రాయిటర్స్ జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాయిటర్స్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలను ధృవీకరించిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మయన్మార్‌లో బ్లాక్ డే అని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ జే అడ్లెర్ వ్యాఖ్యానించారు
రాయిటర్స్ జర్నలిస్టులు వా లోనె (32) కియా సో ఓ (28) మయన్మార్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ అభియోగాలతో గత ఏడాది అరెస్ట్ అయ్యారు . ఇద్దరు పోలీసుల నుండి అతి ముఖ్యమైన రహస్య పత్రాలను జర్నలిస్టులు సేకరించడం ద్వారా వలసవాద కాలం నాటి చట్టాన్ని ఉల్లంఘించారని అక్కడి ప్రాసిక్యూషన్ అధికారులు వాదించారు. వారు ఉల్లంఘించింది మయన్మార్ అధికార రహస్యాల చట్టమని ప్రాసిక్యూటర్లు గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment