national convention
-
Kamala Harris: ట్రంప్ వస్తే వినాశనమే
షికాగో: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ’ఏ మాత్రం సీరియస్‌నెస్ లేని వ్యక్తి’గా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. ‘పొరపాటున ఆయన మళ్లీ అధ్యక్షుడైతే అంతులేని వినాశనమే. దేశాన్ని ట్రంప్ అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనక్కు తీసుకెళ్తారు‘ అంటూ అమెరికన్లను హెచ్చరించారు. డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చివరి రోజు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని ఆమె లాంఛనంగా స్వీకరించారు. ‘జాతి, లింగ, భాషా భేదాలకు అతీతంగా, తమ కలల సాకారానికి అహరహం శ్రమిస్తున్న అమెరికన్లందరి తరఫున ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నా‘ అంటూ కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా హారిస్ అభివరి్ణంచారు. ‘నన్ను గెలిపిస్తే పార్టీ భేదాలు తదితరాలకు అతీతంగా, అమెరికన్లందరి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తా. దేశ మౌలిక విలువలను, సూత్రాలను సమున్నతంగా నిలబెడతా. రాజకీయంగా, సైనికంగా సూపర్ పవర్‌గా అమెరికా స్థానాన్ని అన్నివిధాలా సుస్థిరం చేస్తా. అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పోరాడతా. గత పాలన తాలూకు విద్వేషాలు, విభజనవాదాలను రూపుమాపి దేశాన్ని ఒక్కటి చేస్తా‘ అని ప్రకటించారు. 59 ఏళ్ల హారిస్ వేదిక మీదకు వస్తుండగా పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. పలు అంశాలను స్పృశిస్తూ 40 నిమిషాల పాటు ఏకధాటిగా సాగిన ఆమె ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంతసేపూ, ’ఎస్, యూ కెన్ (నువ్వు సాధించగలవ్)’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారమే హారిస్ పదో పెళ్లి రోజు కూడా కావడం విశేషం. హిల్లరీ క్లింటన్ తర్వాత డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత, ఆఫ్రికన్ మూలాలున్న నేత హారిసే. ఆమె గెలిస్తే అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.ట్రంప్‌పై నిప్పులు ట్రంప్‌పై హారిస్ తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ఏ కోణంలో చూసినా ఆయన అత్యంత నాన్ సీరియస్ వ్యక్తి అని దుయ్యబట్టారు. ట్రంప్ హయాంలో దేశంలో అయోమయం, గందరగోళమే రాజ్యం చేశాయన్నారు. చివరికి ఓటమిని ఒప్పుకోకుండా పార్లమెంటు మీదికే అల్లరిమూకలను ఉసిగొలి్పన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. హష్ మనీ మొదలుకుని ఫ్రాడ, లైంగిక వేధింపుల దాకా నానారకాల ఆరోపణలు, లెక్కలేనన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విచి్ఛన్నకర శక్తిగా ట్రంప్‌ను అభివరి్ణంచారు. ‘ట్రంప్ రష్యాకు అన్ని అరాచకాలకూ లైసెన్సు ఇచ్చారు. అమెరికా మిత్రదేశాలపై దండెత్తేలా ప్రోత్సహించారు‘ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే కేవలం తనకోసం, తన బిలియనీర్ మిత్రుల ప్రయోజనాల కోసమే పాటుపడతారని దుయ్యబట్టారు. ‘నేనలా కాదు. అమెరికన్లందరి కోసం పోరాడతా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంతలను ట్రంప్ మాదిరిగా నేను ఉపేక్షించను. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దుతా. సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ట్రంప్‌లా ఎన్నటికీ కించపరచను‘ అని చెప్పారు. గాజా యుద్ధాన్ని ఆపేందుకు బైడెన్‌తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు సర్వ హక్కులూ ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.కోర్టు హౌస్ నుంచి వైట్ హౌస్ దాకా... అనూహ్య ప్రస్థానాలు అలవాటేఅధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అత్యంత అనూహ్యంగా తాను అధ్యక్ష రేసులోకి వచి్చన వైనాన్ని హారిస్ ప్రస్తావించారు. ఇలాంటి అనూహ్య ప్రస్థానాలు జీవితంలో తనకు కొత్తేమీ కాదన్నారు. అమెరికాను తిరిగి ఐక్యం చేసి నూతన దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నేతగా తనను తాను పరిచయం చేసుకున్నారు. కోర్టు హౌస్ నుంచి ఇప్పుడు వైట్ హౌస్‌కు పోటీపడే దాకా తన జీవనయానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందన్నారు. ‘ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశ ఘన చరిత్రకు వారసులం మనం. అమెరికా అంటే అనంతమైన అవకాశాలకు, అంతులేని ప్రేమకు, అపరిమితమైన స్వేచ్ఛకు ఆలవాలమని ప్రపంచానికి మరోసారి చాటుదాం‘ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు.తల్లీ నిన్ను తలంచి.. తన తల్లి శ్యామలా గోపాలన్‌ను ఈ సందర్భంగా హారిస్ గుర్తు చేసుకున్నారు. ఆమెను రోజూ మిస్సవుతున్నానని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రధానమైన గాజుతెరను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో అమ్మ మరీ మరీ గుర్తొస్తోందని చెప్పారు. ఆమె నూరిపోసిన విలువలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. ఏ పనీ సగంలో వదలొద్దని తల్లి తనకు మరీ మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నారు. ‘నా తల్లి కేవలం 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి ఎన్నో కలలతో భారతదేశం నుంచి అమెరికాలో అడుగు పెట్టింది. ఒక సైంటిస్టుగా రొమ్ము క్యాన్సర్‌కు మందు కనిపెట్టడమే లక్ష్యంగా శ్రమించింది. ఉన్నది ఐదడుగులే అయినా అనంతమైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. భారత్ తిరిగి వెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ సమయంలో జమైకా నుంచి వచి్చన మా నాన్న డొనాల్డ్ హారిస్‌తో అమ్మకు పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. నన్నూ, చెల్లెలు మాయను అమ్మే పెంచింది. ఈస్ట్ బేలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. శ్రామిక తరగతి వ్యక్తుల నడుమ పెరిగాం. అమ్మ రోజంతా పనిచేస్తే మా బాగోగులు ఇరుగుపొరుగు చూసుకునే వాళ్లు‘ అంటూ వారిని పేరుపేరునా హారిస్ గుర్తు చేసుకున్నారు. ‘వాళ్లంతా మాకు రక్త సంబం«దీకులు కాకున్నా ప్రేమ బాంధవులు. కలసికట్టుగా నెగ్గడం ఎలానో వారి మధ్య పెరగడం వల్లే నేర్చుకున్నా‘ అన్నారు. ‘ఈ క్షణం అమ్మ పైనుంచి నన్ను కచి్చతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది‘ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కూడా ఈ సందర్భంగా ఆప్యాయంగా స్మరించుకున్నారు. -
ఏకైక చాయిస్ హారిస్..
