మరో ఇద్దరితో కలిసి ఓ కంపెనీ నిధులకు స్కెచ్
వారి చెక్కు చోరీ చేసి తన ఖాతాలోకి నగదు బదిలీ
ఆఖరి నిమిషంలో విషయం వెలుగులోకి, కేసు నమోదు
ముందస్తు బెయిల్ పొంది 2011 నుంచి పరారీలోనే
సాంకేతిక ఆధారాలతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీ 13 ఏళ్లుగా చిక్కలేదు... కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా జాడ దొరకలేదు... దీంతో పోలీసులు ఆ కేసు మూసేయాలని భావించారు... ఈ సమయంలో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ నిందితుడిని పట్టుకుంది. అతగాడిని తదుపరి చర్యల నిమిత్తం మహంకాళి పోలీసులకు అప్పగించినట్లు టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శుక్రవారం వెల్లడించారు. చైతన్యపురి ప్రాంతానికి చెందిన కె.భరద్వాజ్ రావు అలియాస్ గోపాల్‌రెడ్డి మరో ఇద్దరితో కలిసి 2011లో భారీ కుట్ర పన్నాడు. వీరిలో ఒకరి ద్వారా పుణే కేంద్రంగా కార్యకలాపాలు సాగించే రమెలెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్కు చోరీ చేయించాడు.
అదే ఏడాది ఆగస్టు 22న సికింద్రాబాద్, ఎస్డీ రోడ్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో తన వివరాలు, ఫొటో ఆధారంగా గోపాల్‌రెడ్డి పేరుతో ఓ సేవింగ్స్ ఖాతా తెరిచాడు. ఆపై పుణే సంస్థ చెక్కుపై గోపాల్‌రెడ్డి పేరు రాసి రూ.90 లక్షలకు సిద్ధం చేశాడు. దీన్ని బ్యాంక్‌కు తీసుకువెళ్లిన భరద్వాజ్ అధికారులకు అందించి తాను గోపాల్‌రెడ్డి పేరుతో తెరిచిన ఖాతాలోకి నగదు మళ్లించాడు. ఆపై ఆ ఖాతాకు సంబంధించిన సెల్ఫ్ చెక్ ఇచ్చి ఆ మొత్తం డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచాడు. అయితే ఆ ఖాతా కొత్తగా తెరిచింది కావడంతో పాటు ఒకేసారి భారీ మొత్తం డ్రా చేసే ప్రయత్నం చేయడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచి్చంది. నగదు ఇవ్వడానికి కొంత సమయం కోరిన వారు అప్పటికి భరద్వాజ్‌ను పంపేశారు.
ఈ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా పుణే సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సదరు సంస్థ తమ చెక్కు చోరీ అయిందని, ఆ మొత్తం డ్రా చేసుకోనీయ వద్దని సమాధానం ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు గోపాల్‌రెడ్డిగా చెప్పుకున్న భరద్వాజ్‌పై మహంకాళి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు భరద్వాజ్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భరద్వాజ్ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అప్పటి నుంచి కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కోర్టు 2018లో ఆ కేసు నుంచి భరద్వాజ్‌ను వేరు చేసి, మిగిలిన ఇద్దరినీ విచారించింది.
న్యాయస్థానం భరద్వాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఇతడిపై ఉన్న కేసును లాంగ్ పెండింగ్ కేటగిరీలో మూసేయాలని అధికారులు భావించారు. ఆ సమయంలో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ దృష్టికి ఈ విష యం వచ్చింది. ఇన్‌స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు పి.గగన్‌దీప్, సి.రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులు దాసు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలను బట్టి భరద్వాజ్ కొత్తపేటలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అనేక చోట్ల ఇళ్లు, ఫోన్ నెంబర్లు మార్చిన అతగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment