
ప్రతీకాత్మక చిత్రం
ఘజియాబాద్: ఐదు మొక్కలు నాటితే అరెస్ట్ వారంట్ రద్దు చేస్తానని ఓ నిందితుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు ఆఫర్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అఫిడవిట్ సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా అదనపు ప్రభుత్వ కౌన్సెలర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం నమోదైన కిడ్నాప్ కం రేప్ కేసులో ప్రధాన నిందితుడు రాజు అలియాస్ కల్లు 6 నెలల నుంచి విచారణకు హాజరుకావడం లేదు. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి రాకేష్ వశిష్ట నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారు. ఇది తెలిసిన నిందితుడు రాజు తనపై జారీ చేసిన నాన్‌బెయిలబ్ వారంట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు, నిందితుడికి ఐదు మొక్కలు నాటాలని సూచించింది. అలాగే సరైన విధంగా విచారణకు సహకరిస్తానని అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment