
డెహ్రాడూన్ : రోడ్డును బ్లాక్‌చేసి ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరించిన ఓ మంత్రిని అరెస్ట్ చేయాలని ఉత్తరాఖండ్‌లోని దిగువ న్యాయస్థానం స్థానిక పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి అరవింద్ పాండేపై రుద్రపూర్ జిల్లాకోర్టు శుక్రవారం మంత్రిపై నాన్ బెయిబుల్ వారెంట్‌ను జారీచేసింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో అప్పటి ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు జాతీయ రహదారిని దిగ్భందించింది. దీంతో స్థానిక పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది స్థానిక నేతలపై కేసు నమోదు చేశారు. ఆయా కేసులను తాజాగా విచారించిన రుద్రపూర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వారందరినీ దోషులుగా తేల్చారు.
ప్రజా వ్యవస్థకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరించారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వీరిలో ప్రస్తుత మంత్రి అరవింద్ పాండేతో పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్భజన సింగ్, రాజ్‌కుమార్, ఆదేశ్ చౌహాన్, మాజీ ఎంపీ బల్‌రాజ్ పాసీలు ఉన్నారు. కోర్టు ఆదేశాలను అందుకున్న స్థానిక ఎస్పీ రాజేష్ భట్.. నిందితులను అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అక్టోబర్ 23లోపు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చాలని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment