Associated Press
-
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్‌లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. -
స్వలింగ సంపర్కం నేరం కాదు: పోప్
వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్‌లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు. క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. -
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ కీలక నిర్ణయం..!
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ తమ వంతు ప్రయత్నంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్‌తో భాగస్వామ్యం కానుంది. విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే ట్విటర్ తన సైట్‌లోని తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారాన్ని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తప్పుదారి పట్టించే ట్వీట్లను గుర్తించడానికి, వాస్తవాలను తనిఖీ చేయడంలో సహాయం చేయాలని ట్విటర్ తన యూజర్లను కోరింది. మొదటిసారిగా ట్విటర్ అధికారికంగా వార్తా సంస్థలతో కలిసి కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ట్విటర్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు రాయిటర్స్, అసోసియెటేడ్ ప్రెస్ భాగస్వామ్యంతో ఫేక్‌వార్తలను గుర్తించడం మరింత సులువు అవుతుందని తెలిపారు. "విశ్వాసం, కచ్చితత్వం, నిష్పాక్షికత అనే మూడు సూత్రాలతో రాయిటర్స్ ప్రతిరోజూ పనిచేస్తోందని రాయిటర్స్ యూజీసీ గ్లోబల్ హెడ్ హెజల్ బెకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసోసియేటెడ్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ టామ్ జనుస్క్వీ మాట్లాడుతూ..వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
జంతువుల నుంచే కరోనా!
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి లీకేజీకి అవకాశం లేదంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. కోవిడ్ తొలిసారిగా బయటపడిన చైనా నగరం వూహాన్‌ను జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ పరిశోధకుల బృందం సందర్శించి తయారుచేసిన ముసాయిదా నివేదిక మంగళవారం విడుదల కానుండగా ఆ ప్రతి ముందుగానే తమకు లభ్యమైందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. వైరస్ మొట్టమొదటగా ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక విషయంతోపాటు పలు ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలను చూపలేకపోయింది. మున్ముందు సంభవించే ఇలాంటి మహమ్మారులను నివారించేందుకు ఈ నివేదికలోని వివరాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్ మొదటగా ఎలా వ్యాపించిందన్న విషయంలో డబ్ల్యూహెచ్‌వో– చైనా నిపుణులు తయారు చేసిన ఈ ముసాయిదా నాలుగు అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు సోకింది. ఇలా జరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఒక వేళ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన పక్షంలో ‘కోల్డ్–చైన్’ఆహారోత్పత్తుల ద్వారా వ్యాపించడం సాధ్యం. కానీ ఇలా జరిగేందుకు అవకాశాలు లేవు. గబ్బిలాలను ఆశ్రయించి ఉండే కరోనా వైరస్లు, కోవిడ్‌కు కారణమైన సార్స్–కోవ్–2కు దగ్గరి సంబంధం ఉంది. అయితే, వీటి మధ్య అంతరం ఉంది. పంగోలిన్లలో ఉండే వైరస్‌కు, కరోనా వైరస్‌తో అత్యంత దగ్గర సంబంధం ఉంది. మింక్‌లు, పిల్లుల్లో వైరస్లు కోవిడ్ వైరస్ రకానికి అత్యంత సమీపంగా ఉంటాయి. ఇవి కూడా ఈ వైరస్ వాహకాలే’అని పేర్కొంది. చైనాలోని హువానన్ మార్కెట్లో మొదటిసారిగా వైరస్ కేసులు బయటపడటంపై ఈ నివేదిక ప్రస్తావిస్తూ..ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని వివరించింది. ఈ మార్కెట్లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరిగిన విషయం ప్రస్తావిస్తూ...వీటి ద్వారానే వూహాన్‌కు కొత్త వైరస్ వచ్చి ఉంటుందని అంచనా వేసింది. డిసెంబర్ 2019లో వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచే మొదటిసారిగా కోవిడ్ మొదలయిందా అనే విషయమై ఈ నివేదిక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనా నగరం వూహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రబలేందుకు కారణమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తదితరులు∙విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకేజీకి అవకాశాలున్నాయన్న వాదనలను బలపరిచారు. ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఈ నివేదిక తయారీపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నివేదిక రూపకల్పనలో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉంది’అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌వో బృందానికి బంధనాలు? వైరస్ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందానికి చైనా ప్రభుత్వం పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేవీ వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్ మార్కెట్లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. -
ట్రంప్‌దే రిపబ్లికన్ టికెట్
జూలైలో జరిగే నేషనల్ కన్వెన్షన్‌లో నామినేషన్ అందజేత వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందడానికి అవసరమైన డెలిగేట్లను డొనాల్డ్ ట్రంప్ సాధించారు. పార్టీ నామినేషన్ గెలుచుకోవటానికి 1,237 మంది డెలిగేట్లు అవసరం కాగా.. ట్రంప్‌కు ఇప్పటికే 1,238 మంది డెలిగేట్ల మద్దతు లభించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ లెక్క తేల్చింది. నేషనల్ కన్వెన్షన్‌లో తాము ట్రంప్‌కు మద్దతిస్తామని ఒక్లహామా పార్టీ చైర్‌వుమన్ పామ్ పొల్లార్డ్ సహా పలువురు డెలిగేట్లు ఏపీకి చెప్పారు. వచ్చే నెల 7న ఐదు రాష్ట్ర ప్రైమరీల్లో 303 మంది డెలిగేట్లు ఓట్లు వేయనుండటంతో.. ట్రంప్ తన విజయాన్ని సులభంగానే బలోపేతం చేసుకోనున్నారు. బిలియనీర్ బిజినెస్‌మేన్‌గా సెలబ్రిటీగా ఉంటూ ప్రభుత్వంపై వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఇంతకుముందు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం 16 మందితో పోటీపడ్డారు. సొంత పార్టీలోనే ట్రంప్‌కు మద్దతు ఇవ్వటానికి చాలా మంది అగ్రనేతలు వెనుకంజవేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో లక్షలాది మంది కార్యకర్తలు ట్రంప్‌కు మద్దతుపలికారు.చివరకు.. నామినేషన్‌కు అవసరమైన డెలిగేట్లను ట్రంప్ సాధించారు. ఆయన జూలైలో జరిగే కన్వెన్షన్‌లో నామినేషన్ అందుకోనున్నారు. అవును మారు పేర్లు వాడాను: వ్యాపార ఒప్పందాల్లో తాను చాలాసార్లు మారు పేర్లను వాడినట్లు ట్రంప్ అంగీకరించారు. ఆయన ఏబీసీ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘నేను చాలా సార్లు మారుపేర్లు వాడాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నపుడు ఏదైనా కొనాలని అనుకుంటాను. కానీ నా పేరు వాడితే ఆ భూమి కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది కాబట్టి వేరే పేర్లు వాడాను’ అని చెప్పారు.