Reporters
-
సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్‌ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్‌ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
మీకు నచ్చింది రాసుకోపో...ఈనాడు, ABN రిపోర్ట్ ర్స్ పై మంత్రి అంబటి ఫైర్
-
‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం
సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్ కోర్టుకు వెళ్లారు. దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది. చదవండి: టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం అసలు కేసు నేపథ్యమేంటీ? నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది. నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్‌కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది. ఈ కథనంపై అప్పటి వైస్ ఛైర్మన్ రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. -
బ్లాక్మెయిల్ చేస్తున్న నలుగురు విలేకరులపై కేసు నమోదు
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి యజమానులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు విలేకరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ... శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలోని కమలాపురి కాలనీలో మనీష్ జైన్ అనే వ్యాపారి ప్లాట్ నెంబర్ 117లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నెల 4వ తేదీన తాము విలేకరులమంటూ నలుగురు వ్యక్తులు ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు. తాము లోకల్ మీడియా రిపోర్టర్లమని పేర్కొంటూ తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఆకుల కిరణ్ గౌడ్, సోపాల శ్రీనివాస్, తడక విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్ తదితరులు రోజూ 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వీరిపై బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కేసులో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నిర్మిస్తున్న భవనంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ తన ఇంటి ఫొటోలు తీస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బిల్డింగ్ కూలి్చవేయిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. అయిదు సంవత్సరాల క్రితం కూడా ఈ నలుగురు విలేకరులు తమను డబ్బుల కోసం డిమాండ్ చేయడం జరిగిందని వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డట్లు ఆరోపించారు. బిల్డింగ్ కూలి్చవేయిస్తామని అప్పట్లోనే బెదిరించగా రూ. 12 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా మళ్లీ తనను డబ్బు ల కోసం బెదిరిస్తున్నాడని తనకు ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా మారిందని వీరి బారి నుంచి రక్షించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కిరణ్‌గౌడ్, సోపాల శ్రీనివాస్, విజయ్‌కుమార్, కుళ్ల రవీందర్‌లపై ఐపీసీ సెక్షన్ 447, 385, 386, 506 రెడ్‌విత్ 120(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
అక్కాబావలు అమ్మను చంపేశారు.. నే బతకనిక.. అనుమతి ఇవ్వండి
నేలకొండపల్లి: ‘నా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి, నేను బతికి బాధలు భరించలేను’అని ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరెంట్ల సాయిచంద్(17) అనే బాలుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ వీడియోను మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆదివారం కలిసిన విలేకరుల ఎదుట తన గోడు వెలిబుచ్చాడు. నేలకొండపల్లికి చెందిన గోరంట్ల సుజాత చెరువుమాదారం పాఠశాలలో అటెండర్. సాయిచంద్, సాయి ప్రత్యూష ఆమె సంతానం. సాయి ప్రత్యూషను 2014 లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గుండా గోపి అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం ఇబ్బంది పెట్టడమే కాకుండా, ‘నువ్వు చనిపోతే ఆ ఉద్యోగం నా భార్యకు వస్తుంది’అంటూ సుజాతను వేధించేవాడు. ఈ క్రమంలో 2020లో అనారోగ్యానికి గురైన సుజాత హుజూర్‌నగర్‌లోని కూతురు ఇంట మృతి చెందింది. అయితే, ఆమె కరోనాతో చనిపోయిందని కూతురు, అల్లుడు అంటుండగా, ఆ మృతిపైన అనుమానాలు ఉన్నాయని, అక్కకు ఉద్యోగం కోసమే చంపి ఉంటారని ఆ బాలుడు ఆరోపిస్తున్నాడు. ఇదే విషయమై నిలదీస్తే తనను కూడా చంపేస్తానని బావ బెదిరిస్తున్నాడని, తన ఇంటి తాళాలు పగులగొట్టి సర్టిఫికెట్లు, డబ్బు, బంగారు వస్తువులు తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అక్క అత్తారింటివారు కూడా వేధిస్తున్నారని, ఇన్ని బాధలు భరించలేనని, చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఖమ్మం, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీష్‌రెడ్డిలను వేడుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు మతిస్థిమితంలేదని ప్రచారం చేస్తున్నారని, ఆత్మహత్య చేసుకునే ధైర్యం తనకు లేదని, అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఆ బాలుడు కోరాడు. అక్కాబావలపై చర్యలు తీసుకోవాలని, వచ్చే జన్మలోనైనా మంచి కుటుంబంతో బతకాలని ఉందని పేర్కొన్నాడు. తమ్ముడిని తప్పుదారి పట్టిస్తున్నారు: సాయి ప్రత్యూష, సోదరి తల్లి మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని, ఆమె మృతికి సంబంధించిన రిపోర్టులు కూడా ఉన్నాయని సాయిచంద్ సోదరి సాయిప్రత్యూష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ్ముడి వీడియో సోషల్ మీడియాలో చూసి ఆందోళన చెందానని, కొందరు అతడిని తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై ఇప్పటికే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. -
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన థాయ్‌ల్యాండ్ ప్రధాని
-
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన ప్రధాని
బ్యాంకాక్: ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు.. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలపడం కోసం.. అలానే ప్రభుత్వ పని తీరుపై వచ్చిన ఆరోపణలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి. అందుకే చాలా మంది నాయకులు ప్రెస్ మీట్స్ అంటే భయపడతారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందో.. ఎక్కడ నోరు జారతామో అని ప్రెస్ మీట్లు పెట్టరు. ఒకవేళా పెట్టినా నచ్చని ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పకుండా దాట వేస్తారు. అంతే తప్ప ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ల మీద దాడి చేయడం అసంభవం. కానీ దీన్ని నిజం చేసి చూపారు థాయ్‌లాండ్ ప్రధాని. విలేకరుల తమ ప్రశ్నలతో విసిగిస్తున్నారని అసహనానికి గురైన థాయ్ పీఎం ఏకంగా వారిపై శానిటైజర్ స్ప్రే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-ఓచా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రిపోర్టర్లు తాజాగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాల గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా కొద్ది కాలం నుంచి పలువురు అధికారులు తమ క్యాబినేట్ పదవుల నుంచి వైదొలగారు. అలానే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు మినిస్టర్లను వారం రోజుల క్రితమే జైలుకు పంపించారు. ఈ అంశాలన్నింటి గురించి విలేకరులు ప్రధాని ప్రయూత్ని ప్రశ్నించారు. రిపోర్టర్ల ప్రశ్నలకు విసిగిపోయిన ప్రధాని ప్రయూత్.. ‘‘మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా.. ఇలాంటి విషయాలన్ని నాకు కనిపించడం లేదు ఎందుకో.. ఇవన్ని ముందుగా తెలియాల్సింది ప్రధానికే కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వత తన పొడియం వద్ద నుంచి బయటకు వచ్చేశారు. అలా వస్తూ.. పక్కనే ఉన్న శానిటైజర్ డబ్బాను చేతిలోకి తీసుకుని జర్నలిస్ట్‌ల దగ్గరకు వచ్చి.. వారందరి మీద శానిటైజర్ స్ప్రే చేస్తూ ముందుకు వెళ్లి పోయారు. ఈ తతంగాన్నంత అక్కడ ఉన్న రిపోర్టర్లు వీడియో తీశారు. చివరకు ప్రయూత్ ఇదే రిపోర్టర్లతో చాలా ఆగ్రహంగా మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. ఇక ప్రధాని చర్యలపై నెటిజనులు మండి పడుతున్నారు. ఇంత అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్ పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత -
పోలీసులపై దాడి.. ఇద్దరు రిపోర్టర్లు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. హార్బర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం గోవిందరావు (45), రమణారావు (43) మద్యం సేవించి వేగంగా గాజువాక నుంచి కాన్వెంట్ కూడలి వైపు వస్తున్నారు. కాన్వెంట్ కూడలి వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలు నిలిపి ఉండగా... వేగంగా వస్తున్న వీరిద్దరూ ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. దీంతో ఆ కూడలిలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డు రవి సంఘటన స్థలానికి వెళ్లి కారును ఎందుకు గుద్దారని ప్రశ్నించారు. దీంతో వారిద్దరిపై గోవిందరావు, రమణారావు దాడి చేసి దుర్భాషలాడారు. ఒకరు పీపుల్ వాయిస్ రిపోర్టర్ని అని, మరో వ్యక్తి మహాన్యూస్ రిపోర్టర్ని అని చెప్పారు. దీంతో వారిద్దరిపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని సురేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీపీ (ట్రాఫిక్) ఆదినారాయణ, ఏసీపీలు ఎంఆర్కే రాజు, టి.మోహన్‌రావు, సీఐ శ్యామలారావు పాల్గొన్నారు. -
ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్
-
ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : మహారాష్ట్ర కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ముంబైలో కొంతమంది ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజాటివ్‌గా తేలింది. ఇప్పటికే ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కు చెందిన ఆరుగురు రిపోర్టర్లకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. ఆదివారం చెన్నైలో ముగ్గురు మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా క్వారెంటైన్లో చికిత్స పొందుతున్నారు. -
సీఏఏ నిరసన సెగలు: జర్నలిస్టులపై దాడి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు వ్యతిరేకంగా సోమవారం కూడా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద నిరసనలు కొనసాగాయి. యూనివర్సిటీ గేట్-1 వద్ద విద్యార్థుల నిరసనలను కవర్ చేస్తుండగా ఇద్దరు జర్నలిస్టులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు చెందిన రిపోర్టర్ ఉజ్వల్ రాయ్, కెమెరాపర్సన్ సరబ్జీత్ సింగ్‌పై కొందరు దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జర్నలిస్టులపై దాడిని ఢిల్లీ పోలీసుశాఖ అధికార ప్రతినిధి ఎంఎస్ రాంధ్వా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద ఉన్న మెట్రో స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ప్రకటించింది. ఆ స్టేషన్ వద్ద మెట్రో రైళ్లను ఆపడం లేదని తెలిపింది. విద్యార్థుల ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. -
బీజేపీకి షాక్.. రిపోర్టర్లకు లంచం ఇవ్వబోయారంటూ
శ్రీనగర్ : సార్వత్రిక ఎన్నికల జోరుగా సాగుతున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. లడఖ్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రచారం చేయాలంటూ.. ఆ పార్టీ నాయకులు తమకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని లేహ్ రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎన్డీటీవీ ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ విషయం గురించి మహిళా జర్నలిస్ట్ రించెన్ ఆంగ్మో మాట్లాడుతూ.. 'ఈనెల 2న ఓ హోటల్లో బీజేపీ నాయకులు విక్రం రంధావా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాం. కార్యక్రమం ముగిశాక మేము బయటకు వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకులు మా దగ్గరకు వచ్చారు. నలుగురు రిపోర్టర్లకు ఎన్వలప్‌లను ఇచ్చారు. అనుమానం వచ్చిన రిపోర్టర్లు వాటిని తెరిచి చూడగా దానిలో రూ. 500 నోట్లు ఉన్నాయి. బీజేపీ చర్యలకు మేం షాక్ అయ్యాం. ఇలా చేయడం తప్పని చెప్పాం’ అన్నారు. కానీ విక్రం, రవీందర్‌లు ‘ఇది కేవలం అభిమానంతో ఇస్తున్నాం. ఈ రోజుల్లో ఇదంతా సాధారణమేనని, ఇలాంటివి ప్రతిచోటా జరుగుతాయని మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ, వెంటనే మా రిపోర్టర్లు ఆ ఎన్వలప్‌లను అక్కడే టేబుల్‌పై పెట్టి బయటకు వచ్చార’ని రించెన్ ఆంగ్మో తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఓ సీనియర్ బీజేపీ నాయకుడు ఖండించారు. తమ నాయకులు రిపోర్టర్లకు ఇచ్చింది ఎన్వలప్‌లు కాదని.. ఇన్విటేషన్ కార్డని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ పర్యటించబోతున్నారని.. దాన్ని కవర్ చేయడానికి రిపోర్టర్లను ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ ఇచ్చామని ఆయన తెలిపారు. జర్నలిస్ట్‌లకు మేం చాలా గౌరవం ఇస్తాం. బీజేపీ ఇలాంటి పనుల ఎన్నటికి చేయదని ఆయన స్పష్టం చేశారు. ఈసీకి జర్నలిస్టుల ఫిర్యాదు లడఖ్ ఎంపీ స్థానంలో ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా వార్తలు ప్రచారం చేయాలంటూ రిపోర్టర్లకు లంచం ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించిందని లేహ్ ప్రెస్ క్లబ్ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. -
రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు శిక్ష
రాయిటర్స్ జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాయిటర్స్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలను ధృవీకరించిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మయన్మార్‌లో బ్లాక్ డే అని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ జే అడ్లెర్ వ్యాఖ్యానించారు రాయిటర్స్ జర్నలిస్టులు వా లోనె (32) కియా సో ఓ (28) మయన్మార్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ అభియోగాలతో గత ఏడాది అరెస్ట్ అయ్యారు . ఇద్దరు పోలీసుల నుండి అతి ముఖ్యమైన రహస్య పత్రాలను జర్నలిస్టులు సేకరించడం ద్వారా వలసవాద కాలం నాటి చట్టాన్ని ఉల్లంఘించారని అక్కడి ప్రాసిక్యూషన్ అధికారులు వాదించారు. వారు ఉల్లంఘించింది మయన్మార్ అధికార రహస్యాల చట్టమని ప్రాసిక్యూటర్లు గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే. -
విలేకరులకు సన్మానం
