అమెరికన్లకు హారిస్ హెచ్చరిక
దేశాన్ని వెనక్కు తీసుకెళ్తారంటూ ధ్వజం
డెమొక్రాట్ల అభ్యరి్థత్వం స్వీకరిస్తూ భావోద్వేగ ప్రసంగం
షికాగో: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ’ఏ మాత్రం సీరియస్‌నెస్ లేని వ్యక్తి’గా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. ‘పొరపాటున ఆయన మళ్లీ అధ్యక్షుడైతే అంతులేని వినాశనమే. దేశాన్ని ట్రంప్ అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనక్కు తీసుకెళ్తారు‘ అంటూ అమెరికన్లను హెచ్చరించారు.
డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చివరి రోజు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని ఆమె లాంఛనంగా స్వీకరించారు. ‘జాతి, లింగ, భాషా భేదాలకు అతీతంగా, తమ కలల సాకారానికి అహరహం శ్రమిస్తున్న అమెరికన్లందరి తరఫున ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నా‘ అంటూ కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు.
నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా హారిస్ అభివరి్ణంచారు. ‘నన్ను గెలిపిస్తే పార్టీ భేదాలు తదితరాలకు అతీతంగా, అమెరికన్లందరి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తా. దేశ మౌలిక విలువలను, సూత్రాలను సమున్నతంగా నిలబెడతా. రాజకీయంగా, సైనికంగా సూపర్ పవర్‌గా అమెరికా స్థానాన్ని అన్నివిధాలా సుస్థిరం చేస్తా. అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పోరాడతా.
గత పాలన తాలూకు విద్వేషాలు, విభజనవాదాలను రూపుమాపి దేశాన్ని ఒక్కటి చేస్తా‘ అని ప్రకటించారు. 59 ఏళ్ల హారిస్ వేదిక మీదకు వస్తుండగా పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. పలు అంశాలను స్పృశిస్తూ 40 నిమిషాల పాటు ఏకధాటిగా సాగిన ఆమె ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతున్నంతసేపూ, ’ఎస్, యూ కెన్ (నువ్వు సాధించగలవ్)’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారమే హారిస్ పదో పెళ్లి రోజు కూడా కావడం విశేషం. హిల్లరీ క్లింటన్ తర్వాత డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత, ఆఫ్రికన్ మూలాలున్న నేత హారిసే. ఆమె గెలిస్తే అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.
ట్రంప్‌పై నిప్పులు
ట్రంప్‌పై హారిస్ తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ఏ కోణంలో చూసినా ఆయన అత్యంత నాన్ సీరియస్ వ్యక్తి అని దుయ్యబట్టారు. ట్రంప్ హయాంలో దేశంలో అయోమయం, గందరగోళమే రాజ్యం చేశాయన్నారు. చివరికి ఓటమిని ఒప్పుకోకుండా పార్లమెంటు మీదికే అల్లరిమూకలను ఉసిగొలి్పన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు.
హష్ మనీ మొదలుకుని ఫ్రాడ, లైంగిక వేధింపుల దాకా నానారకాల ఆరోపణలు, లెక్కలేనన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విచి్ఛన్నకర శక్తిగా ట్రంప్‌ను అభివరి్ణంచారు. ‘ట్రంప్ రష్యాకు అన్ని అరాచకాలకూ లైసెన్సు ఇచ్చారు. అమెరికా మిత్రదేశాలపై దండెత్తేలా ప్రోత్సహించారు‘ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే కేవలం తనకోసం, తన బిలియనీర్ మిత్రుల ప్రయోజనాల కోసమే పాటుపడతారని దుయ్యబట్టారు.
‘నేనలా కాదు. అమెరికన్లందరి కోసం పోరాడతా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంతలను ట్రంప్ మాదిరిగా నేను ఉపేక్షించను. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దుతా. సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ట్రంప్‌లా ఎన్నటికీ కించపరచను‘ అని చెప్పారు. గాజా యుద్ధాన్ని ఆపేందుకు బైడెన్‌తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు సర్వ హక్కులూ ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
కోర్టు హౌస్ నుంచి వైట్ హౌస్ దాకా... అనూహ్య ప్రస్థానాలు అలవాటే
అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అత్యంత అనూహ్యంగా తాను అధ్యక్ష రేసులోకి వచి్చన వైనాన్ని హారిస్ ప్రస్తావించారు. ఇలాంటి అనూహ్య ప్రస్థానాలు జీవితంలో తనకు కొత్తేమీ కాదన్నారు. అమెరికాను తిరిగి ఐక్యం చేసి నూతన దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నేతగా తనను తాను పరిచయం చేసుకున్నారు.
కోర్టు హౌస్ నుంచి ఇప్పుడు వైట్ హౌస్‌కు పోటీపడే దాకా తన జీవనయానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందన్నారు. ‘ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశ ఘన చరిత్రకు వారసులం మనం. అమెరికా అంటే అనంతమైన అవకాశాలకు, అంతులేని ప్రేమకు, అపరిమితమైన స్వేచ్ఛకు ఆలవాలమని ప్రపంచానికి మరోసారి చాటుదాం‘ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు.
తల్లీ నిన్ను తలంచి..
తన తల్లి శ్యామలా గోపాలన్‌ను ఈ సందర్భంగా హారిస్ గుర్తు చేసుకున్నారు. ఆమెను రోజూ మిస్సవుతున్నానని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రధానమైన గాజుతెరను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో అమ్మ మరీ మరీ గుర్తొస్తోందని చెప్పారు. ఆమె నూరిపోసిన విలువలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. ఏ పనీ సగంలో వదలొద్దని తల్లి తనకు మరీ మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నారు.
‘నా తల్లి కేవలం 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి ఎన్నో కలలతో భారతదేశం నుంచి అమెరికాలో అడుగు పెట్టింది. ఒక సైంటిస్టుగా రొమ్ము క్యాన్సర్‌కు మందు కనిపెట్టడమే లక్ష్యంగా శ్రమించింది. ఉన్నది ఐదడుగులే అయినా అనంతమైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. భారత్ తిరిగి వెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ సమయంలో జమైకా నుంచి వచి్చన మా నాన్న డొనాల్డ్ హారిస్‌తో అమ్మకు పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
నన్నూ, చెల్లెలు మాయను అమ్మే పెంచింది. ఈస్ట్ బేలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. శ్రామిక తరగతి వ్యక్తుల నడుమ పెరిగాం. అమ్మ రోజంతా పనిచేస్తే మా బాగోగులు ఇరుగుపొరుగు చూసుకునే వాళ్లు‘ అంటూ వారిని పేరుపేరునా హారిస్ గుర్తు చేసుకున్నారు. ‘వాళ్లంతా మాకు రక్త సంబం«దీకులు కాకున్నా ప్రేమ బాంధవులు. కలసికట్టుగా నెగ్గడం ఎలానో వారి మధ్య పెరగడం వల్లే నేర్చుకున్నా‘ అన్నారు. ‘ఈ క్షణం అమ్మ పైనుంచి నన్ను కచి్చతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది‘ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కూడా ఈ సందర్భంగా ఆప్యాయంగా స్మరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment