ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్ | Trump on top: He reaches magic number to clinch nomination | Sakshi
Sakshi News home page

ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్

Published Fri, May 27 2016 1:21 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్ - Sakshi

ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్

జూలైలో జరిగే నేషనల్ కన్వెన్షన్‌లో నామినేషన్ అందజేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందడానికి అవసరమైన డెలిగేట్లను డొనాల్డ్ ట్రంప్ సాధించారు. పార్టీ నామినేషన్ గెలుచుకోవటానికి 1,237 మంది డెలిగేట్లు అవసరం కాగా.. ట్రంప్‌కు ఇప్పటికే 1,238 మంది డెలిగేట్ల మద్దతు లభించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ లెక్క తేల్చింది. నేషనల్ కన్వెన్షన్‌లో తాము ట్రంప్‌కు మద్దతిస్తామని ఒక్లహామా పార్టీ చైర్‌వుమన్ పామ్ పొల్లార్డ్ సహా పలువురు డెలిగేట్లు ఏపీకి చెప్పారు.

వచ్చే నెల 7న ఐదు రాష్ట్ర ప్రైమరీల్లో 303 మంది డెలిగేట్లు ఓట్లు వేయనుండటంతో.. ట్రంప్ తన విజయాన్ని సులభంగానే బలోపేతం చేసుకోనున్నారు. బిలియనీర్ బిజినెస్‌మేన్‌గా సెలబ్రిటీగా ఉంటూ ప్రభుత్వంపై వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఇంతకుముందు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం 16 మందితో పోటీపడ్డారు. సొంత పార్టీలోనే ట్రంప్‌కు మద్దతు ఇవ్వటానికి చాలా మంది అగ్రనేతలు వెనుకంజవేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో లక్షలాది మంది కార్యకర్తలు ట్రంప్‌కు మద్దతుపలికారు.చివరకు.. నామినేషన్‌కు అవసరమైన డెలిగేట్లను ట్రంప్ సాధించారు. ఆయన జూలైలో జరిగే కన్వెన్షన్‌లో నామినేషన్ అందుకోనున్నారు.
 
అవును మారు పేర్లు వాడాను: వ్యాపార ఒప్పందాల్లో తాను చాలాసార్లు మారు పేర్లను వాడినట్లు ట్రంప్ అంగీకరించారు. ఆయన ఏబీసీ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘నేను చాలా సార్లు మారుపేర్లు వాడాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నపుడు ఏదైనా కొనాలని అనుకుంటాను. కానీ నా పేరు వాడితే ఆ భూమి కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వేరే పేర్లు వాడాను’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement