![Twitter Partners With AP Reuters To Battle Misinformation On Its Platform - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/3/twitter.jpg.webp?itok=e6O7FP93)
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ తమ వంతు ప్రయత్నంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్‌తో భాగస్వామ్యం కానుంది. విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే ట్విటర్ తన సైట్‌లోని తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారాన్ని తొలగించే పనిలో నిమగ్నమైంది.
ఈ ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తప్పుదారి పట్టించే ట్వీట్‌లను గుర్తించడానికి, వాస్తవాలను తనిఖీ చేయడంలో సహాయం చేయాలని ట్విటర్ తన యూజర్లను కోరింది. మొదటిసారిగా ట్విటర్ అధికారికంగా వార్తా సంస్థలతో కలిసి కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ట్విటర్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు రాయిటర్స్, అసోసియెటేడ్ ప్రెస్ భాగస్వామ్యంతో ఫేక్‌వార్తలను గుర్తించడం మరింత సులువు అవుతుందని తెలిపారు.
"విశ్వాసం, కచ్చితత్వం, నిష్పాక్షికత అనే మూడు సూత్రాలతో రాయిటర్స్ ప్రతిరోజూ పనిచేస్తోందని రాయిటర్స్ యూజీసీ గ్లోబల్ హెడ్ హెజల్ బెకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసోసియేటెడ్ గ్లోబల్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ టామ్ జనుస్క్వీ మాట్లాడుతూ..వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment