
సాక్షి, రాజమండ్రి: ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఆయనకు బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది. ఓ ఫైనాన్షియర్‌కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment