
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్(Ghaziabad)లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న మామకు కోడలు శిక్ష విధించింది. భర్త చనిపోయిన నేపధ్యంలో కుమారుడిని పెట్టుకుని మామ ఇంటిలో ఉంటున్న ఆమెకు తండ్రిలాంటి మామ నుంచి చెడు అనుభవం ఎదురయ్యింది. దీంతో ఆమె అపరకాళికలా మారి మామకు శిక్ష విధించింది.
ఘజియాబాద్‌లోని కవినగర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు(Police) ఈ ఘటనలో నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టణ డీసీపీ రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై హర్‌సవా గ్రామానికి చెందిన మల్‌ఖాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఉదంతంలో మృతిచెందిన వ్యక్తిని పతిరామ్(63)గా పోలీసులు గుర్తించారు. ఆయన కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో పనిచేసి రిటైర్ అయ్యారు.
కవినగర్‌లోని గోవిందపురం కాలనీలో ఉంటున్న పతిరామ్ తన కోడలు ఆరతి ఇల్లు ఊడుస్తుండగా అభ్యంతరకరంగా తాకాడు. ఆమె భర్త జితేంద్రసింగ్ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. ఆరతి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తన మామ పతిరామ్‌కు పలువురు మహిళలలో సంబంధాలున్నాయని ఆరోపించారు. అలాగే తనకు భర్త వాటాగా రావాల్సిన ఆస్తి వాటా కూడా ఇచ్చేందుకు మామ నిరాకరించాడని తెలిపింది. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించానని పేర్కొంది.
ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ సాయంత్రం మామ ఇంటికి రాగానే కోడలు ఆరతి ఆతని తలపై క్రికెట్ బ్యాట్(Cricket bat)తో దాడి చేసింది. అయితే అతను ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, అతని కాలర్ పట్టుకుని ఇంటిలోనికి లాగి, మళ్లీ దాడి చేసింది. దీంతో అతను నేలకొరిగి కన్నుమూశాడు. దీనిని గమనించిన ఆరతి తన కుమారుడని ఇంటి నుంచి పంపవేసి, గదిలోని రక్తపు మరకలను గుడ్డతో తుడిచే ప్రయత్నం చేసింది. ఇంతలో ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment