అన్యాయం. బ్యాలెట్ పెట్టెల్లో తడి ఆరకముందే పార్టీ ఫిరాయించి, అవతలి పక్షం కండువాలు ధరించిన ఎంపీపై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ చర్య లేదు. ఇక అక్కడి కార్పొరేటీకరణ బహిరంగ రహస్యమే! ప్రతి ఎన్నికలప్పుడు, ముందూ, వెనుకా అక్కడి పాలక పక్షానికి ధన వ్యవస్థతో ఊడిగం చేయిస్తున్న కార్పొరేట్ శక్తుల, వ్యక్తుల ప్రాబల్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంలో, పార్టీలో, ఎంపీల్లో, ఎమ్మెల్యేల్లో, ఎమ్మెల్సీల్లో.... అంతటా వారిదే ముఖ్యపాత్ర. పార్టీ సాధారణ కార్యకర్తలు ఎన్నికలప్పుడు పౌరుల్ని ఓటర్లుగా మార్చే సైనికులు మాత్రమే! ప్రజాస్వామ్యం, వేదికల మీద దంచే ఉపన్యాసాలకు పనికొచ్చే ముడిసరుకు మాత్రమే! ఇదీ పరిస్థితి!! ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ -
మేయర్ కాని మేయర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సొమ్మొకరిది.. సోకొకరిది అనే చందంగా మారింది నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి. ప్రజాస్వామ్య బద్ధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ అయితే.. అప్రజాస్వామికంగా టీడీపీ నేత, కార్పొరేటర్ జెడ్ శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అందుకు మంగళవారం 11వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వెలసిన బ్యానర్లే నిదర్శనం. వార్డులో వెలసిన ఆ బ్యానర్లను చూసిన నగర ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఔరా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. అనూహ్యంగా ఏర్పాటు చేసిన పచ్చ బ్యానర్‌ను చూసి టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కార్పొరేటర్‌గా విజయం సాధించి మేయర్ పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ టీడీపీ నేతల ప్రలోభాలకులోనై పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. టీడీపీలో చేరిన నాటి నుంచి మేయర్ అజీజ్‌కు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ జోక్యం చేసుకుని పార్టీ శ్రేణులు మేయర్ అజీజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఒకరకంగా హుకుం జారీ చేశారు. అయినా తమ్ముళ్ల తీరు మారకపోవడంతో మంత్రి నారాయణ ఇటీవల టీడీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నుంచి చేరిన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి సమక్షంలోనూ మేయర్ అజీజ్‌ను లెక్కచేయకుండా విమర్శలు చేశారు. టీడీపీలోని ఓ వర్గం మంత్రి మాటనూ పెడచెవిన పెట్టింది. కొద్దిరోజులకు అంతా సర్దుకుంటుందని భావిం చారు. అయితే అటువంటిదేదీ జరక్కపోవటంతో రోజురోజుకూ కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో మేయర్ అజీజ్ జన్మభూమి కార్యక్రమాల్లో పెద్దగా హాజరుకాకుండా దూరంగా ఉంటున్నారు. అడుగడుగునా అవమానం నగరంలో మంగళవారం 11వ వార్డులో నెల్లూరు మేయర్ జడ్ శివప్రసాద్ అని పేర్కొంటూ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండటంతో అటు టీడీపీలోనూ.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం తాము ఏ పార్టీలో ఉన్నామో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ‘అనుకున్నదొకటి.. జరిగేదొక్కటి’ అన్నచందంగా మారటంతో ‘పార్టీ మారినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాం’ అని ఓ కార్పొరేటర్ మంగళవారం తన వర్గీయుల వద్ద ఆందోళన వ్యక్తం చేయటం కనిపించింది. మేయర్‌గా పీఠాన్ని అధిష్టించిన అబ్దుల్ అజీజ్ నగరంలో చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులోభాగంగా పొడి చెత్తను వేరు చేసి వేలం నిర్వహించాలని, వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నారు. అలాగే తడిచెత్తను మినీ డంపింగ్‌యార్డుకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించి తద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని భావించారు. అదేవిధంగా నగరంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వీటి అమలును టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ రెండు కార్యక్రమాలు అటకెక్కినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా మేయర్ వార్డుల్లో పర్యటించాలని భావించారు. అందుకు కొందరు అధికారులు సహకరించకపోవటం.. ఆయా వార్డుల్లోని టీడీపీ కార్పొరేటర్లు నిరాకరించటంతో ఆ కార్యక్రమం కూడా ముందుకు సాగలేదు. టీడీపీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నగరపాలక సంస్థ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు అధికారులు, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి మేయర్ అజీజా? జడ్ శివప్రసాదా? అని టీడీపీ శ్రేణులు చర్చించుకోవటం కనిపించింది.