కొరాపుట్/జయపురం : ప్రపంచ మీడియా దినోత్సవం సందర్భంగా కొరాపుట్ జిల్లాలో పలువురు పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను శనివారం సన్మానించారు. కౌన్సిల్ ఫర్ మీడియా అండ్ శాటిలైట్ బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ ఆధ్వర్యంలో కొరాపుట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కె.సుధాకర్ పట్నాయక్, ఓటీవీ జయపురం బ్యూరో ఛీప్ టి.గౌరీ శంకర్, ప్రముఖ ఒడియా దినపత్రిక సమాజ్ జిల్లా ప్రతినిధులు దిలీప్ మహంతి, పతిత పావన సాహు, సూర్యనారాయణ పండాలను సన్మానించారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు సీఎంసీబీ జిల్లా అధ్యక్షుడు నిసాపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొరాపుట్ విశ్వ విద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరవ్ గుప్తా మాట్లాడుతూ..పాత్రికేయులు కచ్చితమైన ప్రమాణాలతో వార్తలు రాయడం సమాజానికి మేలు చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పత్రికలు, పాత్రికేయుల రక్షణ కోసం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1948లో ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. పాత్రికేయుల రక్షణ కోసం చట్టాలున్నప్పటికీ వారిపై ఎక్కడికక్కడ దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారన్నారు. సుమారు 13 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులపై దాడులు చేసిన దోషులు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసి శిక్షించారన్నారు. స్వేచ్ఛ ఉన్న నాడు సక్రమంగా కర్తవ్యం ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతలను వివరించారు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉన్న నాడే వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలరని, అయితే నేడు అనేక సందర్భాల్లో జర్నలిస్టులపై దాడులు జరుగాయన్నారు. వారికి భద్రత లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని వక్తలు కోరారు. కొరాపుట్ జిల్లా సమాచార ప్రజా సంబంధాల అధికారి జగన్నాథ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌సీఎంఏ ప్రాంతీయ డైరెక్టర్ వేణు ధర్ సాహు, సీఎంఎస్బీ అధ్యక్షుడు వీ.కె. బంగారి, ప్రముఖ భూదాన ఉద్యమ నేత కృష్ణ సింగ్, కేంద్రీయ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ సౌరవ్ గుప్త , సమాజ్ దినపత్రిక బ్యూరో చీఫ్ సమరేందు దాస్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
పోలీస్ జీప్
‘ఒరేయ్ రాజూ! నీకీ విషయం తెలీదేట్రా! గోశాల జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందట. మీ చిన్నాన్న కొడుకు లేడూ.. అదేరా మీ శ్రీనుగాడు. వాణ్ని పోలీసు జీపు గుద్దేసిందట. పాపం ఎలాగున్నాడో ఏమో?’’ గోశాలకేసి పరిగెడుతున్నాడు ఈరన్న.నాకు నోటమాట రాలేదు. ఆత్రుతగా అతని వెనుకే పరుగందుకున్నాను.గోశాల మూడు రోడ్ల జంక్షన్. మధ్యలో పెద్ద రావి చెట్టు. అప్పటికే అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు. మేం వెళ్లే్లసరికి శ్రీనుగాణ్ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు.‘‘ఏమైందిరా?’’ జనాల మధ్యఏడుస్తూ నిలబడ్డ నర్సింహాన్ని చూసి అడిగాను.‘‘ఏమో అన్నయ్యా! ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు శ్రీనివాస నగర్ వెళ్లొస్తానన్నాడు. సైకిల్ తీస్తుంటే వద్దని తిట్టాడు నాన్న. అయినా వినకుండా వచ్చాడు. ఇదిగో ఇప్పుడిలా!’’ ఏడుస్తూనే అన్నాడు నర్సింహ. ‘‘ప్రాణహాని లేదు కదా’’ ఆత్రుతగా అడిగాను.‘‘ఏమో! చూసిన వాళ్లంతా స్పాట్లోనే చనిపోయాడంటున్నారు. ప్రమాదం జరిగీ జరగ్గానే పోలీసులు అదే జీపులో పెద్దాసుపత్రికి తీసుకుపోయారట. నేనూ ఇప్పుడే వచ్చాను’’ చెప్పాడు నర్సింహ.గంటా గంటన్నరలోపే అనుకుంటా అంబులెన్స్ ఒకటి సైరన్ వేసుకుంటూ వచ్చింది. దాన్ని చూస్తూనే మా అందరికీ దుఃఖం ఆగలేదు. దాని వెనుకే పోలీసు జీపు కూడా ఫాలో అయి వచ్చింది. శ్రీనుగాడి శవాన్ని అప్పగించేసి వెంటనే వెళ్లిపోయారు పోలీసులు.అప్పటికే సాయంత్రం ఆరైపోయింది. చీకటి ముసురుకుంది. నాకెందుకో మనసంతా ఆందోళనగా ఉంది. మనసు మనసులో లేదు. ఆలోచిస్తూ నడుస్తున్నాను.‘పోలీసులే గుద్దేసి, కేసూగీసూ లేకుండా మాఫీ చేసేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది.తెల్లారితే శ్రీను శవాన్ని దహనం చేస్తారు. ఈలోపే ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి? ఎస్! పేపర్‌వాళ్లకి ఈ విషయం చెబితేనే, బయటి ప్రపంచానికి తెలుస్తుంది. పేపరాఫీసుకి ఫోన్ చేశాను. ‘‘సార్! మాది అడివివరం గ్రామం. మా ఊళ్లో ఒక కుర్రాణ్ని పోలీసు జీపు గుద్దేసింది. ఆ కుర్రాడు చనిపోయాడు’’ నెమ్మదిగా నసుగుతూ విషయం చెప్పాను. అరగంటలో వచ్చి వాలిపోయాడతను. అతను టీవీ రిపోర్టర్లు, పేపర్ రిపోర్టర్లు అందరికీ ఉప్పందించినట్లున్నాడు. పదీపదిహేను మంది మూకుమ్మడి దాడి చేశారు. రాత్రి ఎనిమిది గంటల వార్తల్లో అన్ని టీవీ చానెళ్లలో ఇదే వార్త.సరిగ్గా అర్ధరాత్రి నాలుగైదు జీపుల్లో పోలీసులు వచ్చారు. బంధువులంతా శోకసంద్రంలో మునిగి ఉన్నారు. పోలీసుల హడావుడి చూసి ఊరంతా ఉలిక్కిపడి లేచింది. మా వాళ్లెవరూ ఇళ్లకు కూడా వెళ్లలేదు. నేనో మూల నక్కి నిలబడ్డాను. ‘‘ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి ప్రెస్ వాళ్లకి ఎవరు లీక్ చేశారు? ఇది సాధారణ ప్రమాదమే కదా. ఇప్పుడు చూడండి. ఈ కేసు తలనొప్పిలా తయారైంది’’ అని ఓ పోలీస్ అధికారి పబ్లిక్ మీద అరుస్తున్నాడు. అలా అంటూనే శ్రీను శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని ఆర్డర్ జారీ చేశాడు.నేను అనుకున్నట్లే పోలీసు కేసు నమోదైంది. ఆ మర్నాడు పోస్టుమార్టమ్ జరిగాక శవాన్ని అప్పగించేశారు. దహన సంస్కారాలయ్యాక అందరం బజార్లో రావిచెట్టు కింద కూర్చున్నాం. గోపాలపట్నం నుంచి బుల్లెట్ మీద ఎస్సై, ఒక కానిస్టేబుల్ వచ్చారు. ‘‘ఇక్కడ నరేంద్ర ఎవరు?’’ బుల్లెట్ దిగుతూనే కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చి అడిగాడు. పోలీసులు నా గురించి అడిగేసరికి ఉలిక్కిపడ్డాను. నాకెందుకో ఒళ్లు వణకసాగింది. మనసులో ఏదో భయం మొదలైంది. వినయంగా వెళ్లి ఎస్సైగారికి నమస్కారం చేశాను. ‘‘మీరే కదా.. పేపర్ వాళ్లకి ఈ యాక్సిడెంట్ మెసేజ్ చెప్పింది’’ నాకేసి చూస్తూ అడిగాడు. అదిరిపడ్డాను. నా పేరు, వివరాలు పోలీసులకెలా తెలుసాయి?’’‘‘ఓకే నరేంద్ర. నేను క్రైమ్‌బ్రాంచ్ నుంచి వచ్చాను. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. డోంట్ వర్రీ. మీరు చేసింది మంచి పనే. తప్పు కాదు. వర్రీ కాకండి’’ అన్నాడు ఎస్సై. అతనలా అనేసరికి నా మనసు కాస్త కుదుటపడింది.‘‘సార్! యాక్సిడెంట్ జరిగిన విషయమే తెలుసు. అదే పేపర్ వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను’’ వినయంగా అన్నాను. ‘‘మీ ఫోన్ నంబర్ ఇదే కదా, అవసరమున్నప్పుడు మీకు కాల్ చేస్తాను. దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కేస్’’ చెప్పాడు ఎస్సై. నాకేమీ అర్థంకాక అయోమయంగా చూశాను.‘‘పేపర్లో వార్త చూసి ఎవరో లాయర్‌గారు ప్రజావ్యాజ్యం వేశారు. పోలీసు జీపు యాక్సిడెంట్‌కి సంబంధించి బాధితుడికి అన్యాయం జరగకుండా న్యాయవిచారణ జరిపించమని కోర్టుని కోరాడు. దాంతో కోర్టు నాకీ ఎంక్వైయిరీ బాధ్యతలు అప్పగించింది. మీరు ఫోన్ చేసిన పేపర్ ఆఫీసులో మీ ఫోన్ నంబర్ తీసుకొని మీ వివరాలు సేకరించి ఇక్కడకు వచ్చాను. మీకు ఎలాంటి వివరాలు తెలిసినా నాకు ఫోన్ చెయ్యండి’’ అంటూ తన ఫోన్ నంబర్ ఉన్న విజిటింగ్ కార్డును నాకిచ్చాడు ఆ ఎస్సై.‘‘అలాగే సార్’’ అన్నాను సంతోషంగా. ఒక పోలీసాఫీసర్ నాకంత వివరంగా కేసు గురించి చెబుతున్నప్పుడు ఇక నాకెందుకు భయమనుకున్నాను. ‘‘మేం యాక్సిడెంట్ స్పాట్‌కి వెళ్లాం. అక్కడ చలివేంద్రం ఉంది కదా. ఆ కుర్రాడే ప్రత్యక్ష సాక్షి. ఇంకా ఎవరైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడున్నారేమో ఆరా తియ్యండి నరేంద్ర’’ అడిగాడు ఎస్సై.‘‘కేసు రిజిస్టర్ అయిందిగా. రావలసిన రాయితీలు, ఇన్సూరెన్స్‌లు గట్రా అన్నీ వస్తాయి. కాకపోతే ఈ ప్రమాదం పోలీసుల నిర్లక్ష్యమా? లేక నిజంగా యాక్సిడెంటా? అనేది తేలాలి. ఓకే థ్యాంక్యూ నరేంద్ర..’’అంటూ ఎస్సై బుల్లెట్ స్టార్ట్ చేశాడు. అతని వెనుక ఎక్కి కూర్చున్నాడు కానిస్టేబుల్. పోలీసులు వెళ్లిపోయాక బజార్లో ఉన్నవాళ్లంతా వచ్చి నన్ను చుట్టుముట్టారు.‘‘ఆ రోజు పోలీసులు కొండకెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందంటున్నారట్రా. ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండ్రా. ఎస్సైగారికి సమాచారం ఇవ్వొచ్చు’’ అన్నాను ఆలోచిస్తూ.‘‘ఒరేయ్ నరేంద్ర! ఆ రోజు ఆ పోలీసోళ్లు గోపాలపట్నం నుంచి వస్తూ నా దుకాణం దగ్గర ఆగి సిగరెట్లు కొనుక్కున్నార్రా. అప్పుడు మన శ్రీనుగాడు ఆ జీపు డ్రైవర్‌తో ఏదో మాట్లాడటం చూశాను’’ అన్నాడు కిళ్లీ కొట్టు కన్నయ్య.ఆ మాట వింటూనే ఉలిక్కిపడ్డాను. పోలీసు జీపు డ్రైవర్‌తో శ్రీనుగాడికి పనేంటి? జీపు డ్రైవర్‌తో మాట్లాడేంత చనువుందా? ఇంతకీ ఏం మాట్లాడుంటాడు? ఆలోచిస్తూ ఉండిపోయాను. ‘‘శ్రీనుగాడితో మరో కుర్రాడు కూడా ఉన్నాడ్రా!’’ ఆలోచిస్తూ అన్నాడు కిళ్లీకొట్టు కన్నయ్య.‘‘నిజమా! ఎవరా కుర్రాడు?’’ ఆత్రుతగా అడిగాను. ఈ సమాచారం క్రైమ్‌బ్రాంచ్ ఎస్సైకి చేరవెయ్యాలి. దీనివల్ల వీసమెల్తైనా కేసుకు మేలు జరుగుతుందేమో! అనుకున్నాను.‘‘మన ఊరోడో.. పక్కూరోడో.. ఆ కుర్రాడు సరిగా పోలిక దొరకలేదురా?’’ తల గోక్కుంటూ విచారంగా అన్నాడు కన్నయ్య. ఆ వెంటనే వీళ్లు చెప్పిందంతా ఎస్సైకి పూసగుచ్చినట్లుగా చెప్పేశాను. ‘‘వెల్ డన్ నరేంద్ర. ఆ కుర్రాడెవరో ఆరా తియ్యి. నేను ఎంటరయితే భయపడి ఎవరూ నిజం చెప్పరు’’ అన్నాడు ఎస్సై. ‘‘అలాగే సర్!’’ అన్నాను ఉత్సాహంగా.ఆ రోజే శ్రీను చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాను. కాలేజీకి వెళ్లి శ్రీనుతో చనువుగా ఉండేవాడి స్నేహితుల జాబితా సంపాదించాను. శ్రీను పెద్దఖర్మ రోజు వాడి స్నేహితులందర్నీ పిలవాలని అనుకుంటున్నామని అబద్ధమాడితే గాని ఒకరొకరు బయటపడలేదు. పదిమంది వరకు ఉన్నారు. ‘‘అన్నా! శ్రీను చాలా మంచోడన్నా. ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు. ఎవరన్నా గొడవపడితే ఇద్దరికీ రాజీచేసి దోస్తీ చేసేవాడు. చదువులో కూడా సూపర్ బ్రిలియంటన్నా’’ దాదాపుగా అందరూ శ్రీను గురించి మంచి మాటలే చెబుతున్నారు. ‘‘అన్నా! రాజీవ్ గాడొకడున్నాడు. ఆడు రెండు రోజులుగా కాలేజీకి రావడం లేదు. వాడు మా అందరికన్నా శ్రీనుగాడికి జిగురు దోస్తన్నా. వాణ్ని కూడా తీసుకొస్తాం’’ ఓ కుర్రాడు నేను వచ్చేయబోతుంటే పరుగున నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒక్కసారిగా నాలో ఉత్సాహం పెరిగింది. ఆ రోజు శ్రీనుగాడితో ఉన్నది ఆ కుర్రాడే కావచ్చు. ‘‘ఆ అబ్బాయిది ఏ ఊరు?’’ అడిగాను. ‘‘అడివివరం దగ్గర విజినిగిరి పాలెం’’.వెంటనే నేరుగా విజినిగిరి పాలెం వెళ్లాను. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉందని కాలేజీకి వెళ్లలేదని చెప్పాడు రాజీవ్. ‘‘శ్రీనుకి యాక్సిడెంట్ జరిగినరోజు ఉదయాన్నే నువ్వు, శ్రీను కలుసుకున్నారు కదూ?’’ అనడిగా.‘‘ఆ.. ఆ.. అవునన్నా’’ తడబడుతూ చెప్పాడు.‘‘ఎక్కడ? కలుసుకున్నాక ఏం జరిగింది?’’‘‘అడివివరం మెయిన్ రోడ్డు మీద. ఆ రోజు మాకు కాలేజీ లేదు. ఊరికే కలుద్దామని వెళ్లాను. మేమిద్దరం మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్డు వారగా నడుస్తూ వెళ్తున్నాం. ఇంతలో పోలీసు జీపు వచ్చి పాన్‌షాపు ముందు ఆగింది. జీపు పక్క నుంచే ఇద్దరం ముందుకు వెళ్తున్నాం. ఇంతలో పోలీసు జీపులో కూర్చున్న డ్రైవర్ మమ్మల్ని పిలిచాడు. ఎందుకో అనుకుని ఆగాం. జీపు దగ్గరకు రమ్మన్నాడు. వెళ్లాం. ఏం కళ్లు కనిపించడం లేదా? పోలీసు జీపు అని తెలిసి ఒళ్లు దగ్గర పెట్టుకొని నడవలేరా? అని కోపంగా అన్నాడు జీపు డ్రైవర్. మేమేం చేశామని శ్రీను ఎదురు ప్రశ్న వేశాడు. ‘జీపు మీద ఎవర్రా బాదింది?’ కళ్లు ఎర్రజేస్తూ అడిగాడు. ‘మాట్లాడుకుంటూ వెళ్తూ నేనే జీపు మీద నెమ్మదిగా దరువేశాను. గట్టిగా బాదలేదు సార్..’ అన్నాన్నేను భయపడుతూ. ‘వేస్తార్రా వేస్తారు. కాలో చెయ్యో తీసేస్తే ఆ పొగరు వగరు వదిలిపోతుంది’ అన్నాడతను కోపంగా. ‘పదరా!’ అంటూ శ్రీనే అతణ్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి నన్ను లాక్కొచ్చేశాడు. ఆ డ్రైవర్ వెనుక నుంచి బూతులు తిడుతున్నా పట్టించుకోకుండా వచ్చాం. అంతే అన్నా జరిగింది. ఆ మధ్యాహ్నమే శ్రీనుకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందన్నా. అప్పటి నుంచి నాకీ మాయదారి జ్వరం తగులుకుంది’’ అన్నాడు రాజీవ్.ఆ రోజు జరిగిందంతా క్రైమ్‌బ్రాంచ్ ఎస్సైకి ఫోన్ చేసి చెప్పాను. ఆ జీపు డ్రైవర్ కానిస్టేబుల్ కాదని, హోమ్‌గార్డ్ అని చెప్పాడు. నన్ను పోలీస్ స్టేషన్‌కి వచ్చి కలవమన్నాడు. వెంటనే వెళ్లి కలిశా. నేను వెళ్లగానే కానిస్టేబుల్‌కు చెప్పి జీపు డ్రైవర్ హోమ్గార్డ్ని వెంటబెట్టుకుని పిలిపించాడు. ‘‘నువ్వు ఆ రోజు ఉదయం మొన్న యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీనుతో గొడవ పడ్డావట. నిజమేనా?’’ అడిగాడు ఎస్సై. ఆ హోమ్‌గార్డును ఎక్కడో చూసినట్టుంది నాకు. ఒక్కసారి చూస్తేమర్చిపోయే రూపం కాదు. ఎక్కడో.. ఎప్పుడో.. చూశాను. ఎక్కడ? ఎప్పుడు? ‘‘ఏమో సార్. నాకు గుర్తులేదు. ఎవరో ఇద్దరు కుర్రాళ్లు రోడ్డు మీద గెంతుకుంటూ మన జీపు మీద దబదబా చరుస్తూ వెళ్తుంటే పిలిచి చీవాట్లు పెట్టాను సార్. అంతే!’’ అన్నాడు ఆ హోమ్‌గార్డ్.అప్పుడు గుర్తొచ్చింది. ఎస్.. అతనే ఇతను. శ్రీను స్నేహితుల వివరాలు కనుక్కోవడానికి కాలేజీకి వెళ్లినప్పుడు.. అక్కడ చూశాను. ఓ అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తూ మా అందరికేసి ఓరగా తల ఎత్తి చూశాడు. అతణ్ని నేను గమనించాను. ఎస్.. అతనే.. ! ఆ వెంటనే ఎస్సై దగ్గర వీడ్కోలు తీసుకుని విజినిగిరి పాలెం వెళ్లాను. రాజీవ్‌ని కలిసి శ్రీను ఎవరెవరితో స్నేహంగా ఉంటాడో పట్టుబట్టి మళ్లా నా దగ్గరున్న జాబితాతో సరి చూసుకున్నాను. రాజీవ్‌తో పదిహేనుమందయ్యారు. అందులో నలుగురు అమ్మాయిలున్నారు. కాలేజీలో ఆ కుర్రాళ్లు మగ పిల్లల పేర్లే చెప్పారు. అమ్మాయిల పేర్లు చెప్పలేదు. అక్కడి నుంచి కాలేజీకి వెళ్లాను. పదిమంది కుర్రాళ్లు నన్ను చూస్తూనే దగ్గరికి వచ్చారు. నలుగురమ్మాయిల గురించి ఆరా తీశాను. సిగ్గుపడుతూ తలలు దించుకున్నారు.‘‘అమ్మాయిలు కదా. ఎందుకులే అని చెప్ప లేదన్నా’’ అన్నారు. వాళ్లను నాకు చూపించారు. నా అనుమానం నిజమైంది. అందులో ఒక అమ్మాయి నా దృష్టిలో పడింది. ఆ అమ్మాయే ఈ అమ్మాయ నుకున్నాను. హోమ్‌గార్డు ఈ అమ్మాయితోనే వెళ్లాడని నిర్ధారించుకున్నాను. అక్కడి నుంచే క్రైమ్‌బ్రాంచ్ ఎస్సైకి ఫోన్ చేసి విషయం వివరించాను.అంతే! ఆ మరునాడే అన్ని పేపర్లలో శ్రీను యాక్సిడెంటల్‌గా చనిపోలేదని, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డరని వార్త వచ్చింది. క్రైమ్ ఎస్సైయే స్వయంగా ప్రెస్మీట్లో చెప్పాడు. చనిపోయిన శ్రీను కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని... ఆ అమ్మాయి అన్నే శ్రీనుని జీపుతో గుద్ది చంపేశాడని... అతను పోలీసు డిపార్ట్మెంట్లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అని... శ్రీను మరణం వెనుక ఉన్న ఈ రహస్యాన్ని ఛేదించడంలో నరేంద్ర అనే యువకుడు సహకరించాడని వివరించారు. ∙ ఇందూ రమణ -
పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
-
అఫ్గానిస్తాన్‌లో 37 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన పలు ఆత్మాహుతి దాడుల్లో పది మంది విలేకరులు, పదకొండు మంది చిన్నారులు సహా 37 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లలో కలిపి 25 మంది చనిపోగా, కాందహార్‌లో జరిగిన మరో దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మూడు ఘటనల్లో కలిపి 65 మంది గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2001 తర్వాత అఫ్గానిస్తాన్‌లో మీడియాపై జరిగిన అత్యంత భయానక దాడి ఇదేనని ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ వెల్లడించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు.కాబూల్‌లో జరిగిన రెండు దాడులూ చేసింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాది జర్నలిస్ట్‌లా వచ్చి జనసమూహంలో తనను తాను పేల్చుకున్నాడని కాబూల్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. చనిపోయిన జర్నలిస్టుల్లో పలు స్థానిక చానళ్ల ప్రతినిధులు సహా ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. మరో ఘటనలో కాందహార్‌లో ఉగ్రవాది బాంబులతో నిండిన కారులో వచ్చి దాడికి పాల్పడటంతో 11 మంది చిన్నారులు మృతి చెందగా అఫ్గాన్, ఇతర దేశాల భద్రతా దళాల సిబ్బంది సహా 16 మంది గాయపడ్డారు.ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అఫ్గానిస్తాన్‌లో 34 మంది జర్నలిస్టులు చనిపోయారనీ, పత్రికా స్వేచ్ఛ సూచీలో ఆ దేశ స్థానం 118 అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ గుర్తుచేసింది. 2016లోనూ ఓ చానల్‌పై తాలిబాన్లు దాడి చేయగా ఏడుగురు ఉద్యోగులు మరణించారు. గత నవంబర్‌లో కూడా మరో టీవీ చానల్ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. -
పదోన్నతుల్లో నిబంధనల కిరికిరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియెట్‌లో గెజిటెడ్ రిపోర్టర్లుగా పనిచేస్తున్న గ్రూప్ –1 కేడర్ ఉద్యోగులు పాతికేళ్లుగా పదోన్నతులకు నోచుకోవడంలేదు. ఫలితంగా ఇతర విభాగాల్లోని కిందిస్థాయి ఉద్యోగులు గడిచిన ఇరవై ఏళ్లలో నాలుగు నుంచి ఐదు పదోన్నతులు పొందినా, గెజిటెడ్ రిపోర్టర్లు మాత్రం నిబంధనల కిరికిరితో పదోన్నతులు పొందలేకపోతున్నారు. 1952 నాటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం రిపోర్టర్లు, సెక్షన్ ఆఫీసర్లు 1:1 ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్ పొందేవారు. 1956లో ఆంధప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కూడా 1979 వరకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ రూల్స్‌నే అమలు చేశారు. అసెంబ్లీలో క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందన్న కారణతో 1979లో పదోన్నతుల నిష్పత్తిని 3:1 గా మార్చారని, దీనివల్ల సెక్షన్ ఆఫీసర్లకు 3, రిపోర్టర్లకు 1 చొప్పునే అసిస్టెంట్ సెక్రటరీ పదోన్నతి దక్కుతోందని అసెంబ్లీ గెజిటెడ్ రిపోర్టర్లు వాపోతున్నారు. పదోన్నతుల నిష్పత్తిని మారుస్తూ తెచ్చిన జీవో 82 ను హైకోర్టు, సుప్రీం కోర్టులు కొట్టివేసినా 1983లో మళ్లీ జీవో 66ను తీసుకువచ్చారని, ఇప్పటికీ అదే పద్ధతిని అమలు చేస్తుండడంతో తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సిబ్బంది విభజన జరిగింది. దీని ప్రకారం సెక్షన్ ఆఫీసర్ల క్యాడర్ స్ట్రెంత్‌ను 13గా, రిపోర్టర్ల క్యాడర్ స్ట్రెంత్‌ను 32గా నిర్ధారించారు. పాత నిబంధన అయిన 3:1ని మార్చకపోవడం వల్ల, ఇంకా ఏపీ సర్వీసు రూల్సును అమలు చేస్తున్నారని, గడిచిన 27 ఏళ్లుగా తమకు ఎలాంటి పదోన్నతులు దక్కలేదని వాపోతున్నారు. తమ సమస్యను సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శుల దృష్టికి తీసుకు వెళ్లారు. సుప్రీం, హైకోర్టుల తీర్పు మేరకు హైకోర్టు, రెవెన్యూ, సెంట్రల్ ఎక్సయిజ్ శాఖలో అనుసరిస్తున్న నియమ నిబంధనలనే అసెంబ్లీలో కూడా పదోన్నతుల్లో అవలంభించాలని ‘తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్ గెజిటెడ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వీరారెడ్డి కోరారు. -
లోపలేసి మూసేస్తా!
మెదక్ డీఎస్పీ నాగరాజు కస్సుబుస్సు సెల్ఫోన్లు లాక్కుని.. ఫొటోలు డిలీట్ దుర్భాషలాడుతూ విలేకరులపై వీరంగం కొండపాక: మెదక్ డీఎస్పీ నాగరాజు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకుపడ్డారు. విలేకరుల చేతిలో నుంచి సెల్ఫోన్లు లాకున్నారు. అందులోని డేటాను, ఫొటోలను డిలీట్ చేశారు. ఎక్కువ మాట్లాడితే సెల్లో వేస్తానంటూ బెదిరించారు. దొంగల్లా వస్తారా? అంటూ నానా దుర్భాషలాడారు. ఈ ఘటన శనివారం కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఉన్నతాధికారుల వేధింపులను భరించలేక ఈనెల 16న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు శనివారం డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వచ్చారు. ఈ వార్తను కవర్ చేయడానికి స్థానిక విలేకరులు ఠాణాకు వెళ్లారు. అధికారులు సాక్షులను విచారిస్తున్న ఫొటోలను విలేకరులు చిత్రీకరించారు. వీరావేశంతో విలేకరుల వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన మెదక్ డీఎస్పీ నాగరాజు.. తన అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తారంటూ చిందులేశారు. ఇలా చేసినందుకు లోపల కూర్చోబెడతానంటూ రెచ్చిపోయారు. తాము విలేకరులమని చెప్పినా విన్పించుకోలేదు. ‘మీరు దొంగలో.. విలేకరులో ఎలా తెలుస్తుంది?’ అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించారు. ఐడీ కార్డు చూపించినా కోపం తగ్గలేదు. విలేకరుల వద్ద ఫోన్లు లాక్కుని పోలీస్‌స్టేషన్‌లో విచారణకు సంబంధించిన ఫొటోలతో పాటు ఇతర ఫొటోలనూ డిలీట్ చేశారు. కేసు విచారణ విషయంలో పేపర్లో ఏమో బాగా రాశారట గదా అంటూ కన్నెర్ర చేస్తూ వెళ్లిపోయారు. లోపలేసినా వార్తలు పంపుతాం.. వరుస ఘటనలతో పోలీసులు సహనం కోల్పోయి విలేకరులపై విరుచుకు పడటం మంచిది కాదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. డీఎస్పీ నాగరాజు విలేకరులను సెల్లో వేసి బంధించినా అక్కడి నుంచి వార్తలను పంపటమే తమ వృత్తి ధర్మమన్నారు. డీఎస్పీ అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో విలేకరులపై పోలీసు దాడులు కొత్తకాదని, ఇప్పుడు మెదక్ డీఎస్పీ కూడా అలాగే వ్యవహరించారన్నారు. మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే ఆందోళనకు సిద్ధమవుతామని విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. -
చెక్‌పోస్టు వద్ద బెదిరింపులు: విలేకరులపై కేసు
సూళ్లూరుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్టు వద్ద బెదిరింపులకు పాల్పడుతున్న పత్రికా విలేకరులపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. గత డిసెంబరు 9వ తేదీన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈనాడు పత్రిక విలేకరి చంద్రమోహన్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి విలేకరి రమేష్ వారిని అడ్డుకుని కొన్ని లారీలను ముందుకు దాటించే ప్రయత్నం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు సిబ్బందిని బెదిరించారు. దీనిపై చెక్‌పోస్టు అధికారి జగబంధు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆరోపణలు నిజమని తేలటంతో ఇందుకు సంబంధించి ఇద్దరు విలేకరులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు. -
2014లో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టుల మృతి
వాషింగ్టన్: 2014వ సంవత్సరంలో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టులు అసువులు బాసారు. వీరంతా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు సీపీజే విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టమైంది. ఇందులో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. ఇందులో 44 శాతం మంది జర్నలిస్టులు హత్య గావించబడగా, ఒక్క సిరియాలోనే 17 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ సంవత్సరం నమోదైన జర్నలిస్టుల మరణ సంఖ్య గత సంవత్సరకంటే తగ్గింది. 2013 లో ప్రపంచవ్యాప్తంగా 70 మంది జర్నలిస్టులో మృతి చెందారు. ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాల్లో అరబ్ దేశాల్లో 79 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. -
మీడియాతో నేరుగా మాట్లాడతా
ప్రధాని మోదీ హామీ జాతీయ మీడియా ఎడిటర్లు సహా 400 మంది జర్నలిస్టులతో భేటీ న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంతవరకు మీడియాతో నేరుగా సంభాషించని నరేంద్ర మోదీ ఎట్టకేలకు శనివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దివాళీ మిలన్’ కార్యక్రమంలో జాతీయ మీడియా ఎడిటర్లు సహా 400 మంది జర్నలిస్టులతో మోదీ ముచ్చటించారు. ఇకపై తాను నేరుగా మీడియా తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇదే కార్యాలయంలో గతంలో ఆఫీస్ బేరర్‌గా తాను ఉన్నప్పుడు విలేకరుల కోసం కుర్చీలు వేసి వారి కోసం ఎదురుచూస్తుండేవాడినని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ రోజులే వేరు. మనం అప్పుడు చాలా స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్లం. మీతో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి.. అవి గుజరాత్లో ఉపయోగపడ్డాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నాను’’ అని అన్నారు. నేరుగా మాట్లాడడం వల్ల, మీడియా ప్రచురించలేని, ప్రసారం చేయలేని కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు. నేను మీడియాకు రుణపడి ఉన్నాను.. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని మారుమూల గ్రామాల వరకు తెలియజేసి వారిలో చైతన్యం తేవడంలో మీడియా చాలా ముఖ్య పాత్ర పోషించిందని మోదీ కొనియాడారు. ‘‘స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా తన కలాన్ని చీపురుగా ఉపయోగించింది. ఇది జాతికి చేస్తున్న సేవ. ఈ విషయంలో నేను మీకు రుణపడి ఉన్నాను’’ అని అన్నారు. ఆరోగ్య రక్షణ కంటే.. అనారోగ్య నివారణ ముఖ్యమని, అందులో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఫొటోగ్రాఫర్ మోదీ! అతడు బీజేపీ కార్యక్రమాలను కవర్ చేసే పార్టీ ఫొటోగ్రాఫర్. పేరు అజయ్ కుమార్ సింగ్. జర్నలిస్టులతో ప్రధాని సమావేశం సందర్భంగా వారితో కరచాలనం చేస్తూ, వారితో జోకులు వేస్తూ నవ్వులు చిందిస్తున్న నరేంద్ర మోదీని తన కెమెరాలో బంధించడానికి అతడు నానా తంటాలూ పడుతున్నాడు. మరోవైపు జర్నలిస్టులు మోదీతో కలిసి తమ సెల్ఫీలను సెల్ ఫోన్లలో బంధించుకోవడానికి పోటీపడుతున్నారు. ఇంతలో మోదీ అజయ్ కుమార్‌ను చూసి.. ఇప్పుడు నా వంతు అంటూ అతడి వద్ద కెమెరా లాక్కున్నారు. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోని అతడిని మోదీ ఫొటో తీశారు. ఆ తర్వాత అతడితో కలిసి ఫొటో దిగారు. ‘‘ఇది నాకు దీపావళి సర్ప్రైజ్. నన్ను చాలా బాగా ఫొటో తీశారు’’ అంటూ ఆనందంతో అజయ్ చెప్పాడు.