Reuters
-
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
ఇజ్రాయిల్ దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మృతి, మరో ఆరుగురికి గాయాలు
జెరుసలేం: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. జ్రాయిల్ సరిహద్దు దగ్గరున్న అల్మా అల్-షాబ్ సమీపంలో ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్బుల్లా కాల్పులకు పాల్పడుతోంది. అదే ప్రాంతంలో అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పీ)కు చెందిన జర్నలిస్టులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దిశ నుంచి వచ్చిన మిస్సైల్ దాడిలో రాయిటర్స్ వీడియో జర్నలిస్ట్ ఇస్సామ్ అబ్దల్లా హత్య ప్రాణాలు కోల్పోయాడు. జర్నలిస్టు మృతికి ఇజ్రాయిల్ కారణమని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఆరోపించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు తమ జర్నలిస్టు మృతిపట్ల రాయిటర్స్ వార్తా సంస్థ స్పందించింది. సౌత్ లెబనాన్ నుంచి లైవ్ అందిస్తున్న ఇస్సామ్ అబ్దుల్లా మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్న క్షిపణి కాల్పులను వీడియో తీస్తుండగా, మరో మిస్సైల్ దూసుకురావడంతోఅతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. రాయిటర్స్‌కు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు అల్ సుడానీ, మహేర్ నజే సైతం గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం Video showing the scene before Reuters journalist Issam Abdallah was killed. Journalists clearly marked as journalists, in an open landscape, doing their jobs. Not endorsing the commentary, just sharing the video. pic.twitter.com/weaKiYqFet — Aislinn Laing (@Simmoa) October 14, 2023 ఇదిలా ఉండగా హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య వారం రోజులుగా భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసి గాజాను చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు బాంబ్‌లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల్లో తాజాగా హమాస్‌కు గ్రూపుకు చెందిన వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్‌ను ఇజ్రాయెల్ అంతమొందించింది. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. వైమానిక కార్యకలాపాలను సాగిస్తున్న హమాస్ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడుల్లో మురాద్ హతమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా హమాస్ మిలిటెంట్లకు మురాద్ దిశానిర్దేశం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాంగ్ గ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టడానికి మురాద్ కారణమని చెబుతున్నారు. -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Elon Musk: చిక్కుల్లో న్యూరాలింక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ సొంత కంపెనీ న్యూరాలింక్ చిక్కులను ఎదుర్కొబోతోందా?.. అవుననే అంటున్నాయి విదేశీ మీడియా సంస్థలు. మెడికల్ డివైస్ కంపెనీ అయిన న్యూరాలింక్ ద్వారా జంతువులపై ఘోరమైన ప్రయోగాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఫెడరల్ దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఫిర్యాదులు చేసింది న్యూరాలింక్‌లో పని చేసే ఉద్యోగులే కావొచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. మనిషి మెదడులో చిప్ అమర్చడం ద్వారా అద్భుతానికి తెర తీయాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నాడు. చిప్ ద్వారా పక్షవాతానికి గురైన వాళ్లు సైతం నడవొచ్చని, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రకటించుకున్నాడు కూడా. ఈ క్రమంలో.. ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్ ప్రకటిస్తూ వచ్చాడు. తాజాగా తన మెదడులో చిప్ అమర్చుకునేందుకు రెడీ అని ప్రకటించాడు కూడా. అయితే డెడ్‌లైన్స్‌ను చేరుకునే క్రమంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, జంతువులపై జరిగిన ప్రయోగాలు వాటికి నరకం చూపించాయని, లెక్కకు మించి జంతువుల మరణం కూడా సంభవించిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. 2018 నుంచి న్యూరాలింక్ చిప్ ప్రయోగాల పేరిట.. 280 గొర్రెలు, పందులు, ఎలుకలు, కోతులు, చిట్టెలుకలను చంపింది. వీటి మొత్తం సంఖ్య పదిహేను వందలకు పైనేనని రాయిటర్స్ లెక్క గట్టింది. అయితే.. నిర్లక్ష్య పూరితంగా జరిపిన నాలుగు ప్రయోగాలపై స్పష్టత ఇచ్చే యత్నం చేసింది సదరు కథనం. ఈ నాలుగు ప్రయోగాల ద్వారా 86 పందులు, రెండు కోతులు చనిపోయినట్లు తెలిపింది. అయితే.. ఫెడరల్ దర్యాప్తు ఇవే అంశాలపై జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు జంతువుల మరణాల సంఖ్యను కూడా ఏనాడూ న్యూరాలింక్ ప్రకటించింది లేదు కూడా. సుమారు ఏడాది కిందట న్యూరాలింక్ బ్రెయిన్లో చిప్ అమర్చిన ఓ కోతి కంప్యూటర్ గేమ్ ఆడిన వీడియోను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ధరలు అదుపులో భారత్ విజయం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నిర్వహించడంలో భారతదేశం విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఆహార ధరలపై సరఫరా వైపు ఒత్తిడిని పరిష్కరించడానికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలతో కూడిన చక్కటి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని అన్నారు. వెర్చువల్‌గా జరిగిన ‘రాయిటర్స్ నెక్ట్స్’ ఈవెంట్లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లే ద్రవ్యోల్బణం తీవ్రమవుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరల తీవ్రతను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయగలమన్న విశ్వా సం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఇందుకు తగిన సమాచారం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం లేదా మధ్యలో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తున్నాం. ► భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ► రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగాయి. పశ్చిమ దేశాల కూడా రష్యా నుంచి ఇంధనం వంటి దిగుమతులను ప్రస్తుతం పెంచుకుంటున్నాయి. భారత్–రష్యా సంబంధాలపై ఇలా... భారతదేశం నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి రష్యా ఆసక్తి గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటికే రూపాయి ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. ‘‘నిజానికి ఈ తరహా ఫ్రేమ్‌వర్క్ కొత్తది కాదు. ఇది చాలా దశాబ్దాలుగా ఉంది. అయితే మనకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తాము. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద మనం కొనడం– అమ్మడం వంటి చర్యలను నిర్వహించవచ్చు. మనం కొనుగోలు చేసే ఎరువులు లేదా ఇంధనాలకు సంబంధించి ఆ దేశంతో వాణిజ్య సమతుల్యతా అవసరమే. ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా కొన్ని ఉత్పత్తులు ఆ దేశానికి విక్రయించాలి’’ అని సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణం తీరిది.. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. మరోదఫా రెపో రేటు పెంపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. -
చిక్కుల్లో ట్విటర్: వారు గుడ్‌బై, ఆదాయం ఢమాల్..రీజన్?
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ భారీగా యాక్టివ్ యూజర్లను పెద్దమొత్తంలో కోల్పోతోందట. ట్విటర్ ఇంటర్నెల్ రీసెర్చ్ ప్రకారం ట్విటర్ గ్లోబల్ ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న 10 శాతం హెవీ ట్వీటర్లు ట్విటర్‌ను వీడుతున్నారట. ఈ మేరకు రాయిటర్స్ ట్విటర్లో ఒక రిపోర్ట్‌ను పోస్ట్ చేసింది. హెవీ ట్వీటర్లు అంటే ఎవరు? రాయిటర్స్ నివేదిక ప్రకారం తనవ్యాపారంలో కీలకమైన సెలబ్రిటీలు, అత్యంత చురుకైన వినియోగ దారులను నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతోంది. వారానికి ఆరు లేదా ఏడు రోజులు ట్విట్టర్లోకి లాగిన్ అయి వారానికి మూడు నుండి నాలుగు సార్లు ట్వీట్ చేసే వ్యక్తిని "హెవీ ట్వీటర్" గా పిలుస్తారు. వీరి సంఖ్య నెలవారీ మొత్తం వినియోగదారులలో 10శాతం కంటే తక్కువే అయినా ప్రపంచ ఆదాయంలో సగం సృష్టిస్తున్నారని రాయిటర్స్ నివేదించింది. ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కువ యూజర్లలో క్రిప్టోకరెన్సీ, అశ్లీలతతో కూడిన కంటెంట్‌పై ఆసక్తి బాగా పెరిగిందని తెలిపింది. అదే సమయంలో వార్తలు, క్రీడలు, వినోదంపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొంది. (ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!) కాగా టెస్లా సీఈవో ట్వీటర్ డీల్ ను రద్దు చేసుకోవడంతో, షేర్ ధర పడిపోవడం, భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోవడం, న్యాయపోరాటం లాంటి ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు దీంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే యూజర్లను కోల్పోవడం మరో సమస్య కానుంది. ఇదీ చదవండి : ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ! EXCLUSIVE Twitter is losing its most active users, internal documents show https://t.co/EoHgcznik5 pic.twitter.com/Jlz5zWyipN — Reuters (@Reuters) October 25, 2022 -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
భారత్‌లో అమెజాన్ వ్యవహారం.. ‘జెఫ్ బెజోస్ పచ్చి అబద్ధాలకోరు’!
Reuters Allegations On Amazon's Business Practices: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు మొట్టికాయలు గట్టిగానే పడ్డాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఐదుగురు చట్టసభ్యుల యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం కంపెనీని హెచ్చరిస్తూ ఘాటుగా ఓ లేఖను రాసింది సదరు కమిటీ. అమెజాన్ అనైతిక వ్యాపారధోరణిపై రాయిటర్స్ తాజా సంచలన కథనం మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో కంపెనీలో పని చేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తులు, చివరికి వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా అంతా పార్లమెంట్(అమెరికా కాంగ్రెస్)ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసి ఉంటారని, అబ్దదాలు సైతం చెప్పారంటూ యూఎస్ హౌజ్ జ్యుడీషియరీ కమిటీ తన లేఖలో పేర్కొంది. అవసరమనుకుంటే ఈ వ్యవహారంలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరపిస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీని ఉద్దేశిస్తూ ఓ లేఖలో ప్యానెల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే విషయంలో అమెజాన్ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ రాయిటర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. గత బుధవారం ఆ కథనం ప్రచురితం కాగా.. ఈ సంచలన కథనం ఆధారంగా స్పందించిన దర్యాప్తు కమిటీ అమెజాన్‌ను పరోక్ష హెచ్చరికగా లేఖను రాసింది. స్థానిక ఉత్పత్తులను కాపీ కొట్టి ప్రొడక్టులు తయారుచేసుకోవడంతో పాటు, భారత్‌లాంటి దేశాల్లో అమెజాన్ ఇండియా యాప్ ద్వారా స్థానిక ఉత్పత్తులను తొక్కిపడేస్తూ, తమ ప్రొడక్టులను.. తమ అనుకూల ఉత్పత్తులనే ఎక్కువగా ప్రమోట్ చేస్తోందంటూ అమెజాన్‌పై రాయిటర్స్ తన కథనంలో ఆరోపించింది. మరోవైపు భారత్‌లోనూ ఈ కథనం ఆధారంగా అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ ఉత్పత్తుల వ్యాపారాన్ని దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై పలువురు మండిపడుతున్నారు. అంతేకాదు లక్షల మంది సంప్రదాయ వ్యాపారుల తరపున బృందం.. అమెజాన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి లేఖను సైతం రాసింది. ఇదిలా ఉంటే గతంలోనూ అమెజాన్‌పై ఇదే తరహా ఆరోపణలు రాగా.. ఈ ఐదుగురు సభ్యుల హౌజ్ జ్యుడీషియరీ కమిటీ 2019 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆరోపణలు రావడంతో అప్పుడు సీఈవోగా ఉన్న జెఫ్ బెజోస్ సహా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించింది ప్యానెల్. అయితే తాము ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం లేదంటూ ఆ టైంలో అంతా వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు రావడంతో క్రిమినల్ దర్యాప్తు తప్పదని హెచ్చరించింది విచారణ కమిటీ. అయితే తామెప్పుడూ కమిటీని తప్పుడు దోవ పట్టించలేదని, మీడియా కథనాలే తప్పుల తడకగా ఉన్నాయని వివరించామని ఓ ప్రతినిధి వెల్లడించారు. చదవండి: బెజోస్‌కు ఆ ఆనందం లేకుండా చేసిన ఎలన్ మస్క్ -
అమెజాన్‌పై సంచలన కథనం
పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా పని చేసే క్రమంలో ఈ-కామర్స్ కింగ్ ‘అమెజాన్’ దిగజారి ప్రవర్తిస్తోందని తాజాగా రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా India Private Brands Programme పేరుతో సేకరించిన పత్రాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెటింగ్‌లో దిగజారి ప్రవర్తిస్తుందనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు భారత్‌లో పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోందన్నది రాయిటర్స్ కథనంలో ఆరోపణ. ఈ మేరకు వివిధ దేశాలకు సంబంధించి అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడిస్తూ.. అందులో భారత్ ప్రస్తావన సైతం తీసుకొచ్చింది. ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి.. ప్రొడక్టులను తయారు చేయడం, వాటిని ప్రమోట్ చేయడంలోనూ అమెజాన్ టాప్ ప్రయారిటీ ఇస్తోందనేది రాయిటర్స్ ప్రధాన ఆరోపణ. భారత్ అమెజాన్ మార్కెట్లో లోకల్ బ్రాండ్లను సైతం వదలకుండా కాపీ కొడుతోందని, ఇక అంతర్గత సమాచార సేకరణతో ఈ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం తెలిపింది. కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్.. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్‌కు ఎక్కువగా బలైందని వెల్లడించింది. అమెజాన్‌కు సంబంధించిన బ్రాండ్లతో పాటు అమెజాన్ టాప్ ప్రయారిటీ ఉన్న బ్రాండ్లనే(రివ్యూలతో సంబంధం లేకుండా) వినియోగదారులకు టాప్ సెర్చ్‌లో చూపిస్తోందనేది(డిస్ప్లే చేయడం) చేస్తోందట. గతంలో ఇలాంటి వ్యవహారంతో ఇబ్బందులు, నష్టాల్ని చవిచూసిన అమెజాన్.. ఇప్పుడు పెద్ద ఎత్తున్న ఇలాంటి వ్యవహారానికి తెరలేపిందనేది రాయిటర్స్ కథన సారాంశం. మరి అమెజాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: amazon.. ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు -
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ కీలక నిర్ణయం..!
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్విటర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ తమ వంతు ప్రయత్నంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్‌తో భాగస్వామ్యం కానుంది. విశ్వసనీయమైన సమాచారాన్ని వేగంగా అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సోషల్ మీడియా కంపెనీల మాదిరిగానే ట్విటర్ తన సైట్‌లోని తప్పుదోవ పట్టించే లేదా తప్పుడు సమాచారాన్ని తొలగించే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తప్పుదారి పట్టించే ట్వీట్లను గుర్తించడానికి, వాస్తవాలను తనిఖీ చేయడంలో సహాయం చేయాలని ట్విటర్ తన యూజర్లను కోరింది. మొదటిసారిగా ట్విటర్ అధికారికంగా వార్తా సంస్థలతో కలిసి కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ట్విటర్ కృషి చేస్తోందని ట్విటర్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీలు రాయిటర్స్, అసోసియెటేడ్ ప్రెస్ భాగస్వామ్యంతో ఫేక్‌వార్తలను గుర్తించడం మరింత సులువు అవుతుందని తెలిపారు. "విశ్వాసం, కచ్చితత్వం, నిష్పాక్షికత అనే మూడు సూత్రాలతో రాయిటర్స్ ప్రతిరోజూ పనిచేస్తోందని రాయిటర్స్ యూజీసీ గ్లోబల్ హెడ్ హెజల్ బెకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసోసియేటెడ్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ టామ్ జనుస్క్వీ మాట్లాడుతూ..వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్?
