వాషింగ్టన్: 2014వ సంవత్సరంలో 60 మంది అంతర్జాతీయ జర్నలిస్టులు అసువులు బాసారు. వీరంతా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లి మృతి చెందినట్లు సీపీజే విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టమైంది. ఇందులో ఎక్కువ శాతం మంది హత్యకు గురైనట్లు తెలిపింది. ఇందులో 44 శాతం మంది జర్నలిస్టులు హత్య గావించబడగా, ఒక్క సిరియాలోనే 17 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు స్పష్టం చేసింది.
అయితే ఈ సంవత్సరం నమోదైన జర్నలిస్టుల మరణ సంఖ్య గత సంవత్సరకంటే తగ్గింది. 2013 లో ప్రపంచవ్యాప్తంగా 70 మంది జర్నలిస్టులో మృతి చెందారు. ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాల్లో అరబ్ దేశాల్లో 79 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.