Ghajiabad
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెళుతున్న తల్లికొడుకులు రోడ్డుపై చాలా దూరం ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం(జులై 20) జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
‘నిర్భయ’ను మించిన దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి రెండ్రోజులుగా..!
గాజియాబాద్: బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ(40)ను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్ ఇంకా మహిళ మర్మాంగాల్లోనే ఉందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది బాధితురాలు. ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని గాజియాబాద్ ఎస్పీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజియాబాద్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మలివాల్ ఎస్పీని కోరారు. ‘ ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలోనూ ఇనుప రాడ్డు అలాగే ఉంది. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్ ఎస్ఎస్పీకి నోటీసులు పంపించాం’అని ట్వీట్ చేశారు శ్వాతి. ఇదీ చదవండి: స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం -
మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిలిపివేత
A school in Uttar Pradesh’s Ghaziabad suspended offline classes: కరోనా ముప్పు తగ్గలేదని జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ సైతం కోవిడ్ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని జాగ్రత్తగ ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైశాలిలో కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా స్కూల్ యజమాన్యం ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిలిపేసింది. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిషేధించడమే కాకుండా ఆన్లైన్ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా తల్లిదండ్రులు కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి మరువక ముందే కొద్దిరోజుల్లోనే మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తెరవాలని, యథావిధిగా తరగతులకు ప్రారంభించాలని ఆదేశించడం గమనార్హం. (చదవండి: కరోనా ముప్పు తొలగలేదు) -
పోయే కాలం అంటే ఇదేనేమో.. సోషల్ మీడియాను షేక్ చేసిన మహిళ
లక్నో: ఓ మహిళ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీ కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టడమేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్ ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటోంది. కాగా, తన ఇంట్లోని కిటికీని క్లీన్ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది. వెంటనే ఓ క్లాత్ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. She is a woman...can do anything.. A woman was seen hanging on to the railing of the fourth floor and cleaning the window. #Ghaziabad,#UttarPradesh.#LadkiHoonLadSaktiHoon (मैं एक लड़की हूं, मैं लड़ सकती हूं) 👇👇 pic.twitter.com/NJNlDX7njv — Mitesh Bambhaniya (@IamMitesh86) February 21, 2022 దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్ ఉమెన్ అని పొడుగుతుంటే.. ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్!!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్‌ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్‌కు చెందిన కమల్ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు. నలుగురు సభ్యులతో ముఠా.. ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన జమీర్ షేక్‌తో పరిచయమైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్ ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్ అయిదో మెంబర్ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్‌కు అవసరమైన కోడ్‌ను వీరికి జార్ఖండ్‌లోని జామ్తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్‌లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. ఈ కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చిన షానవాజ్ తానే గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్ షేక్ (కోడింగ్ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్ ఉమర్, మెహ్రాజ్ (బీసీఏ గ్రాడ్యుయేట్) సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్ వాసి కమల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్‌లో వీరికి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ మాల్వేర్ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్బీ డ్రైవ్‌లో వేసి షానవాజ్‌కు అందించాడు. ఈ డ్రైవ్‌ను మిషన్‌కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్వేర్ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్ ప్రధాన సర్వర్‌తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్ వేర్ ఓ కోడ్‌ను సృష్టించి కమల్ పొందుపరిచిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్‌లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్‌వర్డ్‌గా మార్చి షానవాజ్ గ్యాంగ్‌కు ఫోన్లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా ముఠా మెషీనన్ రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్‌ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్‌కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్ టీమ్‌ను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌లో ఉన్నాడని.. మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని స్వాట్ టీమ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్ టీమ్‌కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్ పోలీసులు విధుల నుంచి తొలగించారు. షానవాజ్‌ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
అరెస్ట్ చేయనంటేనే పోలీసుల ఎదుటకు వస్తాను: ట్విట్టర్ ఎండీ
బెంగళూరు: తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే.. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుటకు వస్తానని సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో మనిష్ మహేశ్వర్‌పై యూపీ ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనిష్ మహేశ్వర్ ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మనిష్ మహేశ్వర్ ‘‘వారు(యూపీ పోలీసులు) నాపై చేయి వేయబోమని కోర్టుకు అండర్‌టేకింగ్ ఇస్తే.. నేను వ్యక్తిగతంగా పోలీసులు ఎదుట హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఇక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉందంటూ ట్విట్టర్ ఎండీ మనీశ్‌కు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులిచ్చారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే, తాను వర్చువల్ పద్ధతిలో హాజరవుతానని మనీశ్ జవాబివ్వగా అందుకు ఘజియాబాద్ పోలీసులు నిరాకరించారు. -
లక్నో: సమాజం తలదించుకొనే చర్య
-
నడిరోడ్డుపై మహిళపై దాడి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఘజియాబాద్ జిల్లాలో మహిళపై ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. ఆమె పైకి లేస్తుండగా కుర్చీతో ఆమెపై దాడి చేసి లేవనంతగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో నమోదయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆవ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరు అతని మీద ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారందరూ ఆ మహిళపై దాడి జరుగుతుంటే ఎవరు కాపాడటానికి ముందుకు రాలేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొట్టి వెళ్లిపోయిన తరువాత ఒక వ్యక్తి ఆమెకు కుర్చీ తీసుకువచ్చి సాయం చేశాడు. అయితే అప్పటి దాకా ఎవరూ ముందు వచ్చి ఆ నిస్సహాయ మహిళను ఆదుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయం అంటూ ట్వీట్ చేస్తున్నారు. చదవండి: మొబైల్ చార్జర్ కేబుల్ మెడకు చుట్టి.. -
వారున్న చోట మహిళా సిబ్బంది దూరం..
లక్నో : ఢిల్లీ మర్కజ్లో పాల్గొని తిరిగివచ్చి ఐసోలేషన్ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల సేవల కోసం పురుష సిబ్బందినే నియమించాలని అక్కడ మహిళా కానిస్టేబుళ్లు, నర్సులకు విధులు కేటాయించరాదని యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ ఆదేశించింది. కరోనా వైరస్ అనుమానితులుగా ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న కొందరు తబ్లిగీ జమాతే సభ్యులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆస్పత్రి నర్సులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమాతే సభ్యులకు వైద్య, భద్రతా సేవల కోసం పురుష సిబ్బందినే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘజియాబాద్ ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిగీ జమాతే సభ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద చర్యలు చేపట్టాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని మానవత్వానికి శత్రువులుగా యోగి ఆదిత్యానాథ్ అభివర్ణించారు. నిందితులు చట్టాన్ని గౌరవించకపోవడమే కాకుండా సమాజ కట్టుబాట్లనూ అంగీకరించలేదని..వారు మానవత్వానికే శత్రువులని వ్యాఖ్యానించారు. ‘వారు మహిళా ఆరోగ్య కార్యకర్తల పట్ల వ్యవహరించిన తీరు హేయం..వారిపై ఎన్ఎస్ఏ కింద చర్యలు చేపడతాం..వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్ట’మని యోగి అన్నారు. మరోవైపు తబ్లిగి జమాతే సభ్యుల ప్రవర్తనపై కేంద్ర మంత్రి, ఘజియాబాద్ ఎంపీ వీకే సింగ్ మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ డాక్టర్లకు సహకరించాలని, మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చదవండి : యాంటీ మలేరియా డ్రగ్‌తో డాక్టర్ మృతి -
లావుగా ఉన్నానని బయటకు పంపడం లేదు
లక్నో: తెలుగులో కొన్నేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో తల్లిదండ్రుల బలవంతం మేరకు హీరో లావుగా ఉన్న మహిళను వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో వివాహం అయిన నాటి నుంచి ఆ మహిళను లావుగా ఉన్నావ్ అంటూ విమర్శించడమే కాక ఆమెతో కలిసి బయటకు ఎక్కడకు వెళ్లడు. సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళకు. భర్త వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలు.. బిజ్నోర్కు చెందిన ఓ మహిళకు మీరట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో 2014లో వివాహం అయ్యింది. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి లావుగా ఉన్నావంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తనతో పాటు ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. ఆమెను ఎక్కడికి పంపే వాడు కాదు. అంతేకాక ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తే వారి ముందే ఆమెను అవమానించేవాడు. అంతటితో ఊరుకోక తనతో కలిసి మద్యం సేవించాల్సిందిగా సదరు మహిళను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోతే కొట్టేవాడు. ఈ విషయాల గురించి బాధిత మహిళ తన తల్లిదండడ్రులకు, అత్తింటి వారికి కూడా చెప్పింది. కానీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. విసిగిపోయిన మహిళ భర్త పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక పోతున్నాను.. విడాకులు ఇప్పించండి అంటూ ఘజియాబాద్ కోర్టును ఆశ్రయించింది. -
120 కిలోల బంగారం పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోదీ నగర్ జిల్లాలో శుక్రవారం తనిఖీలు చేస్తున్న పోలీసులకు రూ 38 కోట్ల విలువైన 120 కిలోల బంగారం ఓ వాహనంలో పట్టుబడింది. ఢిల్లీ నుంచి యూపీలోని హరిద్వార్‌కు చెందిన ఓ ఫ్యాక్టరీకి బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో ముడి బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి పలు ప్రాంతాలకు తరలిస్తారని పోలీసులు చెప్పారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో క్యాషియర్, డ్రైవర్ సహా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు చెన్నై విమానాశ్రయంలో రూ 6.24 కోట్ల విలువైన 17.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో విమానాశ్రయంలో సోదాలు నిర్వహించగా అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చిన బంగారం పట్టుబడిందని అధికారులు పేర్కొన్నారు. గృహాపకరణాలు, గాడ్జెట్లలో ప్రయాణీకులు బంగారాన్ని దాచారని వారు చెప్పారు. బంగారంతో పాటు రూ 1.1 కోట్ల విలువైన ఐఫోన్లు, స్మార్ట్ వాచీలు,యూఎస్బీ చిప్స్, స్టోరేజ్ పరికరాలు, కెమెరా లెన్స్‌లు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. -
‘ఐదు మొక్కలు నాటు.. అరెస్టు వారంట్ రద్దు చేస్తా’
ఘజియాబాద్: ఐదు మొక్కలు నాటితే అరెస్ట్ వారంట్ రద్దు చేస్తానని ఓ నిందితుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు ఆఫర్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అఫిడవిట్ సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా అదనపు ప్రభుత్వ కౌన్సెలర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం నమోదైన కిడ్నాప్ కం రేప్ కేసులో ప్రధాన నిందితుడు రాజు అలియాస్ కల్లు 6 నెలల నుంచి విచారణకు హాజరుకావడం లేదు. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి రాకేష్ వశిష్ట నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఇది తెలిసిన నిందితుడు రాజు తనపై జారీ చేసిన నాన్బెయిలబ్ వారంట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు, నిందితుడికి ఐదు మొక్కలు నాటాలని సూచించింది. అలాగే సరైన విధంగా విచారణకు సహకరిస్తానని అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. -
పక్కింటావిడే కదా అని నగలు చూపిన పాపానికి..
నోయిడా : పొరుగింటి ఆవిడే కదా అని నగలు, బట్టలు చూపించిన పాపానికి గర్భిణి దారుణ హత్యకు గురయ్యింది. డబ్బు మీద వ్యామోహం ఉన్న పక్కింటి దంపతుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఘజియాబాద్‌కు చెందిన మాలా, శివమ్‌లకు ఆరు నెలల క్రితం వివాహమయ్యింది. శివమ్ ఉద్యోగ నిమిత్తం బిస్రాఖ్ ఏరియాలోని ఓ అపార్టుమెంటులో వీరు అద్దెకు దిగారు. కాగా మాలా గర్భం దాల్చడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొత్తగా చేయించుకున్న నగలు, ఖరీదైన దుస్తులు మాలా వాళ్లకి చూపించింది. అదే సమయంలో పక్కింట్లో అద్దెకు ఉండే రీతూ అనే వివాహిత కూడా మాలా ఇంటికి వచ్చింది. ఆమె నగలు, బట్టలు చూసిన రీతూకు కళ్లు చెదిరాయి. ఎలాగైనా అవి తన సొంతం చేసుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది. అతడు కూడా ఇందుకు సరేననడంతో.. ఇద్దరూ కలిసి మాలాను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. గొంతు నులిమి, సూట్‌కేసులో కుక్కి తమ ఇంటికి రావాలంటూ రీతూ ఆహ్వానించడంతో మాలా సరేనంది. గురువారం శివమ్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత రీతూ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో రీతూ భర్త దివాకర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాలాతో మాటలు కలిపిన రీతూ, దివాకర్‌లు ఆమె గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేశారు. మాలా మరణించిందని ధ్రువీకరించుకున్న తర్వాత.. ఆమె ఫ్లాట్‌కు వెళ్లి నగలు, బట్టలు ఉన్న సూట్‌కేసు తీసి.. వాటి స్థానంలో మాలా శవాన్ని కుక్కారు. నగలు, బట్టలు తీసుకున్న అనంతరం రీతూ తన మేనమామ ఇంటికి వెళ్లగా.. దివాకర్ ఊరి శివారులో మాలా శవాన్ని పడేసి అక్కడికి చేరుకున్నాడు. కట్నం కోసం అత్తింటివారే హత్య చేశారంటూ.. మాలా అకస్మాత్తుగా మాయమవడంతో కట్నం కోసం భర్త, అత్తింటి వారే ఆమెను హత్య చేసి ఉంటారంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మాలా కనిపించకుండా పోయిన సమమయంలో ఆమె భర్త ఆఫీసులో, అత్తామామలు వారి ఇంటి వద్దే ఉన్నారని నిర్ధారించారు. మాలా మాయమైన నాటి నుంచి పక్కింట్లో ఉండే రీతూ, దివాకర్‌లు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు గౌతం బుద్ధ నగర్ ఎస్ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. -
తుపాకులతో బెదిరించి రూ. 40లక్షల దోపిడి!
ఘజియాబాద్: బంగారపు షాపులో దుండగులు పడి రూ.40లక్షల విలువైన డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నగరంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రావల్పిండి జ్యువెలర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ముఖాలకు గుడ్డలు కట్టుకుని తుపాకీలతో లోపలికి ప్రవేశించారు. ఇద్దరు బయట బైక్ లతో సిద్ధంగా ఉండగా మిగిలిన ముగ్గురు 15 నిమిషాల్లో దోపిడీ పూర్తిచేసి తూర్పు వైపుగా పారిపోయారని పోలీసులు తెలిపారు. షాపులోకి ప్రవేశించిన తర్వాత దొంగలు జెబుల్లో నుంచి తుపాకీలు తీసి బెదిరించినట్లు ఓనర్ తెలిపాడు. షాపులో విలువైన వస్తువులతో పాటు క్యాష్ ను కూడా తీసుకువెళ్లినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ల్లోని దొంగల గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏటువంటి ఆధారాలు తమకు లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సల్మాన్ తాజ్ పాటిల్ తెలిపారు.