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 థర్డ్ వేవ్ అక్టోబర్‌లో వస్తుందని, అయితే సెకండ్ వేవ్ కంటే సమర్థంగా మన దేశం ఎదుర్కొంటుందని రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్య రంగ నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు, ప్రొఫెసర్లు... ఇలా కరోనాపై పని చేస్తున్న నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మొదటి రెండు వేవ్‌లు ఎలా మొదలై, ఎలా కేసులు పెరిగి, తిరిగి ఎలా తగ్గాయో తెలిపే డేటాను సేకరించింది. అన్నింటినీ క్రోడీకరించి కొన్ని అంచనాలు తయారు చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్ వేవ్ ఖాయంగా వస్తుందని చెప్పిన రాయిటర్స్ కేంద్రంలో మోదీ సర్కార్ సెకండ్ వేవ్ కంటే దీనిని సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపింది. మరో ఏడాది పాటు కరోనా ప్రజారోగ్యానికి సవాల్‌గానే ఉంటుందని పేర్కొంది. జూన్ 3–17 మధ్య 40 మంది నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 85% మందికి పైగా అక్టోబర్‌లో థర్డ్ వేవ్ వస్తుందని చెప్పారు. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆగస్టులో వస్తుందని లెక్కలు వేస్తే, 12 మంది సెప్టెంబర్‌లో వస్తుందన్నారు. ఇక మిగిలిన వారు నవంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కోవిడ్ మళ్లీ పంజా విసురుతుందని వివరించారు. 70% మంది నిపుణులు భారత్ మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు ‘‘థర్డ్ వేవ్‌ని మరింత సమర్థంగా ఎదుర్కోగలం. ఎందుకంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంతే కాకుండా సెకండ్ వేవ్‌లో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో ఎంతో కొంత హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడే ఉంటుంది’’అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా చెప్పారు. పిల్లలకి ముప్పు ఉండే ఛాన్స్ ఈసారి పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై 40 మంది నిపుణుల్లో 26 మంది ముప్పు పొంచి ఉందని చెబితే, 14 మంది అలాంటిదేమీ ఉండదన్నారు. మరో ఏడాది పాటు కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి ఉంటుందని రాయిటర్స్ సంస్థ నివేదిక తెలిపింది. -
ఎడిటర్–ఇన్–చీఫ్ రాయిటర్స్‌కు తొలి మహిళ
వార్తా పత్రికల్లో అనేకమంది ఎడిటర్లు ఉంటారు. పత్రికా కార్యాలయంలో ఎన్ని ప్రత్యేకమైన వార్తా విభాగాలు ఉంటే అంతమంది ఎడిటర్లు. వాళ్లందరి పైనా మళ్లీ ఒక ఎడిటర్ ఉంటారు. వారే ఎడిటర్–ఇన్–చీఫ్. లేదా చీఫ్ ఎడిటర్. ‘రాయిటర్స్’.. ప్రపంచానికి ఎప్పటికప్పుడు వార్తల్ని, వార్తా కథనాల్ని అందిస్తూ వస్తున్న విశ్వసనీయ వార్తా సంస్థ. ఆ సంస్థకు ఇంతవరకు ఒక మహిళా చీఫ్ ఎడిటర్ లేనే లేరు. ఇప్పుడు తొలిసారి అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఆ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు! 170 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ని ఈ నెల 19 నుంచి 47 ఏళ్ల వయసు గల గలోనీ నడిపించబోతున్నారు! మహామహులకు మాత్రమే దక్కే ఇంత పెద్ద అవకాశం చిన్న వయసులోనే ఆమె సాధించగలిగారు! రాయిటర్స్ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అక్కడ తన ‘ఎడిటర్–ఇన్–చీఫ్’ సీట్లో కూర్చొని దేశదేశాల్లోని 2,500 మంది సీనియర్ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయబోతున్నారు గలోని! రాయిటర్స్ న్యూస్ రూమ్ దాదాపుగా ఒక వార్ రూమ్. అక్కడ నిరంతరం తలపండిన పాత్రికేయుల సమాలోచనలు జరుగుతుంటాయి. వార్తని ‘ఛేదించడం’, ‘సాధించడం’ వారి ప్రధాన లక్ష్యాలు. వాళ్లందరికీ ఇక నుంచీ లీడర్.. గలోనీ. న్యూస్ రూమ్‌లో ప్రణాళికలను రూపొందిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాలలో ఉన్న రిపోర్టర్లతో ఆమె ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. చిన్న పని కాదు. అలాగని పురుషులకే పరిమితమైన పని కాదని ఇప్పుడీ కొత్త నియామకంతో రాయిటర్స్ తేల్చి చెప్పింది. ఇప్పటికి వరకు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న స్టీఫెన్ ఆల్డర్ వయసు 66. రాయిటర్స్ గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్ హోదాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలెస్సాండ్రా గలోనీ. గత పదేళ్లుగా ఆయన న్యూస్ రూమ్‌కి సారథ్యం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడు. ఆయన రిటైర్ అయితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. రాయిటర్స్లోనే ‘గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్’గా ఉన్న గలోనీనే సరైన ఎంపికగా నిలిచారు! ఐదేళ్లుగా ఆ పదవిలో ఉన్న గలోనీదే న్యూస్ ప్లానింగ్ అంతా. 2015లో రాయిటర్స్లోకి రాకముందు వరకు మరొక ప్రఖ్యాత వార్తా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో 2013 నుంచీ దక్షిణ ఐరోపా బ్యూరో లో ఉన్నారు. ఎడిటర్–ఇన్–చీఫ్‌గా గత సోమవారం అనేక ఊహాగానాల మధ్య గలోనీ పేరును బహిర్గతం చేస్తూ.. ‘‘ఈ పదవికి తగిన వ్యక్తి కోసం లోపల, బయట విస్తృత పరిధిలో అనేకమంది అత్యంత యోగ్యులైన వారిని దృష్టిలో ఉంచుకున్న అనంతరం మా వెతుకులాట అలెస్సాడ్రా గలోని దగ్గర ఆగింది’’ అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ ప్రకటించారు. గలోనీ రోమన్ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్, పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలలో ఏం జరగబోతోందీ, అవి ఎలాంటి మలుపులు తిరగబోతున్నదీ ముందే ఊహించగల అధ్యయనశీలి, అనుభవజ్ఞురాలు. ఆమె కెరీర్ ప్రారంభం అయింది కూడా రాయిటర్స్లోనే. ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్‌గా చేరి, కొద్ది కాలంలోనే ‘ఎడిటర్–ఇన్–చీఫ్’గా ఎదిగారు! జర్నలిజంలో అత్యంత విశేష పురస్కారం అయిన ‘గెరాల్డ్ లోయెబ్ పౌండేషన్’ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేత గలోనీనే! ఇంకా ఆమె ‘ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు’, యు.కె. ‘బిజినెస్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ల విజేత కూడా. గలోనీ హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో చదివారు. తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిభ, అంకితభావం గల జర్నలిస్టులతో నిండి ఉండే ప్రపంచ స్థాయి న్యూస్ రూమ్‌ను నడిపించే వకాశం రావడం నాకు లభించిన గౌరవం’’ అని అన్నారు గలోనీ. -
అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి
అమెజాన్ ఇండియా స్థానిక కార్యకలాపాలను నిషేధించాలని భారతీయ చిల్లర వ్యాపారుల బృందం బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాల విషయంలో మోసాలు, అన్యాయాలకు పాల్పడినట్లు రాయిటర్స్ నివేదించింది. కఠినమైన విదేశీ పెట్టుబడి నిబంధనలను తప్పించుకునేందుకు భారత చట్టాలను ఉల్లంఘించినట్లు సీఐఐటి తెలిపింది. భారతదేశంలో 80 మిలియన్ల రిటైల్ దుకాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) ఒక ప్రకటనలో రాయిటర్స్ కథనంలోని "దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడి" అయ్యాయి కాబట్టి భారతదేశంలో అమెజాన్ కార్యకలాపాలను వెంటనే నిషేధించడానికి ఈ సమాచారం సరిపోతుంది అని పేర్కొంది. "కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ అన్యాయమైన, అనైతికంగా వాణిజ్యాన్ని నిర్వహించడానికి భారతదేశం యొక్క ఎఫ్ డిఐ[ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్] చట్టాలను ఉల్లఘించినట్లు సిఐఐటి తెలిపింది. అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) కొన్ని సంవత్సరాలుగా వాణిజ్యశాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఈడీకి చేరవేసింది డీపీఐఐటీ. ఈ క్రమంలోనే అమెజాన్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. భారతీయ చిల్లర వ్యాపారుల బృందం దేశ బహిష్కరణ ప్రకటనలపై అమెజాన్ స్పందించలేదు. కానీ, సిఏఐటి అమెజాన్ నిషేధానికి పిలుపునిచ్చిన కొద్దికాలానికే రాయిటర్స్ నివేదికపై అమెజాన్ స్పందించింది. "ఇది ఆధారాలు లేని, అసంపూర్ణమైన, అసత్య ప్రచారం అని విమర్శించింది. అమెజాన్ భారతీయ చట్టాలకు లోబడి ఉంది అని" పేర్కొంది. "గత కొన్ని సంవత్సరాలుగా (ఎ) నిబంధనలలో అనేక మార్పులు జరిగాయి. అమెజాన్ ప్రతి సందర్భంలోనూ సమ్మతిని నిర్ధారించడానికి వేగంగా చర్యలు తీసుకుంది. అందువల్ల ఈ కథనం పాత సమాచారం ఉన్నట్లు అనిపిస్తుంది" అని తన అమెజాన్ ఇండియా న్యూస్ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. The story is unsubstantiated, incomplete, factually incorrect. Amazon remains compliant with Indian laws. We haven't seen the documents & Reuters hasn't shared provenance to confirm veracity: the details are likely supplied with intent to create sensation & discredit Amazon. 1/3 https://t.co/lblDPxYVCH — Amazon India News (@AmazonNews_IN) February 17, 2021 అమెజాన్ సంస్థకు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. బయటకు లక్షలాది మంది చిరు వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ కార్పొరేట్, తన వాటా దారులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిరు వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది. చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం! -
అమెజాన్ ఇండియా భారీ మోసం
భారత చట్టాలను ఉల్లఘించడానికి అమెజాన్ వేసిన ఓ కుట్రకు సంబందించిన కథనాన్ని రాయిటర్స్ సంస్థ ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. 2019 ప్రారంభంలో అమెజాన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే కార్నె ఒక ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతున్నారు. జే కార్నె ఇంతక ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద ప్రెస్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సిలో భారత రాయబారితో జే కార్నె మాట్లాడాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కొత్తగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను ప్రకటించింది. ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం తీసుకొచ్చిన నిబంధనల వల్ల అమెజాన్ వ్యాపారానికి భారీ నష్ట్టం వాటిల్లుతుంది. అయితే ఈ సమావేశానికి ముందు అమెజాన్ ఉద్యోగులు కార్నీ కోసం ఒక డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేశారు. ఈ డ్రాఫ్ట్ నోట్ లో జే కార్నె ఏమి చెప్పాలో?, ఏమి చెప్పకూడదు అని అందులో ప్రస్తావించారు. అమెజాన్ భారత దేశంలో 5.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, 4 లక్షల మంది భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాలు సాగించేందుకు తమ ఆన్ లైన్ ప్లాట్ ఫాం సహాయం అందిస్తుందనే పాయింట్ హైలైట్ చేయాలి అని డ్రాఫ్ట్ నోట్ లో ఉంది. అయితే కంపెనీ వెబ్సైట్లో విక్రయించే అన్ని వస్తువుల విలువలో మూడింట ఒక వంతు మంది 33 మంది అమెజాన్ అమ్మకందారులని వెల్లడించవద్దని ఆయన ఆ నోట్లో పేర్కొన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి బహిర్గతం చేయకూడని అందులో పేర్కొంది. మూడింట రెండు వంతులు అమెజాన్ వాటాదారులే ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అమెజాన్ పరోక్ష ఈక్విటీ వాటాను కలిగి ఉన్న మరో పెద్ద ఇద్దరు అమ్మకందారులు 2019 ప్రారంభంలో అమెజాన్ ప్లాట్‌ఫాం అమ్మకాల వచ్చిన ఆదాయంలో 35 శాతం వాటాను కలిగి ఉన్నారు. మొదటి 33 మంది వాటా 33 శాతం, అమెజాన్ సంస్థ పరోక్షంగా పెట్టుబడులు కలిగిన ఈ ఇద్దరు వాటా 38 శాతం. ఇలా మొత్తం వాటాలో మూడింట రెండు వంతులు అమెజాన్ వాటాదారులే కలిగి ఉన్నారు. మొత్తం అమెజాన్ షాపింగ్ లో 4 లక్షల మంది వ్యాపారులు చేసేది మూడింట ఒక వంతు అయితే, ఈ 35(33+2) మంది చేసేది మూడింట రెండు వంతులు. అయితే, ఈ విషయాన్ని కార్నే అంబాసిడర్‌కు చెప్పారో లేదో కూడా తెలీదు. 2019 ఏప్రిల్‌లో ఎలాంటి మీటింగ్ జరగలేదు అని సమాచారం. -
బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్’
‘అత్యధిక పాఠకలోకం ఆదరణ పొందడం అందుకు అనుగుణంగా పాఠకులకు అబద్ధాలతో కాకుండా వాస్తవాలతో కూడిన సరైన సమాచారం అందించడమే వార్తా సర్వీసుల (న్యూస్ సర్వీసెస్) లక్ష్యం. వార్తల్ని బట్వాడా చేసే సంస్థలు ఆ వార్తల్ని అందించడంలో తమ సొంత తీర్పుల్ని చొప్పించకూడదు. అది పాటిం చినప్పుడే ఆ వార్తలను అందించే సర్వీసులు తమపై పాఠకులలో అనుమానాలూ, అస్పష్టతా రేకెత్తకుండా జాగ్రత్త పడగలుగుతాయి. అలా అయితేనే వార్తలు అందించే న్యూస్ సర్వీసుల లక్ష్యానికి తాత్విక పునాది ఉంటుంది. లేదా అది పాఠకులకు స్థూలంగా ఆమోదయోగ్యమైన వార్తగానైనా ఉండాలి’.– ప్రపంచ వార్తా సర్వీసుల తాత్విక పునాది పట్ల సుప్రసిద్ధ పాత్రికేయ చరిత్రకారుడు జొనాధన్ ఫెన్బీ నిర్వచనం. ‘ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం’ అన్న దశలో పతనావస్థకు చేరుకున్న టీడీపీ నాయకుడు చంద్రబాబు, ప్రస్తుతం పాత వలసపాలన అవశేషాలకు చిహ్నాలుగా మిగిలి ఉన్న కొన్ని విదేశీ న్యూస్ సర్వీసులను ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి వాడుకునే స్థితికి దిగజారిపోయారు. వ్యక్తులు సమాజ సంపదను పోగేసుకోవడానికి స్వేచ్ఛను కాపాడుతున్నది 1935 నాటి బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యవాద ప్రభుత్వం రూపొందించిన చట్టం. దాని ఆధారంగా స్వతంత్ర భారత రాజ్యాంగంలో చేరిన 31వ అధికరణ చంద్రబాబు చేతిలో ఇప్పుడు బినామీ ఆస్తుల కేంద్రీకరణకు ఎలా యథేచ్ఛగా దోహదపడుతున్నదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ముసుగులో ‘అమరావతి’ బినామీ కథలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఈ బినామీ ఆస్తుల రక్షణలో తాడూ బొంగరంలేని అమరావతి రాజధానికి ముక్కూముఖం ఏర్పరిచే మిష పైన ప్రపంచ వార్తా సర్వీసుగా బ్రిటిష్ ఇండియా నుంచి నేటిదాకా ఉనికిలో ఉన్న రాయిటర్స్ వార్తా సంస్థ సేవలను తన అధికార దాహంకొద్దీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత కూడా చంద్రబాబు వాడుకోదలిచారు. స్థానికంగా తన ‘ఉంపుడు పత్రికలు’గా తయారైన రెండు తెలుగు దినపత్రికలను తన ప్రభుత్వ పతనం తర్వాత మరింతగా వినియోగించడంతో సంతృప్తిపడని బాబు మరికొన్ని అడ్డదారులు తొక్కడానికి సాహసించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అశేష ప్రజాదరణతో, రాష్ట్ర చరిత్రలో అరుదైన అఖండ మెజారిటీతో పరిపాలనా పగ్గాలు అందుకున్న యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంస్కరణవాద సంక్షేమ పథకాల అమలు జరుగుతుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుతగలడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామం.. అనంతపురం జిల్లాలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఒక రూపు తొడిగి భారీ పరిశ్రమగా దక్షిణ కొరియా ‘కియా’ మోటారుకార్ల యూనిట్ ఎదుగుతూ వేలసంఖ్యలో స్థానికుల ఉపాధి కల్పనకు శరవేగాన ముందడుగు వేస్తోంది. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం లేకుండా పేద మధ్యతరగతి ప్రజల భూముల్ని ముందుగానే అన్యాక్రాంతం చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తి చేతులు చూపిన వ్యక్తి బాబు. ఇప్పుడు కియా మోటార్ కార్ల పరిశ్రమ యాజమాన్యానికి దిగులు కలిగించే సరికొత్త ప్రచారానికి బాబు గజ్జె కట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాల వల్ల అనంతపురం నుంచి కియా మోటార్ భారీ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందన్న నీలివార్తల్ని బాబు, అతని రెండు అనుకూల పత్రికలు వ్యాపింపచేశాయి. రాష్ట్ర ప్రజలు బాబు నీలివార్తల్ని ఎక్కడ నమ్మరోనని భావించి బాబు కొత్త ఎత్తుకు దిగారు. దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతప్రజలను, నాయకుల్ని వంచిస్తూ సామ్రాజ్యవాద పాలనకు అనుకూలంగా, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు గుప్పిస్తూ వచ్చినవి– రాయిటర్స్ (బ్రిటన్), ఎ.ఎఫ్.పి. (ఫ్రాన్స్), అసోసియేటెడ్ ప్రెస్ (ఎ.పి. అమెరికా). భారతదేశంలోని పెట్టుబడిదారీ పత్రికలు కొన్ని మినహాయింపులతో వార్తల కోసం ఈ విదేశీ సంస్థలపై ఆది నుంచీ ఆధారపడుతూ మన దేశ పాఠకులకు వార్తలు అందిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పెక్కు పత్రికల, నాయకుల బానిస మనస్తత్వమూ, బుద్ధులూ పెద్దగా మారిందేమీ లేదు. పైగా చంద్రబాబులాంటి ‘తిమ్మిని బమ్మిని’ చేయగల అక్రమ సంపాదనాపరుల చేతుల్లో ‘రాయిటర్స్’ లాంటి పెద్ద సంస్థ కూడా ఇరుక్కుపోవడం విశేషం– ఎందుకంటే సర్వత్రా వ్యాపార ధోరణి కావటంవల్ల! అసలు రాయిటర్స్‌కు, బాబు పాత సర్కారుకు ‘లంకె’ ఎలా కుదిరింది? బాబు పాలనలో విశాఖ, హైదరాబాద్‌లలో ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమాల పథకాన్ని తలపెట్టి ఎన్నికలలో ప్రయోజనాలు పొందే టెక్నాలజీ మతలబుకు అంకురార్పణ జరిగింది. 2018–2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రతిపక్షాన్ని ఎన్నికలలో విజయం సాధించకుండా అడ్డుకోగల నానా అడ్డగోలు ప్రయత్నాలకు పాల్పడిన బాబు వర్గం డిజిటల్ యంత్రాల్ని వినియోగించి దొరికిపోయింది. అలా డిజిటల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఆధారంగా 2017లో రాయిటర్స్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ టీడీపీ నాయకత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల సారాంశం– డిజిటల్ కంటెంట్స్ మార్పిడి పేరిట, టెండర్లు పిలవకుండానే (ఇతర ప్రపంచ సంస్థలేవీ పోటీకి రాకుండా) చంద్రబాబు హయాంలో ఒక్క రాయిటర్స్కే ప్రయోజనం కల్పిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇదీ– ఇప్పుడు ఇందుకు ముదరాగా రాయిటర్స్, నేటి వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ సహా ఆచరణలోకి తెస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు పన్నిన వలలో చిక్కుకుంది. అయితే బాబు రాయిటర్స్ సంస్థ ద్వారా కియా సంస్థ మేనేజ్‌మెంట్‌పైన, జగన్ ప్రభుత్వంపైన వ్యాపింపజేసిన తప్పుడు ప్రచారానికి తాళం పడిపోయింది. అటునుంచి తమిళనాడు ప్రభుత్వమూ ఖండన పరంపర ద్వారా బాబు, రాయిటర్స్ జమిలిగా తలపెట్టిన కుట్రను భగ్నం చేయవలసి వచ్చింది. విడిపోయిన నూతన ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని కోసం వెతుకులాటలో సుదీర్ఘ పర్యటనానంతరం ఉన్నతస్థాయి కేంద్ర విచారణ సంఘం (శ్రీరామకృష్ణన్ కమిటీ) అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని, మూడు పంటలు పండే అమరావతి ఏరియా మాగాణి సుక్షేత్రాలను పొరపాటున కూడా రాజధాని పేరిట పాడుచేయవద్దని హెచ్చరించింది. అంతేగాదు, అమరావతి ప్రాంతంలో పర్యావరణ ప్రమాణాల దృష్ట్యా తక్కువ లోతునుంచే నీరు ఉబికివచ్చే ప్రమాదం ఉన్నందున, భారీ నిర్మాణాలకు అది అనువైనది కాదని కూడా నివేదికలో హెచ్చరించింది. అయినా ఆ నివేదికను అసెంబ్లీ ఛాయలకు కూడా రానివ్వకుండా, ప్రవేశపెట్టకుండా, చర్చించకుండానే విద్యా వ్యాపారవేత్త చేత రాజధానిగా అమరావతికి అనుకూలంగా నివేదికను గిలిగించి దాంతోనే భూములపైన స్పెక్యులేషన్ వ్యాపారం చేసింది బాబు ప్రభుత్వం. బినామీ భూముల కోసమే అమరావతిని బాబు బలి చేశాడు. అయిదేళ్లయినా అవసరమైన రాజధానిని నిర్మించడంలో విఫలమయ్యారు. ఈ తరుణంలో కేంద్ర పర్యావరణ సాధికార సంస్థ, నిర్ణయాధికార సంస్థ రాజధానిగా అమరావతి నిర్మాణం తగదని సూచనప్రాయంగానూ, లిఖితపూర్వకంగానూ స్పష్టంగా హెచ్చరించినా బాబు పెడచెవిన పెట్టడానికి కారణం– కేవలం బినామీ ఆస్తుల్ని పోగేసుకోవడానికేనని తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. ఇదే సమయంలో మన కోస్తాలో మాదిరే తీర ప్రాంతాల పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 2019 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశిస్తూ అందుకు 138 రోజుల వ్యవధినిస్తూ తీర్పు చెప్పవలసి వచ్చిందని మరచిపోరాదు. ఆ కారణంగానే కేరళలోని మరడు ప్రాంతంలో నిర్మించిన భవంతులను క్షణాలలో కూల్చివేయించిన ఘటననూ మనం మరవరాదు. ఈ సాధికారికమైన హెచ్చరికలను సహితం ఖాతరు చేయకుండా, ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికీ బాబు మొండిగా వ్యతిరేకించడమంటే నదిలో మునిగిపోతున్నవాడు ఆఖరి ప్రయత్నంగా ‘గడ్డిపోచ’ను పట్టుకుని బయటపడదామన్న వృథా తాపత్రయమే అవుతుంది. భారతదేశంలోని అరడజను రాష్ట్రాలు, ప్రపంచంలో పన్నెండు దేశాలు– పరిపాలనా విభాగాలుగా, శాసన వేదికలుగా, న్యాయస్థాన కేంద్రాలుగా రెండేసి, మూడేసి రాష్ట్రాలలో వేర్వేరుగా ఏర్పరచుకుని పాలనా సౌలభ్యాన్ని, ప్రాంతాల మధ్య అసమానతలను క్రమంగా తొలగిస్తూ అభివృద్ధినీ సాధించాయి. ఈ దేశీయ, అంతర్జాతీయ పాఠాల నుంచే జగన్ ప్రభుత్వం పాలనా, ప్రాంతీయ స్థాయి అభివృద్ధికి అనుగుణంగా వికేంద్రీకరణ పథకాన్ని తలపెట్టడం ఒక ప్రయోగంగా వినూత్నమేగాదు, అవశ్యం, అవసరం కూడా అని మరవరాదు. గత చరిత్రను తవ్విచూసుకున్నా– శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల దాకా కోటి లింగాల, బోధన్ల నుంచి అమరావతి వరకూ, రెండేసి, మూడేసి రాజధానులను పాలనా కేంద్రాలుగా మలచుకున్నవారే. అంతేగాదు, పల్లవులు, విష్ణుకుండినులు కూడా పాలనా సౌలభ్యం కోసం రెండేసి, మూడేసి ప్రాంతాలలో రాజధానులు నిర్వహించారు. ఆంధ్రుల చరిత్రలో విష్ణుకుండినుల పాలకులకు వేములవాడ, నాగార్జునకొండ రాజధానులుగా ఉండేవని కొందరు చారిత్రికుల భావన. నాడూ, నేడూ, ఏనాటికైనా పాలన ఎక్కడినుంచి సాగిం దని కాదు, ఎంత మంచిగా ప్రజానురంజకంగా ఎంతకాలం సాగిందన్నదే ప్రజల జ్ఞాపకంలో ఉండేదీ, లెక్కల్లో నిలిచేదీ!! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
కియా మోటార్స్ : తప్పు సవరించుకున్న రాయిటర్స్
-
రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం
సాక్షి, అమరావతి: కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోతోందనే దుష్ప్రచారం వెనుక అసలు కథ వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన రాయిటర్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో వింతేమీ లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా ఒప్పందం..? థామ్సన్ రాయిటర్స్ సంస్థకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ డెవలప్మెంట్’ కార్యక్రమం కింద రాయిటర్స్‌తో నాడు రాష్ట్ర ఐటీ శాఖ రెండు ఒప్పందాలు చేసుకుంది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విశాఖలోని గీతం వర్సిటీ అందుకు సంధానకర్తగా వ్యవహరించింది. లోకేశ్ అప్పట్లో ఐటీ మంత్రిగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ఐటీ శాఖ, గీతం వర్సిటీ, రాయిటర్స్ సంస్థ సంయుక్తంగా నెలకొల్పిన ‘ఇన్నోవేషన్ యాప్ స్టూడియో’ను 2017 అక్టోబరు 9న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అకడమిక్, స్టార్టప్, పరిశోధనలకు ప్రోత్సాహం పేరుతో ఈ స్టూడియోను నెలకొల్పారు. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధే ఉంటే విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనో, నగర శివార్లలో ఉన్న ఐటీ సెజ్‌లోనో ఇన్నోవేషన్ యాప్ స్టూడియోను ప్రభుత్వం నెలకొల్పేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థ అయిన గీతం విశ్వవిద్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇ– ప్రగతి నిధులూ రాయిటర్స్‌కు ... ‘ఇ–ప్రగతి’ కార్యక్రమం కింద కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయిటర్స్ వార్తా సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మరో ఒప్పందం చేసుకుంది. ‘డిజిటల్ కంటెంట్ ఎక్ఛేంజ్’ పేరిట ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం రాయిటర్స్ సంస్థకు చెందిన ఇ–బుక్ సాఫ్ట్వేర్, లీగల్ రిసెర్చ్ సొల్యూషన్స్, వెస్ట్‌లా తదితర మెటీరియల్‌ను ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు వినియోగించుకుంటాయి. అందుకు రాయిటర్స్‌కు ప్రభుత్వం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సాఫ్ట్వేర్ వినియోగానికి టెండర్లు పిలిస్తే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. (చదవండి: కియాపై మాయాజాలం) -
కియాపై మాయాజాలం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం బరి తెగించి హద్దులు దాటింది. ఈసారి ఏకంగా అంతర్జాతీయ మీడియా సంస్థనే తమ విష ప్రచారానికి వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరలిపోతోందంటూ బుధవారం అర్థరాత్రి ఒక అసత్య కథనం వెలువడింది. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలోనే నాస్డాక్, మింట్ బ్రేకింగ్ న్యూస్ నడపడంతో పాటు పబ్లిష్ కూడా చేశాయి. ఎల్లో మీడియా దీన్ని అందుకొని కియా వెళ్లిపోతోందంటూ శోకాలు ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ నుంచి గల్లీదాక ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టాయి. ఈ వార్త వెలువడిన వెంటనే కియా యాజమాన్యంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఖండిచినా సరే ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆపలేదు. తరలించే ఉద్దేశం లేదని చెప్పిందంటూనే.. ‘రాయిటర్స్’ రాసిన కథనంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తమ యూనిట్‌ను తరలించే ఉద్దేశం లేదని కియా చెప్పినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో నెలకొల్పిన యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేంత వరకు దేశంలో ఎలాంటి విస్తరణ కార్యక్రమం గురించి ఆలోచన లేదని చెప్పినట్లు కూడా రాశారు. వీటిని బట్టి చూస్తే రాయిటర్స్ రిపోర్టర్‌ను ఎవరో ప్రభావితం చేసి అవాస్తవ, అసత్య కథనాన్ని ప్రచురించేలా చేసినట్లు స్పష్టమవుతోంది. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం) వివరణ లేకుండా కథనం.. సాధారణంగా రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ లాంటి అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సంస్థలు అధికారికంగా సమాచారం లేనిదే వార్తను ప్రచురించవు. కానీ దీనికి భిన్నంగా కియా కంపెనీ నుంచి కానీ, రెండు రాష్ట్రాల అధికారుల నుంచి కానీ ధ్రువీకరణ లేకుండా ‘సోర్సెస్’ అంటూ కథనాన్ని రాయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన వ్యక్తి పనే! రాష్ట్రంలో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న నిబంధన వల్లే కియా పరిశ్రమ తరలిపోతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. కానీ కియాలో ఇప్పటికే 85 శాతం మంది స్థానిక యువత పని చేస్తున్నారు. అలాగే కియాకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇప్పటికే లభించాయి. పైగా రైల్వే అండర్ పాస్‌లు, రహదారులు దగ్గర నుంచి అన్నీ మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అవాస్తవాలతో కూడిన వార్తను అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ చేశారంటే దీని వెనుక మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన వ్యక్తి ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఆ విలేకరికి రాజకీయ దురుద్దేశాలు? ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఈ వార్తను ముగ్గురు విలేకరులు ఆదిత్య కర్లా, సుదర్శన్ వర్థన్, అదితి షా రాసినట్లుగా రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ వార్త రాయడంలో ప్రధాన భూమిక పోషించిన ఆదిత్య కర్లా ట్వీట్ ఖాతాను పరిశీలిస్తే అసలు రంగు బయటపడింది. ఈ వార్తను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్ అతడి ఖాతాపై ఆంక్షలు విధించింది. ట్విటర్ ఖాతాను ఇలా దురుద్దేశపూర్వకంగా వాడుకుని తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారంటూ ఆదిత్య కర్లా ఖాతాను స్తంభింపజేసింది. ఆయన రాసే కథనాల్లో రాజకీయ దురుద్దేశాలు ఉండటంతో ట్విట్టర్ యాడ్ పాలసీ ప్రకారం ట్వీట్లను బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయి సామర్థ్యం ‘ఈ వార్తలో ఇసుమంత కూడా నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కియా సత్సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన కార్లకు అదనంగా కొత్త మోడళ్లను ఉత్పత్తి చేసే పనిలో ఉంది. ఈ ఏడాది చివరికి యూనిట్‌ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంలోకి తెచ్చేలా కియా శరవేగంగా ముందుకెళుతోంది. ఇలాంటి అసత్య వార్తను ఎందుకు రాశారో రాయిటర్స్ సంస్థను వివరణ అడిగి తగిన చర్యలు తీసుకుంటాం’ – మేకపాటి గౌతమ్‌రెడ్డి (పరిశ్రమల శాఖ మంత్రి) తమిళనాడు ప్రభుత్వం ఖండించింది ‘తమిళనాడుతో రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉంది. పెట్టుబడులు పెట్టడం గురించి కియా మోటార్స్‌తో తాము ఎటువంటి చర్చలు జరపలేదని తమిళనాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని, తరలింపు ఆలోచనే లేదని కియా కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కియా మోటార్స్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం 2 లక్షల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది చివరకు 3 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తి అవాస్తవాలతో రాయిటర్స్ రాసిన కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది’ – రజత్ భార్గవ (పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
