non bailable warrant
-
ఒక దొంగ... తొమ్మిది వారెంట్లు!
సాక్షి, హైదరాబాద్: సొత్తు సంబంధిత నేరాల్లో నిందితుడిగా ఉండి మూడున్నర ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న రాజస్థాన్ వాసి ప్రదీప్‌ను సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతగాడిపై మూడు పోలీసుస్టేషన్ల పరి«ధిలో తొమ్మిది నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నట్లు క్రైమ్స్ డీసీపీ కె.నర్సింహ్మ సోమవారం తెలిపారు. రాజస్థాన్‌లోని బిచౌలా గ్రామానికి చెందిన ప్రదీప్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నిర్మాణరంగంలో కార్మికుడిగా పని చేసిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం దొంగగా మారాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలు, నిర్మాణ స్థలాలను టార్గెట్‌గా చేసుకున్న ఇతగాడు వాటి నుంచి ఇనుము, అల్యూమినియం తదితర వస్తువులు చోరీ చేసి అమ్మేవాడు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇతడిపై కొల్లూరు, మోకిలా, నార్సింగి పోలీసుస్టేషన్ల పరిధిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఓ సందర్భంలో మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021లో ఇతగాడిని కొల్లూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రదీప్ తన స్వస్థలానికి వెళ్లిపోయారు. ఈ తొమ్మిది కేసుల్లోనూ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానాలు ఎన్బీడబ్ల్యూలు జారీ చేశాయి. మూడున్నరేళ్లుగా ఇతగాడి ఆచూకీ ఎవరికీ లభించలేదు. దీంతో ప్రదీప్ అరెస్టు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సైబరాబాద్ సీసీఎస్ అధికాలు రాజస్థాన్‌కు పంపారు. ముమ్మరంగా గాలించిన పోలీసులు శనివారం రాజస్థాన్‌లో పట్టుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తీసుకువచ్చారు. కొల్లూరు పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఎనిమిది కేసుల్లోనూ ఇతడిని అరెస్టు చూపించనున్నారు.నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు -
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
పాత నేరస్తుల పని పడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను, నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి తీసుకువస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పారిపోయిన మోసగాళ్లను సైతం కటకటాల వెనక్కి నెడుతున్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలు కోసం తెలంగాణ సీఐడీ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం సత్ఫలితాలిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 212 నాన్‌బెయిలబుల్ వారెంట్లను పరిష్కరించారు. రూ.కోట్లలో అమాయకులను మోసగించి దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులపై ఎస్పీ రామ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ బృందం ఫోకస్ పెట్టింది. ఫలితంగా పాత కేసులలోనూ చిక్కుముడులు వీడుతున్నాయి. మొత్తంగా ఏడాదికాలవ్యవధిలో 156 ఎన్‌బీడబ్ల్యూల సమాచారం ప్రత్యేక బృందం సేకరించింది. 56 మంది పాత నేరస్తులను అరెస్టు చేసింది. ఇటీవల అమలు చేసిన ఎన్బీడబ్ల్యూ కేసులు కొన్ని.. ► మంచిర్యాల టౌన్లో 1995 నమోదైన ఒక డెకాయిటీ కేసులో 29 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అప్పల సత్తయ్య అనే నేరస్తుడిని ఈ ఏడాది జనవరి 24న కరీంనగర్లో అరెస్టు చేసింది. ► ఆన్లైన్ ఓఎల్ఎక్స్ మోసం కేసులో ఎనిమిదేళ్లుగా సీఐడీ సైబర్‌క్రైం పోలీసులకు చిక్కకుండా ఉన్న సోహాల పొద్దార్ అనే పాత నిందితుడిని ముంబైలో ఈ ఏడాది జనవరి 29 ఎన్బీడబ్ల్యూ స్పెషల్ ఎగ్జిక్యూషన్ టీం అరెస్టు చేసింది. ► కృషి బ్యాంకు కుంభకోణం కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆ బ్యాంకు డైరెక్టర్ కాగితాల శ్రీధర్‌ను గతేడాది సెప్టెంబర్ 25న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అరెస్టు చేసింది. సాంకేతికత వినియోగంతో సమాచారం కూపీ లాగుతారు.. మోసాలు చేయడంలో దిట్ట అయిన సదరు పాత నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ సీఐడీ ఎన్బీడబ్ల్యూ స్పెష ల్ ఎగ్జిక్యూషన్ టీం సాంకేతికతను వినియోగిస్తోంది. నేర స్తుల సీడీఆర్ (కాల్ డీటెయిల్డ్ రికార్డ్), బ్యాంకు ఖాతాల కు లింక్ అయిన ఉన్న మొబైల్ నంబర్ల ఆధారంగా, అదేవిధంగా స్విగ్గీ, ఓయో, ర్యాపిడో, అమెజాన్ డాటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. సైకాప్స్ అప్లికేషన్ ద్వారా కూడా వివరాలు విశ్లేíÙస్తున్నారు. గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్‌కు ఇచ్చే ఆధారాలు, సోషల్ మీడియా ఖాతాల్లో ఫో న్ నంబర్లు ఇలా...అన్ని కోణాల్లో సదరు నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడనేది స్పష్టత వచి్చన తర్వాత క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపడుతున్నారు. -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి
లక్నో: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై ఇదివరకే రెండు కేసులు నమోదు కాగా, ఆమె విచారణకు హాజరు కావడం లేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. -
సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ క్రికెటర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకనాటి సహచరుడు, టీమిండియా మాజీ ఆటగాడు ప్రశాంత్ వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో నాగ్‌పూర్ పోలీసులు (బజాజ్ నగర్) వైద్యను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు వైద్యను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా.. పూచికత్తుపై అతన్ని విడుదల చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారిని చీట్ చేసిన కేసులో పోలీసులు ఈ మాజీ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారి నుంచి వైద్య 1.9 కోట్లు విలువ చేసే స్టీల్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా చెక్‌లకు ఇచ్చాడు. అయితే చెక్‌లు బౌన్స్ కావడంతో సదరు వ్యాపారి వైద్యను పలు మార్లు నగదు చెల్లించాల్సిందిగా కోరాడు. డబ్బు చెల్లించాలని వైద్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పలు నోటీసులు ఇచ్చిన అనంతరం వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన బజాజ్ నగర్ పోలీసులు వైద్యను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. 56 ఏళ్ల ప్రశాంత్ వైద్య 1995-96 మధ్యలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసి 4 వన్డే మ్యాచ్‌ల్లో (4 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో వైద్య భారత జట్టులో ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైద్య మహారాష్ట్రకు చెందినప్పటికీ బెంగాల్ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడాడు. వైద్య తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 56 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. వైద్య ప్రస్తుతం విదర్భ క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నాడు. -
ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారణకు గైర్హాజరు కావడం పట్ల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) డిప్యూటీ కార్యదర్శిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)) జారీ చేసింది. ఆయనను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. తమ కాలేజీ గుర్తింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ పీడీ చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. గుర్తింపు రద్దు కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చామని, అయినా కూడా ఆ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా గుర్తింపు రద్దు చేస్తూ జూలై 7, 2020లో ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై ఎన్సీటీఈ ముందు ఆన్లైన్లో అప్పీల్ దాఖలు చేశామని, చట్టం నిర్దేశించిన ఫీజు కూడా చెల్లించామన్నారు. అలాగే పోస్టు ద్వారా వినతిపత్రం కూడా పంపామని తెలిపారు. అయితే తమ ముందు ఎలాంటి అప్పీల్ దాఖలు చేయలేదని ఎన్సీటీఈ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 18న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు డిప్యూటీ కార్యదర్శి రాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయమూర్తి డిప్యూటీ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇమ్రాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఇమ్రాన్‌ఖాన్ సహా ఆయన పార్టీ పీటీఐ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. వివరాల ప్రకారం.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ కార్యాలయం, ఓ కంటైనర్‌పై దాడి చేసి, తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ క్రమంలో రెండు కేసుపై లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ సహా.. పీటీఐ నేతలు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: చైనా ఓవరాక్షన్.. భారత్, అమెరికాకు భంగపాటు -
ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. శనివారం ఆయన ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టులో హాజరయ్యారు. చేరుకున్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఇమ్రాన్ హాజరైనట్టు కోర్టు ఆవరణలో వాహనంలోనే సంతకం తీసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లోకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో విచారణ సాగదన్న జడ్జి, ఇమ్రాన్‌పై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అభియోగపత్రం లేకుండానే అక్కడి నుంచే తిరిగి వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లో ఉండగానే లాహోర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 20 రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు దొరికాయన్నారు. విచారణకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇమ్రాన్ కాన్వాయ్‌లో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. -
నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్నాథ్ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్నాథ్ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? కాగా 2019 ఏప్రిల్ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారెంట్!
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారిలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, లల్జిత్ సింగ్ భుల్లార్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరిహద్దు జిల్లాలైన అమృత్సర్, తరన్ తరన్‌లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్, టాక్సేషన్ శాఖ మంత్రి హర్పల్ సింగ్ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్‌తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్‌ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్‌లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్‌కు నవనీత్ సవాల్ -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్‌లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలకు ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదైంది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీతో బలరాం నాయక్ కోర్టుకు హాజరయ్యారు. బలరాం నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఉపసంహరించింది. విచారణను వచ్చేనెల 3కి ప్రజా ప్రతినిధులు కోర్టు వాయిదా వేసింది. ఇవీ చదవండి: Indira park: లవర్స్‌కు షాక్, వెంటనే వెనక్కి తగ్గిన అధికారులు Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు -
ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావులకు హైకోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ వారెంట్‌ను అమలు చేసి ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ చేయూత పథకానికి తాము అర్హులమైనా, ఆ పథకాన్ని తమకు వర్తింపజేయడం లేదంటూ కృష్ణా జిల్లా, చందర్లపాడుకు చెందిన పలువురు మహిళలు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు, వారికి వైఎస్సార్ చేయూత పథకాన్ని వర్తింపజేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు 2020–21 సంవత్సరానికి నిధులు విడుదల చేశారు. అయితే 2019–20 సంవత్సరానికి నిధులు ఇవ్వకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, ఇంతియాజ్, శ్రీనివాసరావులు కోర్టు ముందు స్వయంగా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ అధికారులిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్‌లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్‌పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్‌ను, అతని మామ సత్పాల్ సింగ్‌ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ -
బాలయ్య నిర్మాతకు షాక్ ఇచ్చిన కోర్టు
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్‌ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్‌అమ్మేశారని ఓ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి : (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య) (కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు) -
ఇద్దరు ఐఏఎస్‌లకు వారెంట్లు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తామిచ్చిన ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కానందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ నెల 19లోపు వారెంట్లను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇందులో ప్రవీణ్‌కుమార్, రామారావులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులను మార్చి 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఈ ధిక్కార వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రవీణ్‌కుమార్, రామారావు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేసిన న్యాయమూర్తి.. ఇద్దరు అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తిలను ఏప్రిల్ 6న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. చదవండి: అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. 2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్ వారెంట్‌జారీ అయ్యింది. అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది. -
టూల్‌కిట్ వివాదం: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
మద్యం మత్తు.. నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ‘నిషా’చరుడు సయ్యద్ అమీరుద్దీన్‌కి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసి అరెస్టు చేయించింది. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆ నిందితుడిని శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమీరుద్దీన్‌కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఓ మందుబాబుపై ఎన్బీడబ్ల్యూ జారీ కావడంతో ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో తొలిసారని చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 రాత్రిని జీరో యాక్సిడెంట్ నైట్‌గా చేయడానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంబర్‌పేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ అమీరుద్దీన్ మద్యం తాగి యాక్టివా వాహనంపై వస్తూ చార్మినార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ అనలైజర్ యంత్రంతో పరీక్షించిన నేపథ్యంలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 141గా తేలింది. ఈ కౌంట్ 30 దాటితే వారిపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, వివరాలు నమోదు చేసుకుని, వాహనం స్వాధీనం చేసుకుని పంపారు. ఇలా చిక్కిన మందుబాబులు నిర్ణీత తేదీల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఆపై కోర్టుకు వెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్ష పూర్తి చేయడం లేదా జరిమానా కట్టడం చేసిన తర్వాత తమ వాహనం తీసుకువెళ్లాలి. అయితే అమీరుద్దీన్ మాత్రం కౌన్సెలింగ్‌కు, కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నాడు. దీంతో చార్మినార్ పోలీసులు అతడిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. దీని ఆధారంగా కోర్టు అమీరుద్దీన్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసినా అతను బేఖాతరు చేశాడు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. -
సీతక్కపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున ఆమెకు కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 9లోగా ఈ వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు సమన్లు జారీ కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావులు కోర్టుకు హాజరయ్యారు. -
'రోబో' డైరెక్టర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
చెన్నై: బ్లాక్‌బస్టర్ హిట్ 'ఎంథిరన్' సినిమా వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరూర్ తమిళ్‌నాడన్ అనే వ్యక్తి తను రాసిన 'జిగుబా' కథను కాపీ చేసి 'ఎంథిరన్'గా తీశారంటూ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశాడు. తనకు న్యాయం జరగాలంటూ కొన్నేళ్ల క్రితం కోర్టుకెక్కాడు. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నా శంకర్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రెండో కోర్టు అతడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. (చదవండి: రామ్‌చరణ్, యశ్‌తో శంకర్ మల్టీస్టారర్!) కాగా తమిళ్‌నాడన్ రాసిన 'జిగుబ' కథ 1996లో ఓ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. తర్వాత 2007లో 'ధిక్ ధిక్ దీపిక ధీపిక' అనే నవలగా ప్రచురితమైంది. ఈ కథను కాపీ కొట్టి శంకర్ 'ఎంథిరన్' తెరకెక్కించాడని, ఇది కాపీరైట్స్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించాడు. తన స్వంత కథతో ఎంథిరన్ టీమ్ మొత్తం లాభం పొందిందని పేర్కొన్నాడు. ఇక ఎంథిరన్ తెలుగు, హిందీలో 'రోబో'గా డబ్ అవగా ఇక్కడ కూడా అఖండ విజయం సాధించింది. ఇందులో తలైవా రజనీకాంత్ డబుల్ యాక్షన్ చేయగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించింది. 2010లో రిలీజైన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్ డేట్ ఫిక్స్) -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ ఘటనలో వినయ్ భాస్కర్‌తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో తొమ్మిది మందికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.