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఫక్తు షోమ్యాన్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..హారిస్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమర్‌గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్‌డొనాల్డ్స్‌లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్‌గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్‌పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..హారిస్ రన్నింగ్మేట్గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్‌కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.హారిస్‌కు ఓప్రా మద్దతు..వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.‘‘హారిస్‌ను, ఆమె రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్‌ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు. -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్‌ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్‌పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్‌కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్‌కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్‌కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్‌గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్‌కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
BJP National Convention 2024: 100 రోజులు.. 370 స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు. ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధ్దన్‌రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు. -
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. జూలై 2, 3 తేదీల్లో నోవాటెల్ హోటల్ (హైటెక్స్ సమీపంలోని)లో కార్యవర్గ భేటీ నిర్వహించాలని జాతీయ నాయకత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో రెండ్రోజులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 40 మంది కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు దాదాపు 400 మంది నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి నగరంలో ఈ భేటీ జరగబోతోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు వైస్రాయ్ హోటల్లో ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని పార్టీ జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కీలక సమావేశాలను నిర్వహిస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సమావేశ స్థలాన్ని పరిశీలించిన జాతీయ నేతలు సమావేశ స్థలం, జాతీయ కార్యవర్గసభ్యులకు బస కల్పించే నోవాటెల్, ఇతర హోటళ్లు, ప్రధాని బస నిమిత్తం రాజ్‌భవన్, తదితర ప్రదేశాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్‌ఛుగ్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు బుధవారం సందర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలు సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మంత్రి శ్రీనివాస్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ తదితరులతో తరుణ్‌ఛుగ్, సంతోష్‌జీ సమావేశమయ్యారు. లోపాలు, లోటుపాట్లు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. బుధవారం రాత్రి రాజ్‌భవన్‌ను సైతం సందర్శించిన తరుణ్ చుగ్, çసంతోష్‌జీ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. రాజ్‌భవన్‌లో ప్రధాని బస కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనుండగా కేంద్ర మంత్రులు వివిధ స్టార్ హోటళ్లలో విడిది చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 500 దాకా గదులను ముందస్తుగా బుక్ చేసినట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా హాజరుకానుండటంతో వారికి విడిగా మీడియా సెంటర్, హోటళ్లలో బస తదితర ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది. అటు పార్టీ కార్యాచరణ.. ఇటు రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టి.. దేశవ్యాప్తంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రంతో సహా వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 8 ఏళ్ల మోదీ పాలన విజయాలు, పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రాల్లో ప్రాంతీయ, కుటుంబ పార్టీలు అధికారంలో ఉండటంతో పెరుగుతున్న అవినీతి, నియంత పాలనను ప్రస్తావించనున్నారు. కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఏర్పడితే లభించే ప్రయోజనాలు తెలియజేయనున్నారు. టీఆర్ఎస్ సర్కారు పాలన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసి అటు పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. -
బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయస్థాయి అవార్డు
బాసర: బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానంపై బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు వరించింది. రాజస్తాన్ ఎలేట్స్ టెక్నో ఆధ్వర్యంలో జైపూర్‌లో ఈనెల 24, 25వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్తాన్ ఉన్నత విద్య కమిషన్ కార్యదర్శి అశుతోష్ ఏటిపడేకర్ చేతుల మీదుగా బాసర ట్రిపుల్ ఐటీ అకడమిక్ డీన్ సాయినాథ్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మణిపూర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రులు, ఏఐసీటీఈ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వ్యవసాయ సంక్షోభంపై జాతీయ సదస్సు
-
సాగు సంక్షోభంపై జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాగు రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపై చర్చించడంతో పాటు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఉన్న మార్గాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. ‘ది నేషనల్ కాన్ఫరెన్స్ 2022’ పేరిట ఈ సదస్సు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పుసా కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 20వ తేదీన సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించే సీఏసీపీ ప్రతినిధులు, పలు వ్యవసాయ వర్సిటీల పరిశోధకులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ప్రధాని సమక్షంలోనే సిఫార్సులు.. సమావేశం తొలిరోజున వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు.. రైతులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధో మథనం జరుపుతారు. రెండోరోజు వారు ప్రధాని మోదీ సమక్షంలో తమ సిఫార్సులను వెల్లడిస్తారు. ఇటీవల బడ్జెట్లో కనీస మద్దతు ధరలను.. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లకు పైగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోతుందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు రుణమాఫీ, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటించాయి. -
సమదృష్టితోనే సుస్థిర అభివృద్ధి
నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ సాక్షి, హైదరాబాద్: ఆర్థిక, సామాజిక, పర్యా వరణ అంశాలపై సమదృష్టితో ప్రభుత్వాలు ముందుకుసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్య మవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ అన్నారు. ఎంసీఆర్‌హెచ్ ఆర్డీలో గురువారం ‘బంగారు తెలంగాణ– సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై నిర్వహిం చిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం అభివృద్ధి వ్యూహాల్లో మార్పులు ఉండాలన్నారు. సుస్థిర అభివృద్ధి కోణంలో నిర్ణయాలను పరిశీలించడానికి ఒక వ్యవస్థను సృష్టించాల్సిన అవసరముంద న్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిం చుకున్న మూడేళ్లు, ఏడేళ్ల అభివృద్ధి ప్రణాళి కలు బాగున్నాయని ప్రశంసించారు. మిషన్ భగీరథ భేష్... రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం రూ.14వేల కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంపై ప్రశం సలు కురిపించారు. మిషన్ భగీరథ పథకం పూర్తయితే ప్రజల్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం మరో 33% పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు బీవీ పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం జీడీపీ పరంగా తెలంగా ణను వృద్ధి పథంలో నడిపించడమే కాకుండా మానవాభివృద్ధి సూచీలో కూడా తమ స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో–ఆర్డినేటర్ డీగో పాలసియోస్, యూనిసెఫ్ హైద రాబాద్ విభాగం అధినేత మిథల్ రస్దియా, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
‘తెలుగు కవిత్వం’లో జోహార్ వైఎస్సార్!
జాతీయ సదస్సులో వైఎస్సార్‌పై కవితలు వినిపించిన ఆచార్య హరికృష్ణ కడప కల్చరల్(కడప): తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం, పాలనకు అద్దం పట్టే కవితలను ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎం.హరికృష్ణ వినిపించారు. 20 మంది ప్రముఖ కవులు డాక్టర్ వైఎస్సార్‌పై రాసిన కవితలను ఆయన భావయుక్తంగా, భావోద్వేగంతో వివరించారు. వైఎస్సార్ జిల్లా కడపలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన వర్సిటీతో కలసి ‘70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం’ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శనివారం సదస్సు ముగింపు సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్‌పై పలువురు రాసిన కవితలను ఆచార్య ఎం.హరికృష్ణ వినిపించారు. ‘ప్రజాకాంక్షలతో నేసిన ఖద్దరు బట్టల్లో నిలువెత్తు పావురంలా మా రాజన్న నడుస్తుంటే.., ప్రముఖ కవి శిఖామణి రాసిన ‘ఒక్క సూర్యుడు’ కవితను ఉటంకిస్తూ ‘ఎవరు అలవోకగా అరచేతిని అలా గాలిలోకి ఎత్తి అటూ, ఇటూ సుతారంగా ఊపితే... కవితలు ఆలపించి అలరించారు. -
కవిత్వం ఉద్దేశం మనుషులందరినీ ఏకం చేయడమే
► ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ► ఘనంగా ప్రారంభమైన జాతీయ సదస్సు కడప: ప్రపంచంలోని మనుషులందరినీ ఏకం చేయడమే కవిత్వం ఉద్దేశమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో 70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రానికి ముందు జాతీయోద్యమ కవిత్వం సాగిందని, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రజలు చేస్తున్న పోరాటానికి ఊతం ఇచ్చిందన్నారు. సబాధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కవిత్వం ప్రతిబింబించిందన్నారు. కవిత్వం కన్నా జీవితం ముఖ్యమైనదని, అణిచివేతకు గురైన వారి జీవితాలను ప్రతిబింబించే దిశగా కవిత్వం నిరంతరాయంగా సాగుతోందన్నారు. సభలో కీలకోపన్యాసం చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ సంచాలకులు ఆచార్య యలవర్తి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సమస్యలున్నంత వరకు కవిత్వం ఉంటుందని, కాలానికి, అవసరానికి అనుగుణంగా రూపాలు, వాదాలు వేరుగా మారినా లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయేస్సుగానే సాగిందన్నారు ‘కవి సంధ్య’ ఆవిష్కరణ: విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, ప్రముఖ కవి శిఖామణి (కె.సంజీవరావు) సంపాదకత్వంలో వెలువడుతున్న ‘కవి సంధ్య’ ద్వైమాస పత్రికను అతిథులతో ఆవిష్కరింపజేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన వైవీయూ కుల సచివులు ఆచార్య వై.నజీర్ అహ్మద్ సదస్సు ధ్యేయాన్ని వివరించారు. సదస్సు సంచాలకులు, బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి రెండు రోజుల సదస్సు గురించి వివరించారు. సదస్సులో కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కవి దుబ్బలదాస్, బుక్కసముద్రానికి చెందిన సమీవుల్లా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.హరికృష్ణ, ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, వైవీయూకు ఆచార్యలు తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్ ఎంఎం వినోదిని, డాక్టర్ రమాదేవి, డాక్టర్ పార్వతి, కె.గంగయ్య, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ టక్కోలు మాచిరెడ్డి, కవి లోసారి సుధాకర్ (డీఎస్పీ), జానమద్ది విజయభాస్కర్, పాలగిరి విశ్వప్రసాద్, కె.చెంచిరెడ్డి, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగోడులో జాతీయ సదస్సు
- ఈ నెల 28, 29 తేదీల్లో కార్యక్రమం - శ్రీనీలం సంజీవరెడ్డి డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాట్లు వెలుగోడు(శ్రీశైలం): ఈ నెల 28, 29 తేదీల్లో వెలుగోడు శ్రీ నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన జాతీయ విద్యా సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడ్వాన్స్డ్ ఇన్ గ్రీన్ కెమిస్ట్రీ అనే అంశంపై తలపెట్టిన జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు హాజరవుతుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు చైర్మన్‌గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రాంభూపాల్‌రెడ్డి, కో-చైర్మన్‌గా బి.రాబేశ్వర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కెమిస్ట్రీ అధ్యాపకులు టీఎస్.రాజేంద్రకుమార్ ఎంపికయ్యారు. వీరు గురువారం సదస్సు ఏర్పాట్లను సమీక్షించారు. సదస్సులో పాల్గొనే వారు ఫోన్(9490974069)లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. -
ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్
జూలైలో జరిగే నేషనల్ కన్వెన్షన్‌లో నామినేషన్ అందజేత వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందడానికి అవసరమైన డెలిగేట్లను డొనాల్డ్ ట్రంప్ సాధించారు. పార్టీ నామినేషన్ గెలుచుకోవటానికి 1,237 మంది డెలిగేట్లు అవసరం కాగా.. ట్రంప్‌కు ఇప్పటికే 1,238 మంది డెలిగేట్ల మద్దతు లభించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ లెక్క తేల్చింది. నేషనల్ కన్వెన్షన్‌లో తాము ట్రంప్‌కు మద్దతిస్తామని ఒక్లహామా పార్టీ చైర్‌వుమన్ పామ్ పొల్లార్డ్ సహా పలువురు డెలిగేట్లు ఏపీకి చెప్పారు. వచ్చే నెల 7న ఐదు రాష్ట్ర ప్రైమరీల్లో 303 మంది డెలిగేట్లు ఓట్లు వేయనుండటంతో.. ట్రంప్ తన విజయాన్ని సులభంగానే బలోపేతం చేసుకోనున్నారు. బిలియనీర్ బిజినెస్‌మేన్‌గా సెలబ్రిటీగా ఉంటూ ప్రభుత్వంపై వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఇంతకుముందు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం 16 మందితో పోటీపడ్డారు. సొంత పార్టీలోనే ట్రంప్‌కు మద్దతు ఇవ్వటానికి చాలా మంది అగ్రనేతలు వెనుకంజవేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో లక్షలాది మంది కార్యకర్తలు ట్రంప్‌కు మద్దతుపలికారు.చివరకు.. నామినేషన్‌కు అవసరమైన డెలిగేట్లను ట్రంప్ సాధించారు. ఆయన జూలైలో జరిగే కన్వెన్షన్‌లో నామినేషన్ అందుకోనున్నారు. అవును మారు పేర్లు వాడాను: వ్యాపార ఒప్పందాల్లో తాను చాలాసార్లు మారు పేర్లను వాడినట్లు ట్రంప్ అంగీకరించారు. ఆయన ఏబీసీ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘నేను చాలా సార్లు మారుపేర్లు వాడాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నపుడు ఏదైనా కొనాలని అనుకుంటాను. కానీ నా పేరు వాడితే ఆ భూమి కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వేరే పేర్లు వాడాను’ అని చెప్పారు. -
వివక్షకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు జరగనుంది. వర్సిటీలోని దళిత్-ఆదివాసీ స్టడీస్, అంబేడ్కర్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిసున్నట్టు తెలిపారు. ICSSR ఛైర్మన్ సుఖదేవ్ థోరట్, కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి పిఎస్.క్రిష్ణన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమాచక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా లతో కూడిన బృందం ఈ సదస్సుకి ముఖ్య అథిదులుగా హాజరుకానున్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటిలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో నెలకొన్న కుల వివక్షపై సమగ్రసమాచారాన్ని సేకరించి, నిర్దిష్టమైన నివేదికను తయారుచేయడమే జాతీయ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హెచ్‌సియులో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్, అతనితో పాటు మరో నలుగురు విద్యార్థుల రస్టికేషన్ నేపధ్యంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని వివక్షను తెరపైకి తెచ్చింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఆయా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు స్పష్టమైన రిపోర్టును అందించనున్నారు. ఈ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న వివక్షపై ఒక డాక్యుమెంటును రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని రాష్ట్ర పతి, ప్రధానులకు, అన్ని రాజకీయ పక్షాలకు అందించనున్నారు. -
11నుంచి అంధుల జాతీయ సదస్సు
అఖిల భారత కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఢిల్లీ) జాతీయ సేవా సంస్థ ప్రతి నాలుగేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సర్వసభ్య సమావేశాలను ఈనెల 11 నుంచి రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ సదస్సులో విద్యాహక్కు, విద్యా విషయ చట్టం అమలు సమస్యలపై చర్చించనున్నట్లు నిర్వహాకులు అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం(డ్వాబ్) ప్రధాన కార్యదర్శి సోమగోటి చొక్కారావు(నల్లగొండ) తెలిపారు. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ సంస్థకు దేశవ్యాప్తంగా 20 అనుబంధ సంస్థలు ఉన్నాయని, దాదాపు 150 మంది కార్యక్రమంలో పాల్గొంటారని చొక్కారావు తెలిపారు. క్రిష్టోఫెల్ అండ్ బ్లైండ్ మిషన్ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తెలంగాణ సాగు నీటి పారుదల మంత్రి టి. హరీష్‌రావు పాల్గొంటారు. -
పరిశ్రమలకు స్వర్గధామం తెలంగాణ
రాష్ట్ర పారిశ్రామిక విధానంపై జాతీయ సదస్సులో కేటీఆర్ భారీ పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి కె. తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో అన్ని అనుమతులు లభించేలా సింగిల్ విండో విధానాన్ని పకడ్బందీగా అమలుచేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు ఏర్పా టు చేసేవారికి అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను టీఎస్-ఐపాస్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రభుత్వంతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తల ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని... ఇందులో భాగంగా త్వరలో ప్రవాసీ దివస్ పేరుతో సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఐదు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం ముదావహమని కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ సెంట్రల్ వర్సిటీ చాన్సలర్ వై.కె.అలఘ్ పేర్కొన్నారు. పరిశ్రమలతో పాటు డైరీ ప్రాజెక్టులు, పప్పు ధాన్యాల వంటి వ్యవసాయాధారిత ప్రత్యామ్నాయాల పట్ల కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. నూతన పారి శ్రామిక విధానంలో ఉన్న లోటుపాట్లను సవరించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డెరైక్టర్ ఆర్కే మిశ్రా, సెస్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ సూచించారు. -
వ్యాధి నిర్ధారణలో రేడియాలజిస్ట్‌ల పాత్ర కీలకం
ఎమర్జెన్సీ రేడియాలజీ సదస్సులో డాక్టర్ కాకర్ల సుబ్బారావు విజయవాడ : వ్యాధి నిర్ధారణలో రేడియాలజిస్ట్‌ల పాత్ర కీలకమని నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ) విజయవాడ శాఖ ఆధ్వర్యాన రామవరప్పాడు రింగ్ సమీపంలోని ‘కె’ హోటల్లో ‘ఎమర్జెన్సీ రేడియాలజీ’పై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సును ఐఆర్‌ఐఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీఎన్ వరప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్స్‌లో డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలకు గురైన చిన్నారుల గాయాలను గుర్తించే విధానాలను పలు రేర్ ఇమేజెస్‌ను చూపిస్తూ వివరించారు. రేడియాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాధి నిర్ధారణలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో సీటీ తీస్తే రేడియేషన్ ప్రభావం ఉంటుందని ఆందోళన చెందేవారని, ప్రస్తుత తక్కువ రేడియేషన్‌తో వ్యాధిని నిర్ధారించే స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాల్లో వెన్నుపూస, మెదడు, ఇతర అవయవాలకు అయిన గాయాలను ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలోనే స్కాన్ చేసి గుర్తించే అడ్వాన్స్డ్ సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి వ్యాధి నిర్ధారణ ఎంతో ముఖ్యమని, రేడియాలజిస్ట్‌లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రాణాపాయ సమయంలో వ్యాధి నిర్ధారణ కచ్చితంగా ఎలా చేయాలనే అంశాన్ని విశ్లేషనాత్మకంగా వివరించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి 300 మందికిపైగా రేడియాలజిస్ట్‌లు హాజరయ్యారని వివరించారు. అనంతరం ‘బేసిక్స్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఎమర్జింగ్ టూల్’ అనే అంశంపై నగరానికి చెందిన డాక్టర్ కె.లక్ష్మీసుధ ప్రసన్న ప్రసంగించారు. ‘స్పైనల్ గాయాలు’పై డాక్టర్ రవివర్మ, ‘నాన్ ట్రామాటిక్ న్యూరాలజికల్ ఎమర్జెన్సీ’పై డాక్టర్ సి.కేశవదాస్, ‘అక్యుట్లో నడుము నొప్పి’పై డాక్టర్ భావిన్ జాన్కరియా మాట్లాడారు. ‘గైనకాలజీ ఎమర్జెన్సీస్’పై డాక్టర్ టి.రాజేశ్వరరావు, ‘ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎమర్జెన్సీ’పై డాక్టర్ పి.సతీష్ ప్రసంగించారు. ఐఆర్‌ఐఏ నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జీవీ మోహన్‌ప్రసాద్, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలతో పొంచి ఉన్న ప్రమాదం
ఏయూలోని జాతీయ సదస్సులో మంత్రి ‘గంటా’ ఆందోళన త్వరలో సేఫ్టీ అడిట్ చేయించనున్నట్టు వెల్లడి పోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచన ఏయూ క్యాంపస్ : నగరం చుట్టూ ఉన్న ఎన్టీపీసీ, స్టీల్‌ప్లాంట్, ఫార్మా, కెమికల్ పరిశ్రమలతో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వీటిపై త్వరలో సేఫ్టీ అడిట్ చేయిస్తామని వెల్లడించారు. పోర్టు కాలుష్యాన్ని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ నగరం బాంబ్‌పై కూర్చున్నట్టుగా దర్శనమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సోమవారం ‘పర్యావరణంపై ఉద్గారాలు, మలిన పదార్థాల ప్రభావం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పరిశ్రమల స్థాపన ద్వారా సాధించే ప్రగతికంటే ప్రజారోగ్యమే ప్రధానమన్నారు. చిన్నపాటి మానవ తప్పిదాలు ప్రాణాలను హరిస్తున్నాయని, దీనిని ఇటీవల ప్రమాదాలే స్పష్టం చేశాయన్నారు. విశాఖను గ్రీన్ సిటీగా మలిచే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనాన్నరు. పచ్చదనం పెంచితేనే నిర్మాణ అనుమతులు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ గ్రీన్హౌస్ గ్యాస్‌లు, విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావం మానవుని ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతున్నాయన్నారు. సదస్సు చైర్మన్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సదస్సుకు 102 పరిశోధన పత్రాలను విభిన్న అంశాలపై సమర్పించనున్నట్టు తెలిపారు. సమస్యను గుర్తించడం, విశ్లేషించడం, పరిష్కారాలను చూపడం సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(ప్రాజెక్ట్స్) పి.సి.మహాపాత్రో మాట్లాడుతూ తమ పరిశ్రమలో 90 శాతం వ్యర్థాలను పునర్వినియోగం చేస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలో 43 శాతం పైగా హరితవనంగా చేశామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక సంచికను మంత్రి విడుదల చేశారు. ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పి.జార్జి విక్టర్, జేఎన్టీయూ కాకినాడ వీసీ జి.తులసీరామ్ దాస్, ఏయూ రెక్టార్ ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, ఆదికవి నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్ కె.రఘుబాబులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ సదస్సుకు విశేష స్పందన
గణిత, గణన పరిశోధనా ఒరవడిపై ఆచార్యుల, శాస్త్రవేత్తల ప్రసంగాలు హాజరైన దేశ, విదేశీ విద్యార్థులు కాచిగూడ: రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని గణిత, సాం ఖ్యాక శాఖల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కళాశాల అడిటోరియంలో ‘గణిత, గణన శాస్త్రాలలో సాగే ప్రస్తుత పరిశోధనా ఒరవడి’ అనే అంశంపై రెండు రోజు ల (శుక్ర,శని) పాటు నిర్వహించిన జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో తొమ్మిది మంది గణిత, గణన శాస్త్రాలలో నిష్ణాతులైన వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, జాతీయ పరిశోధనాలయాల లోని శాస్త్రజ్ఞులు పాల్గొని ప్రసంగించారు. సదస్సును ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రామకృష్ణ రామస్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ యూనివర్సి టీల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలైన ఆచార్య వి.కణ్ణన్, సుజాత రామదురై, గంగాధర్ మిశ్రా, మంజు అగర్వాల్, డాక్టర్ రుషినారాయణసింగ్, వి.శివరామప్రసాద్, సి.రాఘవేంద్రరావు, వీవీ హరగోపాల్, డాక్టర్ కీర్తి శ్రీవత్సవ వివిధ అంశాలపై ఉపన్యసించారు. సదస్సులో కళాశాల కార్యదర్శి ప్రొఫెసర్ తిప్పారెడ్డి, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి, ప్రిన్సిపాల్ ఎంవీ లక్ష్మీదేవి, డాక్టర్ కె.శారద పాల్గొన్నారు. -
మా అన్నయ్య దాశరథి
చెదరని జ్ఞాపకం ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో’ అన్న కవి దాశరథి. ఆయన చనిపోయి (1987) చాలా కాలమైనా సాహిత్యంలో ఆయన ప్రాసంగికత, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆయన కవిత్వ స్ఫూర్తి పదే పదే స్ఫురణకు వచ్చి ఆయన యశస్సును పెంచుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి మహాకవి దాశరథి పేరుతో ఒక జాతీయ సదస్సు నిర్వహించి ఆ సందర్భంగా వచ్చిన 61 పత్రాలను ‘దాశరథి సాహిత్య సమాలోచన’ గా, దాశరథికి కవుల నివాళిని ‘సాహిత్య ప్రపంచంలో దాశరథి’ గా భారీ సంకలనాలు తీసుకొని వచ్చింది (ప్రతులకు: 9848292715). ఈ సందర్భంగా ఈ సంకలనాల కోసం దాశరథి సోదరుడు దాశరథి రంగాచార్యులు తన అన్నయ్య చివరి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసిన వ్యాసం ఇది. ‘దేశే దేశే కళత్రాని, దేశే దేశేచ బాంధవాః తంతు దేశం నాపశ్యామి యత్ర భ్రాత సహోదరః’ అని విలపిస్తాడు రాముడు- లక్ష్మణుడు మూర్ఛపోయినందుకు. మరి మా అన్నయ్య నా రాముడు దాశరథి కవితా శరధి మాట మాత్రం చెప్పకుండా వెళ్లిపోయాడు. దుఃఖంలో ముంచి పోయాడు. నా గుండెలో చీకట్లు నింపి తిమిరంలో సమరం జరపడానికి వెళ్లిపోయాడు. అక్కడ- ఆ లోకంలో- నైజాం పిశాచం వెలసినట్టున్నాడు. అక్కడ చీకట్లు కమ్ముకున్నట్టున్నాయి. సమరం జరపడానికి పిలిచినట్టున్నారు. దేవుడు వట్టి స్వార్థపరుడు. ఇక్కడి చీకట్లను ఇలాగే ఉంచి, అక్కడి తిమిరంతో సమరానికి మా అన్నయ్యని తీసుకెళ్లాడు.మా అన్నయ్య చనిపోయాడంటే- అతని పార్థివ శరీరాన్ని నేనే అగ్నికి ఆహుతి చేయించానంటే నా మనసు నన్నే నమ్మడం లేదు. తెల్లని ధోవతి ధరించి, కాలరులేని పొడుగు చేతుల చొక్కా వేసుకొని చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకుని మా ఇంటి దర్వాజాలో నుంచొని ‘తమ్ముడూ’ అని పిలుస్తున్నట్టనిపిస్తున్నది. మా అన్నయ్య ఇంకా మాట్లాడ్తాడనీ, ఏ విషయాన్ని అయినా ఎవరితోనయినా గంటల తరబడి మాట్లాడేవారు మరణించడం అసాధ్యం అనీ అనుకుంటుంది మనసు. 20 సెప్టెంబర్ నాడు మా అన్నయ్యను ఆస్పత్రిలో చేర్పించారని ఫోను వచ్చింది. నేను కదిలే స్థితిలో లేను. డాక్టర్‌ను అడిగాను. మీ ఆరాటం చూస్తుంటే మీరు వెళ్లడమే మంచిది అన్నాడు. కమల, నేను వెళ్లాం, మా పిల్లవాడు విరించి అక్కడే ఉన్నాడు. నన్ను మా అన్నయ్య ఉన్న గదికి తీసుకెళ్లాడు. మంచం మీద దిండ్లు ఆనించి కూర్చోపెట్టారు. ఆక్సిజన్ వగైరా గొట్టాలతో కట్టివేసినట్టున్నాడు. అన్నయ్యను చూచాను. నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడ్చేశాను. అన్నయ్య కళ్లు తెరిచాడు. ‘తమ్ముడూ’ అన్నాడు. నా గుండె అవిసిపోయింది. నర్సులు వచ్చారు. నన్ను బయటకు నడిపించారు. మా అన్నయ్యను నిజాం జైల్లో పెట్టగలిగాడు- కాని బంధించలేకపోయాడు. జైల్లోనే ‘వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా’ అని గర్జించాడు. అలాంటి సింహాన్ని ఆస్పత్రి బంధించింది. చూడలేకపోయాను. ఎంతోసేపు విలపించాను.అన్నయ్య ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాడు. నేను, కమల వెళ్లాం. ఆస్పత్రిలో కంటే బావున్నాడు. పూర్వం వలెకాకున్నా సరదాగానే మాట్లాడాడు. ‘మరదలు వచ్చిందంటే ఆపిల్స్ తెచ్చిందన్న మాటే. చెక్కు తీసి కోసి పెట్టమ్మా’ అన్నాడు. అన్నయ్య మాటల్లో దుఃఖపు తడి కనిపించింది. కమల ఆపిల్ చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టింది. ‘తమ్ముడూ.. ఈ ఊపిరితిత్తుల్లో నీరు ఎప్పుడు వచ్చిందో తెల్సుగా. 1940లో ఖమ్మం హీరాలాల్ ఇంట్లో నువ్వు నా మూత్రపురీషాలు ఎత్తిపోశావు’ అని గతాన్ని తోడి పోశాడు. ఆపిల్ ముక్క ఒక్కటే తిన్నాడు. ‘అందరికీ ఆపిల్స్ సెలెక్ట్ చేయడం చేత కాదురా’ అన్నాడు. మా అన్నయ్య బాగవుతున్నాడు. కోలుకుంటున్నాడు. మళ్లీ కొద్దిరోజుల్లో మా ఇంటికి వస్తాడు. ‘తమ్ముడూ’ అని పిలుస్తాడు. మా ఇంట్లో ఆపిల్ తింటాడు. చాయ్ తాగుతాడు. లోకంలో ముచ్చట్లన్నీ చర్చిస్తాడు అనుకున్నాను. కాలేదు. బాగు కాలేదు. మా ఇంటికి రాకుండానే వెళ్లిపోయాడు. ఆశలన్నీ అడియాసలు చేసి వెళ్లిపోయాడు.1-11-87 ఆదివారం నేనూ కమలా వెళ్లాం. అన్నయ్య నిద్రలో ఉన్నాడంటే బయటనే కూర్చున్నాం. గ్రహించాడు మేం వచ్చామని. ‘తమ్ముడూ’ అని పిలిచాడు. వెళ్లాం. నన్ను తన మంచం మీదనే కూచోమన్నాడు. తాను లేచి కూచున్నాడు. ఇదివరకు చూచినప్పటికీ ఇప్పటికీ బాగున్నాడు. రాసినవి, రాయవలసిన వాటిని గురించి ముచ్చటించాడు. ‘అన్నయ్యా. నీ జబ్బు నయమైంది. ఇంక కోలుకోవాలి. అంతే. వారం పది రోజుల్లో బాగవుతావనుకుంటా. మేము మళ్లీ వచ్చేసరికి కోలుకుని నడుస్తుంటావు’ అన్నాను. ‘నేనూ అదే అనుకుంటున్నాను. నాకు జబ్బు లేదు. నీరసమే ఉంది. బాగయిపోతాను’ అని ధైర్యం కనబరచాడు. నాకు చాలా సంతోషం కలిగింది. ఇంటికి వచ్చిన తరువాత అనుకున్నాను. మా అన్నయ్యకు అన్నీ మా నాయన లక్షణాలు వచ్చాయని. మా నాయన 1979వ సంవత్సరంలో తన 81వ సంవత్సరంలో పరమపదించారు. మా అన్నయ్య కూడా 81 సంవత్సరాలు జీవిస్తాడు అనుకున్నాను. అన్ని అంచనాలను తల్లకిందులు చేశాడు. అందని తీరాలకు వెళ్లిపోయాడు. కార్తీకపౌర్ణమి అందరికీ పర్వదినం. మాకది దుర్దినం. అన్నయ్య ఆ ఉదయం రక్తపరీక్ష కోసం డాక్టరు దగ్గరికి వెళ్లి వచ్చాడు. రెండు ఇడ్లీలు తిన్నాడు. కాస్సేపు నిద్రపోయాడు. లేచాడు. ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్నాడు. బాత్రూమ్కు వెళ్లాడు. తలుపు వేసుకోవద్దని వాళ్లమ్మాయి ఇందిర బయట నుంచుంది. కమోడ్ మీది నుంచి పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడిపోయాడు. ఇందిర ‘నాన్నా నాన్నా’ అంటూ లోనికి ఉరికింది. ఇంకెక్కడి నాన్నా. నాన్న ఎక్కడున్నాడు. ఎక్కడున్నాడమ్మా నాన్నా. నాన్న వెళ్లిపోయాడు. ఏ లోకాల నుంచో పిలుపు వచ్చింది. వెళ్లిపోయాడు. అందరినీ వదలి వెళ్లిపోయాడు. ఒంటరిగానే వెళ్లాడు. అర్థం కాని చోటికి వెళ్లిపోయాడు. మృత్యువు సైతం మా అన్నయ్య మందహాసాన్ని ఆర్చలేకపోయింది. చావు తర్వాత కూడా మా అన్నయ్య ముఖంలో మార్పులేదు. అది వెలుగుతున్న దివ్వెలా ఉంది. మా అన్నయ్యను యమపాశాలు బంధించినట్లు కనిపించదు. మృత్యుదేవి అతని అడుగులకు మడుగులొత్తి తీసుకెళ్లిపోయింది. మరణాయాసం మా అన్నయ్య దరి చేరడానికి అదిరిపోయింది. మా అన్నయ్య శరీరం నిద్రపోతున్నట్టుంది. ఏవో పనుల మీద ఆ లోకాలకు వెళ్లాడు. మరలి వస్తాడేమో అన్నట్టున్నాడు. మా అన్నయ్య కల్లాకపటం ఎరుగనివాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. అతడికి వేల సంఖ్యలో మిత్రులున్నారు. మా అన్నయ్య మానవతామూర్తి. ఆయన మనసులో కళ్లలో కవితలో హృదయంలో మానవత నిండి నిబిడీకృతం అయి ఉంది. మా అన్నయ్య నిజమైన కవి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా స్పందించేవాడు. దాన్ని కవితామయం చేసేవాడు. మా అన్నయ్య గొప్ప వక్త. సభలలో గంటల తరబడి అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఉత్తరాలు రాయడంలో మా అన్నయ్యను మించినవాడు ఉన్నాడనుకోను. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. కొంతమందికి వారి ఉత్తరం అవసరం లేకుండానే జవాబు రాసేవాడు. వేల సంఖ్యలో జాబులు రాశాడు. మా అన్నయ్య హెచ్చుతగ్గులు ఎరగడు. ప్రధానితోనూ పసిపాపతోనూ ఒకేరకంగా మాట్లాడేవాడు. మా అన్నయ్య మహా మానవతావాద కవి. ఆయన కవితలు అగ్గి కురిపించగలవు. పూలవాన రాల్చగలవు. మా అన్నయ్య అగ్నిధారలో ఉన్నాడు. రుద్రవీణలో ఉన్నాడు. తిమిరంతో సమరంలో ఉన్నాడు. గాలిబ్ గీతాల్లో ఉన్నాడు. మిత్రుల మనసుల్లో ఉన్నాడు. మా అన్నయ్య ఉన్నాడు. ఉంటాడు. ఉండి తీరుతాడు. -
గడువు లోపు... జీపీఎస్ సాధ్యం కాదు
రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో రాహుల్ రోడ్డు షో రద్దు సాక్షి, బెంగళూరు : ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని వాహనాలకు ఈ నెల 20 లోపు జీపీఎస్(గ్లోబల్ పోజిషన్ సిస్టం) వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా రవాణా వ్యవస్థలో బస్సు పాత్ర’ అనే అంశంపై బెంగళూరులో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బస్సు, ట్యాక్సీ తదితర ప్రజా రవాణా వాహనాలన్నింటికీ ఈ నెల 20 లోపు జీపీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. అయితే గడువు తక్కువగా ఉండడం వల్ల మరింత సమయం కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి వస్తే బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, హుబ్లీ-ధార్వాడ నగరాల్లోని వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ కల్పిస్తామని చెప్పారు. రాబోవు బడ్జెట్లో రోడ్లకు ఇరువైపులా శౌచలయాలు, హోటళ్ల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. తరచూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల రాష్ట్ర రవాణా శాఖపై పెనుభారం పడుతోందని చెప్పారు. సగటున నెలకు లీటరు డీజిల్‌కు 60 పైసలు పెరుగుతుండడంతో ఒక్క బీఎంటీసీపై ఏడాదికి రూ. 36 కోట్ల భారం పడుతోందని వివరించారు. బెంగళూరులో రాహుల్‌గాంధీ రోడ్ షో రద్దయిందని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. -
ఓయూలో ‘సంస్కృతి-2014’