వారిపై చర్యలు తీసుకుంటాం : బుగ్గన
సాక్షి, అమరావతి : కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. తమ ప్రభుత్వంపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాయిటర్స్ తప్పుడు వార్తలను ప్రచురించిందని, ఆ కథనంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కియా విషయంలో కావాలనే గందరగోళం సృష్టించారని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. (చదవండి : కియా మోటార్స్ ఎక్కడికి తరలివెళ్లడం లేదు) తమ ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో కియా సంస్థ యాజమాన్యం ఎంతో సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అసలు ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయో తమకు కూడా తెలియదని కియా సంస్థ యాజమాన్యం చెప్పిందని బుగ్గన అన్నారు. కొందరు కావాలనే కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో పరిశ్రమల పెట్టుబడులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. బిర్లా, ఏటీసీ టైర్స్, స్మార్ట్‌టెక్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు త్వరలేనే ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయని బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబే ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో పరిశ్రమలకు రూ.3500 కోట్ల రాయితీలను చెల్లించలేదని బుగ్గన ఆరోపించారు. డీపీఆర్‌లు లేకుండానే రూ.లక్ష కోట్లకు టెండర్లు పిలిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. సివిల్ సప్లయ్, డిస్కమ్‌లపై రూ.20వేల కోట్లకు పైగా అప్పుడు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తూ వెళ్తూ ఒక్క రోజులో రూ.5వేల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై రుద్దారని విమర్శించారు. చంద్రబాబు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని బుగ్గను ఆరోపించారు. -
రాయిటర్స్ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయిటర్స్ ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, కియా, ఏపీ ప్రభుత్వం రెండు కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. మరోవైపు కియా మోటర్స్ కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించింది. భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్‌ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియా మోటర్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కియా మోటర్స్‌కు సంపూర్ణ సహకారం అందించారు. గతేడాది డిసెంబర్లో కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంపెనీ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామనే అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అయినప్పటీకి కియా మోటర్స్ తరలిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించడంతో పాటు తీవ్రంగా పరిగణించింది. తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జర్నలిజం ముసుగులో అసత్యాలు ప్రచారం కియామోటర్స్ ఏపీ నుంచి తరలిపోతుదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కియా మోటర్స్, ఏపీ ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, రెండు కలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. కియామోటర్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాల సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిజం ముసుగులో కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘గతంలో ఎవరినైనా అప్రతిష్ట పాలుచేయాలంటే తప్పుడు ఆరోపణలు, అసభ్య దూషణలతో ముద్రించిన కరపత్రాలను వెదజల్లేవారు. ఇప్పుడు పచ్చ మీడియా అచ్చం అలాగే చేస్తోంది. ప్రజలను అయోమయానికి గురిచేసేలా అసత్య కథనాలు వడ్డిస్తూ జర్నలిజం ముసుగులో పత్రికలను నడుపుతున్నాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
కియామోటర్స్‌పై రాయిటర్స్ కథనం అవాస్తవం
-
శ్రీలంక పేలుళ్లు; ఫొటో జర్నలిస్టు అరెస్టు
కొలంబో : నిబంధనలు అతిక్రమించాడన్న కారణంగా ఓ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మే15 వరకు నెగోంబో మెజిస్ట్రేట్ అతడికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలో ముష్కరులు సృష్టించిన నరమేధంలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నివసించే రాయిటర్స్ జర్నలిస్టు సిద్ధిఖి అహ్మద్ డానిష్ న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా నెగోంబో సిటీకి చేరుకున్న ఆయన అనుమతి లేకున్నా ఓ స్కూళ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వరుస పేలుళ్లలో మరణించిన ఓ విద్యార్థి కుటుంబాన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లగా పోలీసులు సిద్ధిఖిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నెగొంబో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఈనెల 15వరకు రిమాండ్ విధించారు. ఇక ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
భారత బాంబులపై ‘రాయ్‌టర్స్’ బాంబ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించిన సంఘటనపై జాతీయంగా, అంతర్జాతీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో నెట్వర్క్ కలిగిన ‘రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ’ బుధవారం ఓ బాంబు పేల్చింది. బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే, మార్చి 4వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలోని ‘ప్లానెట్ లాబ్స్ ఇన్కార్పొరేటెడ్’ తీసిన బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ మదర్సా శాటిలైట్ చిత్రాలను, అంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో ఇదే శాటిలైట్ తీసిన ఇదే స్థావరం చిత్రాలను విడుదల చేసింది. వాటిని పోల్చి చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి....(‘బాలకోట్’లో భారత్ గురి తప్పిందా?!) బాలకోట్‌లోని భవనాల పైకప్పులపై ఎలాంటి రంధ్రాలుగానీ, కూలిన గోడలుగానీ, కాలిన గుర్తులుగానీ, బాంబులు పడ్డాయని చెప్పడానికి సంబంధించి మరెలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది. శాటిలైట్ పాత చిత్రాలకు, కొత్త చిత్రాలకు ఎలాంటి తేడా కనిపించడం లేదని పేర్కొంది. బాలకోట్‌పై జరిపిన భారత వైమానిక దాడిలో 250 నుంచి 350 వరకు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, అందుకు సాక్ష్యాలు చూపించాలంటూ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన జవాన్ల కుటుంబాలు కూడా బాలకోట్ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దళాలు జరిగిన దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలు చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగి ఉండవచ్చు! 1. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటల ప్రారంతంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ భాభాగంలోకి దూసుకుపోవడం నూటికి నూరు పాళ్లు నిజం. ఈ విషయాన్ని మనకంటే పాకిస్థాన్ వర్గాలే ముందుగా ప్రకటించాయి. సకాలంలో తాము అప్రమత్తమైన భారత యుద్ధ విమానాలను తరమి కొట్టామని, ఆ తొందరలో భారత యుద్ద విమానాలు లక్ష్య రహితంగా బాంబులు కురపిస్తూ పారిపోయాయని, తమవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి. బాలకోట్‌కు పది కిలోమీటర్ల ఇవతల బాంబులు పడ్డాయని, వాటి వల్ల కొన్ని చెట్లు కూలయని, కొన్ని చోట్ల గుంతలు పడ్డాయంటూ కొన్ని ఫొటోలను కూడా పాక్ సైనిక వర్గాలు ఆ తర్వాత విడుదల చేశాయి. 2. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. బాలకోట్‌లోని జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్ర శిక్షణ కేంద్రంపై భారత వైమానిక దళాలు బాంబు దాడులు జరిపాయని, ఈ దాడిలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు, ఆత్మాహుతి బందాల సభ్యులు మరణించారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు మతుల సంఖ్య 350 వరకు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 3. భారత వైమానిక దాడులపై భిన్న కథనాలు వస్తున్న నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులు బాల్కోట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లారు. వారికి స్థానికులు, పాక్ సైనికులు ‘బాంబులు వేసింది ఇక్కడే’ అంటూ కొన్ని బాంబులు పడిన గుర్తులను చూపారు. బాంబు దాడిలో ఓ పౌరుడికి గాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడికి సమీపంలోనే ఉన్న మదర్సా (ఉగ్రవాదుల శిక్షణా కేంద్రం)ను సందర్శించేందుకు మాత్రం పాక్ సైనికులు అనుమతించడం లేదు. దాంతో అంతర్జాతీయ మీడియా శాటిలైట్ ఛాయా చిత్రాలతో భారత్ దాడులు గురి తప్పాయంటూ పలు కథనాలను ప్రచురించాయి. బాంబు దాడుల వల్ల ఉగ్రవాదులకు అపార నష్టం వాటిల్లిందని రుజువు చేయడాని భారత వైమానిక దళం వద్ద రాడార్ చిత్రాలు, భారత సైన్యం వద్ద శాటిలైట్ చిత్రాలు ఉన్నాయంటూ కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణం ఆ రాడార్, శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి అనుమానాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రాయిటర్స్ షాక్ : వేల కోట్లు హాంఫట్
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు అంతర్జాతీయ మీడియా సంస్థ భారీ షాక్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు తమ బేబీపౌడర్లో క్యాన్సర్ కారకాలున్నాయన్న సంగతి ముందే తెలుసునని రాయటర్స్ తాజాగా వాదిస్తోంది. అయితే ఈ విషయంలో దశాబ్దాల తరబడి వినియోగదారులను మోసం చేస్తూ వస్తోందని విమర్శించింది. ఆస్బెస్టాస్ మూలంగా మేసోథెలియోమా లాంటి అనేక అరుదైన, బాధాకరమైన కాన్సర్లకుదారి తీస్తుందని పేర్కొంది. దీంతో వివాదాలు, పలు కేసులు, కోర్టు తీర్పులతో ఇబ్బందుల్లో పడిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ రిపోర్టును ఎప్పటిలాగానే జాన్సన్ అండ్ జాన్సన్ తిరస్కరించింది. తమ బేబీ టాల్కమ్ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకం ఉన్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి దశాబ్దాలుగా తెలుసని రాయిటర్స్ కథనం పేర్కొంది. బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నట్లు 1971లోనే జాన్సస్ సంస్థ గుర్తించిందని తెలిపింది. ఈ విషయమై ఇటీవల కంపెనీపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి మరీ నిర్ధారించింది. అయితే ఇది తక్కువ మోతాదు, హానికరం కాదంటూ రెగ్యులేటరీ సంస్థలను ఒప్పించటానికి ప్రయత్నం చేసిందని, కానీ ఈ సంవత్సరం న్యూజెర్సీ న్యాయమూర్తి జాన్సన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ రాయటర్స్ నివేదించింది. అయితే ఈ వార్తలను జాన్సన్ అండ్ జాన్సన్ కొట్టిపారేసింది. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కంపెనీ ఆరోపించింది. తమ టాల్కం పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్ కారకాలు లేవని ఇప్పటికే చాలా పరీక్షలు రుజువుచేశాయని కంపెనీ గ్లోబల్ మీడియా రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎర్నీ నీవిట్జ్ తెలిపారు. అయితే బేబీ పౌడర్ కాకుండా పారిశ్రామిక అవసరాలకోసం ఉద్దేశించిన తమ టాల్క్ బ్యాచ్‌లలో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉండి వుండవచ్చని వాదించారు. కాగా జాన్సన్ అండ్ జాన్స్ బేబీ పౌడర్‌తో పాటు షవర్ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, తద్వారా తమకు క్యాన్సర్ సోకిందన్న ఆరోపణలపై వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే బాధితులను వాదనలను సమర్థించిన పలుకోర్టులు పరిహారం చెల్లించాల్సిందిగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే. 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక విభాగం జాన్సన్‌కు చెందిన జననేంద్రియ ప్రాంతాల్లో ఉపయోగించే (వెజైనల్) టాల్క్ అండాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చని ఒక ప్రకటన జారీ చేసింది, అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదని కొట్టి పారేసింది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ షేర్లు కుప్పకూలాయి. షేరు విలువ 10శాతం మేర పడిపోయింది. 45బిలియన్ డాలర్ల సంపద (సుమారు 32వేల కోట్ల రూపాయలు) తుడిచిపెట్టుకుపోయింది. 16ఏళ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’
న్యూయార్క్ : జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టుల తరపున వారి కుటుంబాలు.. మయన్మార్ అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేశాయని మానవ హక్కుల న్యాయవాది అమల్ క్లూనీ తెలిపారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో జరిగిన పత్రికా స్వేచ్ఛా కార్యక్రమంలో అమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్ క్షమాభిక్ష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆమెకే బాగా తెలుసు.. ‘ఒక వ్యక్తికి శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ద్వారా అతడు మళ్లీ సాధారణం జీవితం గడిపేందుకు వీలవుతుంది కదా. ఈ కోవలోనే వా లోన్, కా సో ఓల కుటుంబ సభ్యులు అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం వారి తరపున దరఖాస్తు చేశారు. నాకు తెలిసి మయన్మార్ అధ్యక్షుడు ఈ విషయమై అంగ్ సాన్ సూకీతో తప్పకుండా చర్చిస్తారు. వారిద్దరు తలచుకుంటే ఈ ఇద్దరు జర్నలిస్టులకు ఈరోజుతో శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. ఒక రాజకీయ ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అంగ్ సాన్ సూకీ కంటే ఎవరికీ కూడా అంత ఎక్కువగా తెలిసి ఉండదు’ అంటూ అమల్ వ్యాఖ్యానించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా అరెస్టైన వీరిద్దరి వద్ద దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు లభ్యమయ్యాయన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరికి శిక్ష ఖరారు చేస్తూ సెప్టెంబరు 3న తీర్పు ఇచ్చింది. ధైర్యంగా ఎదుర్కొంటాం.. తీర్పు అనంతరం వా లోన్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ తీర్పును మేం దృఢచిత్తంతో, ధైర్యంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ప్రభుత్వం తమను అరెస్ట్ చేయగలదనీ, కానీ ప్రజల కళ్లు, చెవులను మాత్రం మూయలేదని కా అన్నారు. కాగా ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేయాలని మయన్మార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేశాయి.